హ్యుందాయ్ ఎక్స్టర్ Vs టాటా పంచ్, సిట్రోయెన్ C3 మరియు ఇతర కార్లు: ధర పోలిక
హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం rohit ద్వారా జూలై 12, 2023 11:19 pm ప్రచురించబడింది
- 270 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హ్యుందాయ్ ఎక్స్టర్ మైక్రో SUV ఆకర్షణీయమైన ఫీచర్‌ల జాబితాతో అలాగే పోటీ ధరతో వస్తుంది
హ్యుందాయ్ ఎక్స్టర్ ఐదు విస్తృత వేరియెంట్‌లలో లభిస్తుంది: EX, S, SX, SX (O) మరియు SX (O) కనెక్ట్. మైక్రో SUV అయినందున, దీని ప్రత్యక్ష పోటీదారులు టాటా పంచ్, సిట్రోయెన్ C3 మరియు మారుతి ఇగ్నిస్. ఎక్స్టర్ ధర మరియు ఫీచర్‌ల జాబితా ఆధారంగా ఇది రెనాల్ట్ కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ సబ్ؚకాంపాక్ట్ SUVలకు కూడా పోటీగా నిలుస్తుంది.
ఈ కథనంలో, ఈ వాహన వేరియెంట్-వారీ ధరలు దాని పోటీదారులతో ఎలా ఉన్నాయో చూద్దాం:
పెట్రోల్-మాన్యువల్
హ్యుందాయ్ ఎక్స్టర్ |
టాటా పంచ్ |
సిట్రోయెన్ C3 |
మారుతి ఇగ్నిస్ |
రెనాల్ట్ కైగర్ |
నిస్సాన్ మాగ్నైట్ |
EX–రూ.6 లక్షలు |
ప్యూర్–రూ.6 లక్షలు |
లైవ్–రూ. 6.16 లక్షలు |
సిగ్మా–రూ.5.84 లక్షలు |
XE–రూ.6 లక్షలు |
|
EX (O) – రూ. 6.24 లక్షలు |
ప్యూర్ రిథమ్ – రూ. 6.35 లక్షలు |
డెల్టా – రూ. 6.38 లక్షలు |
RXE – రూ. 6.50 లక్షలు |
||
అడ్వెంచర్ – రూ. 6.9 లక్షలు |
ఫీల్ – రూ. 7.08 లక్షలు |
జెటా – రూ. 6.96 లక్షలు |
XL – రూ. 7.04 లక్షలు |
||
S – రూ. 7.27 లక్షలు |
అడ్వెంచర్ రిథమ్ – రూ. 7.25 లక్షలు |
ఫీల్ వైబ్ ప్యాక్ - రూ. 7.23 లక్షలు |
|||
S (O) – రూ. 7.41 లక్షలు |
XL గెజా ఎడిషన్- రూ. 7.39 లక్షలు |
||||
అకాంప్లిష్ - Rs 7.7 lakh |
షైన్ – రూ. 7.60 లక్షలు |
ఆల్ఫా – రూ. 7.61 లక్షలు |
XV – రూ. 7.81 లక్షలు |
||
SX – రూ. 8 లక్షలు |
అకాంప్లిష్ – రూ. 8.08 లక్షలు |
RXT – రూ. 7.92 లక్షలు |
XV రెడ్ ఎడిషన్- రూ. 8.06 లక్షలు |
||
ఫీల్ టర్బో- రూ. 8.28 లక్షలు |
RXT (O) – రూ. 8.25 లక్షలు |
||||
SX (O) – రూ. 8.64 లక్షలు |
క్రియేటివ్ – రూ. 8.52 లక్షలు |
RXZ - రూ 8.8 లక్షలు |
XV ప్రీమియం – రూ. 8.59 లక్షలు |
||
SX (O) కనెక్ట్ -రూ.9.32 లక్షలు |
క్రియేటివ్ iRA – రూ. 8.82 లక్షలు |
షైన్ టర్బో- రూ. 8.92 లక్షలు |
XV టర్బో – రూ. 9.19 లక్షలు |
||
RXT (O) టర్బో – రూ. 9.45 లక్షలు |
XV రెడ్ ఎడిషన్ టర్బో – రూ. 9.44 లక్షలు |
||||
XV ప్రీమియం టర్బో – రూ. 9.72 లక్షలు |
|||||
RXZ టర్బో – రూ.10 లక్షలు |
XV ప్రీమియం (O) టర్బో – రూ. 9.92 లక్షలు |
-
ఎక్స్టర్ ప్రారంభ ధర దీని దగ్గరి పోటీదారు అయిన టాటా పంచ్‌తో సమానంగా రూ.6 లక్షలుగా ఉంది, మారుతి ఇగ్నిస్ ధర ఈ రెండిటి కంటే సుమారు రూ.16,000 తక్కువ.
-
మాగ్నైట్ ధరలు ఎక్స్ؚటర్ؚకు సమానంగా ఉన్నాయి, సిట్రోయెన్ C3 ధర రూ.16,000 ఎక్కువగా ఉంది. కానీ అన్నిటి కంటే ఖరీదైన ఎంట్రీ పాయింట్ రెనాల్ట్ కైగర్ؚది.
-
రెనాల్ట్ మరియు నిస్సాన్ SUVలు మినహా, ఇతర మోడల్‌లు అన్నీ 5-స్పీడ్ MT 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚను పొందాయి.
-
రెనాల్ట్-నిస్సాన్ జంట 5-స్పీడ్‌ల MTతో 1-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ యూనిట్ؚను కలిగి ఉన్నాయి. ఇవి అదే మాన్యువల్ గేర్‌బాక్స్ ఎంపికతో 1-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ؚతో అందుబాటులో ఉన్నాయి.
-
6-స్పీడ్ MTతో 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికను పొందిన ఏకైక కారు సిట్రోయెన్ C3 మాత్రమే.
-
వీటి అన్నిటిలో CNG పవర్‌ట్రెయిన్ؚను అందిస్తున్నది కేవలం హ్యుందాయ్ ఎక్స్టర్ మాత్రమే (పంచ్ CNG వచ్చే వరకు).
-
టాప్-స్పెక్ ఎక్స్టర్ ధర, టాప్-స్పెక్ పంచ్ కంటే రూ.50,000 వరకు ఎక్కువ కానీ సన్ؚరూఫ్ మరియు డ్యూయల్-కెమెరా డ్యాష్ؚకామ్ వంటి మరిన్ని ఫీచర్‌లను అందిస్తుంది.
-
నిస్సాన్ మాగ్నైట్ ఎంట్రీ-లెవెల్ టర్బో వేరియెంట్, టాప్-స్పెక్ ఎక్స్ؚటర్ కంటే చవకైనది, దీని భారీ పరిమాణం కారణంగా, కైగర్ؚలాగా మరింత ఎక్కువ స్పేస్ؚను అందిస్తుంది. కానీ మీరు పనితీరును పరిగణిస్తే, దీనికి బదులుగా మీరు టాప్-స్పెక్ C3 టర్బో-పెట్రోల్ ఎంపికను ఎంచుకోవచ్చు.
-
ఈ పోలికలోని మోడల్‌లలో అన్నిటినీ డ్యూయల్-టోన్ పెయింట్ ఎంపికతో పొందవచ్చు, ప్రధానంగా హయ్యర్-స్పెక్ వేరియెంట్ؚలకు ఇది పరిమితం అవుతుంది. కొంత అధిక ధరలో, ప్రత్యేకమైన ఎక్స్ؚటీరియర్ ఫినిష్‌తో బహుళ వేరియెంట్ؚలతో టాటా పంచ్ కామో ఎడిషన్ కూడా వస్తుంది.
సంబంధించినది: హ్యుందాయ్ ఎక్స్టర్‌ను 9 విభిన్న రంగులలో పొందవచ్చు
పెట్రోల్-ఆటో
ఎక్స్టర్ |
టాటా పంచ్ |
మారుతి ఇగ్నిస్ |
రెనాల్ట్ కైగర్ |
నిస్సాన్ మాగ్నైట్ |
డెల్టా AMT - రూ. 6.93 లక్షలు |
||||
అడ్వెంచర్ AMT - రూ. 7.5 లక్షలు |
జెటా AMT - రూ. 7.51 లక్షలు |
|||
S AMT - రూ. 7.97 లక్షలు |
అడ్వెంచర్ రిథమ్ AMT - రూ. 7.85 లక్షలు |
|||
అకాంప్లిష్ AMT - రూ. 8.3 లక్షలు |
ఆల్ఫా AMT - రూ. 8.16 లక్షలు |
RXT AMT - రూ. 8.47 లక్షలు |
||
SX AMT - రూ. 8.68 లక్షలు |
అకాంప్లిష్ డాజిల్ AMT - రూ. 8.68 లక్షలు |
RXT (O) AMT - రూ. 8.8 లక్షలు |
||
SX (O) AMT - రూ. 9.32 లక్షలు |
క్రియేటివ్ AMT - రూ. 9.12 లక్షలు |
RXZ AMT - రూ. 9.35 లక్షలు |
||
క్రియేటివ్ iRA AMT - రూ. 9.42 లక్షలు |
||||
SX (O) కనెక్ట్ AMT - రూ. 10 లక్షలు |
XV టర్బో CVT - రూ. 10 లక్షలు |
|||
RXT (O) టర్బో CVT - రూ. 10.45 లక్షలు |
XV రెడ్ ఎడిషన్ టర్బో CVT - రూ. 10.25 లక్షలు |
-
ఎక్స్టర్ ఎంట్రీ-లెవెల్ ఆటోమ్యాటిక్ వేరియెంట్ ధర పంచ్ కంటే ఎక్కువ, మారుతి ఇగ్నిస్ ఎంట్రీ-లెవెల్ ఆటోమ్యాటిక్ ధర కంటే దాదాపు ఒక లక్ష రూపాయలు తక్కువ. నిస్సాన్ మాగ్నైట్ రూ. 10 లక్షలతో ఇక్కడ అత్యంత ఖరీదైన ఎంట్రీ-లెవల్ ఆటోమేటిక్ ఎంపిక.
-
ఎక్స్టర్ మరియు పంచ్ AMT వేరియెంట్ؚల ధరలు దాదాపుగా దగ్గరగా ఉన్నప్పటికీ, రెండవది మరింత చవకైనది.
-
ఎక్స్టర్, పంచ్ మరియు ఇగ్నిస్ అన్నీ 5-స్పీడ్ AMTని అందిస్తున్నాయి, అలాగే 1-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో రెనాల్ట్ కైగర్ కూడా దీనినే అందిస్తుంది. సిట్రోయెన్ C3లో ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚను అందించడం లేదు అలాగే నిసాన్ తమ మాగ్నైట్ 1-లీటర్ ఇంజన్ؚతో కూడా అందించడం లేదు. రెనాల్ట్-నిస్సాన్ SUVల టర్బో-పెట్రోల్ ఇంజన్ؚలు CVT ఆటో ఎంపికతో వస్తాయి.
-
AMT మోడల్‌లను పరిగణంలోకి తీసుకుంటే, హ్యుందాయ్ ఎక్స్టర్ టాప్-స్పెక్ SX (0) కనెక్ట్ AMT వీటి అన్నిటిలో అత్యంత ఖరీదైనది (రూ.10 లక్షలు). ప్రత్యక్ష పోటీదారులలో ప్యాడిల్ షిఫ్టర్ మరియు పైన పేర్కొన్న సన్ؚరూఫ్ మరియు డ్యాష్ؚకామ్ వంటి ఫీచర్‌లను అందిస్తున్నది కేవలం ఇది మాత్రమే.
చెప్పాలంటే, మెరుగైన ఫీచర్‌లను కలిగిన ఎక్స్టర్, పంచ్ కంటే మరింత ఎక్కువ ధరతో వస్తుంది, మరొకవైపు పాత ఇగ్నిస్ ప్రతి పోలికలో మరింత చవకైనది. మిగిలిన మూడు వాహనాలలో ఉన్నని ఫీచర్‌లు సిట్రోయెన్ C3లో లేవు, కానీ భారీ క్యాబిన్ మరియు ఆకట్టుకునే టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను కలిగి ఉంటుంది. అలాగే, రెనాల్ట్ కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ సబ్ؚకాంపాక్ట్ SUVలు, వాటి భారీ కొలతలు మరియు టాప్ ఎండ్ؚ వాహనాలలో మరిన్ని ఫీచర్‌ల కారణంగా మొత్తం మీద ఎక్కువ ఖరీదైనవి.
అన్నీ ఎక్స్‌షో రూమ్ ఢిల్లీ ధరలు
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్ ఇంధన సామర్ధ్యాన్ని ఇక్కడ చూద్దాం
ఇక్కడ మరింత చదవండి: ఎక్స్టర్ AMT