• హ్యుందాయ్ వెర్నా front left side image
1/1
 • Hyundai Verna
  + 100చిత్రాలు
 • Hyundai Verna
 • Hyundai Verna
  + 6రంగులు
 • Hyundai Verna

హ్యుందాయ్ వెర్నా

కారును మార్చండి
573 సమీక్షలుఈ కారుకి రేటింగ్ ఇవ్వండి
Rs.8.17 - 14.07 లక్ష*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
వీక్షించండి తాజా ఆఫర్లు
ఈ నెల అందిస్తున్న పండుగ ఆఫర్లను మిస్ అవ్వకండి

హ్యుందాయ్ వెర్నా యొక్క కిలకమైన నిర్ధేశాలు

మైలేజ్ (వరకు)24.0 కే ఎం పి ఎల్
ఇంజిన్ (వరకు)1591 cc
బిహెచ్పి126.2
ట్రాన్స్మిషన్మాన్యువల్/ఆటోమేటిక్
సీట్లు5
సర్వీస్ ఖర్చుRs.3,722/yr

వెర్నా తాజా నవీకరణ

తాజా నవీకరణ: హ్యుందాయ్ సంస్థ ఈ పండుగ సీజన్ లో వెర్నా యొక్క ఒక ప్రత్యేక వార్షిక ఎడిషన్ ను ప్రారంభించింది. ప్రస్తుతం విడుదల అయిన ఈ లిమిటెడ్ ఎడిషన్, ఒక కొత్త రంగును, అదనపు లక్షణాలను మరియు సూక్ష్మ సౌందర్య నవీకరణలతో అందుబాటులో కొనుగోలుదారుల ముందుకు వచ్చింది. మరింత సమాచారం కోసం ఇక్కడ చూడండి.

హ్యుందాయ్ వెర్నా నాలుగు వేరియంట్ లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా, ఈ, ఈ ఎక్స్, ఎస్ ఎక్స్ మరియు ఎస్ ఎక్స్ (ఓ). ఈ అనేది దిగువ శ్రేణి వేరియంట్, దీని యొక్క పెట్రోల్ ధర రూ 7.79 లక్షలు మరియు డీజిల్ రూ. 9.49 లక్షలు గా నిలచింది. మరోవైపు, ఎస్ఎక్స్ (ఓ) అగ్ర శ్రేణి వేరియంట్, దీని యొక్క పెట్రోల్ ధర రూ. 12.55 లక్షల రూపాయలు, డీజిల్ ధర రూ. 12.75 లక్షలు (ఎక్స్- షోరూమ్ ఢిల్లీ) ధరకు అందుబాటులో ఉంది. మీ అవసరాలకు అనుగుణంగా ఉండే వేరియంట్ ను తెలుసుకోవడానికి, మా హ్యుందాయ్ వెర్నా వేరియంట్స్ గురించిన వీడియోయొక్క సమాచారం ఇక్కడ చూడండి.

హ్యుందాయ్ వెర్నా మూడు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది: అవి వరుసగా, 1.4 లీటర్ పెట్రోల్, 1.6 లీటర్ పెట్రోల్ మరియు 1.6 లీటర్ డీజిల్. ముందుగా 1.4 లీటర్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 100 పిఎస్ పవర్ ను అలాగే 132 ఎన్ ఎం గల టార్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మరోవైపు 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 123 పిఎస్ పవర్ ను అలాగే 151 ఎన్ ఎం గల గరిష్ట టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. మరోవైపు 1.6 లీటరు డీజిల్ ఇంజిన్ విషయాఇకి వస్తే ఈ రెండింటి కన్నా అత్యధికంగా 128 పి ఎస్ పవర్ ను అలాగే 260 ఎన్ ఎం గల అధిక టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. రెండు 1.6 లీటర్ ఇంజన్ లూ 6- స్పీడ్ మాన్యువల్ లేదా 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ తో అనుసంధానం చేయబడి ఉంటాయి. అయితే 1.4- లీటర్ పెట్రోల్ ఇంజిన్ విషయానికి వస్తే, 6- స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ తో మాత్రమే జత చేయబడి ఉంటుంది.

ఈ వెర్నా కలిగి ఉన్న లక్షణాల విషయానికి వస్తే, వెర్నా ఎల్ ఈ డి డే టైం రన్నింగ్ లైట్లు (డి ఆర్ ఎల్ ఎస్ లు) ల తో పాటు ఆటోమేటిక్ ప్రొజెక్టార్ హెడ్ ల్యాంప్‌లు, విద్యుత్ సన్‌రూఫ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆపిల్ కార్ప్లే, యాండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్ లింక్ లను కలిగిన 7- అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ప్రొజెక్టార్ హెడ్‌ల్యాంప్స్, వెంటిలేటెడ్ ముందు సీట్లు, వెనుక పార్కింగ్ సెన్సార్ల తో కూడిన కెమెరా మరియు డైనమిక్ మార్గదర్శకాలు అలాగే క్రూజ్ నియంత్రణ వంటి అనేక అంశాలను కలిగి ఉంది.

భద్రత పరంగా వెర్నా వాహనం, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్, ఏ బి ఎస్, ప్రిటెన్షినార్లతో కూడిన ముందు సీటు బెల్ట్ లు మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్ వంటి అంశాలు అన్ని ఈ వాహనం యొక్క అన్ని వేరియంట్ శ్రేణిలో ప్రామాణికంగా అందించబడ్డాయి. ఏది ఏమయినప్పటికీ, అగ్ర శ్రేణి వేరియంట్ లో నాలుగు అదనపు ఎయిర్బాగ్ లు ప్రామాణికంగా అందించబడతాయి.

వెర్నా ప్రత్యర్ధుల విషయానికి వస్తే, ఈ వాహనం హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్, వోక్స్వాగన్ వెంటో మరియు స్కొడా రాపిడ్ వంటి వాహనాలతో గట్టి పోటీను ఇస్తుంది.   

ఎక్కువ మొత్తంలో పొదుపు!!
72% ! ఉపయోగించిన ఉత్తమ ఒప్పందాలను కనుగొనండి వరకు సేవ్ చేయండి

హ్యుందాయ్ వెర్నా ధర లిస్ట్ (variants)

విటివిటి 1.4 ఈ1368 cc, మాన్యువల్, పెట్రోల్, 19.1 కే ఎం పి ఎల్Rs.8.17 లక్ష*
విటివిటి 1.4 ఈఎక్స్1368 cc, మాన్యువల్, పెట్రోల్, 19.1 కే ఎం పి ఎల్Rs.9.33 లక్ష*
సిఆర్డిఐ 1.4 ఈ1396 cc, మాన్యువల్, డీజిల్, 24.0 కే ఎం పి ఎల్Rs.9.42 లక్ష*
సిఆర్డిఐ 1.4 ఈఎక్స్1396 cc, మాన్యువల్, డీజిల్, 24.0 కే ఎం పి ఎల్Rs.9.99 లక్ష*
విటివిటి 1.6 ఎస్ఎక్స్1591 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 కే ఎం పి ఎల్
Top Selling
Rs.9.99 లక్ష*
విటివిటి 1.6 ఎటి ఎస్ఎక్స్ ప్లస్1591 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 17.0 కే ఎం పి ఎల్Rs.11.62 లక్ష*
సిఆర్డిఐ 1.6 ఎస్ఎక్స్1582 cc, మాన్యువల్, డీజిల్, 22.0 కే ఎం పి ఎల్
Top Selling
Rs.11.72 లక్ష*
విటివిటి 1.6 ఎస్ఎక్స్ ఆప్షన్1591 cc, మాన్యువల్, పెట్రోల్, 17.0 కే ఎం పి ఎల్Rs.11.72 లక్ష*
యానివర్సరీ ఎడిషన్ పెట్రోల్1591 cc, మాన్యువల్, పెట్రోల్, 17.7 కే ఎం పి ఎల్Rs.11.78 లక్ష*
విటివిటి 1.6 ఎటి ఎస్ఎక్స్ ఆప్షన్1591 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 17.0 కే ఎం పి ఎల్Rs.12.87 లక్ష*
సిఆర్డిఐ 1.6 ఎస్ఎక్స్ ఆప్షన్1582 cc, మాన్యువల్, డీజిల్, 22.0 కే ఎం పి ఎల్Rs.13.01 లక్ష*
సిఆర్డిఐ 1.6 ఎటి ఎస్ఎక్స్ ప్లస్1582 cc, ఆటోమేటిక్, డీజిల్, 22.0 కే ఎం పి ఎల్Rs.13.28 లక్ష*
సిఆర్డిఐ 1.6 ఎటి ఎస్ఎక్స్ ఆప్షన్1582 cc, ఆటోమేటిక్, డీజిల్, 22.0 కే ఎం పి ఎల్Rs.14.07 లక్ష*
వేరియంట్లు అన్నింటిని చూపండి
Ask Question

Are you Confused?

Ask anything & get answer లో {0}

Recently Asked Questions

హ్యుందాయ్ వెర్నా ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

హ్యుందాయ్ వెర్నా సమీక్ష

"ఈ కొత్త వెర్నా వాహనం, కొత్త డైనమిక్స్ తో ఇప్పుడు మంచి నిర్వహణ ను మరియు గొప్ప రైడ్ నాణ్యత మధ్య ఒక గొప్ప సమతుల్యతను కలిగి ఉంది, పాత కారు యొక్క పెద్ద సమస్యలను ఈ కొత్త దాని వల్ల అధిగమించగలిగాము"

ఈ కొత్త హ్యుందాయ్ వెర్నా చాలా పోటీగా ధరలను కలిగి ఉంది ఎంతా అనుకుంటున్నారా, రూ .7.99 లక్షల నుండి - రూ 12.39 లక్షల మధ్య కలిగి ఉంది, మారుతి సియాజ్ డీజిల్ ధరకు పూర్తిగా సరిపోతుంది మరియు పూర్తిగా హోండా సిటీ ధర తో పోలిస్తే తగ్గించబడింది. ఈ వాహనం కలిగి ఉన్న లక్షణాల విషయానికి వస్తే, దీని అంశాలు మరింత మందిని ఆకర్షించే విధంగా ఉన్నాయి, అవి ఏమిటంటే, విద్యుత్ సన్ రూఫ్, కొత్త విభాగంలో -హ్యాండ్స్ ఫ్రీ బూట్ విడుదల మరియు వెంటిలేటెడ్ ఎయిర్ కూల్డ్ ముందు సీట్లు వంటి అంశాలు కొనుగోలుదారులను ఆకర్షితులను చేస్తున్నాయి. ఈ నూతన అవతార్, హ్యుందాయ్ 2017 వెర్నా డిజైన్ కు రిఫ్రెష్ మెచ్యూరిటీని తెచ్చి పెట్టింది.

"ఈ కొత్త వెర్నా వాహనం, కొత్త డైనమిక్స్ తో ఇప్పుడు మంచి నిర్వహణ ను మరియు గొప్ప రైడ్ నాణ్యత మధ్య ఒక గొప్ప సమతుల్యతను కలిగి ఉంది, పాత కారు యొక్క పెద్ద సమస్యలను ఈ కొత్త దాని వల్ల అధిగమించగలిగాము" దీని డైనమిక్స్ గురించి చెప్పాలంటే ఈ కొత్త వెర్నా వాహనం, కొత్త డైనమిక్స్ తో ఇప్పుడు మంచి నిర్వహణ ను మరియు గొప్ప రైడ్ నాణ్యత మధ్య ఒక గొప్ప సమతుల్యతను కలిగి ఉంది, ఈ పాత కారు యొక్క పెద్ద సమస్యలను ఈ కొత్త దాని వల్ల అధిగమించగలిగాము. ఈ కొత్త హ్యుందాయ్ వెర్నా, మూడు సంవత్సరాల / అపరిమిత కిలోమీటర్ వారంటీ తో చాలా తెలివైన కొనుగోలు కు సిద్దంగా ఉంది. కొత్త వెర్నా యొక్క ఒక తీవ్రమైన ప్రతికూలత ఏమిటంతే, వెనుక భాగంలో పుష్కలమైన రూం లేకపోవడం మరియు ఇది వెనుక సీటులో ఉండే వారు ఎక్కువ సమయం గడపడానికి వీలు లేకుండా అసౌకర్యాన్ని కలిగించే విధంగా ఉంది. అందువల్ల ఇది ఈ వాహనానికి అతి పెద్ద ప్రతికూలత అని చెప్పవచ్చు. అయితే, 2017 హ్యుందాయ్ వెర్నా సరిగ్గా కొనుగోలుదారులు ఏ ఏ అంశాలు ఉండాలి అని ఆసక్తి చూపిస్తారో ఆయా అంశాలు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి. అందువల్ల కారు కొనుగోలుదారులు ఈ వాహనాన్ని కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.డబుల్ లైన్ మీద సంతకం చేయడానికి ముందు హుండాయ్ ప్రదర్శనశాలల మధ్య-స్థాయి సెడాన్ కారు-కొనుగోలుదారులకుఅగ్రస్థాయివాహనంలాతయారవుతుంది.  

బాహ్య

వెర్నా వాహనం యొక్క భాహ్య భాగం విషయానికి వస్తే, ఈ వాహనం హ్యుందాయ్ యొక్క లిక్విడ్ డిజైన్ ను కలిగి ఉంటుంది. ఈ రూపకల్పన ఆధారం గా ఈ విభాగంలో ముందంజలో ఉంది. ఈ వాహనం అనేక మెరుగుపర్చబడిన అంశాలతో మీ ముందుకు వచ్చింది. ఈ కొత్త హ్యుందాయ్ వెర్నా యొక్క రూపం ఇప్పటికీ ఆకర్షణీయమైన ప్యాకేజీతో ముందుకు సాగుతున్నాయి, ఇది బాగా తెలిసిన మరియు తాజాగా కనిపిస్తుంది.

ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే, ఈ ముందు భాగం ప్రజల కంటికి కొత్తది కాదు మరియు తొలుత చైనాలో దీని యొక్క డిజైన్ మొదతిసారిగా వెల్లడించబడింది మరియు ఇక్కడే మొదట కనిపించింది. వాస్తవానికి, ఇది సోలారిస్ బ్యాడ్జ్ తో రష్యాలో అమ్మకానికి ఉంది. భారతదేశం కోసం, 2017 వెర్నా, డే టైం రన్నింగ్ ఎల్ ఈ డి లైట్ లతో పాటు ప్రొజెక్టార్ ఫాగ్ ల్యాంప్‌లు అంటేకాకుండా ప్రొజెక్టార్ హెడ్‌ల్యాంప్స్ తో కొత్తది పెద్ద ముందు గ్రిల్ వంటి అంశాలతో అందుబాటులో ఉంది. ముందు భాగంలో ఉండే హెడ్ ల్యాంప్‌లు హాక్ ఐ ఆకారాన్ని గుర్తు చేస్తాయి. దీని క్రింది మధ్య భాగంలో ఒక నలుపు రంగు గ్రిల్ పొందుపరచబడింది. దీని మధ్యలో క్రోం స్లాట్లు అందంగా బిగించబడి ఉన్నాయి. దీని మధ్య భాగంలో సంస్థ యొక్క చిహ్నం అందంగా పొందుపరచబడి ఉంది. దీని క్రింధి భాగం లో ఎయిర్ డాం బిగించబడింది దీనికి ఇరువైపులా వృత్తాకార ఫాగ్ ల్యాంప్‌లు అందంగా పొందుపరచబడి ఉన్నాయి.  

ఈ వాహనం యొక్క శైడ్ భాగం విషయానికి వస్తే, ఒక పదునైన లైను కేవలం విండో లైన్ కింద వ్యాపించి ఉంది మరియు ఇది హ్యుందాయ్ ఎలెంట్రా ను గుర్తుచేస్తుంది. అంతేకాకుండా ఈ రెండు వాహనాలు అంటే, హ్యుందాయ్ వెర్నా మరియు ఎలెంట్రా ఇప్పుడు అదే కె2 ప్లాట్‌ఫారమ్ తో నడుస్తాయి. ఇది కొంచెం పరిపక్వత చూడటంతోపాటు, అవుట్గోయింగ్ మోడల్ కన్నా కొద్దిగా పెద్దదిగా ఉంటుంది. ఈ వాహనం యొక్క కొలతలు విషయానికి వస్తే, దీని పొడవు 4440 మీ మీ గా ఉంది ముందు కంటే 65 మీ మీ ఎక్కువ పొడవును కలిగి ఉంది. వెడల్పు ముందు దాని కంటే 29 మీ మీ పెరుగుదల అంటే ఇప్పుడు 1729 మీ మీ వరకు ఉంది మరియు వీల్ బేస్ 30 మీ మీ పెరిగింది అంటే 2600 మీ మీ గా ఉంది. కానీ, రూఫ్ యొక్క ర్యాక్ పదునుగా ఉన్నప్పటికీ, ఎత్తు 1475 మీ మీ వద్ద ముందు వలె ఒకేలా ఉంటుంది.

పైన రూఫ్ శాంతముగా కారు వెనుక భాగంలోకి ఒక అందమైన ఒంపు ను కలిగి ఉంది మరియు తక్కువ వెంటేజ్ పాయింట్ నుండి అది దాదాపు అద్భుతంగాకనబడుతుంది. ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, టైల్ లైట్లు ఎలెంట్రా వాహనంలో అందించబడినట్లుగా అలాగే సమానంగా ఉంటాయి, అవి కూడా మూడు- యూనిట్ రూపకల్పనలో ఉన్నాయి, అయితే ఎలెంట్రా లో వృత్తాకార ఎల్ ఈ డి ఎలిమెంట్ లను, అదే కొత్త వెర్నా స్పోర్ట్స్ అర్ధ వృత్తాకార యూనిట్లను కలిగి ఉంది. కొత్త బంపర్ ఫ్లెయిర్ లుక్ వలె జిడ్డు గా కాకుండా పరిపక్వ క్రొత్త రూపాన్ని ముగించింది. బూట్ మూతకు కూడా ఒక మందపాటి క్రోం స్ట్రిప్ కూడా అందించబడింది. దీని వలన వెనుక భాగానికి మరింత అందం చేకూరుతుంది

Exterior Comparison

Hyundai VernaHonda CityMaruti CiazSkoda Rapid
Length (mm)4440mm4440mm4490 mm4413mm
Width (mm)1729mm1695mm1730 mm1699mm
Height (mm)1475mm1495mm1485 mm1466mm
Ground Clearance (mm)165mm165mm170 mm163mm
Wheel Base (mm)2600mm2600mm2650 mm2552mm
Kerb Weight (kg)-1147kg-1182kg

Boot Space Comparison

Skoda RapidHonda CityMaruti CiazHyundai Verna
Volume460510510-litres480
 

అంతర్గత

ఈ వాహనం యొక్క అంతర్గత భాగం విషయానికి వస్తే, హ్యుందాయ్ వెర్నా అంతర్గత భాగం ఎల్లప్పుడూ దాని బలమైన పాయింట్లలో ఒకటి మరియు ఈ కొత్త కారు యొక్క మెటీరియల్స్ మరియు ప్లాస్టిక్ లలో అదే స్థాయిలో నాణ్యతను కలిగి ఉంది. డిజైన్ అయితే మేము ఇతర కొత్త హ్యుందాయ్స్ లో చూసిన వలె పోలి ఉంటుంది, కాబట్టి అది అంత వింతను కలిగి లేదు మరియు ఈ కొత్త కారు అంతటా చూడటానికి అద్భుతంగా ఉంది. పాత వెర్నాతో పోల్చి చూస్తే, ఈ రూపకల్పన కొంచెం తక్కువగా మరియు ఆడంబరంగా అనిపిస్తుంది. అన్ని స్విచ్చులు, డాష్ బోర్డ్ పై మరియు స్టీరింగ్ వీల్ పై అందంగా పొందుపరచబడి ఉన్నాయి. ఇవి డ్రైవర్ కు సౌకర్యాన్ని మరింత చేకూర్చడానికి సానుకూల చర్యలు కలిగి ఉన్నయి అంతేకాకుండా ఈ వాహనం దృడంగా మరియు అద్భుతంగా నిర్మించబడిన అనుభూతి కొనుగోలుదారులకు అందించబడుతుంది. 

సెంట్రల్ కన్సోల్‌లో పెద్ద 7- అంగుళాల టచ్‌స్క్రీన్ డిస్ప్లే మధ్య భాగంలో అమర్చబడి ఉంది, ప్రత్యేకంగా వేర్వేరు ఫంక్షన్లకు వేర్వేరు బటన్లు ఉంటాయి. మరియు ఇది సియాజ్ లో మాదిరిగా తక్కువ దృష్టి కంటే ఎక్కువ అన్ని టచ్- ఆధారిత సిస్టమ్ వలె ఈ 2017 వెర్నా కూడా ఫ్లూయిడ్ రూపకల్పన అవే అంశాలతో మన ముందుకు వచ్చింది. 

ముందు సీట్లు విషయానికి వస్తే, మంచి లుంబార్ మద్దతు మరియు పార్శ్వ మద్దతుతో మంచి మెత్తని కుషనింగ్ లక్షణాన్ని కలిగి ఉంటాయి. సీట్లు కేవలం అద్భుతంగా ఉండటమే కాకుండా మంచి తొడ మద్దతు ను అందించడానికి కొద్దిగా వెడల్పుగానే అందించబడ్డాయి. ఇది అసౌకర్యకరంగా లేనందున, మనం కొంచెం ఎక్కువ మద్దతును ఇస్తాము. ముందు సీట్లు కూడా ముందు వైపు పుష్కలమైన లెగ్ రూం అలాగే హెడ్ రూం లు అందించబడ్డాయి మరియు వీటి కోసం ఉదారంగా సర్దుబాటు సౌకర్యాన్ని కలిగి ఉన్నాయి. నిజానికి, ఈ కారు అద్భుతమైన లక్షణాలను అలాగే డ్రైవర్ కు మరియు ప్రయాణికులకు అధిక సౌకర్యం అందించడానికి అనేక అంశాలతో మన ముందుకు వచ్చింది. ఆటో ప్రయాణాలను కూడా హాయిగా చేస్తుంది. దురదృష్టవశాత్తు, టెస్ట్ డ్రైవ్ జరుగలేదు, కానీ సంస్థ వారు త్వరలోనే కారును పరీక్షించి ఈ టెస్ట్ పరిశీలిస్తారని నమ్ముతున్నాము. 

ఈ విభాగంలో ఎయిర్ -కూల్డ్ సీట్లను కలిగి ఉన్న మొట్టమొదటి కారు వెర్నా 2017 మాత్రమే, మరియు కొచ్చి లోని వేడి మరియు తేమతో కూడిన వాతావరణంలో కూడా ప్రయాణికులకు ఒక సౌకర్యాన్ని అందిస్తుంది ఎలా అంటే ఇవి ఇంటిగ్రేటెడ్ సీట్లు కావడం వలన శీతలికరణను కలిగి ఉంటాయి, ఇవి సీట్లపై చెమట మచ్చలను కూడా పడనివ్వవు. 

ఆశ్చర్యకరమైనవిషయంఏమిటంటే, కొలతలు పెరిగాయి.కానీ, వెనుక సీటులో ఉండే స్థలం ఎక్కువ మొత్తంలో ఏమి పెరగలేదు. వెనుక భాగంలో పుష్కలమైన లెగ్ రూం అలాగే పెద్ద పరిమాణం కలిగిన పెద్దలకు సరిపోయే విధంగా సీట్లు అందించబడ్డాయి. వెనుక భాగంలో ముగ్గురు కూర్చోవడానికి వీలు ఉంటుంది కానీ కొంచెం అసౌకర్యకరంగా కూర్చోవలసి వస్తుంది. ఇది మారుతి సియాజ్ లేదా హోండా సిటీ వంటి వాహనాలకు సమీపంలో లేదు. ఇక్కడ వెనుక సీటు ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం వెనుక భాగంలో, వెనుక ఏసి వెంట్లు మరియు ఒక యూ ఎస్బి ఛార్జర్ వంటివి అంశాలు అందించబడ్డాయి. ఈ అంశాలు అన్ని కానీ ఈ వాహనం యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అయిన ఈ వేరియంట్ లో ఈ అంశాలు అందించబడటం లేదు. 

సాంకేతికత, అంశాలు మరియు భద్రత

ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో యాండ్రాయిడ్ డ్రైవ్, ఆపిల్ కార్ప్లే మరియు మిర్రర్ లింక్ వంటి వాటికి మద్దతిచ్చే స్మార్ట్ఫోన్ఫోన్ కనెక్టివిటీ ఫంక్షన్ తో నావిగేషన్ అంశం అందించబడుతుంది. 

ఈ కొత్త వెర్నా, ఇప్పుడు దాని విభాగంలో కొన్ని కొత్త అంశాలను తీసుకొచ్చింది అవి వరుసగా, ఒక విద్యుత్ సన్‌రూఫ్ ను పొందుతుంది మరియు హ్యాండ్స్ ఫ్రీ బూట్ మూత విడుదల వంటి అంశాలను కలిగి ఉంది. ఇది, మీ జేబులో కీ ఉండిపోతే మూడు అడుగుల దూరంలో ఉన్నట్లయితే మూడు సెకన్ల సమయంలో మీరు హ్యాండ్స్- ఫ్రీ బూట్ అంశంసహాయంతోమూతను సులభంగా తెరవవచ్చు. 

ఈ సౌకర్య లక్షణం, షాపింగ్ చేసి వచ్చినప్పుడు చేతి నిండా బ్యాగ్‌లను కలిగి ఉన్న సమయంలో ఈ అంశం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇది రివర్స్ పార్కింగ్ కెమెరా మరియు పార్కింగ్ సెన్సార్లను కలిగి ఉంటుంది, అయితే అన్ని- ఎల్ ఈ డి హెడ్‌ల్యాంప్‌లు మరియు రైన్- సెన్సింగ్ వైపర్లు కూడా హోండా సిటీలో అందుబాటులో ఉంటాయి. 2017 హ్యుందాయ్ వెర్నా యొక్క టాప్ ఎండ్ వేరియంట్స్ కూడా 6 ఎయిర్బాగ్లను పొందుతుండగా, ద్వంద్వ ఎయిర్‌బ్యాగ్స్ మరియు ఏబిఎస్ అంశాలు ఈ వాహనం యొక్క అన్ని వేరియంట్ లలో ప్రామాణికంగా అందించబడతాయి. 

ఈ వాహనానికి అందించబడిన మరో ఆలోచనాత్మక లక్షణం ఏమిటంటే, హ్యుందాయ్ ఆటో లింక్ అని పిలిచే ఒక అనువర్తనం, ఇది ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఎస్ ఎక్స్ (ఓ) వేరియంట్ లో ప్రమాణంగా ఉంటుంది. ఈ అనువర్తనం హుండాయ్ యొక్క ఆర్ & డి కేంద్రంలో హైదరాబాద్‌లో అభివృద్ధి చేయబడింది. ఈ యాప్, మీ స్మార్ట్ ఫోన్‌కు కారుకు జత చేస్తుంది మరియు ఇంజిన్ వేగం, ఇంజిన్ లోడ్ మరియు బ్రేకింగ్ అలవాట్లు వంటి నిజ సమయ డేటా ను మరియు ఇతర సమాచారాన్ని మీ ఇంతి నుండి సౌలభ్యంగా చూసుకోవచ్చు మరియు ఒక సేవను బుకింగ్ లేదా తనిఖీ చేయడం మీ డ్రైవింగ్ చరిత్రపై లేదా మీ చివరి పార్కింగ్ స్థలాన్ని కూడా నిల్వ చేస్తుంది. ఇటువంటి అద్భుతమైన అంశాలను ఈ వెర్నా వాహనం కలిగి ఉంది.

ప్రదర్శన

వెర్నా యొక్క ఇంజన్ల విషయానికి వస్తే, ఈ 2017 వెర్నా ఇప్పుడు కేవలం పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్ ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి రెండూ కూడా శక్తివంతమైన 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 1.6 లీటర్ సి ఆర్ డి ఐ డీజిల్ ఇంజన్. ముందుగా 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ వి టి వి టి పెట్రోల్ ఇంజన్ అత్యధికంగా 123 పిఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. మరోవైపు 151 ఎన్ ఎం గల గరిష్ట టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే సి ఆర్ డి ఐ డీజిల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధికంగా 128 పి ఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది మరియు 260 ఎన్ ఎం గల గరిష్ట టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు ఇంజన్లూ, 6- స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ లతో జత చేయబడి ఉంటాయి. మెరుగైన పనితనంతోనూ మరియు సమర్ధతతోనూ అందుబాటులో ఉంటాయి.

డీజిల్

%performanceComparision-Diesel%

ముందుగా 2017 హ్యుందాయ్ వెర్నా యొక్క 1.6 సి ఆర్ డి ఐ డీజిల్ ఇంజిన్ విషయానికి వస్తే, అవుట్గోయింగ్ మోడల్ వలె శక్తివంతమైనది, కాని ఇప్పుడు తక్కువ ఆర్ పి ఎం ల వద్ద కూడా ఎక్కువ టార్క్ ను అందిస్తుంది. దీని అర్ధం ఏమిటంటే, నగరాలలో తక్కువ వేగం వద్ద అంటే సుమారు 30 కె ఎం పి హెచ్ వేగంతో, 3 వ భాగంలో ట్రాన్స్మిషన్ ను విడుదల చేస్తుంది మరియు గ్యాస్ పెడల్ ను నొక్కేటప్పుడు దానిని చక్కగా లాగవలసి ఉంటుంది. టర్బో ఇంజన్ సుమారు 1700- 1800 ఆర్ పి ఎం లలో దాని స్వంతదానిలోకి ప్రవేశించినప్పుడు మంచి త్వరణాన్ని కేవలం తక్కువ సమయంలోనే అందిస్తుంది మరియు గొప్ప విషయం ఏమిటంటే ఈ ఇంజిన్ తక్కువ ఆర్ పి ఎం ల వద్ద కూడా అద్భుతమైన పనితీరును అందిస్తుంది.

ఇది కొద్దిగా పొరపాటు విషయం ఏమిటంటే, పనిలేకుండా మరియు మధ్యస్థ థొరెటల్ ఇన్పుట్లను వద్ద 1100- 1800 ఆర్ పి ఎం ల మధ్య క్యాబిన్ లోపల ఎక్కువ శబ్ధాన్ని మరియు అసౌకర్యాన్ని అందిస్తుంది. అన్ని ఇతర రివర్స్ శ్రేణులలో ఇంజిన్ మరింత భరించదగినిదిగా మరియు నిశ్శబ్దంగా సౌకర్యాన్ని అందిస్తుంది. హ్యుందాయ్ వెర్నా యొక్క ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, ఈ డీజిల్ ఇంజన్ ఏ ఆర్ ఏ ఐ ప్రకారం అత్యధికంగా మాన్యువల్ ట్రాన్స్మిషన్ వద్ద 24.75 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అలాగే ఆటో మేటిక్ ట్రాన్స్మిషన్ వద్ద 21.02 కె ఎం పి ఎల్ గల మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది అని హుందాయ్ పేర్కొంది. మునుపటి తరం హ్యుందాయ్ వెర్నా మాన్యువల్ కోసం 23.9 కె ఎం పి ఎల్ మైలేజ్ ను మరియు ఆటో ట్రాన్స్మిషన్ లో 19.08 కె ఎం పి ఎల్ మైలేజ్నుఅందించేసామర్ధ్యాన్నికలిగిఉండేది.

పెట్రోల్

%performanceComparision-Petrol%

మరోవైపు పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, ఈ వెర్నా యొక్క వి టి వి టి పెట్రోల్ ఇంజన్ అత్యధికంగా 123 పి ఎస్ పవర్ ను నిస్సందేహంగా అందించగలదు. ముందు దాని వలె కాకుండా ఈ కొత్త ఇంజన్ నగర ప్రయాణాలలో, నిశ్శబ్ద మరియు మెరుగైన పనితీరు కోసం ట్యూన్ చేయబడింది. ప్రశాంతత మరియు అద్భుతమైన పనితీరును కలిగి ఉంది. అలాగే ఈ ఇంజన్, 1500 ఆర్ పి ఎం వద్ద ముందు వెర్షన్ 130.5 ఎన్ ఎం గల టార్క్ ను అందించేది కాని ఈ నవీకరించబడిన పెట్రోల్ ఇంజన్ అత్యధికంగా 151 ఎన్ ఎం గల గరిష్ట టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ మృదువైన పురోగతిని మీకు అందించబడుతుంది. నిజానికి, ఈ ఇంజన్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడింది అంతేకాకుండా ఈ ఇంజన్ నుండి ఒక ఫిర్యాదు లేకుండా ఆరవ గేర్ లో 25 కె ఎం పి హెచ్ తక్కువ నుండి (చాలా నెమ్మదిగా) ఎక్కువ పనితీరును అందిస్తుంది.

మీరు వేగవంతమైన పురోగతిని చూడాలనుకుంటే, ఈ పెట్రోల్ ఇంజిన్ యొక్క ఆర్ పి ఎం లను అంటే 3500- 5000 ఆర్ పి ఎం కంటే ఎక్కువగా పెట్రోల్‌ను స్పిన్నింగ్ చేయాలి. హ్యుందాయ్ వెర్నా యొక్క మాన్యువల్ వెర్షన్, అత్యధికంగా 17.7 కి.మీ. మైలేజ్ ను అలాగే ఆటోమేటిక్ వెర్షన్ లో 17.01 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ముందు వెర్షన్ తో పోలిస్తే ఎక్కువ మైలేజ్ ను అలాగే ఎక్కువ పనితీరును అందిస్తుంది. ముందు వెర్షన్ మాన్యువల్ మోడ్ లో 17.01 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అలాగే 4- స్పీడ్ ఆటో మోడ్ లో 15.74 కె ఎం పి ఎల్ గల తక్కువ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉండేద

ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లు

డీజిల్ మాన్యువల్ 2017 వెర్నాను నడపడానికి మాకు అవకాశం లేదు, కానీ 6- స్పీడ్ కన్వెన్షినల్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఒక ఆనందకరమైన ఆశ్చర్యం. టార్క్ కన్వర్టర్ ట్రాన్స్మిషన్లను 'స్లుష్ బాక్సెస్' అని పిలిచారు, ఇవి థొరెటల్ పెడల్ వద్ద నెమ్మది ప్రతిస్పందన ను మరియు డిస్కనెక్ట్ భావనను అందిస్తుంది. కానీ నిజంగా ఈ హ్యుందాయ్ పునరుక్తిని కొనుగోలుదారులు ఇష్టపడుతున్నారు. ఇది ప్రతిస్పందించే పనితీరు శీఘ్రంగా మరియు నగరాలలో తేలికగా లేదా మధ్యస్థ థొరెటల్ ఇన్పుట్లను డ్రైవింగ్ లో ఉన్నప్పుడు మంచి పనితీరును అలాగే నగర ప్రయాణాలకు ఇది ఉత్తమం అని చెప్పవచ్చు.

మీరు పెడల్ పై ఉన్నప్పుడల్లా మీరు కొన్ని భాద్యతలను అనుసరించటానికి మొదలు పెడతారు మరియు ఇంజిన్ రివర్స్ తీయవలసి వచ్చినప్పుడు మీరు కష్టపడే పనితీరును చూడవచ్చు. కొన్ని ఉత్సాహభరితమైన డ్రైవింగ్ కోసం మీరు మానసిక స్థితిలో ఉంటే, మీరు ఎంపిక చేసుకున్న గేర్ని కలిగి ఉన్నట్లయితే, మీరు ట్రాన్స్‌మిషన్‌ను మాన్యువల్ మోడ్‌లోకి మార్చవచ్చు, కాని ఇది ఆటో మోడ్‌లో వదిలివేయవలసి వస్తుంది, ఇది డీజిల్ నుండి అత్యధిక టార్క్ ను అందిస్తుంది మరియు ఇప్పటికీ మీరు టార్క్ కన్వర్టర్ గేర్ బాక్సులను మార్చాలి అనుకుంటే అంతా సర్ధుమణిగాక మీరు అవసరమైతే ఆటోమేటిక్ మొడ్ లొకి మార్చుకోవచ్చు. ఈ ఇంజన్ మృదువైన గేర్ మార్పులను ఇస్తుంది. ఏ ఆర్ ఏ ఐ సెర్టిఫికెట్ ప్రకారం డీజిల్ ఇంజన్, 21 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది అద్బుతమైన మైలేజ్ అని చెప్పవచ్చు.

రైడ్ మరియు నిర్వహణ ఈ కొత్త హ్యుందాయ్ వెర్నా రైడ్ మరియు నిర్వహణ విషయానికి వస్తే, పాత హ్యుందాయ్ వెర్నాలో ఒక తీవ్రమైన కొరత ఉండేది అది ఏమిటంటే నమ్మకంగా ఉన్న ఈ వాహనం అధిక- వేగ యంత్రం కాదు. ఇప్పుడు వచ్చిన కొత్త కె2 ప్లాట్‌ఫాం అలాగేముందు మరియు వెనుక సస్పెన్షన్ సెటప్ రెండు మార్పులతో వచ్చింది మరియు ఈ 2017 వెర్నా వాహనం లో హ్యుందాయ్ సంస్థ, పూర్తిగా డ్రైవింగ్ అనుభవాన్ని మార్చివేసింది. స్టీరింగ్ ఇప్పటికీ నగరాలలో చాలా తేలికగా ఉంది, ట్రాఫిక్ ఎక్కువ సమయంలో కూడా అటూ తేలికగా కాకుండా ఇటు బరువుగా కాకుండా అధిక వేగాల వద్ద హైవే మీద ఒక సున్నితమైన పనితీరును మరియు సమతుల్యతను కలిగి ఉంది. స్టీరింగ్ కూడా చాలా మంచి అనుభూతిని అందిస్తుంది.అంతేకాకుండా, నిజంగా ముందు చక్రాలు ఎటువంటిపనితీరునుఅందజేస్తాయో తెలియజేయడంలో సహాయపడుతుంది.

ఇది మూలలలో చాలా బాగా స్థిరత్వాన్ని అందజేస్తుంది. చాసిస్ చాలా చదునైనప్పటికీ, కొన్ని రోల్ ఉన్నప్పటికీ, అది ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది మరియు ఎల్లప్పుడూ నియంత్రించబడుతుంది. బ్రేక్ పెడల్ చాలా స్థిరంగా ఉంటుంది మరియు ఇది చాలా సరళంగా ఉంటుంది అంతేకాకుండా తగినంత బ్రేకింగ్ శక్తిని కలిగి ఉంది, ఇది కొద్దిగా తేలికైన చర్యను కొనసాగిస్తుంది. దీని వలన క్యాబిన్ లో ఉన్న ప్రయాణికులు సౌకర్యాన్ని పొందుతారు.

రైడ్ నాణ్యత ఇప్పటికీ కొత్త వెర్నాలో మొండిగా ఉన్నందున సౌకర్యం విషయంలో రాజీపడలేదు. ఇది సంస్థ వైపు కానీ ఇంకా రోడ్ లో గతుకులు మరియు లోపాలు గ్రహించి మంచి పనితీరును నిర్వహిస్తుంది. ఈ వెర్నా వాహనానికి ఇవ్వబడిన హుందాయ్ సస్పెన్షన్ మంచి పనితీరును అందిస్తుంది. ఈ వాహనం యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు చక్రాలకు మెక్ ఫెర్షన్ లింకేజ్ మరియు వెనుక భాగంలో హారిజాంటల్ స్థానభ్రంశంను అందించారు, ఇది పరిమితం చేయడానికి ముందు మక్పెషెన్ కనెక్షన్ యొక్క సెటప్‌ను మార్చింది, వెనుక భాగంలో ప్రయాణికులకు మరింత సౌకర్యాన్ని అందించడం కోసం వెనుక భాగానికి వర్టికల్ నమూనాను అందించడం జరిగింది. ఇవి, రైడ్ ను మరింత మెరుగుపరుస్తాయి.

భద్రత

ఈ 2017 హ్యుందాయ్ వెర్నా విషయానికి వస్తే, ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్, ఏబిఎస్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ మౌంట్ సీటు యాంకర్లు వంటి అంశాలు ఈ వాహనం యొక్క అన్ని వేర్యియంట్ లలో ప్రామాణికంగా అందించబడ్డాయి. మరోవైపు ఈ వాహనం యొక్క ఈ ఎక్స్ వేరియంట్ లో, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, రియర్ పార్కు కెమెరా, ప్రొజెక్టార్ ఫాగ్ లైట్స్ మరియు ఆటో- హెడ్‌ల్యాంప్స్ తో పాటు, ఇంపాక్ట్ / స్పీడ్ సెన్సింగ్ ఆటో డోర్ లాక్స్ మరియు టైమర్ తో కూడిన ఆటో డిఫోగ్గర్ వంటి అంశాలు అందించబడ్డాయి. కొత్త వెర్నా యొక్క ఎస్ ఎక్స్ వేరియంట్ విషయానికి వస్తే, ఆటో- డిమ్మింగ్ అంతర్గత రేర్ వ్యూ మిర్రర్ మరియు ఎత్తు సర్దుబాటు ముందు సీటు బెల్ట్‌లు వంటి అంశాలు అందించబడతాయి. మరోవైపు ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఎస్ ఎక్స్ (ఓ) వేరియంట్ విషయానికి వస్తే, సైడ్ మరియు కర్టెన్ ఎయిర్బాగ్స్, మొత్తం 6 ఎయిర్బాగ్లు ప్రామాణికంగా అందించబడతాయి.

వేరియంట్లు

కొత్త హ్యుందాయ్ వెర్నా, 12 వేరియంట్ లతో అందుబాటులో ఉంది.

హ్యుందాయ్ వెర్నా యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

మనకు నచ్చిన విషయాలు

 • సౌకర్యవంతమైన రైడ్. 2017 వెర్నా అత్యధిక వేగాల వద్ద కూడా మంచి పికప్ ను మరియు మూలలలో గట్టి స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది.
 • 2017 వెర్నా యొక్క పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్లు సులభంగా డ్రైవర్ ఎబిలిటీ ను మరియు మంచి శుద్ధీకరణను అందిస్తున్నాయి. రెండు ఇంజిన్ లూ కూడా 6- స్పీడ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ లతో అందుబాటులో ఉన్నాయి.
 • కొత్త వెర్నా యొక్క ప్రామాణిక భద్రతా కిట్ విషయానికి వస్తే, ద్వంద్వ ముందు ఎయిర్బాగ్స్, ఏ బి ఎస్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్స్ వంటి అంశాలు ఉన్నాయి. అగ్ర శ్రేణి వేరియంట్ అధనంగా 6 ఎయిర్ బాగ్ లను ప్రామాణికంగా కలిగి ఉంది.
 • కొత్త వెర్నా, ప్రీమియం నిర్మాణ నాణ్యతను అందిస్తుంది. హ్యూందాయ్ యొక్క ప్లాస్టిక్స్ మరియు సామగ్రి, సంస్థ అంచనా వెసిన దాని లాగే బెంచ్ మార్కును దాటింది.
 • హుందాయ్ వెర్నా అనేక లక్షణాల జాబితాతో వస్తుంది - యాండ్రయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే తో కూడిన టచ్‌స్క్రీన్, విధ్యుత్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు, హ్యాండ్స్- ఫ్రీ బూట్ విడుదల వంటి అంశాలను కలిగి ఉంది.

మనకు నచ్చని విషయాలు

 • కొత్త వెర్నాలో వెనుక వరుస సీట్లు ఆకట్టుకునే విధంగా లేవు. పరిమాణానికి తగ్గట్టు కాకుండా సగటు వెనుక సీట్ హెడ్ రూమ్ మరియు లెగ్‌రూమ్ లు ఉన్నాయి.
 • హ్యుందాయ్ వెర్నా డీజిల్ ఏటి వెర్షన్, ఎస్ ఎక్స్ (ఓ) వేరియంట్ అందుబాటులో లేదు.
 • కొత్త వెర్నా యొక్క అంతర్గత భాగం, ప్రీమియం లుక్ ను కలిగి ఉన్నప్పటికీ దాని కాబిన్ డిజైన్ ఒక బిట్ తక్కువగా మరియు ఉత్సాహం లేదు.
 • 2017 వెర్నా యొక్క అద్భుతమైన లక్షణాలు అగ్ర శ్రేణి వేరియంట్స్ కు మాత్రమే పరిమితం. దిగువ శ్రేణి వేరియంట్ లో కూడా హెడ్- యూనిట్ లేదా స్పీకర్ లు కూడా అందించబడవు.

అత్యద్భుతమైన లక్షణాలను

 • Pros & Cons of Hyundai Verna

  ఎలెంట్రా వలే, 2017 హ్యుందాయ్ వెర్నా హ్యాండ్స్ ఫ్రీ బూట్ యాక్సెస్ ఫీచర్ పొందుతుంది, మీ చేతుల నిండా సామాన్లు పూర్తిగా ఉన్నప్పుడు సులభంగా బూట్ యాక్సెస్ అనుమతిస్తుంది.

 • Pros & Cons of Hyundai Verna

  2017 వెర్నా లో అందించబడిన విద్యుత్ సన్‌రూఫ్ సహజ గాలి అనుభూతిని ప్రసారం చేస్తుంది. వేసవిలో వేడిని వెదజల్లడంలో కూడా ఉపయోగపడుతుంది.

 • Pros & Cons of Hyundai Verna

  ్రొజెక్టార్ హెడ్‌లైట్ లే కాకుండా, 2017 హ్యుందాయ్ వెర్నా ప్రొజెక్టార్ ఫాగ్ ల్యాంప్‌లు అందించబడతాయి. దీని వలన అధిక వర్షాల సమయంలో / పొగ మంచు / తక్కువ-స్థాయి దృగ్గోచరతను పెంచే ప్రొజెక్టార్ ఫాగ్ లైట్లను పొందుతుంది.

 • Pros & Cons of Hyundai Verna

  ేడి వాతావరణంలో మీ వెనుక సీటు భాగం చల్లగా ఉంచడానికి సహాయపడే వెంటిలేటెడ్ ముందు సీట్ లు, ఈ విభాగంలోని కొత్త వెర్నా కు మాత్రమే అందించబడ్డాయి. ఎక్కువ చెమటలు పట్టినప్పుడు సీటు పై మరకలు కూడా పడవు

 • Pros & Cons of Hyundai Verna

  2017 హ్యుందాయ్ వెర్నా వాహనంలో యాండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు మిర్రర్లింక్ కనెక్టివిటీతో లతో కూడిన 7.0 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఈ వాహనం యొక్క ఎస్ ఎక్స్, ఎస్ ఎక్స్ (ఓ) వేరియంట్ లలో ఆప్షనల్ గా అందించబడుతుంది.

space Image

హ్యుందాయ్ వెర్నా యూజర్ సమీక్షలు

4.6/5
ఆధారంగా573 వినియోగదారు సమీక్షలు
Write a Review and Win
200 Paytm vouchers & an iPhone 7 every month!
Iphone
 • All (572)
 • Looks (187)
 • Comfort (167)
 • Mileage (114)
 • Engine (116)
 • Interior (86)
 • Space (39)
 • Price (69)
 • More ...
 • తాజా
 • ఉపయోగం
 • VERIFIED
 • CRITICAL
 • Great Car.

  It's a powerful car in this segment and it's interior is superb. I am driving this car for 3 years and it's just amazing. I am happy about driving this car. The Verna is ...ఇంకా చదవండి

  ద్వారా aman
  On: Jan 07, 2020 | 397 Views
 • Best in class comfort.

  I have bought the Verna Sx Model second top Petrol Variant. The car is very luxurious from inside and till now it has been around 3 months of me driving my car but I have...ఇంకా చదవండి

  ద్వారా ayush raj mishra
  On: Jan 20, 2020 | 286 Views
 • Best in the segment.

  The Hyundai Verna is powered from a 1.6L diesel engine, which produces excellent power and torque. Best sedan in the segment and value for money.

  ద్వారా farukh fs king
  On: Jan 17, 2020 | 32 Views
 • for CRDi 1.6 SX

  Great Car.

  Maintenance cost is average but performance is incredible. Although, for the mileage, I think its good because I travel long distances with minimum fuel consumption. Comf...ఇంకా చదవండి

  ద్వారా harpreet singh maan
  On: Jan 17, 2020 | 165 Views
 • Perfect Car.

  Great car with great features, no issue in the pickup , only leg space is less and mileage is also quite ok. Overall great car in comparison to Honda city or other sedans...ఇంకా చదవండి

  ద్వారా sarita panwar
  On: Jan 16, 2020 | 97 Views
 • వెర్నా సమీక్షలు అన్నింటిని చూపండి
space Image

హ్యుందాయ్ వెర్నా వీడియోలు

 • Cars To Watch Out For @ Auto Expo 2020| Kia QYI, Maruti XL5 & More| CarDekho
  6:3
  Cars To Watch Out For @ Auto Expo 2020| Kia QYI, Maruti XL5 & More| CarDekho
  Jan 23, 2020
 • Maruti Suzuki Ciaz 1.5 Vs Honda City Vs Hyundai Verna: Diesel Comparison Review in Hindi | CarDekho
  11:11
  Maruti Suzuki Ciaz 1.5 Vs Honda City Vs Hyundai Verna: Diesel Comparison Review in Hindi | CarDekho
  Jul 27, 2019
 • Maruti Suzuki Ciaz Vs Hyundai Verna Vs Honda City | Diesel Comparison Review | ZigWheels.com
  9:56
  Maruti Suzuki Ciaz Vs Hyundai Verna Vs Honda City | Diesel Comparison Review | ZigWheels.com
  Jun 27, 2019
 • Toyota Yaris vs Honda City vs Hyundai Verna | Automatic Choice? | Petrol AT Comparison Review
  13:58
  Toyota Yaris vs Honda City vs Hyundai Verna | Automatic Choice? | Petrol AT Comparison Review
  May 22, 2018
 • Honda City vs Hyundai Verna | Sedan Comparison | ZigWheels.com
  12:7
  Honda City vs Hyundai Verna | Sedan Comparison | ZigWheels.com
  Dec 20, 2017

హ్యుందాయ్ వెర్నా రంగులు

 • మండుతున్న ఎరుపు
  మండుతున్న ఎరుపు
 • టైఫూన్ సిల్వర్
  టైఫూన్ సిల్వర్
 • ఆల్ఫా బ్లూ
  ఆల్ఫా బ్లూ
 • థండర్ బ్లాక్
  థండర్ బ్లాక్
 • స్టార్రి నైట్
  స్టార్రి నైట్
 • పోలార్ వైట్
  పోలార్ వైట్
 • టైటాన్ గ్రే మెటాలిక్
  టైటాన్ గ్రే మెటాలిక్

హ్యుందాయ్ వెర్నా చిత్రాలు

 • చిత్రాలు
 • హ్యుందాయ్ వెర్నా front left side image
 • హ్యుందాయ్ వెర్నా side view (left) image
 • హ్యుందాయ్ వెర్నా rear left view image
 • హ్యుందాయ్ వెర్నా front view image
 • హ్యుందాయ్ వెర్నా rear view image
 • CarDekho Gaadi Store
 • హ్యుందాయ్ వెర్నా grille image
 • హ్యుందాయ్ వెర్నా front fog lamp image
space Image

హ్యుందాయ్ వెర్నా వార్తలు

హ్యుందాయ్ వెర్నా రోడ్ టెస్ట్

 • హ్యుందాయ్ వెర్నా: ఫస్ట్ డ్రైవ్ సమీక్ష

  హోండా సిటీ కి మరియు మారుతి సియాజ్ కి సరికొత్త పోటీదారుడు అయిన హ్యుందాయి యొక్క కారు చివరకి మన దగ్గరకి వచ్చింది. చూడడానికి బాగుంటుంది, కానీ ఈ తరువాత తరం వెర్నా ఆ విభాగంలోనే ఫేవరెట్ గా నిలుస్తుందా?  

  By Alan RichardMay 24, 2019

Similar Hyundai Verna ఉపయోగించిన కార్లు

 • హ్యుందాయ్ వెర్నా ఎక్స్ఎక్స్ఐ ఏబిఎస్ (పెట్రోల్)
  హ్యుందాయ్ వెర్నా ఎక్స్ఎక్స్ఐ ఏబిఎస్ (పెట్రోల్)
  Rs1.35 లక్ష
  200962,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • హ్యుందాయ్ వెర్నా ఎక్స్ఐ (పెట్రోల్)
  హ్యుందాయ్ వెర్నా ఎక్స్ఐ (పెట్రోల్)
  Rs1.35 లక్ష
  200870,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • హ్యుందాయ్ వెర్నా ఎక్స్ఐ (పెట్రోల్)
  హ్యుందాయ్ వెర్నా ఎక్స్ఐ (పెట్రోల్)
  Rs1.4 లక్ష
  200880,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • హ్యుందాయ్ వెర్నా 1.6 సిఆర్డిఐ
  హ్యుందాయ్ వెర్నా 1.6 సిఆర్డిఐ
  Rs1.6 లక్ష
  201180,000 Kmడీజిల్
  వివరాలను వీక్షించండి
 • హ్యుందాయ్ వెర్నా సిఆర్డిఐ
  హ్యుందాయ్ వెర్నా సిఆర్డిఐ
  Rs1.65 లక్ష
  20091,00,000 Kmడీజిల్
  వివరాలను వీక్షించండి
 • హ్యుందాయ్ వెర్నా ట్రాన్స్‌ఫార్మ్ విటివిటి
  హ్యుందాయ్ వెర్నా ట్రాన్స్‌ఫార్మ్ విటివిటి
  Rs2 లక్ష
  20111,06,697 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • హ్యుందాయ్ వెర్నా ట్రాన్స్‌ఫార్మ్ ఎస్ఎక్స్ విటివిటి
  హ్యుందాయ్ వెర్నా ట్రాన్స్‌ఫార్మ్ ఎస్ఎక్స్ విటివిటి
  Rs2.15 లక్ష
  201068,593 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • హ్యుందాయ్ వెర్నా 1.6 ఎస్ఎక్స్ సిఆర్డిఐ (o)
  హ్యుందాయ్ వెర్నా 1.6 ఎస్ఎక్స్ సిఆర్డిఐ (o)
  Rs2.8 లక్ష
  20121,00,000 Kmడీజిల్
  వివరాలను వీక్షించండి

Write your Comment పైన హ్యుందాయ్ వెర్నా

space Image
space Image

హ్యుందాయ్ వెర్నా భారతదేశం లో ధర

సిటీఎక్స్-షోరూమ్ ధర
ముంబైRs. 8.17 - 14.07 లక్ష
బెంగుళూర్Rs. 8.17 - 14.07 లక్ష
చెన్నైRs. 8.17 - 14.07 లక్ష
హైదరాబాద్Rs. 8.17 - 14.07 లక్ష
పూనేRs. 8.17 - 14.07 లక్ష
కోలకతాRs. 8.17 - 14.07 లక్ష
కొచ్చిRs. 8.27 - 14.2 లక్ష
మీ నగరం ఎంచుకోండి

ట్రెండింగ్ హ్యుందాయ్ కార్లు

 • ప్రాచుర్యం పొందిన
 • రాబోయే
×
మీ నగరం ఏది?