• English
  • Login / Register

ఇండియా-స్పెక్ సిట్రోయెన్ C3X క్రాస్‌ఓవర్‌ యొక్క ఫస్ట్ లుక్ ఇదేనా?

సిట్రోయెన్ సి3 కోసం ansh ద్వారా జూలై 20, 2023 09:59 pm ప్రచురించబడింది

  • 2K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

C3X, C3 ఎయిర్ క్రాస్ ప్లాట్‌ఫారమ్‌ పై ఆధారపడి ఉండవచ్చుCitroen C3X Crossover Spied

  • సిట్రోయెన్ C3X 2024లో మార్కెట్‌ లోకి రావొచ్చు.

  • C3X అనేది ఎగ్జిక్యూటివ్ స్టైలింగ్ మరియు ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్‌తో కూడిన సెడాన్ క్రాస్ఓవర్.

  • C3X యొక్క క్యాబిన్ మరియు ఫీచర్లు C3 ఎయిర్‌క్రాస్ మాదిరిగానే ఉండే అవకాశాలు ఉన్నాయి.

  • C3Xలో సిట్రోయెన్ లోని 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఉండవచ్చు.

  • దీని ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చు.

భారీగా కప్పబడిన టెస్ట్ మ్యూల్ బెంగళూరులో పరీక్షిస్తున్నట్లు రహస్య చిత్రాలలో వెల్లడయింది. భారతదేశంలో కూపే-శైలి మాస్-మార్కెట్ ఆఫర్‌లు లేనందున దాని వెనుక భాగం స్పష్టంగా వెల్లడైంది. చిత్రాలలో బ్రాండ్ లోగోలను గుర్తించలేము కానీ ఈ వాహనం సిట్రోయెన్ మోడల్‌ పోలికలు ఉండే అవకాశాలు ఉన్నాయి. భారీగా కప్పబడిన వాహనం రాబోయే సిట్రోయెన్ C3X క్రాస్ఓవర్ సెడాన్ కావొచ్చు. ఈ రహస్య షాట్ వెల్లడయ్యే మరిన్ని వివరాలు చూద్దాం.

సుపరిచితమైన డిజైన్

Citroen C3X Crossover Spied
Citroen C3X Crossover Spied

రహస్యంగా తీసిన వీడియోలో టెస్ట్ మ్యూల్ యొక్క సైడ్ ప్రొఫైల్ మాత్రమే వెల్లడైంది. ఈ వీడియో లో ఫ్రంట్ ప్రొఫైల్ యొక్క భాగాలను మరియు హెడ్‌లైట్ డిజైన్‌ కనిపిస్తుంది. మొత్తానికి సిట్రోయెన్ C3 మరియు C3 ఎయిర్‌క్రాస్‌ల పోలికలు ఉన్నట్లు తెలుస్తుంది. అన్ని ఇండియా-స్పెక్ సిట్రోయెన్ మోడల్‌లలో కనిపించే ఫ్లాప్-టైప్ డోర్ హ్యాండిల్స్ ఈ వీడియో నుండి మనకు కనిపించే అత్యంత గుర్తించదగిన భాగాలు. వెనుక భాగంలో ఏటవాలు క్రాస్ఓవర్ డిజైన్ కలిగి ఉంది అది భారీగా కప్పబడి బహిర్గతం అయ్యింది.Citroen eC4X

ఇంటీరియర్ యొక్క సంగ్రహావలోకనం ఈ వీడియో లో లభించలేదు, కానీ C3X యొక్క క్యాబిన్ సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ SUV యొక్క క్యాబిన్‌ లగే ఉండొచ్చు.

వివరణ కోసం ఉపయోగించబడిన సిట్రోయెన్  eC4X చిత్రం

పవర్ట్రైన్

Citroen C3 Aircross Engine

C3 మరియు C3 ఎయిర్‌క్రాస్ లోని 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ ఇండియా-స్పెక్ సిట్రోయెన్ C3X లోనూ ఉండే అవకాశాలు యూ న్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్‌లో, పెట్రోల్ యూనిట్ 110PS మరియు 190Nm శక్తిని చేసే 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మాత్రమే కలిగి ఉంటుంది. సిట్రోయెన్ పనితీరు అవుట్‌పుట్‌ను పెంచే అవకాశాలు ఉన్నాయి. C3 ఎయిర్‌క్రాస్‌లా ఉండటానికి C3X లో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కూడా జోడించవచ్చు.

ఇది కూడా చదవండి: సిట్రోయెన్ eC3 vs టాటా టియాగో EV: స్పేస్ & ఆచరణాత్మకత పోలిక 

కార్‌మేకర్ మరింత సరసమైన ఎంట్రీ పాయింట్ కోసం 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేసిన 1.2-లీటర్ సహజంగా ఆశించిన పెట్రోల్ యూనిట్ (82PS మరియు 115Nm)ని కూడా అందించవచ్చు.

ఫీచర్లు మరియు భద్రత

Citroen C3 Aircross Cabin

C3X కూడా C3 ఎయిర్‌క్రాస్ లోని ఫీచర్ జాబితాను కలిగి ఉండవచ్చు. వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు మాన్యువల్ క్లైమేట్ కంట్రోల్ ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: లాటిన్ NCAP క్రాష్ టెస్ట్‌లలో Citroen C3 0 స్టార్‌లను సాధించింది

ప్రయాణీకుల భద్రత కోసం, ఇందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు వెనుక పార్కింగ్ సెన్సార్‌లు ఉంటాయి.

ధర మరియు ప్రారంభ తేదీ

Citroen eC4X

సిట్రోయెన్ C3X క్రాస్ఓవర్ సెడాన్ 2024లో అంచనా వేయబడిన ఎక్స్-షోరూమ్ ప్రారంభ ధర రూ. 10 లక్షలు (ఎక్స్-షోరూమ్) వద్ద రావచ్చు. C3X అనేది టాటా కర్వ్, హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, వోక్స్వాగన్ విర్టస్ మరియు స్కోడా స్లావియా వంటి వాటికి ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
మరింత చదవండి : సిట్రోయెన్ C3 ఆన్ రోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Citroen సి3

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience