టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు మాట్లాడే విధంగా రూపొందించబడిన హోండా కార్స్!
హోండా సిఆర్-వ ి కోసం dinesh ద్వారా మార్చి 28, 2019 11:59 am ప్రచురించబడింది
- 23 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
-
కారును టెస్ట్ డ్రైవ్ చేస్తున్నప్పుడు దానిలో ఉండే టాకింగ్ కార్ ఇంటర్ఫేస్, తన స్వంత లక్షణాలను వివరించడానికి అనుమతిస్తుంది.
-
కొత్త ఇంటర్ఫేస్, కస్టమర్ యొక్క డ్రైవింగ్ నమూనా నుండి ట్రిగ్గర్ పాయింట్లను స్పష్టం చేస్తుంది మరియు కీ లక్షణాలను కూడా వివరిస్తుంది.
-
ఈ ఇంటర్ఫేస్ ను సిఆర్- వి తో మొదలు పెట్టాం, ఇది ఇతర హోండా మోడళ్లలో తరువాత ప్రవేశపెట్టబడుతుంది.
వినియోగదారుల యొక్క కారు- కొనుగోలు అనుభవాన్ని మెరుగుపరచడానికి, సి ఆర్- వి లో ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్ను హోండా సంస్థ ప్రవేశపెట్టింది. డబ్డ్ 'టాకింగ్ కార్' అను కొత్త ఇంటర్ఫేస్- కారు తన డ్రైవింగ్ నమూనా ఆధారంగా దాని లక్షణాలను డ్రైవర్కు వివరించడానికి అనుమతిస్తుంది.
'టాకింగ్ కార్' ఎలా పనిచేస్తుంది?
టాకింగ్ కార్ అనేది ప్రాథమికంగా ఒక మొబైల్ పరికరంలో ఇన్స్టాల్ చేయబడిన ఒక డిజిటల్ పరికరం, ఇది టెస్ట్ కారు యొక్క ఆడియో సిస్టమ్కు అనుసంధానించబడి ఉంటుంది. ఇంజన్ ప్రారంభించిన తర్వాత 'టాకింగ్ కార్' అప్లికేషన్ డ్రైవింగ్ ఆధారంగా ఇన్పుట్లను తీసుకుంటుంది మరియు కారు యొక్క కీలక లక్షణాల వివరణను ప్రారంభిస్తుంది.
మొదటిగా, టాకింగ్ కార్ ఇంటర్ఫేస్ సిఆర్- వి లో పరిచయం చేయబడుతుంది. అయితే, ఈ ఇంటర్ఫేస్ ను హోండా సంస్థ దాని ఇతర హోండా కార్లకు కూడా విస్తరించాలని యోచిస్తుంది.
-
2018 సిఆర్- వి పెట్రోల్ వర్సెస్ డీజిల్: మీరు దేనిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు?
'టాకింగ్ కార్' ఇంటర్ఫేస్ గురించి మరింత తెలుసుకోవడానికి. క్రింద అధికారిక పత్రికా ప్రకటన చదవండి:
హోండా కార్స్ ఇండియా, కొనుగోలుదారుల కోసం టెస్ట్ డ్రైవ్ కార్లలో 'టాకింగ్ కార్' యంత్రాంగాన్ని ఢిల్లీలో ఉన్న డీలర్షిప్లు నవంబర్ 28, 2018న పరిచయం చేసాయి. భారతదేశంలో ప్రీమియం కార్ల తయారీ సంస్థ లలో హోండా కార్స్ ఇండియా లిమిటెడ్- కస్టమర్ ఇంటర్ఫేస్ 'టాకింగ్ కార్' హోండా డీలర్షిప్లలో కస్టమర్ టెస్ట్ డ్రైవులలో అందించడం వలన అగ్ర స్థానంలో ఉంది. కొత్త ఇంటర్ఫేస్ కారు దాని సొంత లక్షణాలను వివరించడానికి కారును అనుమతిస్తుంది, అయితే వినియోగదారులు టెస్ట్ డ్రైవ్ను తీసుకుంటూ, వారి మొత్తం డ్రైవింగ్ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. మొదట అన్ని కొత్త సిఆర్- వి లకు పరిచయం చేయబడింది, ఈ ఇంటర్ఫేస్ త్వరలో ఇతర హోండా మోడళ్లకు కూడా విస్తరించబడుతుంది. టాకింగ్ కార్ ఇంటర్ఫేస్ కస్టమర్ యొక్క వాహనం డ్రైవింగ్ నమూనా నుండి ట్రిగ్గర్ పాయింట్లను స్పష్టం చేస్తుంది మరియు కీ లక్షణాలను కూడా వివరిస్తుంది. టెస్ట్ డ్రైవ్ల సమయంలో కారు యొక్క ముఖ్యమైన అంశాలను ప్రదర్శించే విధంగా మరింత ఆకర్షణీయమైన పద్ధతిలో ప్రామాణికమైన టెస్ట్ డ్రైవ్ అనుభవాన్ని అందించడానికి ఈ యాప్ డీలర్ సిబ్బందిని ప్రోత్సహిస్తుంది.
'టాకింగ్ కార్' అనే అంశంపై హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అండ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డైరెక్టర్ రాజేష్ గోయల్ మాట్లాడుతూ, "హోండా అమ్మకాలు మరియు సేవలలో కొనుగోలుదారులకు సంతోషకరమైన అనుభవాన్ని అందించే వినూత్న పరిష్కారాలను పరిచయం చేయడానికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది అని వివరించారు. అంతేకాకుండా, టెస్ట్ డ్రైవ్ అనేది కొనుగోలు ప్రక్రియలో ఒక కీలక భాగం. 'టాకింగ్ కార్' కాన్సెప్టు మా డీలర్షిప్లలో మా డిజిటైజేషన్ ప్రయత్నాలలో భాగం, ఇది కారు మరియు దాని లక్షణాలను వినియోగదారులు అర్ధం చేసుకోవడానికి విభిన్నమైన మరియు స్నేహపూరిత అనుభవాన్ని వినియోగదారులకు అందిస్తుంది అని వివరించారు.
'టాకింగ్ కార్' మొబైల్ అప్లికేషన్ డిజిటల్ పరికరంలో పొందుపరచబడింది, ఇది కారు యొక్క ఆడియో సిస్టమ్తో కాన్ఫిగర్ చేయబడి, జతచేయబడుతుంది. ఇంజన్ ప్రారంభించిన తర్వాత, 'టాకింగ్ కార్' అప్లికేషన్ స్పందన డ్రైవింగ్ ఆధారంగా ఇన్పుట్లను తీసుకుంటుంది మరియు కారు యొక్క కీలక లక్షణాలను వివరించడం ప్రారంభిస్తుంది. టాకింగ్ కార్ యాప్ లక్షణాల వివరాలను డ్రైవర్ తో తమ సమాచారాన్ని పంచుకుంటుంది.
ఇవి కూడా చదవండి: స్పెసిఫికేషన్ల పోలికలు: మహీంద్రా ఆల్టురిస్ జి4 వర్సెస్ స్కోడా కొడియాక్ వర్సెస్ హోండా సిఆర్- వి
మరింత చదవండి: హోండా సిఆర్ -వి ఆటోమేటిక్