హ్యుందాయ్ ఐ20

` 5.2 - 9.4 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

హ్యుందాయ్ ఇతర కారు మోడల్లు

 
*Rs

హ్యుందాయ్ ఐ20 వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

హ్యుందాయ్ ఎలీట్ ఐ20


ముఖ్యాంశాలు


జనవరి 30, 2016: హ్యుందాయ్ సంస్థ ఎలీట్ ఐ20 యొక్క నవీకరించిన వెర్షన్ ను రూ. 5.36 లక్షల ధర వద్ద ప్రారంభించబడింది. హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 ప్రొజక్టర్ హెడ్ల్యాంప్స్, కార్నరింగ్ లైట్లు మరియు LED DRLs ఇవన్నీ కూడా ఆస్తా(O)లో ప్రామాణికంగా అందించబడతాయి. దక్షిణ కొరియాకు చెందిన కార్ల తయారీదారుడు గత నెలలో బాగా అమ్మకాలు చేయబడిన మారుతి బాలెనో కి పోటీగా ఈ కారుని పునఃరుద్ధరించింది. 2016 హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 రాబోయే 2016 భారత ఆటో ఎక్స్పోలో ప్రదర్శించబడనుంది. ఇది హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 N హాట్ హాచ్ తో కలిసి ఉండబోతుంది.

అవలోకనం


పరిచయం


ఇది ఈ రోజుల్లో రోడ్డుపైన సులభంగా ప్రయాణించగల సురక్షితమైన వాహనం అని చెప్పవచ్చు. హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 ప్రజల కారు, ఈ వాహనం నాణ్యత మరియు ధర మధ్య సమతుల్యతను కలిగి ఉండి మధ్య తరగతి కుటుంబీకులకు తగినట్టుగా ఉంటుంది. ఈ కొత్త వెర్షన్ బాహ్య భాగాల పరంగా రోడ్డు పైన వెల్లేటపుడు చూపరులను ఆకట్టుకుంటుంది మరియు లో క్రమబద్ధీకరించిన ప్రొఫైల్ తో ముందరి భాగంలో మరింత ఉత్తేజభరితమైన డిజైన్ ని కలిగి ఉంది. దీనిలో అంతర్భాగాలు కూడా ప్రయాణికులు నచ్చే విధంగా ఉంటాయి. ఇది చాలా విశాలమైన వాహనం మరియు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలో 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.4 లీటర్ డీజిల్ వినియోగదారులు ఎంచుకొనేందుకు అందుబాటులో ఉంటాయి. ఈ వాహనంలో 'ఎరా' నుండి మొదలయ్యి సంపూర్ణంగా కూర్చబడిన 'ఆశ్టా (O)' వరకు 6 వేరియంట్ స్థాయిలు అందుబాటులో ఉన్నాయి.

Image1

అనుకూలతలు:1. ఈ వాహంలో అత్యుత్తమమైన అంతర్భాగాలు అందించబడుతున్నాయి, జర్మన్ వాళ్ళ తరువాత ఇది అత్యుత్తమ అంతర్భాగాలను కలిగి ఉన్న రెండవ వాహనం.
2.దీనిలో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ వంటి అత్యుత్తమమైన లక్షణాల జాబితా అందించబడుతుంది.
3.హ్యుందాయి సంస్థ విస్తృతంగా సేవలందించే నెట్వర్క్ కలది.

ప్రతికూలతలు1.దీనిలో మధ్యస్థమైన పెట్రోల్ ఇంజన్ ఉంది, ఇంకా అద్బుతంగా ఉండుతుంటే బాగుండేది.
2. పోలో, బాలెనో మరియు జాజ్ వాహనాలలో ఆటోమెటిక్ వేరియంట్స్ అందించబడినట్లు దీనిలో ఆటోమెటిక్ వేరియంట్స్ లేవు.
3. అధిక వేగం వద్ద కావలసినటువంటి స్టీరింగ్ అందించబడలేదు.

అద్భుతమైన లక్షణాలు1. ఈ వాహనంలో టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థ మృధువైనది మరియు ఉపయోగించడానికి సులభంగా ఉంటుంది. బాలెనో కంటే కాస్త మెరుగ్గా కూడా ఉంటుంది.
2. దీనిలో 16 అంగుళాల అలాయ్ వీల్స్ అత్యద్భుతంగా ఉన్నాయి. చూడండి!

అవలోకనం


ఇది ఈ రోజుల్లో రోడ్డుపైన సులభంగా ప్రయాణించగల సురక్షితమైన వాహనం అని చెప్పవచ్చు. హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 ప్రజల కారు, ఈ వాహనం నాణ్యత మరియు ధర మధ్య సమతుల్యతను కలిగి ఉండి మధ్య తరగతి కుటుంబీకులకు తగినట్టుగా ఉంటుంది. ఈ కొత్త వెర్షన్ బాహ్య భాగాల పరంగా రోడ్డు పైన వెల్లేటపుడు చూపరులను ఆకట్టుకుంటుంది మరియు క్రమబద్ధీకరించిన ప్రొఫైల్ తో ముందరి భాగంలో మరింత ఉత్తేజభరితమైన డిజైన్ ని కలిగి ఉంది. ఇదిలా ఉండగా దాని లోపలి వాతావరణం ప్రయాణికులకు వారి ప్రయాణం అంతటా ప్రశాంతంగా ఉంచుతుంది మరియు వినియోగదారులు ఈ వాహనంలో ఉన్న సౌలభ్య మరియు వినోద లక్షణాలతో చాలా సంతృప్తిగా ఉన్నారు. ఇది చాలా విశాలమైన వాహనం మరియు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలో 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.4 లీటర్ డీజిల్ వినియోగదారులు ఎంచుకొనేందుకు అందుబాటులో ఉంటాయి. దీనిలో ఇంజిన్ యొక్క ఆధిపత్యాన్ని నియంత్రించే విధంగా బ్రేకింగ్ మరియు చాసిస్ అమరిక అందించబడడం ప్రయాణికులకు ఒక శుభవార్త! ఈ వాహనంలో 'ఎరా' నుండి మొదలయ్యి సంపూర్ణంగా కూర్చబడిన 'ఆశ్టా (O)' వరకు 6 వేరియంట్ స్థాయిలు అందుబాటులో ఉన్నాయి.

బాహ్యభాగాలు


ఇది దాని విభాగంలో చూడడానికి చాలా అద్భుతమైన వాహనం, ఈ విషయాన్ని చాలా మంది సమ్మతిస్తారు. ఈ కారు ప్రారంభించబడిన దగ్గర నుండి చాలా అభివృద్ధి చెందింది. మొత్తంగా ఈ వాహనం చాలా స్పష్టమైన మరియు పదునైన ప్రొఫైల్ స్పోర్టీనెస్ ని కలిగి ఉంది.

Image2

ఇది ఒక ఉగ్రమైన రూపన్ని కలిగి ఉంది మరియు ప్రక్కభాగంలో పదునైన హెడ్ల్యాంప్స్ తో మరింత ఆకర్షణీయంగా ఉంటుంది. అదేవిధంగా ముందరిభాగంలో ఒక భారీ షడ్భుజి ఆకారపు గ్రిల్ అందించబడుతుంది. మీరు గ్రిల్ ని గనుక దగ్గర నుండి చూసినట్లయితే నలుపు బ్యాక్గ్రౌండ్ మధ్యలో క్రోం చేరికలు గుర్తించవచ్చు.

Image3jpg

కారుకి దిగువ భాగంలోనికి వస్తే ఎయిర్డ్యాం మొత్తం నలుపు రంగులో ఉంది మరియు ఎయిర్డ్యాం మూలల ఫాగ్ల్యాంప్స్ ఉన్నాయి. శరీర రంగు బంపర్స్ ముఖ భాగాన్ని మరింత శ్రావ్యంగా కనిపించేలా చేస్తాయి. దీనిలో పెద్ద బోనెట్ సూక్ష్మ శరీరం పంక్తులను కలిగి ఉంది మరియు బంపర్ చుట్టూ బాడీ వక్రతలు అందించబడి ఉన్నాయి.

image4

ఈ కారులో ముందరిభాగం యొక్క తీరు ప్రవహించే విధంగా ఉంటుంది ప్రక్క భాగంలో దట్టమైన వీల్ ఆర్చులు ప్రవాహంలా ఉంటాయి.


image5

దీనిలో ఉండే క్రోం చేరికలు కలిగిన డోర్ హ్యాండిల్స్ ప్రతీ ఒక్కరిని ఆకట్టుకొనే విధంగా ఉంటాయి. ఇవి చాలా ఆకట్టుకొనే విధంగా ఉంటాయి. శరీర రంగు అద్దాలు విలక్షణంగా రూపొందించబడి చిత్రంలో లోకి ఏకీకృతం అయినట్టుగా ఉంటాయి. మీరు అధిక శ్రేణి వేరియంట్లలోనికి వెళ్ళినట్లయితే మిమ్మల్న్ని డీమండ్ కట్ అలాయ్ వీల్స్ చాలా ఆకర్షిస్తాయి.

image6

బ్లాక్డ్ ఔట్ సి పిల్లర్ తో పాటు ఫ్లోటింగ్ రూఫ్లైన్ చాలా ఆకర్షణీయంగా అద్భుతంగా ఉంది. సి- పిల్లర్ మీద మాట్టే నలుపు కి బదులుగా గ్లోస్ బ్లాక్ అందించబడింది. ఇది మనం అనుకున్నదానికన్నా అద్భుతంగా కనిపిస్తుంది!

image7

వెనుక భాగానికి వెళితే నాజూకైన టెయిల్ లైట్స్ బూట్ ప్యాక్ వైపుగా వెళ్ళి ఒక స్థిరమైన లుక్ ని ఇస్తాయి. దీనిలో టెయిల్ ల్యాంప్స్ LED సెటప్ తో నిజంగా ఖరీదైనవిగా ఉంటాయి. దీని బట్టి వెనుక ప్రొఫైల్ కి వెనుక కెమెరా అమర్చబడి ఉండడం చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనిలో చిహ్నం క్రింద కెమేరా అమర్చబడి అసహజంగా కనిపిస్తోంది!

image8

వెనుక భాగానికి వెళితే నాజూకైన టెయిల్ లైట్స్ బూట్ ప్యాక్ వైపుగా వెళ్ళి ఒక స్థిరమైన లుక్ ని ఇస్తాయి. టెయిల్ గేట్ మధ్యలో హ్యుందాయ్ మార్క్ అందరి మనస్సులో ఒక ముద్ర వేసుకుంటుంది.

image9

Table1

Table 2

అంతర్గత భాగాలు


ఎలైట్ ఐ 20 లోనికి వెళ్ళడం సాపేక్షంగా సులభమైన వ్యవహారం. ఎలీట్ ఐ20 కొద్దిగాతక్కువ ఎత్తుని కలిగి ఉంటుంది, అనగా క్యాబిన్ లోపలకి వెళితే కూర్చోవలసి ఉంటుంది. ఈ వాహనం లోపలికి వెళ్ళడం మరియు బయటకి రావడం చాలా సులభంగా ఉంది. దీని డోర్లు సులభంగా ఉంటాయి మరియు విస్త్రుతంగా ఉంటాయి.

image10

అంతర్భాగాలు ముందు వెర్షన్ లో లేత గోధుమరంగు మరియు బ్లాక్ కలర్ స్కీమ్ అందించబడుతుంది. డాష్బోర్డ్ యొక్క దిగువ భాగం నలుపు రంగులో అందించబడుతుంది మరియు విండో స్క్రీన్ యొక్క ఎగువ భాగం లేత గోధుమరంగులో అందించబడింది.

image11

గేర్ నాబ్, పార్కింగ్ బ్రేక్ మరియు లోపల డోర్ హ్యాండిల్స్ పైన మెటల్ చేరికలు భిన్నంగా కనిపిస్తున్నాయి.


image12

ఈ వాహనంలో డాష్బోర్డ్ రెండు మూలలలో ప్రత్యేకంగా రూపొందించిన ఏ సి వెంట్లతో మరియు ఒక అధునాతన సెంటర్ కన్సోల్ తో అద్భుతంగా రూపొందించబడింది. అంతర్భాగంలో డోర్ కి డోర్ కి మధ్య ఉన్న లేత గోధుమ రంగు చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ రంగు రాప్ భాగం నుండి పైకి వచ్చి ఆకర్షణీయంగా కనిపిస్తుంది.

image13

సెంటర్ కన్సోల్ 7-అంగుళాల టచ్స్క్రీన్ సమాచార వినోద వ్యవస్థతో అందించబడుతుంది. ఈ 7-అంగుళాల యూనిట్ అన్ని ఆడియో ఇన్పుట్లకు మరియు వీడియోలు ప్లే చేసేందుకు మద్దతు ఇస్తుంది.

image14

image15

క్లైమేట్ కంట్రోల్ దిగువ భాగంలో నీలి రంగు ప్రకాశంతో స్లెండర్ స్క్రీన్ అందించబడుతుంది. కన్సోల్ క్రింద ఒక అధునాతన నిల్వా స్థలం అందించబడి ఫోన్లు మరియు స్పేర్ పార్ట్స్ పెట్టుకొనేందుకు సులభంగా ఉంటుంది. ఇంకా దీనిలో డ్యుయల్ 12V పవర్ సాకెట్లు, USB మరియు ఒక ఆక్స్-ఇన్ పోర్ట్ వంటి అంశాలు ప్రయాణికులకు సౌకర్యాన్ని అందిస్తాయి.

image16

దీనిలో స్టీరింగ్ వీల్ హ్యుందాయి సంస్థ యొక్క ప్రత్యేకతగా ఉంటుంది. దీనిని ఒక వైపు మాత్రమే సర్ద్దుబాటు చేసుకోగలరు. ఇది చాలా బలిష్టంగా మరియు సులభంగా పట్టుకొనే విధంగా ఉంటుంది మరియు ముఖ్యంగా అగ్ర శ్రేణి వేరియంట్లలో ఇది లెథర్ తో చుట్టబడి ఉంటుంది. ఈ స్టీరింగ్ వీల్ పైన మ్యూజిక్ మరియు కాల్స్ నియంత్రణలు అమర్చబడి ఉన్నాయి.

image17

ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చాలా చిన్నదిగా ఉంది మరియు తెల్లని కాంతి నేపధ్యంతో ఉంది. టాకొమీటర్ మరియు స్పీడో స్పీడోమీటర్ మల్టీ ఇంఫర్మేషన్ డిస్ప్లే లో ఉంటాయి. అయితే మల్టీ ఇంఫర్మేషన్ డిస్ప్లే ట్రిప్ మీటర్లు మరియు సగటు సామర్థ్యం వంటి ప్రాథమిక అంశాలను కలిగి ఉంటుంది. దీనిలో డిస్టెన్స్ టు ఎంప్టీ రీడింగ్ కూడా అందించబడుతుంది.

image18

వాహనం యొక్క సీటింగ్ అమరిక చాలా సౌకర్యవంతంగా ఉంటుంది మరియు వినియోగదారులు దీనిపైన ఖచ్చితంగా ఎటువంటి పిర్యాదులు ఇవ్వరని నమ్మకంగా ఉన్నాము. ఈ సీట్లు ముందర మరియు వెనుక చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. డ్రైవర్ యొక్క సీటు ఎత్తుని సర్ద్దుబాటు చేసుకోవచ్చు మరియు ఒక సౌకర్యవంతమైన స్థనాన్ని అందిస్తాయి. హ్యాండ్ రెస్ట్లు మరియు హెడ్ రెస్ట్లు మరియు అదేవిధంగా డ్రైవర్ యొక్క సౌకర్యం కోసం అందించబడతాయి.

image19

దీని యొక్క వెనుక సీట్లు ఈ విభాగంలో అత్యంత విశాలంగా ఉంటాయి. స్టార్టర్స్ కోసం వ్వ్ పోలో కంటే చాలా బెటర్ గా ఉంటాయి. అదేవిధంగా దీనిలో లెగ్రూం మరియు షోల్డర్ రూం చాలా ఉదారంగా ఉంటాయి. అయితే, వాలుగా ఉండే రూఫ్లైన్ విశాలమైన హెడ్రూం ని అందిస్తుంది. దీనిలో మధ్య సీటు ఉండవలసిన అవసరం లేదు, ఎందుకంటే హ్యుందాయి ఎలీట్ ఐ20 అనగానే 4-సీటర్ అని అనిపిస్తుంది. ఎలీట్ ఐ20 యొక్క అంతర్భాగాలు లక్షణాలు, స్పేస్ మరియు నాణ్యత మధ్య అందమైన సంతులనంగా ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఈ విభాగంలో చాలా అద్భుతంగా ఉంటుంది.

పనితీరు


డీజిల్


ఈ వాహనంలో ఇది ఉండాల్సిన ఇంజిన్! దీనిలో 1.4 లీటర్ మోటార్ మునుపటి తరంతో పోలిస్తే పెద్దగా ఏమీ మారలేదు. పవర్ డెలివరీ సరళంగా ఉంటుంది మరియు టర్బో-లాగ్ మూసివేయబడి ఉంటుంది. అలా అని పూర్తిగా టర్బో లాగ్ లేదని చెప్పడం లేదు, 1.3 లీటర్ DDIS మోటార్ లో ఉన్నటువంటి విధంగా మరీ అంత ఎక్కువగా ఉండదు. ఈ ఇంజిన్ తో సిటీ డ్రైవ్ చాలా అద్భుతంగా ఉంటుంది మరియు ట్రాఫిక్ లో ఈ వాహనం చాలా సునాయాశంగా ముందుకు వెళుతుంది. హైవే మీద ఈ ఇంజిన్ 120 కి.మీ / గం వెళ్ళగలదు. కాకపోతే ఈ ఇంజిన్ పోలో యొక్క డీజిల్ మిల్లు వలే అంత అద్భుతంగా ఉండదు. కానీ ఎవరైతే సౌకర్యవంతమైన వాహనం కావాలనుకుంటారో వారికి ఇది సరైనది అని చెప్పవచ్చు.

image20

Table3

పెట్రోల్


పెట్రోల్ వేరియంట్ కొరకు 1197cc స్థానభ్రంశం ఇచ్చే 1.2-లీటర్ కప్పా VTVT ఇంజన్ అందించబడి ఉంటుంది. ఇది 2012 లో తిరిగి విడుదల చేయబడిన నమూనా యొక్క వారసత్వంగా వచ్చిన వెర్షన్ కానీ ఇది చిన్న సర్ద్దుబాటులతో ఉంటుంది. ఈ వాహనం అధిక వేగంతో వెళ్ళినపుడు ఈ మోటార్ ఎక్కువగా పనిచేస్తుందా అనే భావన కి మేము ఏమీ చేయలేము. ఈ వాహనం 5-స్పీడ్ గేర్బాక్స్ తో అందించబడుతుంది మరియు అధిక వేగాలప్పుడు సులభమైన డ్రైవింగ్ ని అందిస్తుంది.

image21

Table4

రైడ్ మరియు హ్యాండిలింగ్


మునుపటి వెర్షన్ తో పోలిస్తే, ఈ వాహనం రైడ్ నాణ్యత మరియు సౌకర్యం పరంగా కొంచెం మెరుగుపడింది. ఇది అసమాన రోడ్లపై కూడా సులభంగా ప్రయాణించేలా చేస్తుంది మరియు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ ఎలీట్ వాహనంలో ప్రయాణం చాలా అద్భుతంగా ఉంటుంది. హ్యుందాయ్ యొక్క 'ఎగిరి పడే' స్వభావం ఐ20 లో చాలా ఎక్కువగా ఉంటుంది.

దీని యొక్క చాలా అద్భుతంగా మరియు చక్కగా ఉంది. స్టీరింగ్ లాక్ చేయడం ఒక సులభమైన వ్యవహారం. నగరం లోపల తక్కువ బరువున్న స్టీరింగ్ వీల్ ని ఖచ్చితంగా అందరూ ఇష్టబడతారు. అయితే, ఇది అధిక స్పీడ్ లలో వెళ్ళినపుడు చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. బ్రేకింగ్ విషయానికి వస్తే కొంచెం నిరుత్సాహకరమైన విషయం ఏమిటంటే సంస్థ దీని యొక్క వెనుక డిస్క్ బ్రేకులను డ్రంస్ తో భర్తీ చేసింది. అయితే ముందు డిస్కులను కలయిక మరియు వెనుక డ్రంస్ మరియు మలుపుల దగ్గర దీని నిర్వహణ చాలా స్మూత్ గా ఉంటుంది.

image22

భద్రత


హ్యుందాయి సంస్థ ఈ వాహనంలో అద్భుతమైన భద్రత లక్షణాలను కలిగి ఉంది. ఇంకో విధంగా చెప్పాలంటే కొన్ని లక్షణాలు అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే ఉన్నాయి. కొత్త ఎడిషన్ కోసం, ద్వంద్వ ఎయిర్బ్యాగ్స్ మొత్తం ట్రిమ్ పరిధి అంతటా అందించబడుతుంది మరియు నిస్సందేహంగా ప్లస్ పాయింట్. ఇంకా దీనిలో ఏబిఎస్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, రేర్ కెమెరా, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ మరియు ఎలక్ట్రోక్రోమిక్ వెనుక వీక్షణ ప్రదర్శన వంటి భద్రతా లక్షణాలు అందించబడ్డాయి. ఇదికాకుండా ముందరి ప్రయాణికులు ప్రీ టెన్ష్నర్ తో పాటుగా సీటుబెల్ట్లు, కీలెస్ ఎంట్రీ, ఒక టైమర్ తో పాటు వచ్చే ఒక వెనుక డీఫాగర్ మరియు హెడ్ల్యాంప్ ఎస్కార్ట్ విధులతో కూడా అందించబడుతుంది. దీనిలో ఇంకో భద్రతా లక్షణం ఇంజిన్ ఇమ్మొబలైజర్ అందించబడి డ్రైవర్ యొక్క బయాన్ని తగ్గిస్తుంది.

image23

Table5

వేరియంట్


ఈ వాహనంలో ఎరా, మాగ్నా, స్పోర్ట్జ్, స్పోర్ట్జ్(O), ఆస్తా మరియు ఆస్తా(O) అను 6 వేరియంట్స్ పొందవచ్చు. తక్కువ శ్రేణి వేరియంట్లు తక్కువ ధరకి ఇవ్వబడనున్నాయి, కాని తగ్గించిన లక్షణాల జాబితా అందించబడుతుంది. ఇంతలో, అగ్ర శ్రేణి వేరియంట్లు అనేక లక్షణాలతో అందించబడతాయి, కానీ అధిక ధర వద్ద అందించబడతాయి. ప్రారంభ వేరియంట్ ఎరా సెంట్రల్ లాకింగ్, స్మార్ట్ పెడల్, ద్వంద్వ ట్రిప్ మీటర్, డిజిటల్ గడియారం, తక్కువ ఇంధనం రిమైండర్, డోర్ అజార్ వార్నింగ్ మరియు అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ వస్తుంది. ఇంతలో మాగ్నా మరియు స్పోర్ట్జ్ 2 దిన్ ఆడియో సిస్టమ్, 1GB అంతర్గత మెమొరీ, బ్లూటూత్ సౌకర్యం, వెనుక ఏ.సి వెంట్లు మరియు చల్లగా ఉన్న గ్లోవ్ బాక్స్ వంటి అందమైన లక్షణాలు అందించబడుతున్నాయి. అగ్ర శ్రేణి వేరియంట్లు అయిన ఆస్తా మరియు ఆస్తా(O) వేరియంట్లు పూర్తిగా ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థ, ఒక వెనుక వైపర్ మరియు వాషర్, లగేజ్ ల్యాంప్, విద్యుత్ తో మడత వేయగల బయట వైపు మిర్రర్స్, పార్కింగ్ సెన్సార్ డిస్ప్లే మరియు ఒక ఆటో అన్లాక్ ఫంక్షన్ వంటివి అందించబడుతుంది. అధిక శ్రేణి వేరియంట్ల కోసం సౌకర్యం మరియు లగ్జరీ కోసం వెళ్ళలి అనుకుంటే మీకు ఇవి సరైన వేరియంట్స్ అని చెప్పవచ్చు. తక్కువ డబ్బుతో వాహనం కావాలనుకుంటున్నారా అప్పుడు ఈ వాహనంలో ఉన్న దిగువ శ్రేణి వేరియంట్లు సరైనవి అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ అగ్ర శ్రేణి మరియు దిగువ శ్రేణి వేరియంట్ల మధ్య ఉన్న వేరియంట్స్ మధ్య తరగతి వాళ్ళకి తగ్గట్టుగా ఉన్నాయి.

Table6

తుది విశ్లేషణ


ఐ 20 సుదీర్ఘ మార్గంలో ఉంది. ఇది అందంగా, బాగా స్టయిల్ గా, అనేక సౌకర్య లక్షణాలతో మరియు సహేతుకమైన ధరని కలిగి ఉంటుంది. అలానే దీనిలో అంత అద్భుతంగా లేని పెట్రోల్ ఇంజిన్, ఓవర్ ఎసిస్టెడ్ స్టీరింగ్ వీల్ మరియు తక్కువ శ్రేణి వేరియంట్లలో కొన్ని లక్షణాలు లేకపోవడం వంటి లోపాలు కూడా ఉన్నాయి. ఎలీట్ ఐ20 ఎవరైతే అద్భుతమైన మరియు సౌకర్యవంతమైన లక్షణాలు కావాలనుకుంటే వారికి ఇది సరైన వాహనం అని సులభంగా చెప్పవచ్చు.

image24