• English
  • Login / Register

లాటిన్ NACP క్రాష్ టెస్ట్స్ లో 0 స్టార్లు దక్కించుకున్న సిట్రోయెన్ C3.

సిట్రోయెన్ సి3 కోసం rohit ద్వారా జూలై 17, 2023 02:06 pm ప్రచురించబడింది

  • 1.8K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

దీని బాడీ షెల్  'అస్థిర'మైనదిగా రేట్ చేయబడింది మరియు అదనపు భారం తట్టుకోవడంలో విఫలమైంది. 

Citroen C3 Latin NCAP

సిట్రోయెన్ c3 ను భారత్ లో ప్రవేశపెట్టినప్పుడు, క్రాస్ ఓవర్ హ్యాచ్ను బ్రెజిల్తో సహా లాటిన్ మార్కెట్లలోనూ అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు. C3 ఇండియా అలాగే బ్రెజిల్ లో తయారు చేయబడింది. అయితే ఇప్పుడు లాటిన్ NACP సౌత్ అమెరికాలో తయారుచేయబడిన C3ను క్రాష్ టెస్ట్ చేసింది. కాగా, ఈ పరీక్షలో సిట్రోయెన్ క్రాస్ హ్యాచ్ కనీసం ఒక్క స్టార్ ను కూడా పొందలేక విఫలం అయింది. 

ఏర్పరిచిన భద్రతా పరికరాలు: 

క్రాష్ టెస్ట్ చేసిన C3కి భద్రతా ప్రమాణంగా రెండు ముందు ఎయిర్ బాగ్లు (డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్) మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) అమర్చారు. సీట్ బెల్ట్ రిమైండర్ మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజస్ లాంటి ఇతర సాంకేతిక భద్రతా పరికరాలు ఇందులో కనిపిస్తాయి. బ్రెజిల్ స్పెక్ C3లో సీట్ బెల్ట్ ప్రెటెన్షనర్లు లేకపోయినప్పటికీ సీట్ బెల్ట్ కు భార పరిమితి పరికరాలు (సీట్ బెల్ట్ లోడ్ లిమిటర్స్) మాత్రం ఉన్నాయి. 

ఇండియా స్పెక్ C3 విషయానికి వస్తే, దీనికి రెండు ముందు ఎయిర్ బాగ్లు, ABS మరియు EBD, రివర్స్ పార్కింగ్ సెన్సర్లు మరియు ముందర సీట్ బెల్ట్ రిమైండర్లు ప్రమాణంగా అందించారు. అలాగే సిట్రోయెన్  దీనిని ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం(ESP), హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ సిస్టమ్ తో కూడా సన్నద్ధం చేసింది కాకపోతే ఇవి టర్బో పెట్రోల్ వేరియంట్లకు మాత్రమే పరిమితం అయ్యాయి. 

అడల్ట్ ఆక్యుపెన్ట్ ప్రొటెక్షన్:

Citroen C3 Latin NCAP

పెద్దల యొక్క భద్రత అంశంలో క్రాస్ ఓవర్ హ్యాచ్ 31 శాతం అంటే 12.21 పాయింట్లను సాధించింది. ఇవి ఫ్రంటల్ మరియు సైడ్ ఇంపాక్ట్ పరీక్షల పాయింట్లను కలుపి వచ్చిన ఫలితాలు. 

ఫ్రంటల్ ఇంపాక్ట్

డ్రైవర్ మరియు ప్రయాణీకుల తలకు, మెడకు భద్రత బాగుంది. కాగా, డ్రైవర్ యొక్క ఛాతీ భద్రత బలహీనంగా ఉన్నట్టు అలాగే ప్రయాణీకుల ఛాతీ భద్రత కాస్త ప్రశ్నార్థకంగా ఉన్నట్టు ఈ పరీక్షల్లో వెలువడింది. ప్రయాణీకుల ఎడమ మోకాలి భద్రత బాగున్నప్పటికీ మొత్తంమీద వాళ్ళ మోకాళ్ళ భద్రత అంతంత మాత్రంగానే ఉన్నట్టు తేలింది. ఇక కాలి ఎముకల భద్రత విషయానికి వస్తే డ్రైవర్ మరియు ప్రయాణీకులకు తగినంత భద్రత ఉన్నట్టు వెలువడింది. C3 యొక్క ఫుట్ వెల్ ప్రాంతం మరియు బాడీ షెల్ 'అస్థిరం'గా ఉన్నట్టు పేర్కొనబడింది. అలాగే ఈ పరీక్షల్లో బాడీ షెల్ మరింత భారం భరించేందుకు అసమర్థవంతమైనదిగా నిలిచింది. పైపెచ్చు, సీట్ యొక్క రూపకల్పన వల్ల విప్లాష్ నుండి మెడకు ఎలాంటి భద్రత లభించదని ఈ పరీక్షల్లో వెలువడింది. 

సైడ్ ఇంపాక్ట్ 

Citroen C3 Latin NCAP

సైడ్ ఇంపాక్ట్ పరీక్షలో తలకు మరియు మెడకు తగినంత భద్రత లభిస్తుందని తేలింది. అలాగే పొత్తికడుపు మరియు పెల్విస్ (వెన్నుముక చివరి భాగం)కు లభించే భద్రత బాగానే ఉన్నట్టు వెలువడింది. 

ఐచ్ఛికంగా కూడా సైడ్ హెడ్ భద్రత అందించకపోవడం వల్ల అసలు C3కి సైడ్ పోల్ ఇంపాక్ట్ పరీక్ష జరపనేలేదు. 

ఇదీ చదవండి: సిట్రోయెన్ c3 వర్సెస్ టాటా టియాగో  EV: స్థలం మరియు ఆచరణాత్మక పోలిక

చైల్డ్ ఆక్యుపెన్ట్ ప్రొటెక్షన్

చిన్న పిల్లల యొక్క భద్రత విషయంలో సిట్రోయెన్ c3కి 12 శాతం స్కోర్ లభించినది. ఈ మొత్తం పాయింట్ల విచ్ఛిన్నం ఈ క్రింది విధంగా ఉంది. 

ఫ్రంటల్ ఇంపాక్ట్

మూడేళ్ల మరియు ఒకటిన్నర ఏళ్ల వయసుగల డమ్మీలు కలిగిన రెండు చైల్డ్ సీట్లు వెనక భాగానికి అభిముఖంగా ISOFIX యాంకరేజీల ఆధారంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి తల బహిర్గతం అయ్యే ప్రమాదం నుండి బయటపడే వీలును కల్పిస్తూ, మూడేళ్ల చిన్నారికి మంచి భద్రతను కూడా అందించగలవని వెల్లడయింది. 

సైడ్ ఇంపాక్ట్ 

సైడ్ ఇంపాక్ట్ (సమయం)లో రెండు చైల్డ్ రిస్ట్రైన్ట్ సిస్టమ్స్ (CRS) పూర్తి భద్రతను అందిస్తున్నాయి. 

సిట్రోయెన్ c3 యొక్క అతి తక్కువ మార్కులు, డైనమిక్ స్కోర్ రూపములో వచ్చింది. ఎక్కడైతే ISOFIX యాంకరేజెస్ పరంగా తక్కువ గుర్తింపు అందుకుందో, ఆ పరిధిలో దాని యొక్క పాయింట్లు పూర్తిగా పడిపోయాయి. ముందర కూర్చున్న ప్రయాణీకుడి సీటుకు CRS అనుసంధానించబడినప్పుడు రావాల్సిన ఎయిర్ బాగ్ హెచ్చరిక కూడా ఇది అందించలేకపోయింది. 

పాదచారుల భద్రత

Citroen C3 Latin NCAP

పాదచారుల భద్రత విషయంలో C3 మంచి మార్కులు సంపాదించుకుంది. 50 శాతం అంటే 23.88 పాయింట్లతో ఇది పాదచారుల భద్రతలో అత్యుత్తమంగా నిలిచింది. చాలా అంశాలలో ఇది 'మంచి' (గుడ్), తగినంత (మార్జినల్) మరియు సరిపడ (అడిక్వేట్) అనే భద్రత స్థాయిలను సంపాదించుకుంది. కాకపోతే విండ్స్క్రీన్ మరియు A-పిల్లర్ల దగ్గర తల భాగం యొక్క భద్రత విషయంలో దీనికి చాలా తక్కువ పాయింట్లు లభించాయి. దీని పైకాలు భద్రత స్కోర్ అడిక్వేట్ (సరిపడ) నుండి మంచి (గుడ్) వరకు రేట్ చేయబడింది. అలాగే కాలు క్రింది భాగపు భద్రత మాత్రం తగినంత(మార్జినల్) నుండి మంచి (గుడ్) రేటింగ్ తో సరిపెట్టుకుంది. 

సేఫ్టీ అసిస్ట్

క్రాస్ ఓవర్ హ్యాచ్ యొక్క సేఫ్టీ అసిస్ట్ కి లాటిన్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్ట్లో 35 శాతం, అంటే 15 పాయింట్లు లభించాయి. అయితే, టెస్టింగ్ ఏజెన్సీ మాత్రం ఈ కారులో అతి ముఖ్యమైన భద్రతా పరమైన అంశాలు లోపించాయని పేర్కొంది. 

సిట్రోయెన్  తన బ్రెజిల్ స్పెక్ C3 లో డ్రైవర్ కు మాత్రమే సీట్ బెల్ట్ రిమైండర్ ను అమర్చింది. ఇది లాటిన్ NACP పేర్కొన్న నిబంధనలకు సరిపోలదు. క్రాస్ ఓవర్ హ్యాచ్ కు కూడా ESC ఒక ప్రమాణంగా లభిస్తూ NCAP ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నా, దీనిలో అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఉండదు మరియు అటు బ్రెజిల్ స్పెక్ C3 లో స్పీడ్ లిమిటేషన్ పరికరం కూడా లేదు. 

ఇదీ చదవండి: ఒక క్రాస్ ఓవర్ సెడాన్ ను భారత్ కు తీసుకువస్తున్న సిట్రోయెన్ 

భారత్ లో సిట్రోయెన్ c3

India-spec Citroen C3

సిట్రోయెన్ యొక్క రెండవ మోడల్ గా C3 2022 మధ్యలో భారతదేశంలో ప్రవేశపెట్టబడింది. ఈ మోడల్ ను ఏ NCAP ఏజెన్సీ కూడా ఇంతవరకు పరీక్షించలేదు కానీ ఒక్కసారి 2023 చివరిలో భారత్ NCAP అమలులోకి వచ్చాక దీనికి ఒక రేటింగ్ ను కేటాయించే అవకాశం ఉంది. సిట్రోయెన్ c3 మూడు రంగుల్లో అమ్మబడుతోంది - లైవ్, ఫీల్ మరియు షైన్. దీని ఎక్స్ షోరూం ధర 6.16 లక్షల నుండి 8.92 లక్షల వరకు పలుకుతోంది. 

ఇక్కడ మరింత చదవండి: సిట్రోయెన్ c3 యొక్క ఆన్ రోడ్ ధర. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Citroen సి3

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience