- + 6రంగులు
- + 32చిత్రాలు
- shorts
- వీడియోస్
ఎంజి కామెట్ ఈవి
ఎంజి కామెట్ ఈవి స్పెసిఫికేషన్లు & ఫీచర్లు
పరిధి | 230 km |
పవర్ | 41.42 బి హెచ్ పి |
బ్యాటరీ కెపాసిటీ | 17.3 kwh |
ఛార్జింగ్ టైం | 3.3kw 7h (0-100%) |
సీటింగ్ సామర్థ్యం | 4 |
no. of బాగ్స్ | 2 |
- డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్
- ఆటో డిమ్మింగ్ ఐఆర్విఎం
- వెనుక కెమెరా
- కీ లెస్ ఎంట్రీ
- voice commands
- పార్కింగ్ సెన్సార్లు
- advanced internet ఫీచర్స్
- పవర్ విండోస్
- key నిర్ధేశాలు
- top లక్షణాలు
కామెట్ ఈవి తాజా నవీకరణ
MG కామెట్ EV తాజా అప్‌డేట్
మార్చి 19, 2025: MG కామెట్ EV కి MY2025 అప్‌డేట్ వచ్చింది, దీని ధర రూ. 27,000 వరకు పెరిగింది. అంతేకాకుండా, వేరియంట్ వారీగా ఫీచర్లను కూడా మార్చారు.
ఫిబ్రవరి 26, 2025: కామెట్ EV యొక్క కొత్త ఆల్-బ్లాక్ వెర్షన్, బ్లాక్‌స్టార్మ్ ఎడిషన్, భారతదేశంలో రూ. 9.81 లక్షలకు (ఎక్స్-షోరూమ్) ప్రారంభించబడింది.
జనవరి 31, 2025: కామెట్ EV ధరలు రూ. 19,000 వరకు పెరిగాయి.
కామెట్ ఈవి ఎగ్జిక్యూటివ్(బేస్ మోడల్)17.3 kwh, 230 km, 41.42 బి హెచ్ పిless than 1 నెల వేచి ఉంది | ₹7 లక్షలు* | ||
కామెట్ ఈవి ఎక్సైట్17.3 kwh, 230 km, 41.42 బి హెచ్ పిless than 1 నెల వేచి ఉంది | ₹8.20 లక్షలు* | ||
Top Selling కామెట్ ఈవి ఎక్సైట్ fc17.3 kwh, 230 km, 41.42 బి హెచ్ పిless than 1 నెల వేచి ఉంది | ₹8.73 లక్షలు* | ||
కామెట్ ఈవి ఎక్స్‌క్లూజివ్17.3 kwh, 230 km, 41.42 బి హెచ్ పిless than 1 నెల వేచి ఉంది | ₹9.26 లక్షలు* | ||
కామెట్ ఈవి ఎక్స్‌క్లూజివ్ fc17.3 kwh, 230 km, 41.42 బి హెచ్ పిless than 1 నెల వేచి ఉంది | ₹9.68 లక్షలు* | ||
Recently Launched కామెట్ ఈవి blackstorm ఎడిషన్17.3 kwh, 230 km, 41.42 బి హెచ్ పి | ₹9.81 లక్షలు* | ||
కామెట్ ఈవి 100 year లిమిటెడ్ ఎడిషన్(టాప్ మోడల్)17.3 kwh, 230 km, 41.42 బి హెచ్ పిless than 1 నెల వేచి ఉంది | ₹9.84 లక్షలు* |

ఎంజి కామెట్ ఈవి సమీక్ష
Overview
MG కామెట్ EV సమీక్ష
చాలా తరుచుగా ఒక కారును ఎంచుకోవాలంటే ఆ కారు పరిపూర్ణంగా అన్ని అంశాలను కలిగి ఉండాలి అలాగే అల్ రౌండర్ గా ఉండేలా చూస్తాము. అంతేకాకుండా తగినంత పెద్ద బూట్, ఫీచర్లు, సౌకర్యం మరియు అన్ని సౌకర్యాలు కలిగి ఉండాలనుకుంటాము. ఇవన్నీ కావాలంటే, అది కామెట్ విషయంలో నెరవేరదు. ఇది ఒక కారణం కోసం అందించబడింది అది ఏమిటంటే, ఇటీవల పెరిగిపోతున్న ట్రాఫిక్ లో పెద్ద కారుతో డ్రైవింగ్ చేయడంలో ఉండే ఇబ్బందిని ఎదుర్కోవడానికి అలాగే మరింత సౌకర్యవంతమైన రైడ్ కావాలనుకునే వారి కోసం ఇది ఒక పరిష్కార వాహనంగా ఉంది. ప్రశ్న ఏమిటంటే, ఇది మీ పెద్ద కారు అనుభవంతో సరిపోలుతుందా, ఒకవేళ అయితే మీరు అవసరమైనప్పుడు చిన్న కారుకు మారవచ్చా?
బాహ్య
కామెట్ లుక్స్ పరంగా ఎలా కనబడుతుందో అనేది మొదటి విషయం. ఎందుకంటే ఇది మందు భాగం చూడటానికి అందంగా ఉండటమే కాకుండా అందరి హృదయాల్ని ఆకట్టుకుంటుంది మరియు లుక్స్ ఖచ్చితంగా ఆ విభాగంలో చాలా హెఫ్ట్‌ను కలిగి ఉంటుంది. నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం, ఇది ప్రత్యేకంగా మరియు అందమైనదిగా కనిపిస్తుంది. రహదారిపై, కామెట్ చుట్టూ ఎన్ని కార్లు ఉన్న ఇది అతి చిన్న కారు అవుతుంది. పొడవు మరియు వీల్‌బేస్ 3 మీటర్ల కంటే తక్కువ ఎత్తులో ఉన్నాయి మరియు ఎత్తు పొడవుగా ఉన్నందున, అది కొంచెం కనిపిస్తుంది… అవును, కొంచెం వెరైటీగా ఉందా?అయితే ఈ పొగడ్తలు అన్నీ కూడా డిజైన్ లో ఉన్న కొలతలే. చాలా మంది వ్యక్తులు తమ కార్లలో కోరుకునే చమత్కారమైన అంశాలు మరియు దాదాపు రూ. 20 లక్షల విలువైన కార్లలో చాలా ప్రీమియం ఫీచర్లు ఉంటాయి. LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRL బార్, డ్యూయల్-టోన్ పెయింట్ ఆప్షన్, LED టెయిల్‌ల్యాంప్‌లు మరియు కనెక్ట్ చేయబడిన బ్రేక్ ల్యాంప్ ప్రీమియం అనుభూతికి తగినంత బ్లింగ్‌ను అందిస్తాయి. వీల్ క్యాప్‌ల స్థానంలో అల్లాయ్ వీల్స్ మెరుగ్గా ఉండేవి కానీ దాని కోసం, మీరు కొనుగోలు చేసిన తరువాత చూడవలసి ఉంటుంది.
ఇది ఎక్కువ జీవనశైలి ఎంపిక అయినందున, MG కారుతో టన్ను అనుకూలీకరణ ఎంపికలను అందిస్తోంది. ఎంచుకోవడానికి 5 పెయింట్ ఎంపికలు మరియు కనీసం 7 స్టిక్కర్ ప్యాక్‌లు ఉన్నాయి. లోపల, మ్యాట్‌లు, యాక్సెంట్‌లు మరియు సీట్ కవర్‌లు ఈ స్టిక్కర్ ప్యాక్‌లకు సరిపోతాయి. కాబట్టి మీరు మీ కామెట్‌ని నిజంగా అనుకూలీకరించవచ్చు. మరియు ఈ అన్ని ఎలిమెంట్‌లతో, అందించబడిన ప్రీమియం ఎక్స్‌టీరియర్ ఎలిమెంట్‌లకు లుక్స్ సెకండరీగా మారతాయి.
అంతర్గత
ఇక్కడే కామెట్ అతిపెద్ద ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అందించిన అనుభవం మరియు స్థలం పరంగా, మీరు డోరు తెరిచినప్పుడు మీరు ఆశించిన దానికంటే ఎక్కువ అందిస్తుంది. డాష్‌బోర్డ్ సరళమైనది మరియు ప్లాస్టిక్‌ల ఫిట్ మరియు ఫినిషింగ్ అందరిని ఆకట్టుకుంది. డ్యాష్‌బోర్డ్‌కు ఎడమ వైపున సాఫ్ట్ టచ్ ప్యాడ్ ఉంది మరియు మొత్తంగా, వైట్ ప్లాస్టిక్, సిల్వర్ ఫినిషింగ్ మరియు క్రోమ్ యొక్క ముగింపు చాలా ప్రీమియంగా అనిపిస్తాయి. మాన్యువల్ AC మరియు డ్రైవ్ సెలెక్టర్ కోసం రోటరీ డయల్స్ కూడా చాలా మృదువైన స్పర్శను కలిగి ఉంటాయి. పరిమాణం కాకుండా, క్యాబిన్ కోసం 15 లక్షల ఖరీదు చేసే కారు కోసం బాగా నియమించబడినట్లు అనిపిస్తుంది.
హైలైట్‌లలో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను రూపొందించే డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్‌లు ఉన్నాయి. డిస్‌ప్లేలు మంచి గ్రాఫిక్స్‌తో స్ఫుటమైనవి మరియు వివరాల కోసం మేము ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కి మరింత సులభతరం ఇవ్వాలి. మీరు డ్రైవ్ సమాచారాన్ని మాత్రమే మార్చగలరు మరియు దానికి భిన్నమైన థీమ్‌లు లేవు, కారు మోడల్ చాలా వివరంగా ఉంటుంది. అన్ని విభిన్న లైట్లు (పైలట్, హై బీమ్, లో బీమ్), డోర్లు, సూచికలు మరియు బూట్ అజార్ చూపబడ్డాయి మరియు సమాచారం పెద్దగా మరియు పరిశుభ్రంగా ఉంటుంది.
విడ్జెట్‌లతో కస్టమైజ్ చేయగల ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్ ఉపయోగించడానికి సున్నితంగా ఉంటుంది. అదనంగా, ఇది వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు బగ్‌లు లేకుండా రన్ అయ్యే ఆపిల్ కార్ ప్లేని పొందుతుంది, ఇది మనం ఇంకా ఏ ఇతర సిస్టమ్‌లోనూ అనుభవించలేదు. సౌండ్ సిస్టమ్ ఆమోదయోగ్యమైనది, కానీ మిగిలిన ప్యాకేజీ వలె ఆకర్షణీయంగా లేదు. ఇతర లక్షణాలలో వన్-టచ్ అప్/డౌన్ (డ్రైవర్), మాన్యువల్ AC, వెనుక కెమెరా, పగలు/రాత్రి IRVM, ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ORVM మరియు ఎలక్ట్రానిక్ బూట్ విడుదలతో కూడిన పవర్ విండోలు ఉన్నాయి. మూడు USB భాగాలు కూడా ఉన్నాయి, రెండు డాష్‌బోర్డ్ క్రింద మరియు ఒకటి IRVM క్రింద డాష్ క్యామ్‌ల కోసం అందించబడ్డాయి.


ముందు సీట్లు కాస్త ఇరుకైనప్పటికీ సౌకర్యవంతంగా ఉంటాయి. 6 అడుగుల వరకు ఉన్న ప్రయాణికులు కూడా హెడ్‌రూమ్ గురించి ఫిర్యాదు చేయరు. ఏదైనా పొడవాటి ప్రయాణికులు కూర్చున్నప్పుడు కొంచెం ఇబ్బందిగా అలాగే ఇరుకుగా ఉన్నట్టు అనిపించడం ప్రారంభమవుతుంది. అయితే, వెనుక సీట్లు మెరుగ్గా అందించబడ్డాయి. వెనుక సీట్లను యాక్సెస్ చేయడం కొంచెం గ్యాప్‌గా ఉంటుంది, అయితే అక్కడికి చేరుకున్న తర్వాత, మోకాలి మరియు లెగ్‌రూమ్ సగటు-పరిమాణ పెద్దలకు పుష్కలంగా ఉంటాయి. మళ్లీ, 6 అడుగుల ఎత్తు వరకు ఉన్న ప్రయాణీకులు స్థలం గురించి, వెడల్పు గురించి కూడా ఫిర్యాదు చేయరు. అవును, తొడ కింద మద్దతు లేదు కానీ నగర ప్రయాణాలలో, మీరు దానిని కోల్పోరు.


భద్రత
కామెట్ ABSతో కూడిన EBD, డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లతో ప్రామాణికంగా వస్తుంది. ఇది ఇంకా క్రాష్ టెస్ట్‌కు గురికాలేదు.
బూట్ స్పేస్
దీనికి బూట్ స్పేస్ లేనందున ఈ విభాగాన్ని ఖాళీగా ఉంచవచ్చు. వెనుక సీట్ల వెనుక, మీరు ఛార్జర్ బాక్స్ మరియు పంక్చర్ రిపేర్ కిట్‌లో మాత్రమే స్టోర్ చేయవచ్చు. అయితే, సీట్లను ఫ్లాట్‌గా మడిచినట్లైతే మీరు పెద్ద సూట్‌కేస్‌లను సులభంగా ఉంచడానికి ప్రయాణీకుల స్థలాన్ని ఉపయోగించవచ్చు. సీటు కూడా 50:50కి మూడవబడుతుంది, ఇది ప్రాక్టికాలిటీని జోడిస్తుంది. కాబట్టి షాపింగ్ చేయడానికి తగినంత ఆచరణాత్మకమైనప్పటికీ, విమానాశ్రయం నుండి ఒకరిని పికప్ చేయడం గమ్మత్తైనది.
ప్రదర్శన
స్పెసిఫికేషన్ షీట్‌ను ఒక్కసారి చూడండి, ఇది బోరింగ్ కలిగించే చిన్న EV అని మీరు అనుకుంటారు. 42PS/110Nm యొక్క శక్తి/టార్క్ గురించి గొప్పగా చెప్పుకునే సంఖ్యలు కావు. కానీ దాని చిన్న పరిమాణం కారణంగా, ఈ సంఖ్యలు మాయాజాలం చేస్తాయి. కామెట్ ఆశ్చర్యకరంగా చురుకైనది మరియు డ్రైవ్ చేయడానికి ఉత్సాహాన్ని కలిగిస్తుంది. 20-40kmph లేదా 60kmph నుండి త్వరిత త్వరణం అత్యంత బలంగా ఉంటుంది. నగరంలో ఓవర్‌టేక్‌లు మరియు ఖాళీలలోకి రావడానికి ప్రయత్నించడం అప్రయత్నంగా జరుగుతుంది. అలాగే, కాంపాక్ట్ సైజు కారణంగా, ఇరుకైన ట్రాఫిక్ లలో అధిక భారాన్ని తగ్గిస్తుంది మరియు ఆటో-రిక్షాలను కూడా అసూయపడేలా చేస్తుంది.
పెద్ద విండ్‌స్క్రీన్ మరియు విండోస్ మొత్తం దృశ్యమానతకు కూడా సహాయపడతాయి, ఇది డ్రైవర్‌కు విశ్వాసాన్ని ఇస్తుంది. పార్కింగ్ కూడా సులభమైన వ్యవహారం మరియు ఒక చిన్న పొడవు మరియు టర్నింగ్ సర్కిల్‌తో, మీరు సులభంగా పార్కింగ్ స్థానంలోకి దూరవచ్చు. వెనుక కెమెరా స్పష్టంగా ఉంది మరియు ఆలస్యం లేకుండా పని చేస్తుంది, దీని ఫలితంగా సులభమైన పార్కింగ్ లభించడమే కాదు పార్కింగ్ సమయంలో మంచి అనుభూతిని అందిస్తుంది. మీ తల్లిదండ్రులు ఈ కారును నడపబోతున్నప్పటికీ, పార్కింగ్ స్థలాలను కనుగొనడంలో వారికి ఎలాంటి సమస్యలు ఉండవు. ప్రస్తుతం విక్రయిస్తున్న సిటీ ట్రాఫిక్‌లో నడపడానికి ఇది ఖచ్చితంగా అత్యంత శ్రమలేని కారు అని చెప్పవచ్చు.
మూడు డ్రైవ్ మోడ్‌లు ఉన్నాయి -- అవి వరుసగా ఎకో, నార్మల్ మరియు స్పోర్ట్ - వీటికి పెద్దగా తేడా లేదు, అయితే మంచి విషయం ఏమిటంటే ఎకో మోడ్ కూడా నగరంలో ఉపయోగపడుతుంది. మూడు రీజెన్ మోడ్‌లు కూడా ఉన్నాయి -- లైట్, నార్మల్ మరియు హెవీ, ఇవి తేడాను కలిగిస్తాయి. హెవీ మోడ్‌లో, రీజెన్ ఇంజిన్ బ్రేకింగ్ లాగా అనిపిస్తుంది కానీ మృదువుగా ఉంటుంది. మోటార్ యొక్క ట్యూన్ మరియు ఈ మోడ్‌లు సిటీ డ్రైవ్‌లకు అనుగుణంగా ట్యూన్ చేయబడ్డాయి.
అయితే రెండు సమస్యలు ఉన్నాయి. మొదట, కామెట్ ఖచ్చితంగా సిటీ కారు. దీని అర్థం 60kmph లేదా 80kmph వరకు యాక్సిలరేషన్ ఆమోదయోగ్యమైనది అయితే, అది 105kmph గరిష్ట వేగాన్ని చేరుకోవడానికి పనితీరు తగ్గుతుంది. ఇది హైవేలపై దాని వినియోగాన్ని సమర్థవంతంగా పరిమితం చేస్తుంది. రెండవది, పొడవైన డ్రైవర్లకు డ్రైవింగ్ స్థానం ఇరుకైనది. స్టీరింగ్ ఎత్తుకు మాత్రమే సర్దుబాటు చేయగలదు మరియు డ్యాష్‌బోర్డ్‌కు చాలా దగ్గరగా ఉంటుంది. దీని కారణంగా, మీరు వీల్ కి దగ్గరగా కూర్చోవలసి ఉంటుంది మరియు ఇది యాక్సిలరేటర్ మరియు బ్రేక్ పెడల్‌లను డ్రైవర్‌కు చాలా దగ్గరగా ఉంచబడతాయి, ఫలితంగా ఇబ్బందికరమైన స్థితి ఏర్పడుతుంది. మీరు 6 అడుగుల కంటే ఎక్కువ పొడవు ఉంటే, ఇది మిమ్మల్ని మరింత అసౌకర్యానికి గురి చేస్తుంది.
రైడ్ అండ్ హ్యాండ్లింగ్
చిన్న 12-అంగుళాల చక్రాలపై ప్రయాణించినప్పటికీ, కామెట్ నగరంలోని గతుకుల రోడ్లలో పనితీరు అసౌకర్యకంగా ఉంటుంది. అవును, ప్రయాణం పరిమితంగా ఉంది, అందువల్ల క్యాబిన్‌లో గతుకుల అనుభూతి ఉంటుంది, కానీ తగినంత వేగం తగ్గుతాయి మరియు అవి కూడా బాగా కుషన్‌గా ఉంటాయి. మంచి రోడ్లు మరియు స్పీడ్ బ్రేకర్లలో, కామెట్ హ్యాచ్‌బ్యాక్ వలె సౌకర్యవంతంగా ఉంటుంది మరియు వెన్ను సమస్యలతో బాధపడే వృద్ధులను కూడా వదలదు. అయితే గుర్తుంచుకోండి, వెనుక సీటులో కుదుపులు ఎక్కువగా కనిపిస్తాయి కాబట్టి డ్రైవింగ్ చేసేటప్పుడు మీ ప్రయాణీకులతో జాగ్రత్తగా ఉండండి.
90kmph కంటే ఎక్కువ వేగంతో, కామెట్ కొంచెం మెలితిప్పినట్లు అనిపిస్తుంది. తక్కువ వీల్‌బేస్ కారణంగా, హై-స్పీడ్ లో స్థిరత్వం రాజీపడుతుంది మరియు త్వరిత లేన్ మార్పులు భయానకంగా ఉంటాయి. అయితే, కామెట్ నగర పరిమితులలో నడపబడటానికి ఉద్దేశించబడినందున, మీరు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కోలేరు.
వేరియంట్లు
కామెట్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది, దీని దిగువ శ్రేణి వేరియంట్ ధర 7.98 లక్షల నుండి ప్రారంభమవుతుంది. MG అగ్ర వేరియంట్ ధర 10 లక్షలకు దగ్గరగా ఉంటుందని సూచించింది, ఇది అప్రయత్నంగా సిటీ డ్రైవ్ కోసం ఖచ్చితమైన కొనుగోలు గా అందరిని ఆకర్షిస్తుంది.
వెర్డిక్ట్
MG కామెట్ కారు మాత్రమే కాదు, కుటుంబం మొత్తం బయటకు వెళ్లేందుకు కొనుగోలు చేయదగిన సరైన కారు. అంతేకాకుండా నగర ప్రయాణాలకు కూడా అద్భుతమైన పనితీరును అందిస్తుంది. ఇది అద్భుతమైన కారు అని చెప్పేందుకు కారణం ఏమిటంటే, చిన్న ప్యాకేజీలో విశాలమైన క్యాబిన్ మరియు ఫీచర్ల అనుభవాన్ని అందించడం. అవును, ఇది చిన్న కారు, కానీ నాణ్యత మరియు అనుభవంలో సాధారణ కోతలు లేకుండా మంచి అనుభూతిని అందిస్తుంది. తత్ఫలితంగా, ట్రాఫిక్ భాదను తప్పించుకునేందుకు మరియు అనుభవంలో రాజీపడకుండా జీవితంలో తగినంత సౌకర్యాన్ని అందించదగిన నగర వాహనం అని చెప్పవచ్చు. మీ తల్లిదండ్రులు భారీ పరిమాణం కారణంగా పెద్ద SUVని నడపడం ఇష్టపడకపోతే, వారు కామెట్‌ను నడపడానికి ఇష్టపడతారు.
ఎంజి కామెట్ ఈవి యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు
మనకు నచ్చిన విషయాలు
- చిన్న పరిమాణంతో, నగర వినియోగానికి ఈ కారు ఆదర్శంగా నిలుస్తుంది.
- ఇంటీరియర్స్ యొక్క ప్రీమియం లుక్ మరియు అనుభూతి
- క్లెయిమ్ చేసిన పరిధి 250కిమీ
మనకు నచ్చని విషయాలు
- వెనుక సీట్లను మడవకుండా బూట్ స్పేస్ ఉండదు
- ఆఫ్ రోడ్లపై అసౌకర్య రైడ్ అనుభూతిని పొందుతారు
- హైవే కారు కాదు, కాబట్టి ఆల్‌రౌండర్ కాదు

ఎంజి కామెట్ ఈవి comparison with similar cars
![]() Rs.7 - 9.84 లక్షలు* | ![]() Rs.7.99 - 11.14 లక్షలు* | ![]() Rs.9.99 - 14.44 లక్షలు* | ![]() Rs.12.49 - 13.75 లక్షలు* | ![]() Rs.5 - 8.45 లక్షలు* | ![]() Rs.6.54 - 9.11 లక్షలు* | ![]() Rs.9 - 17.80 లక్షలు* | ![]() Rs.6 - 10.32 లక్షలు* |
Rating217 సమీక్షలు | Rating281 సమీక్షలు | Rating120 సమీక్షలు | Rating97 సమీక్షలు | Rating839 సమీక్షలు | Rating197 సమీక్షలు | Rating65 సమీక్షలు | Rating1.4K సమీక్షలు |
Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeఎలక్ట్రిక్ | Fuel Typeపెట్రోల్ / సిఎన్జి | Fuel Typeపెట్రోల్ / సిఎన్జి | Fuel Typeడీజిల్ / పెట్రోల్ | Fuel Typeపెట్రోల్ / సిఎన్జి |
Battery Capacity17.3 kWh | Battery Capacity19.2 - 24 kWh | Battery Capacity25 - 35 kWh | Battery Capacity26 kWh | Battery CapacityNot Applicable | Battery CapacityNot Applicable | Battery CapacityNot Applicable | Battery CapacityNot Applicable |
Range230 km | Range250 - 315 km | Range315 - 421 km | Range315 km | RangeNot Applicable | RangeNot Applicable | RangeNot Applicable | RangeNot Applicable |
Charging Time3.3KW 7H (0-100%) | Charging Time2.6H-AC-7.2 kW (10-100%) | Charging Time56 Min-50 kW(10-80%) | Charging Time59 min| DC-18 kW(10-80%) | Charging TimeNot Applicable | Charging TimeNot Applicable | Charging TimeNot Applicable | Charging TimeNot Applicable |
Power41.42 బి హెచ్ పి | Power60.34 - 73.75 బి హెచ్ పి | Power80.46 - 120.69 బి హెచ్ పి | Power73.75 బి హెచ్ పి | Power72.41 - 84.82 బి హెచ్ పి | Power68 - 82 బి హెచ్ పి | Power114 - 118 బి హెచ్ పి | Power72 - 87 బి హెచ్ పి |
Airbags2 | Airbags2 | Airbags6 | Airbags2 | Airbags2 | Airbags6 | Airbags6 | Airbags2 |
Currently Viewing | కామెట్ ఈవి vs టియాగో ఈవి | కామెట్ ఈవి vs పంచ్ ఈవి | కామెట్ ఈవి vs టిగోర్ ఈవి | కామెట్ ఈవి vs టియాగో | కామెట్ ఈవి vs ఆరా | కామెట్ ఈవి vs సిరోస్ | కామెట్ ఈవి vs పంచ్ |

ఎంజి కామెట్ ఈవి కార్ వార్తలు
- తాజా వార్తలు
- రోడ్ టెస్ట్