హోండా బ్రియో 2015 భారతదేశం యొక్క ఉత్తమ నిర్మిత కారుగా వెలువడింది
హోండా బ్రియో కోసం nabeel ద్వారా డిసెంబర్ 03, 2015 03:58 pm ప్రచురించబడింది
- 16 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
వారి తాజా అధ్యయనంలో, J.D. పవర్ భారతదేశంలో గత 5 సంవత్సరాలలో కార్ల తయారీ నాణ్యత ఎలా గణనీయంగా మెరుగైనది అని చూపిస్తుంది. ఈ అధ్యయనం ఎనిమిది వాహన విభాగాలలో లోపాలు 200 పైగా సమస్య లక్షణాలు వంటి అంశాలను కవర్ చేస్తుంది. ఈ అధ్యయనం ఇప్పుడు 19వ సంవత్సరంలో ఉంది మరియు J.D.పవర్ 2015 భారతదేశం ప్రారంభ నాణ్యత స్టడీ SM (IQS) అని పిలవబడుతుంది. ఇది నవంబర్ 2014 మరియు జూలై 2015 మధ్య ఒక కొత్త వాహనం కొనుగోలు చేసిన 8,438 వాహన యజమానులు నుండి అంచనాల ఆధారంగా రూపొందించబడింది. ఈ అధ్యయనం 17 తయారీల నుండి 69 వాహనం నమూనాలను కలిగి ఉంది. ఈ అధ్యయనం భారతదేశం అంతటా 30 నగరాల్లో మే 2015 నుండి సెప్టెంబర్ 2015 వరకు జరిగినది. ఇది యాజమాన్య మొదటి రెండు నుండి ఆరు నెలల్లో వారి కొత్త వాహనం సమస్యలు వలన యజమానులు ఎదుర్కొన్న సమస్యలను కొలుస్తుంది మరియు ఎనిమిది వాహనం కెటగిరీలు కవర్ చేసి 200 లకు పైగా సమస్య లక్షణాలను పరిశీలిస్తుంది.
- ఇంజిన్ అండ్ ట్రాన్స్ మిషన్
- HVAC
- డ్రైవింగ్ అనుభవం
- వాహనం ఎక్స్టీరియర్
- ఫీచర్స్, నియంత్రణలు మరియు డిస్ప్లేలు
- వాహనం అంతర్భాగం
- సీట్లు
- ఆడియో, వినోదం మరియు నావిగేషన్
అన్ని సమస్యలు 100 వాహనాలు శాతానికి లెక్కించబడినవి. తక్కువ pp స్కోర్ ఉంటే తక్కువ సమస్యలు ఉన్నట్లు మరియు మంచి నాణ్యత కలిగి ఉన్నట్టు అర్ధం. pp100 లో 52 శాతం లోపాలు సంబంధించిన సమస్యలు ఉంటాయి, ఇవి 2011 నుండి 26 pp100 తగ్గింది. డిజైన్ సంబంధిత సమస్యలు, 2011 లో 38pp 100 నుండి తగ్గి ఇప్పుడు 36 pp100 ఉంది.
ర్యాంకింగ్స్ ( Table)
విభాగం | విన్నర్ | పాయింట్స్ |
ఎంట్రీ కాంపాక్ట్ సెగ్మెంట్ | హ్యుందాయి ఇయాన్ | 78 PP100 |
కాంపాక్ట్ సెగ్మెంట్ | హ్యుందాయి i10 | 83 PP100 |
అప్పర్ కాంపాక్ట్ సెగ్మెంట్ | హోండా Brio | 41 PP100 |
ప్రీమియం కాంపాక్ట్ సెగ్మెంట్ | హ్యుందాయి ఎలీట్ i20/ ఏక్టివ్ | 61 PP100 |
ఎంట్రీ మిడ్ సైజ్ సెగ్మెంట్ | టొయోటా ఇతియోస్ | 82 PP100 |
మిడ్ సైజ్ సెగ్మెంట్ | హోండా సిటీ | 68 PP100 |
MUV/ MPV సెగ్మెంట్ | టొయోటా ఇన్నోవా | 44 PP100 |
SUV | ఫోర్డ్ ఎకో స్పోర్ట్ | 75 PP100 |
* తక్కువ PP100 రేటింగ్ :: బెటర్ క్వాలిటీ
తమ వాహనంలో ఊహించుకున్న సమస్యలు కన్న తక్కువగా ఉన్న వారిలో 71% మంది ఆ వాహనాన్ని వాళ్ళ కుటుంభ సభ్యులకు మరియు స్నేహితులకు సూచిస్తారు. వాహనంలో అనుకున్న దాని కన్నా ఎక్కువ సమస్యలు అనుభవించిన వారిలో 34% మంది ఆ వాహనన్ని వాళ్ల కుటుంభ సభ్యులకు మరియు స్నేహితులకు సూచిస్తారు.
"పరిశ్రమ మొత్తం గణనీయంగా లోపాలు తగ్గించి వాహనాలు నాణ్యత మెరుగుపరిచేందుకు ముఖ్యమైన నవీకరణలు చేస్తుంది. ఇది స్పష్టంగా ఇప్పటి భారత వాహన తయారీదారుల యొక్క నైపుణ్యతను తెలియజేస్తుంది. ఈ ప్రారంభ సమస్యలు యొక్క అవగాహన వినియోగదారుల యొక్క వాడుక నిడివి మరియు అనుభవాల యొక్క పురోభివృద్ధిని మరియు బ్రాండ్ పట్ల వారి సత్సంభందాలను మెరుగుపరుస్తుంది. అందువలన వాహన తయరీదారులు నాణ్యత, డిజైన్ సంభందిత ప్రమాణాలు మెరుగు పరచుకోవడం ద్వారా వినియోగదారులకు ఉత్తమమైన వాహన అనుభవం మరియు నమ్మకాన్ని అందించడం పై దృష్టి సారించాలి. నమ్మకం, నాణ్యత మరియు స్టయిలింగ్ అనేవి వాహనాన్ని ఎంచుకొనేందుకు దోహదపడే కీలక అంశాలు మరియు వినియోగదారులు కొనుగోలు చేసుకున్న తరువాత మొదటి ఆరు నెలల్లోనే వాహన సమస్యలు ఎదుర్కొన్నట్లైతే పునఃకొనుగోలు పై చెడ్డ ప్రభావం చూపిస్తుంది." అని సింగపూర్, J.D. పవర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, మోహిత్ అరోరా తెలిపారు.
ఇంకా చదవండి
0 out of 0 found this helpful