• రెనాల్ట్ క్విడ్ front left side image
1/1
 • Renault KWID
  + 15images
 • Renault KWID
  + 5colours
 • Renault KWID

రెనాల్ట్ క్విడ్

కారును మార్చండి
39 సమీక్షలుఈ కారుకి రేటింగ్ ఇవ్వండి
Rs.2.83 - 4.92 లక్ష*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
Get Dealer Call
don't miss out on the festive offers this month

రెనాల్ట్ క్విడ్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

మైలేజ్ (వరకు)25.17 kmpl
ఇంజిన్ (వరకు)999 cc
బిహెచ్పి67.0
ట్రాన్స్మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
సీట్లు5
boot space279

క్విడ్ తాజా నవీకరణ

తాజా నవీకరణ: కొనసాగుతున్న రెనాల్ట్ మహోత్సవంలో భాగంగా క్విడ్ లో రూ. 30,000 వరకు లాభాలను రెనాల్ట్ అందిస్తోంది. అక్టోబర్ 31 వరకు మాత్రమే ఈ ప్రయోజనాలను పొందవచ్చు.

రెనాల్ట్ క్విడ్ ధర మరియు వేరియంట్: రెనాల్ట్ క్విడ్ 2018, రూ. 2.67 లక్షల ధర నుండి రూ. 4.63 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు అందించబడుతుంది. రెనాల్ట్ క్విడ్ ఐదు వేరియంట్ లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా, స్టాండర్డ్, ఆర్ ఎక్స్ ఈ, ఆర్ ఎక్స్ ఎల్, ఆర్ ఎక్స్ టి మరియు క్లైంబర్.

రెనాల్ట్ క్వైడ్ ఇంజిన్ మరియు మైలేజ్: రెనాల్ట్ క్విడ్ వాహనం, రెండు పెట్రోల్ ఇంజిన్ ఎంపిక లతో వస్తుంది: అవి వరుసగా, 0.8 లీటర్ పెట్రోల్ మరియు 1.0 లీటర్ పెట్రోల్. ముందుగా 0.8 లీటర్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 54 పిఎస్ పవర్ ను అలాగే 72 ఎనెం గల టార్క్ లను విడుదల చేస్తుంది. మరోవైపు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్ విషయానికి వస్తే, అత్యధికంగా 68 పిఎస్ పవర్ ను అలాగే 91 ఎనెం గల టార్క్ లను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. 0.8 లీటర్ ఇంజిన్, 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. అదే 1.0 లీటర్ ఇంజన్ విషయానికి వస్తే, 5- స్పీడ్ మాన్యువల్ లేదా 5- స్పీడ్ ఏఎంటి (ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్) తో జత చేయబడి ఉంటుంది. రెనాల్ట్ క్విడ్ 0.8 లీటర్ ఇంజన్, అత్యధికంగా 22.7 కెఎంపిఎల్ యొక్క ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది, పెద్ద 1.0 లీటర్ పెట్రోల్ మాన్యువల్ ఇంజిన్ 21.7 కెఎంపిఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అదే ఏఎంటి గేర్‌బాక్స్ తో 1.0 లీటర్ ఇంజిన్ అత్యధికంగా 22.5 కె ఎంపిఎల్ గల ఇంధన సామర్ధ్యాన్ని ఇస్తుంది.

రెనాల్ట్ క్విడ్ లక్షణాలు: రెనాల్ట్ క్విడ్ వాహనం, నావిగేషన్ తో కూడిన 7.0 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ కెమెరా, ఒక డిజిటల్ స్పీడోమీటర్, మాన్యువల్ ఎయిర్ కాన్, పవర్ స్టీరింగ్, వెనుక సీట్ ఆర్మ్స్ట్రెస్, వెనుక ప్రయాణీకులకు 12వి ఛార్జర్ మరియు ముందు వైపర్ వంటి అంశాలు అందించబడ్డాయి. అదే భద్రతా అంశాల విషయానికి వస్తే, ఈ వాహానంలో, ఒక వైకల్పిక డ్రైవర్ సైడ్ ఎయిర్బాగ్, సెంట్రల్ లాకింగ్, ప్రిటెన్షినార్లతో కూడిన ముందు సీట్ బెల్ట్‌లు, రిట్రాక్టబుల్ మూడు- పాయింట్ ల వెనుక సీటు బెల్టులు మరియు వెనుక దోర్లకు పిల్లల భద్రతా లాక్‌లు వంటి అంశాలు అందించబడ్డాయి.

రెనాల్ట్ క్విడ్ ప్రత్యర్ధులు: రెనాల్ట్ క్విడ్ వాహనం, కొత్త హ్యుందాయ్ శాంత్రో, మారుతి సుజుకి ఆల్టో 800, ఆల్టో కె 10, హ్యుందాయ్ ఇయాన్, డాట్సన్ రెడి గో వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది.

ఎక్కువ మొత్తంలో పొదుపు!!
52% ! ఉపయోగించిన ఉత్తమ ఒప్పందాలను కనుగొనండి వరకు సేవ్ చేయండి

రెనాల్ట్ క్విడ్ price list (variants)

ఎస్టిడి799 cc, మాన్యువల్, పెట్రోల్, 25.17 kmplRs.2.83 లక్ష*
ఆరెక్స్ఈ799 cc, మాన్యువల్, పెట్రోల్, 25.17 kmplRs.3.53 లక్ష*
ఆర్ఎక్స్ఎల్799 cc, మాన్యువల్, పెట్రోల్, 25.17 kmplRs.3.83 లక్ష*
ఆర్ఎక్స్టి799 cc, మాన్యువల్, పెట్రోల్, 25.17 kmplRs.4.13 లక్ష*
1.0 rxt999 cc, మాన్యువల్, పెట్రోల్, 23.01 kmplRs.4.33 లక్ష*
1.0 rxt opt999 cc, మాన్యువల్, పెట్రోల్, 23.01 kmplRs.4.4 లక్ష*
climber 1.0 mt999 cc, మాన్యువల్, పెట్రోల్, 23.01 kmplRs.4.54 లక్ష*
climber 1.0 mt opt999 cc, మాన్యువల్, పెట్రోల్, 23.01 kmplRs.4.62 లక్ష*
1.0 rxt amt999 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 24.04 kmplRs.4.63 లక్ష*
1.0 rxt amt opt999 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 24.04 kmplRs.4.7 లక్ష*
climber 1.0 amt999 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 24.04 kmplRs.4.84 లక్ష*
climber 1.0 amt opt999 cc, ఆటోమేటిక్, పెట్రోల్, 24.04 kmplRs.4.92 లక్ష*
వేరియంట్లు అన్నింటిని చూపండి
Ask Question

Are you Confused?

Ask anything & get answer లో {0}

Recently Asked Questions

రెనాల్ట్ క్విడ్ ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

రెనాల్ట్ క్విడ్ సమీక్ష

2018 నవీకరణతో, రెనాల్ట్ సంస్థ రివర్సింగ్ కెమెరా, వెనుక సీటు బెల్ట్‌లు వంటి మరింత ఆచరణాత్మక లక్షణాలను జోడించారు. ధరలు ఏ మాత్రం మారలేదు! కాబట్టి, మీరు క్విడ్ కొనాలని చూస్తే, కొనుగోలుదారులకు ఒప్పందం మేరకు చాలా హాయిని ఇస్తుంది.

ఈ రెనాల్ట్ క్విడ్ వాహనం, ఈ విభాగంలో అత్యంత యవ్వనమైన ఉత్పత్తులలో ఒకటిగా నిలచింది. ఇది రెండు విభాగాల నుండి అనేక ఫీచర్లతో అందించబడుతుంది, చురుకుదనం, విశాలమైన క్యాబిన్ మరియు అధిక ఇంధన సామర్థ్యాన్ని వంటి అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది.

"2018 నవీకరణతో, రెనాల్ట్ సంస్థ రివర్సింగ్ కెమెరా, వెనుక సీటు బెల్ట్‌లు వంటి మరింత ఆచరణాత్మక లక్షణాలను జోడించారు. ధరలు ఏ మాత్రం మారలేదు! కాబట్టి, మీరు క్విడ్ కొనాలని చూస్తే, కొనుగోలుదారులకు ఒప్పందం మేరకు చాలా హాయిని ఇస్తుంది".

2018 నవీకరణతో, రెనాల్ట్ సంస్థ ఈ వాహనానికి, ఒక రివర్స్ కెమెరా, ఏఎంటి క్రీప్ మరియు రిట్రాక్టబుల్ వెనుక సీటుబెల్ట్‌లు వంటి మరింత ఆచరణాత్మక లక్షణాలు జోడించారు. ఈ అంశాలు అన్ని ఎక్కువ ఖరీదైన కార్లలో అందించేవి కాని ఈ విభాగంలో ఈ వాహనం లో మొదటిసారిగా అందించడం జరిగింది దీనికి గాను సంస్థకు కృతజ్ఞతలు. అంతేకాకుండా ధరలను అలాగే కొనసాగిస్తుంది, మరియు మరింత విలువ కోసం ప్రతిపాదనను మెరుగుపర్చడానికి, కొత్త అంశాలను అందించింది. కాబట్టి, మీరు క్విడ్ కొనడానికి చూస్తుంటే, ఈ ఒప్పందం చాలా హాయిని ఇస్తుంది.

బాహ్య

ఈ క్విడ్ వాహనం యొక్క బాహ్య భాగం విషయానికి వస్తే,  బడ్జెట్ సెగ్మెంట్ లో పడటంతో పాటు, ఇది రెనాల్ట్ ను విభిన్నంగా చేయటానికి ప్రయత్నించకుండా ఆపలేదు. రెనాల్ట్ క్విడ్ దాని స్టైలింగ్ అంశాలతో ఈ వాహనానికి ఎస్యువి లుక్ ను మొట్టమొదటి చూపులొనే తీసుకొచ్చింది, అంతేకాకుండా ఈ విభాగంలో అడుగుపెట్టిన మొట్టమొదటి ఎంట్రీ- లెవల్ హాచ్బాక్ అని చెప్పవచ్చు. పాత ఆల్టో తో పోలిస్తే ఇది తాజాగా కనిపిస్తుంది. పొడవైన బాగం & బ్లాక్ ప్లాస్టిక్ అంశాల్తో వీల్ ఆర్చ్‌లు బల్జీ గా ఎస్యువి అప్పీల్ ను జోడిస్తాయి.

ఈ వాహనం యొక్క ముందు భాగం విషయానికి వస్తే ముందు, గ్రిల్ ఒక ఫ్యూచర్ నమూనా అందంగా చెక్కబడి ఉంటుంది. ముందు భాగంలో ఉన్న ఒకే ఒక్క క్రోమ్ డైమండ్ రెనాల్ట్ చిహ్నం గ్రిల్ మధ్య భాగంలో అందంగా పొందుపరచబడి ఉంటుంది. మీరు క్రోం ను ఇష్టపడుతున్నట్లైతే, హనీ కోంబ్ గ్రిల్ ను నిర్దేశించవచ్చు. రెనాల్ట్ సంస్థ ఈ క్విడ్ వాహనాన్ని ఆఫర్ చేయడానికి అనుకూలీకరణ ఎంపికలతో మీ ముందుకు వస్తుంది.

ఈ వాహనానికి అందించబడిన బంపర్ విషయానికి వస్తే, బంపర్ కొద్దిగా ఉబ్బినట్టుగా మరియు దానికి ఇరువైపులా రౌండ్ ఫాగ్ లాంప్స్ అందంగా పొందుపరచబడి ఉంటాయి. దీనికి దిగువన ఒక చిన్న ఎయిర్ డాం తో అదే స్టైలింగ్ గ్రిల్ ను కొనసాగుతూ వస్తుంది.

ఈ కారు చూడటానికి చాలా పొడవుగా మరియు సైడ్ పెద్ద విండో లైన్ మరియు పెద్ద విండోస్ ను కలిగి ఉంది. దీని దిగువన ఉన్న బ్లాక్ స్లాట్లు ప్లాస్టిక్ కాదు అవి కేవలం వినైల్ స్టిక్కర్స్ తో అందంగా కనబరుస్తాయి. మీరు డీలర్ స్థాయిలో అధిక ఖర్చుతో ఉపకరణాల ఎంపిక నుండి ప్లాస్టిక్ క్లాడింగ్ ను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

ఈ వాహనం యొక్క పరిమాణ కొలతలు విషయానికి వస్తే, ఈ కారు 13 అంగుళాల రిమ్ లతో మరియు 155 మీ మీ రబ్బరు టైర్లు అందించబడ్డాయి. కేవలం 3 లగ్స్ నట్స్‌లను భద్రపరుస్తుంది. ఇయాన్ లో ఇవే రింలు మరియు ఇవే రబ్బర్ టైర్లు అందించబడతాయి. అదే నానో మరియు ఆల్టో 800 వాహనాల విషయానికి వస్తే, వరుసగా సన్నగా 135 అంగుళాలు మరియు 145 అంగుళాల టైర్లను అలాగే రెండు వాహనాలకు 12 అంగుళాల రిమ్ లు అందించబడతాయి. 2018 నవీకరణతో, రెనాల్ట్ క్విడ్ ఇప్పుడు ఆర్ ఎక్స్ ఎల్ వేరియంట్ నుండి ఫుల్ వీల్ కవర్లు మరియు ఫాగ్ లాంప్ లను తీసుకొచ్చింది. దీనితో మధ్య తరగతి శ్రేణులలో కారును ఒక ఆకర్షణీయంగా చూడవచ్చు.

ఈ వాహనం యొక్క వెలుపల భాగం లో అందించబడిన అంశాల విషయానికి వస్తే, వెలుపలి మిర్రర్లు మరియు డోర్ హ్యాండిళ్ళు కన్వెన్షినల్ యూనిట్లు నలుపు రంగులో అందించబడతాయి. ప్లాస్టిక్ నాణ్యత ఒక లెట్ -డౌన్ తక్కువనే చెప్పవచ్చు. 2018 నవీకరణ తర్వాత కూడా వెలుపలి అద్దాలు లోపల నుండి సర్దుబాటు సౌకర్యాన్ని కూడా ఈ వాహనం లో అందించలేదు, అదే ఆల్టో 800 వాహనంలో ఇదే అంశం అందించబడింది. టర్న్ ఇండికేటర్ బల్బులు ముందు వీల్ ఆర్చ్ లో పొందుపరచబడ్డాయి. ఈ వాహనం యొక్క వేరియంట్ బ్యాడ్జింగ్‌ను, కొనుగోలుదారులు వెనుక విండో డోర్ పై చివరి భాగంలో గుర్తుపట్టగలరు.

వెనుకవైపు, బ్యాడ్జింగ్ బూట్ డోర్ మధ్య భాగంలో క్రోం తో అందంగా పొందుపరచబడి ఉంటుంది. టైల్ ల్యాంప్స్ సాధారణంగా ఉంటాయి. రెనాల్ట్ బ్యాడ్జ్ టెయిల్ గేట్ మీద క్రింది చివరి భాగంలో అందించబడుతుంది, అయితే ఒక చిన్న రెనాల్ట్ బ్యాడ్జ్ ఎడమ వైపున ఉంటుంది. బంపర్ యొక్క దిగువ భాగం ప్రామాణికమైనదిగా అలాగే బ్లాక్ క్లాడింగ్ ను పొందుతుంది.

ఈ క్విడ్ యొక్క పై భాగం విషయానికి వస్తే, ఎగువన, U ఆకారంలో రూఫ్ రిళ్ళు అందంగా పట్టినట్టుగా ఉంటాయి. ఇది దృఢత్వాన్ని పెంచడంతో పాటు ఆందాన్ని కూడా ఇస్తుంది. ఈ రూఫ్ రైల్స్ పై భాగంలో సన్నని మెటల్ ఫినిషింగ్ అందించబడుతుంది. ఈ వాహనం యొక్క అన్ని వేరియంట్ లు ఒక సమీకృత పై కప్పు స్పాయిలర్ ను కలిగి ఉంటాయి, ఇది కెరెక్టర్ లైన్ ను జత చేస్తుంది. దీనితో పాటు మీరు సుదీర్ఘ యాంటెన్నా ను అలాగే ఎఫ్ ఎం యాంటెన్నాను పై భాగంలో పొందవచ్చు. మీరు డీలర్ వద్ద ఉపకరణాల స్టోర్ నుండి రూఫ్ రైల్స్ ను అధనపు ఖర్చుతో పొందవచ్చు.

క్విడ్ ముందు భాగంలో ఒక్క వైపర్ మాత్రమే అందించబడుతుంది మరియు వెనుక భాగానికి ఎటువంటి ఎంపిక అందించబడదు. ఇది ఖర్చు తగ్గించే లక్షణం, కానీ, ప్రతి వేరియంట్ లోనూ విండ్ షీల్డ్ ప్రాంతానికి ఒక వైపర్ ఐనా అందించబడుతుంది. ఈ వాహనం లో ఎటువంటి వాషర్ కాని డిఫోగ్గర్ గాని అందించబడవు. ఈ డిఫోగ్గర్ ఫంక్షన్ అగ్ర శ్రేణి వేరియంట్ అయిన (ఆర్ ఎక్స్ టి) వేరియంట్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇది ఒక స్ట్రీమ్‌కు బదులుగా వాషర్ యొక్క చిన్న మిస్ట్‌ను స్ప్రే చేస్తుంది దీని ద్వారా విండ్ షీల్డ్ శుభ్రపరచబడుతుంది మరియు తర్వాత వైపర్ ద్వారా త్వరిత స్విప్ అవుతుంది. ఈ సెగ్మెంట్లో ఏ కారులో కూడా ఈ ఫంక్షన్ అందించబడదు.

ఈ వాహనం యొక్క కొలతలు విషయానికి వస్తే, క్విడ్ 3679 మి మీ తో ఈ విభాగంలో అతి పొడవైనది. గ్రౌండ్ క్లియరెన్స్ 180 మీ మీ వద్ద అగ్ర స్థాయిలో ఉంది, ఇది స్పీడ్ బ్రేకర్లకు చాలా సౌకర్యాన్ని అందిస్తుంది. వీల్ బేస్ 2422 మీ మీ వద్ద ఉంది. ఇది ఇయాన్ మరియు ఆల్టో 800 వాహనాల కంటే ఎక్కువగా ఉంటుంది. వాహనం యొక్క బరువు 660 కిలోలు, పరిమాణం పరంగా ఇది నానో కంటే దాదాపు 50 కిలోలు తేలికైనది! ఇది 300 లీటర్ల బూట్ స్పేస్ తో ఈ విభాగంలొ ఉత్తమంగా అందించబడుతుంది.

 

కొనుగోలుదారులు క్విడ్ యొక్క దూకుడు స్వభావాన్ని అలాగే ఎస్యువి లాంటి స్టైలింగ్ ను ఇష్టపడుతున్నారు మరియు ఇది సరైన నిష్పత్తులలో నిర్మించబడింది.

Exterior Comparison

Maruti SwiftDatsun redi-GOMaruti Ignis
Length (mm)3840mm3429mm3700mm
Width (mm)1735mm1560mm1690mm
Height (mm)1530mm1541mm1595mm
Ground Clearance (mm)163mm-180mm
Wheel Base (mm)2450mm2348mm2435mm
Kerb Weight (kg)960Kg--

Boot Space Comparison

Maruti IgnisMaruti SwiftDatsun redi-GO
Volume260-litres268222
  

అంతర్గత

ఈ రెనాల్ట్ క్విడ్ వాహనం యొక్క లోపలి భాగం విషయానికి వస్తే, తక్కువ బడ్జెట్ లో కారు మన ముందు ఉంటుంది మరియు ఇది సాధారణంగా క్యాబిన్ విషయంలో అసౌకర్యాన్ని ఇస్తుంది. అయితే, ఖర్చు తగ్గింపు అంశాలు క్విడ్‌లో చాలా తక్కువగా ఉంటాయి మరియు ఇది డ్రైవర్ కు బాగా సౌకర్యాన్ని ఇస్తుంది. ఈ వాహన డిజైనర్లు డ్రైవర్ పరంగా గాని క్యాబిన్ లో ఉపయోగించే అంశాల పరంగా గాని ఎటువంటి రాజీ పడకుండా ఈ వాహనాన్ని మన ముందు ఉంచారు. ఈ వాహనం లో అందించబడిన ప్లాస్టిక్స్ నాణ్యత విషయానికి వస్తే, ఒక రకంగా తక్కువనే చెప్పవచ్చు.

ప్రయాణికులు ఈ క్విడ్ వాహనం లోకి ప్రవేశించిన వెంటనే, మీ కన్ను మొట్టమొదటి పడే అంశం ఏమిటంటే ఈ వాహనంలో అందించబడిన 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇది డస్టర్ నుండి స్వీకరించబడింది. డాష్ బోర్డ్ మొత్తం గ్రే రంగు అందించబడింది. ఈ ఇంఫోటైన్మెంట్ వ్యవస్థ చుట్టూ పియానో ​

బ్లాక్ కలర్ ఉంటుంది దీనిపై ఉండే స్విచ్చులు క్రోమ్ యొక్క టచ్ లతో చుట్టు ముట్టబడి ఉంటాయి. ఈ వ్యవస్థ తో పాటు ఈ వాహనానికి, నావిగేషన్, యూఎస్బి, ఆక్స్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ లతో వస్తుంది. సంస్థ అందించబడిన టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఈ విభాగంలో అందించబడిన ఏకైక కారు.

ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ క్రింద భాగంలో ఎయిర్ కాన్ ఫంక్షన్ పొందుపరచబడి ఉంటుంది. గేర్ నాబ్ క్రోం ఫినిషింగ్ తో అలంకరించబడి ఉంటుంది మరియు ఒక మంచి అనుభూతి అందించబడుతుంది. క్రోమ్ ఇన్సర్ట్లు మరియు చివరలో ఉండే గాలి వెంట్లు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి, వీటి చుట్టూ క్రోమ్ ఇన్సర్ట్లు పొందుపరచబడి ఉంటాయి. అన్ని దేనికది క్లోజ్ చేయవచ్చు. ఈ వాహనం యొక్క దిగువ శ్రేణి వేరియంట్, ఎయిర్ కండిషనింగ్ కూడా అందించబడటం లేదు.

వీటి క్రింది భాగంలో, హాజార్డ్ లైట్ల కోసం బటన్లు, పవర్ విండోస్ మరియు సెంట్రల్ లాకింగ్ కోసం బటన్లు డాష్ బోర్డ్ పై పొందుపరచబడి ఉంటాయి. డ్రైవర్ మరియు ప్రయాణీకుల వైపు ఏ ఒక్క స్విచ్ అందించబడటం లేదు. ఇవి కావాలి అనుకుంటే, సంస్థ వారికి అధనపు ధరను చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయంలో వీరు ఇద్దరూ సమానంగా అందుబాటులో ఉంటారు.

ఈ కన్సోల్ క్రింది భాగంలో మరియు ముందుకు గేర్ స్టిక్ ఉంటుంది. అలాగే కప్ హోల్డర్స్ మరియు ఒక 12వి ఛార్జింగ్ పాయింట్ అందుబాటులో ఉంటుంది. మీరు హ్యాండ్‌బ్రేక్ మరియు గేర్ స్టిక్ మధ్య భాగంలో ఒక చిన్న కూబ్బుల్ అందించబడుతుంది. ఇది ఒక ప్రామాణిక అంశంగా అందించబడుతుంది.

డ్రైవర్ వైపు నుండి చూస్తే, డ్రైవర్ కు సౌకర్యాన్ని అందించడం కోసం ఒక అందమైన స్టీరింగ్ వీల్ అందించబడుతుంది. ఇది పట్టుకోవడానికి సౌకర్యంగా మరియు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. కీ ను ఇగ్నిషన్ లో పెట్టినట్లైతే, క్విడ్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో ఒక ట్రిక్ పోనీ కాదని మీరు తెలుసుకుంటారు. ఆరెజ్ ప్రకాశవంతమైన ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ పై తరగతిని సూచిస్తుంది! వేగం మరియు మిగిలిన అంశాలను చదవడం చాలా సౌకర్యవంతం అవుతుంది. ఇది ఓడోమీటార్, డిస్టెన్స్ టు ఎంటీ, ఒక ట్రిప్ మీటర్, రియల్- టైం ఇంధన వినియోగం, సగటు ఇంధన వినియోగం, డిస్టెన్స్ ట్రావెల్లెడ్ వంటి అంశాలను సూచిస్తుంది, ట్రిప్ ఇంధన వినియోగం మరియు సగటు వేగం వంటి అంశాలను సూచిస్తుంది. ఇంధన బటన్ సమీపంలో ఉంచిన రీసెట్ బటన్‌ను నొక్కడం ద్వారా ఈ చదవగలిగే అన్ని ప్రత్యామ్నాయాలు మారుతూ ఉంటాయి.

హెడ్‌లైట్ ను మరియు ఇండికేటర్ స్టాక్ లను స్టీరింగ్ వీల్ నుండి సులువుగా ఆపరేట్ చేయవచ్చు. ఇది ఒక లేన్ మార్పు ఫీచర్ కూడా ఈ వాహనం లో అందించబడింది. ఒక చిన్న ట్యాప్‌లో, ఒక సూచిక మూడుసార్లు వెలుగుతుంది మరియు దాని అంతట అదే స్వయం చాలకంగా ఆగిపోతుంది.

ప్రయాణీకుల వైపు, రెండు గ్లోవ్ బాక్స్‌లు అందించబడ్డాయి. ఎగువన ఉన్న గ్లోవ్ బాక్స్ లో వాటర్ బాటిల్స్ ను పెట్టుకోవడానికి అందించబడుతుంది. దీని దిగువన ఒక గ్లోవ్ బాక్స్ చాలా పెద్దది పొందుపరచబడి ఉంటుంది! వీటి రెండింటి మధ్య ఒక బహిరంగ నిల్వ షెల్ఫ్ అందించబడింది.

డాష్ బోర్డ్ కు ఇరువైపులా ముందు రెండు స్పీకర్లు పొందుపరచబడి ఉంటాయి. ధ్వని నాణ్యత ఉత్తమంగా ఆమోదయోగ్యంగా ఉంటుంది. మీరు ఈ మ్యూజిక్ సిస్టం నుండి బాస్ భారీ సంగీతాన్ని ఆశించలరు. సంగీతం అభిమానులు వీటిని అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారు.

ముందు సీట్లు ఒక మూడు రంగుల టోన్ ఎరుపు, బూడిద, నలుపు వంటి అపోలిస్ట్రీ అందించబడుతుంది. ఈ ముందు సీట్లకు అందించబడిన హెడ్ రెస్ట్లు స్థిరంగా ఉంటాయి మరియు సర్దుబాటు కావు. ఈ సీట్లు, ఆల్టో తో పోలిస్తే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి, మరియు తొడల మద్దతుతో మంచి స్థలాన్ని ముందు సీటు ప్రయాణికులకు అందించబడతాయి.

ఈ వాహనం యొక్క వెనుక లోపలి విషయానికి వస్తే, ఇది ఆల్టో & ఇయాన్ లతో పోలిస్తే ఇది అగ్ర స్థాయిలో ఉంటుంది. మిగిలిన వాహనాలతో పోలిస్తే ఈ వాహనంలో కూర్చొని ఉన్నప్పుడు ఇక్కడ ఎక్కువ మంది ప్రయాణికులు సౌకర్యంగా ఉంటారు. ముగ్గురు కూర్చోగలరు కానీ అసౌకర్యకరంగా ఉంటుంది. ఇద్దరు వ్యక్తులకైతే ఖచ్చితమైన సౌకర్యం అందించబడుతుంది. ముందు అందించబడినట్టుగానే వెనుక సీట్లు ఇదే ట్రిపుల్ టోన్ అప్హోల్స్టరీను పొందుతాయి. సీట్లు ఆకృతులను కలిగి లేవు. కానీ, సౌకర్యవంతమైన సీట్లు ఉపయోగించబడ్డాయి. సీటింగ్ చాలా ఎక్కువగా ఉంది, ఇది మంచి అభిప్రాయాన్ని కొనుగోలుదారులకు ఇస్తుంది.

2018 రెనాల్ట్ క్విడ్ కొన్ని మంచి అంశాలను కలిగి ఉంది. ఈ లక్షణాలు వరుసగా, వెనుక సీటు బెల్ట్ కోసం ప్రామాణిక అత్యవసర లాకింగ్ రెట్రాక్టర్ (ఈ ఎల్ ఆర్) కూడా ఉంది. ఈ ఎల్ ఆర్ అనేది సీట్‌బెల్ట్ విస్తరించడానికి మాత్రమే కాకుండా, ప్రయాణీకులు ఉపసంహరించుకునేందుకు ఒక భద్రతా లక్షణం. ఇది అత్యవసర బ్రేక్ అసిస్ట్ పై సీటు బెల్ట్ లాకింగ్‌ను అనుమతిస్తుంది, ప్రయాణీకుడిని ముందుకు పడకుండా అడ్డుకుంటుంది. పాత నాన్ రిట్రాక్టబుల్ సీట్ బెల్ట్‌లతో పోల్చినపుడు ఇది ఒక పెద్ద వరంగా ఉంటుంది. అదనంగా, పాత సీటుబెల్ట్లను, తలుపు మూసివేసే ముందు వాటిని వెనక్కి తీసుకొని పెట్టుకోవాలు. దురదృష్టవశాత్తు, వెనుక విండోస్ కు మాన్యువల్ రోలార్స్ అందించబడతాయి మరియు ఇప్పటికీ ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి సి ఎక్స్ ఆర్ (ఓ) వేరియంట్లో కూడా ఇవి అందించబడలేదు.

వెనుక విషయానికి వస్తే, ముందు సీటు కింద ఉండే నాబ్ ను గుండ్రంగా కదిలించినప్పుడు లోపలి వైపు నుండి బూట్ ను యాక్సెస్ చేయవచ్చు. బూట్ స్థలం భారీగా ఉంది! 300 లీటర్ బూట్ ఉత్తమమైనది, దాని ప్రవేశ స్థాయి విభాగంలో మాత్రమే కాదు, ఈ వాహనం యొక్క అన్ని వేరియంట్ లలో ఇదే భాగాలు అందించబడుతున్నాయి. ఈ స్థలానికి మీరు పూర్తిగా సంతృప్తి చెందలేకపోతే, వెనుక సీట్లు ఖచ్చితంగా ఫ్లాట్ చేసుకోవచ్చు, ఇప్పుడు మీకు కావలసినంత స్థలం అందించబడుతుంది.

అంతర్గత మా చివరి తీర్పు: మీరు మీ డబ్బు కోసం చాలా ఫీచర్లను పొందవచ్చు! రెనాల్ట్ వాహనం లోపలి అంతర్గత భాగాలను ఆకర్షణీయంగా అందించింది. కారు లోపల సమయం గడుపుతున్నప్పుడు మీ అనుభవానికి ఏదైనా ఆటంకం కలిగించదు కాబట్టి, రెనాల్ట్ లో ప్రయాణిస్తున్నప్పుడు సౌకర్యన్ని పొందుతారు.

పనితీరు

పెట్రోల్

0.8 SCe

0.8 ఎస్సిఈ

క్విడ్ వాహనం యొక్క పనితీరు విషయానికి వస్తే, ఈ వాహనానికి 0.8 ఇంజన్ మరియు 1.0 లీటర్ ఇంజన్, 1.0 ఏ ఎం టి ఇంజన్ అందించబద్దాయి. ముందుగా 0.8 లీటర్ ఇంజన్ విషయానికి వస్తే, క్విడ్ యొక్క 800 సి సి యూనిట్ కలిగిన అన్ని వాహనాలలోనూ ఈ ఇంజన్ అందించబడింది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, క్విడ్ యొక్క మొత్తం అభివృద్ధి ఖర్చులో 50% ఇంజిన్ ను అభివృద్ధి చేయడం కోఅసం మాత్రమే కేటాయించారు. ఇంజిన్ వైపు ఉన్నటువంటి అధిక దృష్టితో, రెనాల్ట్ భారతదేశంలో అత్యంత ఇంధన సామర్థ్య పెట్రోల్ ఇంజిన్లలో ఒకటిగా అభివృద్ధి చెందింది! ఏ ఆర్ ఏ ఐ ప్రకారం ఈ 0.8 లీటర్ పెట్రోల్ ఇంజన్, 25.17 కె ఎం పి ఎల్ గల అధిక మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. అదే ఆల్టో విషయానికి వస్తే ఏ ఆర్ ఏ ఐ ప్రకారం 22.74 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అలాగే ఇయాన్ విషయానికి వస్తే 21.1కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందిస్తున్నాయి.

ఈ 0.8 పెట్రోల్ ఇంజన్, 3- సిలిండర్ లను కలిగి అత్యధికంగా 54 పిఎస్ పవర్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది మరోవైపు, అత్యధికంగా 72 ఎనెం గల టార్క్‌ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది మరియు ఇది 5- స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ తో జత చేయబడి ఉంటుంది. ఈ ఇంజిన్ వాహనంతో సౌకర్యవంతంగా ఉంటుంది, కానీ ప్రయాణికులు మరియు కొన్ని సామానుతో లోడ్ చెయాల్సి వస్తే కొంచెం అసౌకర్యాన్ని అందిస్తుంది. ఇంజిన్ ఒక నగరానికి ఉత్తమం అని చెప్పవచ్చు, కాబట్టి ఖచ్చితమైన పనితీరు ఆశించే అవసరం లేదు. 

ఒక ప్రతికూలమైన పాయింట్ ఏమిటంటే? ఇది అంత శుద్ధి చేయబడిన ఇంజన్ కాదు. అనివార్యమైన మూడు సిలిండర్ల డ్రోన్ కాకుండా, నాలుగు సిలెండర్ల ఇంజిన్ ను అందించి ఉండే ఒక అనుకూలతగా ఉండేది తన ఉత్తమ పనితీరును అందించడంలో విఫలమైంది. మీరు రివర్స్ తీసుకొని ఎగువ భాగంలోకి వచ్చినప్పుడు ఇది మరింత స్పష్టంగా కనబడుతుంది. అల్టో మరియు ఇయాన్ లతో పోలిస్తే, నిష్క్రియంగానూ మరియు కదలికలోనూ ఈ రెండు వాహనాలు చాలా ప్రశాంతమైనవి అని చెప్పవచ్చు.

1.0 ఎస్సిఈ

మరోవైపు 1.0 లీటర్ మోటార్ ఇంజన్ విషయానికి వస్తే ఈ ఇంజన్, క్విడ్ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లు అయిన ఆరెక్స్టి మరియు ఆర్ ఎక్స్ టి (ఓ) రకాలలో మాత్రమే అందించబడుతుంది మరియు 0.8-లీటర్ యూనిట్‌తో దాని నిర్మాణాన్ని పంచుకుంటుంది. రెనాల్ట్ చిన్న ఇంజిన్ యొక్క బోర్ మరియు స్ట్రోక్‌ని పెంచింది, పెద్ద స్థానభ్రంశం సాధించడానికి, అదనపు శక్తి కోసం ఈ ఇంజన్ ను బలోపేతం చేసింది. ఈ ఇంజన్ పవర్ మరియు టార్క్‌లు విషయానికి వస్తే, ఈ ఇంజన్ అత్యధిక 0.8 ఇంజన్ కంటే 14 పిఎస్ ఎక్కువ పవర్ ను మాత్రమే అందించింది. శక్తి వెంటనే స్వయంగా మరియు స్పష్టంగా కనిపించదు. అయితే, క్విడ్ చాలా స్నేహశీలిగా మరియు అనుభూతి చెందుతుందని మీరు అనుకుంటారు. ఊహిస్తున్న విధంగా, హైవే పనితీరు చాలా ఉత్తమంగా మరియు ఇంజిన్ మూడంకెల వేగంతో వెళుతుంది. కానీ, శబ్దం, కదలిక మరియు కఠినత్వంతో దాని 0.8 లీటర్ల నుండి భిన్నంగా ఏమి లేదు. అదే సమానత్వం మరియు అసౌకర్యం స్వయంగా కనబరుస్తాయి మరియు కఠినంగా నడిచినప్పుడు గందరగోళంగా ఉంటుంది. రహదారులలో ప్రయాణికులకు అసౌకర్యం ఎక్కువగా అందించబడుతుంది.

ఎక్కడైనా 0.8 లీటర్ ఇంజిన్ తో పోలిస్తే 1.0 లీటర్ సరైనదిగా మరియు అద్భుతమైన పనితీరును ఇవ్వాలని కొనుగోలుదారుడు కోరుకుంటాడి కానీ ఈ ఇంజన్ ఏ మాత్రం అద్భుతమైన పనితీరు ఇవ్వడం ప్రక్కన పెడితే అసౌకర్యాన్ని అందిస్తుంది. ఈ వాహనం యొక్క త్వరణం విషయానికి వస్తే 0- 100 కె ఎం పి హెచ్ వేగం దాటడానికి 13.9 సెకన్ల సమయం పడుతుంది. దీని పరంగా ఈ విభాగంలో ఉండే ఇతర హాచ్బ్యాక్ లతో పోలిస్తే ఫోర్డ్ ఫ్రీస్టైల్ పెట్రోల్ మరియు మారుతి సుజుకి స్విఫ్ట్ డీజెల్ వంటి వాహనాలకు గట్టి పోటీను ఇస్తుంది. ఇది ఈ విభాగంలో, క్విడ్ ఇంజన్ నగరలకు ఉత్తమమైనది అని చెప్పవచ్చు. ఈ ఇంజిన్ క్విడ్ యొక్క నగర లక్షణాలను బాగా మెరుగుపరుస్తుంది మరియు చాలా మంది నగరాలకు ఈ వాహనాన్ని ఎంపిక చేసుకుంటున్నారు. అదనంగా, ఈ ఇంజిన్ 0.8 సిసి కంటే శక్తివంతమైనది అయినప్పటికీ, ఇప్పటికీ చాలా సమర్థవంతంగా ఉంది, మైలేజ్ విషయానికి వస్తే, నగరంలో 20 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అలాగే రహదారిపై 23.02 కె ఎం పి ఎల్ మైలేజ్ ను అందించే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

1.0 ఎస్సిఈ ఏఎంటి

ఈ వాహనానికి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ను అందించడం జరిగింది. ఈ 1.0 లీటర్ పెట్రోల్ ఏ ఎం టి ఇంజన్ విషయానికి వస్తే, మారుతి సుజుకి ఆల్టో కె10 ఏ జి ఎస్ వాహనం లో వలె, రెనాల్ట్ క్విడ్ కూడా ఏ ఎం టి వేరియంట్ ను ప్రవేశపెట్టింది. రెండు పెడల్ వెర్షన్ తో మాన్యువల్ కౌంటర్ కు రూ 30,000 పైగా ఖర్చవుతుంది. ప్రయాణికులకు సౌలభ్యాన్ని అందించడం కోసం ఆటోమేటిక్ వెర్షన్ అందించబడింది. క్విడ్ 'ఈసీ- ఆర్' అదనపు ధర కు న్యాయం చేకూరుతుంది.

ఏ ఎం టి బడ్జెట్ సెగ్మెంట్లో నడిచే ఉత్తమమైన వాటిలో ఈ క్విడ్ 1.0 లీటర్ ఏ ఎం టి వాహనం ఒకటి మరియు షిఫ్ట్ షాక్స్ తక్కువగా ఉంటాయి. గేర్‌బాక్స్ థొరెటల్ ఇన్పుట్లను సహేతుకంగా కైవసం చేసుకుంది మరియు వేగంగా వృద్ధి చెందుతుంది. తిరిగి ప్రారంభించినప్పుడు, ఈ ప్రసారం చాలా అవసరమైన క్రీప్ ఫంక్షన్ అందించలేదు. అయినప్పటికీ, 2018 లో రెనాల్ట్ క్విడ్ దానిని పొందింది, రెనాల్ట్ దానిని "ట్రాఫిక్ అసిస్" గా పేర్కొంది. ఈ వాహనం లో అందించిన మూడూ ఇంజన్లను పోలిస్తే, ఈ 1.0 లీటర్ ఏ ఎం టి ఇంజన్, అద్భుతమైనది అని చెప్పవచ్చు. బంపర్-టు-బంపర్ ట్రాఫిక్‌లో పురోగతిని చేస్తున్నప్పుడు నిరంతరం యాక్సిలరేటర్‌ని నొక్కకుండా, ఈ లక్షణం (ఇది డాట్సన్ రెడ్-గో ఆంట్ తో లభ్యమవుతుంది) కారు క్రాల్ వేగంతో ముందుకు సాగుతుంది. సౌకర్యం అందించబడుతుంది అంతేకాకుండా, ఈ ఇంజన్ ఆటోమేటిక్ కావడం వల్ల ప్రయాణికులకు అధనపు సౌకర్యం జత చేయబడుతుంది. అది అవసరమైతే డ్రైవర్ గేర్ మార్పుల నియంత్రణను నియంత్రించడానికి సహాయపడటానికి ఎటువంటి మాన్యువల్ మోడ్ ఇప్పటికీ ఉంది. అది అవసరం లేకుండా ఆటోమెటిక్ గా ప్రయాణించవచ్చు.

Performance Comparison (Petrol)

Maruti SwiftMaruti IgnisDatsun redi-GO
Power74bhp@4000rpm81.80bhp@6000rpm53.64bhp@5678rpm
Torque (Nm)190Nm@2000rpm113Nm@4200rpm72Nm@4386rpm
Engine Displacement (cc)1248 cc1197 cc799 cc
TransmissionManualManualManual
Top Speed (kmph)
0-100 Acceleration (sec)
Kerb Weight (kg)960Kg--
Fuel Efficiency (ARAI)28.4kmpl20.89kmpl22.7kmpl
Power Weight Ratio---

రైడ్ మరియు నిర్వహణ

ఈ వాహనం యొక్క రైడ్ మరియు నిర్వహణ విషయానికి వస్తే, రెనాల్ట్ ఎల్లప్పుడూ డస్టర్ మరియు లాడ్జీ లతో ఒక గొప్ప రైడ్ మరియు నిర్వహణను అందించడానికి ప్రసిద్ది చెందింది. ఈ లక్షణం క్విడ్‌లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది ఒక నగర కారు అయితే, సస్పెన్షన్ మృదువుగా ఏర్పాటు చేయబడింది. ఇది గుంతలు మరియు అప్పుడప్పుడు విరిగిపోయిన రహదారుల పై కూడా ఉత్తమ రైడ్ ను అందిస్తుంది. అధిక గ్రౌండ్ క్లియరెన్స్ అందించడం వలన మూలల్లో పార్కింగ్ సమయాలలో సౌకర్యాన్ని అందిస్తుంది. హ్యాండ్లింగ్ ఊహాజనితమైనది కనుక ఇది సౌకర్యవంతమైన సస్పెన్షన్ సెటప్ ను కలిగి ఉంటుంది. ఈ వాహనం పెద్ద 5 మీటర్ల టర్నింగ్ వ్యాసార్ధాన్ని తీసుకుంటుంది ఇది ఒక ప్రతికూలత అని చెప్పవచ్చు. అదే ఆల్టో 800 తో పోల్చి చూస్తే, ఇది 4.6 మీటర్ల టర్నింగ్ వ్యాసార్ధాన్ని కలిగి ఉంటుంది. క్విడ్ వాహనం, ఇరుకైన ప్రదేశాలలో మరియు లోపల పెట్టడం అలాగే వెలుపలికి తీయడం కోసం అదనపు కృషి పెట్టాల్సి వస్తుంది.

ఈ వాహనానికి అందించబడిన బ్రేక్‌ల విషయానికి వస్తే, బ్రేక్‌లు తగినంత పనితీరును కలిగి ఉంటాయి మరియు ఏ ఇబ్బంది లేకుండా కారును నిలిపివేస్తుంది. ఈ క్విడ్, ఒక ఉత్సాహవంతమైన డ్రైవింగ్ శైలి ఉన్నవారికి ఉత్తమంగా ఉంటుంది. ముందు చక్రాలకు ఏబిఎస్ లేనందున లాక్ చేయటానికి నిజంగా చాలా కష్టంగా ఉంటుంది.

స్టీరింగ్ వీల్ పరంగా, తక్కువ వేగంతో ఉన్నప్పుడు తేలికగా ఉంటుంది అదే అధిక వేగాల వద్ద ఒక లెట్- డౌన్ గా ఉంటుంది.

మొత్తంమీద, కారులో నగర రోడ్లకు మరియు 100 కెఎంపిహెచ్ కన్నా తక్కువ వేగం వద్ద మీరు ఫిర్యాదు చేయవలసినది ఏమి లేదు.

 

సేఫ్టీ

రెనాల్ట్ క్విడ్ యొక్క భద్రత విషయానికి వస్తే, భద్రతా కిట్ 2018 లో మెరుగైంది, కానీ ఇప్పటికీ చాలా కావలసినది ఉంది. క్విడ్ యొక్క అగ్ర శ్రేణి వాహనం అయిన ఆర్ ఎక్స్ టి (ఓ) వేరియంట్లో, డ్రైవర్ సైడ్ ఎయిర్బాగ్ అందించబడుతుంది, కాని ప్రయాణీకుల ఎయిర్బాగ్ ఒక ఎంపికగా కూడా అందుబాటులో లేదు. అదనంగా, యాంటీ- లాక్ బ్రేక్‌లు (ఏబిఎస్) ఇప్పటికీ భద్రతా ప్యాకేజీ లో అందించబడటం లేదు. 2018 క్విడ్ లో మెరుగైన అంశాలు ఏమిటంటే, రేర్ కెమెరా మరియు 3- పాయింట్ల ఈ ఎల్ ఆర్ సేటు బెల్ట్‌లు రెండు వెనుక సీటు ప్రయాణికులకు అందించబడుతున్నాయి. అదే మధ్య ప్రయాణీకులకు ఇప్పటికీ ఒక ల్యాప్ బెల్ట్ అందించబడుతుంది. మొత్తంమీద, రెనాల్ట్ ఈ విభాగంలో క్విడ్ వాహనం, మరింత మెరుగైన రీతిలో క్రాష్ పరీక్ష ఫలితాలను ఎదుర్కోవలసి ఉంది.

రకరకాలు

రెనాల్ట్ క్విడ్ వాహనం, మొత్తం ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది - అవి వరుసగా స్టాండర్డ్, ఆర్ ఎక్స్ ఈ, ఆర్ ఎక్స్ ఎల్, ఆర్ ఎక్స్ టి (ఓ) మరియు క్లైంబర్ లలో అందుబాటులో ఉంది. మొదటి మూడు వేరియంట్ లు మాత్రమే 0.8 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అందుబాటులో ఉంటుంది. ఆర్ ఎక్స్ టి (ఓ), 0.8 లీటర్ మరియు 1.0-లీటర్ ఇంజన్లతో రెండిటితో అందుబాటులో ఉంది. ఇంకా, ఆర్ ఎక్స్ టి (ఓ) మరియు క్లైంబర్ వేరియంట్ లో ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ (ఏ ఎం టి) తో అందుబాటులో ఉన్నాయి.

ఈ రెనాల్ట్ క్విడ్ యొక్క దిగువ శ్రేణి వేరియంట్ అయిన (ఎస్ టి డి) వాహనం విషయానికి వస్తే, చాలా ప్రాథమికంగా ఉంటుంది. నల్లని బంపర్స్, పవర్ స్టీరింగ్ లేదా ఎసి లు లేవు, మ్యూజిక్ సిస్టం మరియు స్పీకర్లు కూడా అందించబడవు. ఈ క్విడ్ దిగువ శ్రేణి వేరియంట్ లో ఏ అంశాలు అందించబడవు మరియు ఇంత తక్కువ ధర అని ఆశ్చర్యం వ్యక్తం చేయడం తప్ప, కానీ కొనుగోలుదారులు ఈ వేరియంట్ ను దాటివేసేందుకు సూచిస్తున్నారు.

తదుపరి (ఆర్ ఎక్స్ ఈ) వేరియంట్, దీనిలో ఏసి తో పాటు ముందు ప్రయాణీకుడికి సన్ వైజర్లు మరియు ఇంజిన్ ఇమ్బోబిలైజర్కు వంటి కొన్ని ఇతర లక్షణాలు ఉన్నాయి, కానీ ఇప్పటికీ చాలా ప్రాథమికంగా అనిపిస్తుంది. ఇది ఇప్పటికీ డ్రైవ్ నడపడం పవర్ స్టీరింగ్ లేకపోవడంతో కొద్దిగా కష్టమే.

మధ్య శ్రేణి ఆర్ ఎక్స్ ఎల్ వేరియంట్, ప్యాకేజింగ్ పరంగా ఒక మృదువైన అంశాలను పొందుతుంది. ఇది ఒక ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ వీల్ నుకలిగి ఉంది మరియు ఒక మంచి ప్రయాణానికి అవసరమైన కనీస మొత్తం లక్షణాలను అందించడంలో చాలా విలువను అందిస్తుంది. ఈ జాబితాలో కారు రంగులో ఉండే బంపర్లు, వీల్ కవర్లు, ఫ్రంట్ పవర్ విండోస్, క్యాబిన్ లైట్ మరియు ఆక్స్ / యూ ఎస్ బి / బ్లూటూత్ కనెక్టివిటీతో ఒకే- డిన్ మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి.

ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఆర్ ఎక్స్ టి (ఓ) విషయానికి వస్తే, 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఈ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. అంతేకాకుండా, ద్వంద్వ- టోన్ డాష్‌బోర్డ్, డ్రైవర్ ఎయిర్బాగ్ మరియు రివర్సింగ్ కెమెరాతో వస్తుంది. ఇది క్విడ్ యొక్క సిఫార్సు చేయబడిన వేరియంట్, ఎందుకంటే దీనిలో ప్రాదమిక అంశాలు అన్ని తప్పనిసరిగా అందించబడ్డాయి వీటన్నింటితో పాటు, క్విడ్ యొక్క ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్ ఎంపికలు అన్ని అందుబాటులో ఉన్నాయి.

చివరి వేరియంట్ క్లైంబర్, ఒక ప్రత్యేక కాస్మెటిక్ కిట్ కంటే ఎక్కువ లక్షణాలను అంశాలను కలిగి ఉండటం వలన క్విడ్ మరింత ప్రత్యేకంగా కనిపిస్టుంది. ఇది స్పోర్టీ లుక్ కలిగిన ఆరెంజ్ వింగ్ మిర్రర్లు, ముందు డోర్ పై మరియు వెనుక విండ్‌షీల్డ్ పై క్లైంబర్ బ్యాడ్జ్ మరియు ఆరెంజ్ ఎసెంట్స్ అలాగే లోపలి వైపు కూడా అందించబడ్డాయి. ఈ వేరియంట్ కు ఎటువంటి అంశాలను జోడించవలసిన అవసరం లేదు అలాగే ఇన్ని అంశాలు కావాలి అనుకుంటే మునుపటి వేరియంట్ కు 25,000 రూపాయల చెల్లిస్తే ప్రీమియం లుక్ తో పాటు నూతన లక్షణాలను మరియు ఆదేశాలను జోడించవచ్చు. ఇది 1.0- లీటరు ఎం టి మరియు ఏ ఎం టీ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో మాత్రమే లభిస్తుంది. కొనుగోలు చెయడానికి, ఈ కారణం మాత్రమే కనిపిస్తోంది.

రెనాల్ట్ క్విడ్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

things we like

 • క్రీప్ ఫంక్షన్ స్టాప్ - గో లక్షణాలను డ్రైవింగ్ చాలా మృదువుగా & సౌకర్యవంతంగా చేస్తుంది
 • 1.0 లీటర్ ఇంజిన్ ప్లస్ కిడ్ యొక్క తెలికపాటి బరువు, మిరుమిట్లుగొలిపే విధంగా మరియు శక్తివంతమైనదిగా చేస్తుంది. ఏఎంటి వెర్షన్ నగరం లోపల ఒక ఖరీదైన వరంగా ఉంది.
 • రిపోలని 4 సంవత్సరాల / 1 లక్షల కి.మీ. వారంటీతో పాటు 4- సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్ట్ సౌకర్యాన్ని అందిస్తుంది
 • టచ్‌స్క్రీన్, కొత్త వెనుక ఆర్మ్ రెస్ట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ వంటి అంశాలు అంతర్గత ఉన్నత అనుభూతిని అందించడానికి ఈ విభాగంలో మొదటిసారిగా అందించారు
 • రైడ్ నాణ్యత నగరానికి ఖచ్చితంగా సరిపోతుంది
 • ఎస్యూవి- ప్రేరిత స్టైలింగ్, క్లాడింగ్ మరియు మస్కులార్ ఎలిమెంట్స్ వంటి అంశాలు ఈ సెగ్మెంట్ లో వేరే ఏ ఇతర వాహనాలలో కనిపించవు.

things we don't like

 • ఎసి వెంట్ మూతలు, ఏమిటి డైల్ మరియు డోర్ ప్యాడ్స్ వంటి ప్లాస్టిక్ అంశాలు క్యాబిన్ లో నాణ్యంగా అందించి ఉంటే బాగుండేది
 • తేలికైన మరియు సన్నగా టైర్లు కారణంగా, క్విడ్ అధిక వేగం వద్ద రహదారులపై స్థిరంగా ఉండేందుకు స్టీరింగ్‌ను సరిదిద్దుబాట్లు చేయవలసిన అవసరం ఉంది
 • క్రీప్ ఫంక్షన్ ఉన్నప్పటికీ, బలవంతంగా బ్రేక్ తో కారును తిరిగి ప్రారంభించినా, తిరిగి ఇంక్లైన్స్ లోకి మరలుతుంది

అత్యద్భుతమైన లక్షణాలను

 • Pros & Cons of Renault KWID

  క్యాబిన్ లో నిల్వ ప్రదేశాలు - ఈ విభాగంలో 300 లీటర్ బూట్ స్పేస్ తో కలిపి ఉన్న పెద్ద సెంటర్ కన్సోల్ నిల్వ స్థలం అందించబడుతుంది, అంటే వారాంతపు యాత్రకు తగినంత ప్రదేశం కంటే ఎక్కువ

 • Pros & Cons of Renault KWID

  ెనుక సీటు ఆర్మ్ రెస్ట్ - వెనుక సీటు ప్రయాణీకులకు క్యాబిన్ సౌకర్యాన్ని మరియు ప్రీమియం ఆహ్లాదాన్ని జతచేస్తుంది

 • Pros & Cons of Renault KWID

  2018 రెనాల్ట్ క్విడ్, ఇప్పుడు మొదటి- తరగతికి చెందిన రివర్స్ పార్కింగ్ కెమెరాతో వస్తుంది.

 • Pros & Cons of Renault KWID

  డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ - చాలా స్పష్టంగా మరియు సులభకరంగా పఠనం చేయడం కోసం అందించబడింది. 

space Image

రెనాల్ట్ క్విడ్ యూజర్ సమీక్షలు

4.4/5
ఆధారంగా39 యూజర్ సమీక్షలు
Chance to win image iPhone 7 & image vouchers - T&C *

ధర & సమీక్ష

 • All (39)
 • Looks (17)
 • Comfort (7)
 • Mileage (9)
 • Engine (8)
 • Interior (5)
 • Space (3)
 • Price (13)
 • More ...
 • తాజా
 • ఉపయోగం
 • CRITICAL
 • My Dream Car

  My favourite car is a Renault Kwid. This is the best car and the cost is less. This new model of 1000 cc is my favourite. Kwid seat is very amazing and so soft. It improv...ఇంకా చదవండి

  ద్వారా baldev rathod
  On: Nov 14, 2019 | 3362 Views
 • Best - Renault KWID

  I love my car Renault KWID, it has got the best mileage in petrol, good space, good height, good ground clearance, it is the best car in all ways.

  ద్వారా anonymous
  On: Nov 13, 2019 | 53 Views
 • Very perfect car for all

  Supercar and very smooth. It looks very beautiful, the design is perfect. The car with the rear camera is very nice and the touchpad is there in the car for navigation, c...ఇంకా చదవండి

  ద్వారా a jagadeeshkumar
  On: Nov 19, 2019 | 39 Views
 • If compared with S Presso

  Looking wise good but not practical. The noisy engine in comparison to Maruti Suzuki S Presso. S Presso will win your heart.

  ద్వారా manoj dhiman
  On: Nov 17, 2019 | 45 Views
 • Best car under this segment

  I am using Kwid from the last 2 years and the best class in this price range. It looks like a new shape SUV.

  ద్వారా vibhu
  On: Nov 17, 2019 | 21 Views
 • క్విడ్ సమీక్షలు అన్నింటిని చూపండి
space Image

రెనాల్ట్ క్విడ్ వీడియోలు

 • Renault KWID AMT | 5000km Long-Term Review
  6:25
  Renault KWID AMT | 5000km Long-Term Review
  Oct 03, 2019
 • Renault Kwid 2019 Spied On Test | Specs, New Features and More! #In2Mins
  1:47
  Renault Kwid 2019 Spied On Test | Specs, New Features and More! #In2Mins
  May 13, 2019
 • Renault Kwid AMT : First Impressions : PowerDrift
  5:9
  Renault Kwid AMT : First Impressions : PowerDrift
  Nov 29, 2016
 • 2016 Renault Kwid 1.0 : First Impressions : PowerDrift
  7:45
  2016 Renault Kwid 1.0 : First Impressions : PowerDrift
  Aug 29, 2016
 • Renault KWID SCE & Easy R : First Impressions : PowerDrift
  3:20
  Renault KWID SCE & Easy R : First Impressions : PowerDrift
  Feb 05, 2016

రెనాల్ట్ క్విడ్ రంగులు

 • ఎలక్ట్రిక్ blue
  ఎలక్ట్రిక్ నీలం
 • fiery red
  ఫైరీ ఎరుపు
 • moonlight silver
  వెన్నెల సిల్వర్
 • zanskar blue
  zanskar నీలం
 • outback bronze
  అవుట్‌బ్యాక్ కాంస్య
 • cool white
  చల్లని తెలుపు

రెనాల్ట్ క్విడ్ చిత్రాలు

 • చిత్రాలు
 • రెనాల్ట్ క్విడ్ front left side image
 • రెనాల్ట్ క్విడ్ side view (left) image
 • రెనాల్ట్ క్విడ్ front view image
 • రెనాల్ట్ క్విడ్ grille image
 • రెనాల్ట్ క్విడ్ front fog lamp image
 • CarDekho Gaadi Store
 • రెనాల్ట్ క్విడ్ headlight image
 • రెనాల్ట్ క్విడ్ taillight image
space Image

రెనాల్ట్ క్విడ్ వార్తలు

రెనాల్ట్ క్విడ్ రహదారి పరీక్ష

Similar Renault KWID ఉపయోగించిన కార్లు

 • రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్టి
  రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్టి
  Rs1.8 లక్ష
  201553,525 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ఎల్
  రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ఎల్
  Rs1.9 లక్ష
  201632,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ఎల్
  రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ఎల్
  Rs2.35 లక్ష
  201726,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ఎల్
  రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ఎల్
  Rs2.35 లక్ష
  201619,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్టి
  రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్టి
  Rs2.4 లక్ష
  201630,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • రెనాల్ట్ క్విడ్ 1.0
  రెనాల్ట్ క్విడ్ 1.0
  Rs2.45 లక్ష
  201633,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • రెనాల్ట్ క్విడ్ 1.0 ఆర్ఎక్స్టి ఆప్షనల్
  రెనాల్ట్ క్విడ్ 1.0 ఆర్ఎక్స్టి ఆప్షనల్
  Rs2.47 లక్ష
  201810,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి
 • రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ఎల్
  రెనాల్ట్ క్విడ్ ఆర్ఎక్స్ఎల్
  Rs2.5 లక్ష
  201511,000 Kmపెట్రోల్
  వివరాలను వీక్షించండి

Write your Comment పైన రెనాల్ట్ క్విడ్

406 వ్యాఖ్యలు
1
V
venkata kishore
Nov 5, 2019 7:56:54 PM

What is the downpaymwnt of renault kwid

  సమాధానం
  Write a Reply
  1
  R
  rao viren yadav
  Oct 2, 2019 11:12:19 AM

  Is Renault kwid come with BS VI

  సమాధానం
  Write a Reply
  2
  A
  ajit menon
  Oct 3, 2019 3:27:53 PM

  No, the Kwid facelift is still powered by a BS4 engine

   సమాధానం
   Write a Reply
   1
   N
   naresh shah
   Jun 18, 2019 11:55:53 AM

   Renault kwid has proved itself an excellent city car with all the safety features and very easy manoeuvre leaing to a very accurate driving at minimum cost. So we are going to buy it.....nareshshah55@rediffmail

    సమాధానం
    Write a Reply
    space Image
    space Image

    రెనాల్ట్ క్విడ్ భారతదేశం లో ధర

    సిటీఎక్స్ షోరూమ్ ధర
    ముంబైRs. 2.93 - 5.02 లక్ష
    బెంగుళూర్Rs. 2.93 - 4.99 లక్ష
    చెన్నైRs. 2.93 - 5.02 లక్ష
    హైదరాబాద్Rs. 2.93 - 5.02 లక్ష
    పూనేRs. 2.93 - 5.02 లక్ష
    కోలకతాRs. 2.93 - 5.02 లక్ష
    కొచ్చిRs. 2.96 - 5.05 లక్ష
    మీ నగరం ఎంచుకోండి

    ట్రెండింగ్ రెనాల్ట్ కార్లు

    • ప్రాచుర్యం పొందిన
    • రాబోయే
    ×
    మీ నగరం ఏది?