• English
  • Login / Register

మారుతి ఫ్రాంక్స్ Vs ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పోటీదారులు: ఇంధన సామర్ధ్య పోలిక

మారుతి బాలెనో కోసం tarun ద్వారా ఏప్రిల్ 11, 2023 01:02 pm ప్రచురించబడింది

  • 44 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ వాహనాలు అన్ని సారూప్య పరిమాణ ఇంజన్‌లతో, అందించే పవర్ గణాంకాలతో వస్తున్నాయి. స్పెసిఫికేషన్ పరంగా ఏ ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ అన్నిటి కంటే ముందు ఉందో చూద్దాం

Maruti Fronx Vs Premium Hatchbacks

మారుతి కొత్త SUV-క్రాస్‌ఓవర్, ఫ్రాంక్స్ కొన్ని రోజులలో విడుదల కానుంది. బాలెనో ఆధారిత ఈ సబ్‌కాంపాక్ట్ ఆఫరింగ్ ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ విభాగంలో ఒక పరోక్ష పోటీదారుగా నిలుస్తుంది. బాలెనో, గ్లాంజా, i20, ఆల్ట్రోజ్ మరియు C3 వంటి వాటికి దృఢంగా కనిపించే ఫ్రాంక్స్ؚను ప్రత్యామ్నాయంగా చూడవచ్చు. 

సారూప్య పరిమాణలతో ఉండే హ్యాచ్ؚబ్యాక్ పోటీదారులతో ఫ్రాంక్ ఇంధన సామర్ధ్య పోలిక క్రింద అందించబడింది:

మారుతి ఫ్రాంక్స్ Vs మారుతి బాలెనో/టయోటా గ్లాంజా 

maruti baleno

స్పెసిఫికేషన్

ఫ్రాంక్స్

బాలెనో/గ్లాంజ

ఇంజన్ 

1.2-లీటర్ పెట్రోల్

1-లీటర్ టర్బో-పెట్రోల్ 

1.2-లీటర్ పెట్రోల్

పవర్/టార్క్ 

90PS / 113Nm

100PS / 148Nm

90PS/ 113Nm

ట్రాన్స్ؚమిషన్

5-స్పీడ్ MT/ 5-స్పీడ్ AMT

5-స్పీడ్ MT / 6-స్పీడ్ AT

5-స్పీడ్ MT/ 5-స్పీడ్ AMT

మైలేజ్

21.79kmpl / 22.89kmpl

21.5kmpl / 20.1kmpl

22.35kmpl/ 22.94kmpl

  • ఫ్రాంక్స్ మరియు దాని హ్యాచ్ؚబ్యాక్ వర్షన్ బాలెనో ఇంధన సామర్ధ్య గణాంకాలు దాదాపుగా ఒకేలా ఉన్న, ఫ్రాంక్స్ టర్బో-పెట్రోల్ ఎంపికను పొందుతుంది ఇది వీటిలో గమనించగలిగిన తేడా. ఇది కేవలం సుమారు 2kmpl తక్కువ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. 

  • టయోటా గ్లాంజా గణాంకాలు కూడా ఫ్రాంక్స్ గణాంకాలకు సారూప్యంగా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: మారుతి ఫ్రాంక్స్ Vs సబ్ؚకాంపాక్ట్ SUV పోటీదారులు: ఇంధన సామర్ధ్య పోలిక 

మారుతి ఫ్రాంక్స్ Vs సిట్రియోన్ C3

Citroen C3 Review

స్పెసిఫికేషన్

ఫ్రాంక్స్ 

C3

ఇంజన్ 

1.2-లీటర్ పెట్రోల్ 

1-లీటర్ టర్బో-పెట్రోల్ 

1.2-లీటర్ పెట్రోల్

1.2-లీటర్ టర్బో-పెట్రోల్ 

పవర్/టార్క్ 

90PS / 113Nm

100PS / 148Nm

82PS/ 115Nm

110PS/ 190Nm

ట్రాన్స్ؚమిషన్

5-స్పీడ్ MT/ 5-స్పీడ్ AMT

5-స్పీడ్ MT/ 6-స్పీడ్ AT

5-స్పీడ్ MT

6-స్పీడ్ MT

మైలేజ్

21.79kmpl / 22.89kmpl

21.5kmpl / 20.1kmpl

19.8kmpl

19.4kmpl

  • ధర మరియు ఫీచర్‌ల పరంగా C3 ఫ్రాంక్స్ؚకు ప్రత్యక్ష పోటీదారు కాకపోయినా, గణాంకాలలో చాలా వరకు ఒకేలా ఉంటాయి, అన్ని ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ؚల కంటే మరింత చవకైన కానీ తక్కువ ఫీచర్‌లు కలిగిన ప్రత్యేమ్నాయంగా పరిగణించవచ్చు. 

  • C3తో పోలిస్తే, ఫ్రాంక్స్ 3kmpl వరకు ఎక్కువ సామార్ధ్యాన్ని కలిగి ఉంది, వీటి నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్‌లు సారూప్య స్పెసిఫికేషన్‌లؚను కలిగి ఉన్న, C2 టర్బో-పెట్రోల్ యూనిట్ మరింత శక్తివంతమైనది. 

  • అయితే, సిట్రియోన్ C3లో ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ అందుబాటులో లేదు, కానీ ఇది ఫ్రాంక్స్ؚలో ఉంది. 

మారుతి ఫ్రాంక్స్ Vs హ్యుందాయ్ i20

స్పెసిఫికేషన్

ఫ్రాంక్స్ 

i20

ఇంజన్ 

1.2-లీటర్ పెట్రోల్ 

1-లీటర్ టర్బో-పెట్రోల్ 

1.2-లీటర్ పెట్రోల్ 

1-లీటర్ టర్బో-పెట్రోల్ 

పవర్/టార్క్ 

90PS/113Nm

100PS/148Nm

83PS/113Nm

120PS/172Nm

ట్రాన్స్ؚమిషన్

5-స్పీడ్ MT / 5-స్పీడ్ AMT

5-స్పీడ్ MT / 6-స్పీడ్ AT

5-స్పీడ్ MT / CVT

6-స్పీడ్ iMT / 7-స్పీడ్ DCT

మైలేజ్

21.79kmpl / 22.89kmpl

21.5kmpl / 20.1kmpl

20.3kmpl / 19.6kmpl

20.2kmpl

  • సమానమైన పవర్‌ను కలిగిన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌లతో, i20 మాన్యువల్ వేరియెంట్ؚలు తక్కువ సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. వాటి ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలలో దాదాపుగా 3kmpl తేడా ఉంటుంది. 

  • తన శక్తివంతమైన టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో I20 ఈ విభాగంలో ముందంజలో ఉంది. మరింత పవర్ మరియు టార్క్ ఉన్నప్పటికీ, ఇది దాదాపుగా ఫ్రాంక్స్ టర్బోؚతో సమానమైన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. 

మారుతి ఫ్రాంక్స్ Vs టాటా ఆల్ట్రోజ్

స్పెసిఫికేషన్

ఫ్రాంక్స్ 

ఆల్ట్రోజ్ 

ఇంజన్ 

1.2-లీటర్ పెట్రోల్ 

1-లీటర్ టర్బో-పెట్రోల్ 

1.2-లీటర్ పెట్రోల్ 

1.2-లీటర్ టర్బో-పెట్రోల్

పవర్/టార్క్ 

90PS / 113Nm

100PS/ 48Nm

86PS / 113Nm

110PS/ 40Nm

ట్రాన్స్ؚమిషన్ 

5-స్పీడ్ MT/ 5-స్పీడ్ AMT

5-స్పీడ్ MT / 6-స్పీడ్ AT

5-స్పీడ్ MT / 6-స్పీడ్ DCT

5-స్పీడ్ MT

మైలేజ్

21.79kmpl / 22.89kmpl

21.5kmpl / 20.1kmpl

19.3kmpl / -

18.13kmpl

  • ఇతర హ్యాచ్ؚబ్యాక్ؚల విధంగానే, నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్‌లను పోల్చి చూస్తే ఫ్రాంక్స్ మరియు ఆల్ట్రోజ్ గణాంకాలు ఒకేలా ఉన్నాయి. 

  • ఫ్రాంక్స్ టర్బో-పెట్రోల్ ఆటోమ్యాటిక్ కాంబినేషన్ ప్రయోజనం కలిగి ఉంది, ఇది టాటాలో అందుబాటులో లేదు. 

  • సామర్ధ్యం పరంగా, ఆల్ట్రోజ్ అన్నిటి కంటే తక్కువ సామర్ధ్యాన్ని కలిగి ఉంది. 

సారాంశం:

అన్నీ మారుతీ కార్‌ల విధంగానే, ఫ్రాంక్స్ మెరుగైన ఇంధన సామర్ధ్య గణాంకాలతో ముందంజలో ఉంది. నిజమైన పోటీ i20 టర్బో నుండి ఉంటుంది, ఇది అత్యంత శక్తివంతమైనది అయినప్పటికీ, దాదాపుగా సమాన సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మా పోలిక సమీక్షల కోసం చూస్తూనే ఉండండి, తనిఖీ చేయడానికి వాస్తవ-గణాంకాలను పోల్చి చూస్తాము. 

ఇక్కడ మరింత చదవండి: మారుతి బాలెనో AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Maruti బాలెనో

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience