ఫోర్డ్ ఎకోస్పోర్ట్

` 7.2 - 10.9 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

ఫోర్డ్ ఇతర కారు మోడల్లు

 
*Rs

ఫోర్డ్ ఎకోస్పోర్ట్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
అవలోకనం: దేశంలో ప్రస్తుతం ఉన్న అనేక కారుల ఉత్పత్తిదారులలో, అథ్యంత మన్నిక గల కంపెనీ ఫోర్డ్ అని చెపొచ్చు. ఈ కంపెనీ కి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు ఉన్నాయి మరియూ అన్ని దేశాలలోనూ దీనికి తిరుగులేని మార్కెట్ విలువ ఉంది. కారులని మన్నికగా తయారు చేయడమే కాకుండా, కొనుగోలుదారునికి ఆ తరువాత కూడా సర్వీసు విషయంలో ఎటువంటి కష్టం లేకుండా అందుబాటులో ఉండటం ఈ కంపెనీ యొక్క ప్రధాన లక్షణం. ఈ కారణంగానే భారత దేశంలో కూడా దీనికి అభిమానులు ఉన్నారు. విడుదల చేసిన ఎన్నో కార్లలో, దీని ఖాతాలో చేరిన మరో గొప్ప ప్రయోగం, ఈకో స్పొర్ట్ అని చెప్పాలి. దీనిని, 2013 లో ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడం జరిగింది. కారుని ఒక సరికొత్త వైవిద్యభరితమైన దిజైనుతో రూపొందించడం జరిగింది. కొత్తగా కనిపించడమే కాకుండా, డ్రైవు కూడా ఎంతో హాయిగా సాఫీగా సాగేట్టుగా వీలు కల్పించారు. సీట్లు చూడటానికీ మరియూ కూర్చోడానికి కూడా ఎంతో బావుంటాయి. పెట్రోలు మరియూ డీజిలు రెండిటిలోనూ ఈ కారుని అందించడం ఒక విశేషమైతే, దేశంలోనే తొలిసారిగా 1.0-లీటరు ఈకోబూస్ట్ అనే ఇంజిను ఈ కారు ద్వారా మొట్టమొదటి సారిగా ప్రవేశపెట్టడం జరుగుతోంది. వినోదం కోసం ఒక అధునాతనమైన మ్యూసిక్ సిస్టము అమర్చడం జరిగింది. ఇందులో, బ్లూటూత్ తో సహా అనేక ప్లేయర్లు అందించడం జరిగింది. వాహనం యొక్క రక్షణ కొరకై అనేక ఉపకరణాలు అమర్చడం వలన ఈ కారు ప్రయానికులు ప్రయాణించడానికి ఎంతో సురక్షితమని చెపొచ్చు. లోపల వాతావరణం ఆహ్లాదంగా ఉండేందుకు ఒక ఏసీ యూనిట్ ని అమర్చడంతో పాటుగా వాటి వెంట్స్ ని కూడా సరైన చోట్ల బిగించడం జరిగింది. మైలేజీ కూడా ఈ కారులో కలిసి వచ్చే విషయం. వైవిద్యమైన రంగులలో లభ్యమవ్వడమే కాకుండా ఈ కారుకి ప్రామాణికమైన వారెంటీని కూడా జత చేయడం జరిగింది. ఎన్నో సౌకర్యాలను ఇవ్వడంతో పాటుగా చూడటానికి కూడా ఆకర్షనీయంగా కనిపించడంతో, ఇది ఎన్నో కార్లకి పోటీగా నిలుస్తుంది అండంలో అతిశయోక్తి లేదు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ కారుకి ఆకర్షణీయమైన మైలేజీని అందించడం జరిగింది. మాన్యూల్ త్రాన్స్మిషను ఉన్న పెట్రోలు ఇంజిను రహదారులలో లీటరుకి 14 కిలోమీటర్లు ఇవ్వగా, సిటీ పరిసరాలో మాత్రం లీటరుకి 11 కిలోమీటర్లనే ఇస్తుంది. ఇక డీజిలు ఇంజిను విషయానికి వస్తే, రహదారులలో లీటరుకి 19.57 కిలోమీటర్లు మైలేజీని అందిస్తే, సిటీలో మాత్రం లీటరుకి 16 కిలోమీటర్లను మాత్రమే ఇవ్వగలదు. ఇక ఆటోమాటిక్ పెట్రోలు ఇంజిను ఐతే సిటీ దారులలో కిలోమీటరుకి 12.95 లీటర్లను ఇస్తే, రహదారులలో లీటరుకి 10 కిలోమీటర్లను ఇస్తుంది. అదే ఈకో బూస్ట్ పెట్రోలు ఇంజిను ఐతే 15.44 కిలోమీటర్లు రహదారులలోనా, మరియూ సిటీ లోపల ఐతే లీటరుకి 11 కిలోమీటర్లను అందించగలగడం విశేషం.

శక్తి సామర్థ్యం:


ఈ కారుకి ఈకో బూస్ట్ అనే ఇంజిను పెట్రోలు ఇంజిను అమర్చారు. ఇది 6000ఆర్పీఏం వద్ద 123బీహెచ్పీ ని 1400 నుండి 4500ఆర్పీఏం వద్ద 170ఏనెం ని ఉత్పత్తి చేస్తుంది మరియూ 999cc యొక్క దిస్ప్లేస్మెంట్ ని అందిస్తుంది. దీనికి ఫైవ్ స్పీడ్ మన్యూల్ త్రాన్స్మిషను తో జత చేయబడింది. వేరొక పెట్రోలు ఇంజిను కారుకి నాలుగు సిలిండర్ల పెటృఓలు ఇంజిను అమర్చారు. ఇది 1499cc డిస్ప్లేస్మెంట్ ని విడుదల చేయగలదు. ఇది 6300ఆర్పీఏం వద్ద 110బీహెచ్పీ ని మరియూ 4400ఆర్పీఏం వద్ద 140ఏనెం ని వడుదల చేస్తుంది. మరో పక్క డీజిలు కారుకి 1498cc డిస్ప్లేస్మెంట్ ని అందించే శక్తి ఉంది. ఇది 3750ఆర్పీఏం వద్ద 89.7బీహెచ్పీని మరియూ 2000 నుండి 2750ఆర్పీఏం వద్ద 204ఏనెం ని విడుదల చేస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ కంపెనీ దీనిని మొత్తం మూడు ఇంజన్లతో మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇవి 5-స్పీడ్ మరియు 6-స్పీడ్ మాన్యువల్ /ఆటోమేటిచ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఆప్షన్లతో వస్తుంది. దీని యొక్క ఎకోబూస్ట్ పెట్రోల్ మిల్లు, వాహనాన్ని దాదాపుగా 190 క్మ్ఫ్ వేగాన్ని దాటేందుకు సహకరిస్తూ, 100 క్మ్ఫ్ వేగాన్ని సుమారుగా 10 సెకన్లలో చేరేలా చేస్తుంది. అయితే, 1.5-లీటర్ పెట్రోల్ వెర్షన్లు దగ్గరదగ్గరగా 13.25 సెకన్లలో 100 క్మ్ఫ్ వేగాన్ని చేరుకోగా, ఇవి సుమారుగా 165 క్మ్ఫ్ గరిష్ట వేగాన్ని దాటుతాయి. మరో వైపు, దీని డీకిల్ వేరియంట్లు 175 క్మ్ఫ్ గరిష్ట వేగాన్ని సాధిస్తాయి. అలాగె, దాదాపుగా 13.2 సెకన్లలో 100 క్మ్ఫ్ వేగాన్ని చేరుతాయి.

వెలుపలి డిజైన్:


ఏ కారైనా మొదట చూసేందుకు బావుండాలి, ఆ తరువాతే వేరే విషయాలు నిర్ధారన చేసుకోడానికి వీలు ఉంటుంది. చూసీ చూడగానే ఏ చూపరులకైన ఆషర్యం కలిగించేంతగా ఈ వాహనాన్ని రూపొందించారు. ఒకొక్క రూపకాన్ని చూసినట్టైతే, ఉత్పత్తిదారులు ఎంత కష్టాన్ని కూర్చి దీనినీ తయారు చేసి ఉంటారో సులువుగా అవగతం అవుతుంది. ముందు వైపు ఉన్న గ్రిల్లు చూడటానికి ఎంతో విశాలంగా ఉండటంతో పాటుగా దాని మీద క్రోము పైంటు వేయడం వల్ల అది ఏంతో ఆకర్షణీయంగ కంపడుతుంది. దానిపైన కంపెనీ ఎంబ్లెం ని అమర్చడం జరిగింది. ఇంజినుకి గాలిని అందిస్తూ చల్లపరిచే ఏయిర్ డ్యాం కి ఇరువైపులా రెందు ఫాగ్ ల్యంఫ్స్ ని పెట్టడం జరిగింది. ఇవి మంచి వెలుతురుని అందించి డ్రైవరుకి రోడ్డు స్పష్టంగ కనిపించేందుకు సహాయపడతాయి. కారుకి ఇరువైపులా రెండు బాహ్య అద్దాలను జత పరచడమే కాకుండా, వాటికి టర్న్ బ్లింకర్స్ ని పొందు పరచారు. కారు యొక్క పైకప్పు మీద ఉన్న రూఫ్ రైల్స్ కి వెండి పూత పూయడంతో ఇది దీని రూపుకి మరింత శోభను చేకూరుస్తుంది. వెనుక వైపు నుండి కూడా ఇది అందంగానే కనపడుతుంది. అందుకు కారణం, వెనక విండ్ స్క్రీన్ కి ఒక సయిలర్ ను బిగించారు. ఇది విబిన్నమైన దిజైనులో అందించడమైంది. బంపర్ కి నలుపు రంగుతో హంగుని అందించగా, డిక్కీ తలుపుకి ఎక్స్ట్రా వీలుని అమర్చారు. వెనుక వైపు ఉన్న విండ్ స్క్రీన్ స్పష్టంగ ఉండటమే కాకుండా వైవిద్యమైన దిజైనుతో కూడా ఇవ్వబడటం విశేషం.

వెలుపలి కొలతలు:


మొత్తం పొడుగు 3999మ్మ్ గా ఉన్న్నందు వల్ల ఇది చూడడానికి ఎంతో పొదవుగా ఉనట్టు ఉండీ, చాలా పెద్ద కారులాగా కనిపిస్తుంది. వెడల్పు విషయానికి వస్తే, ఇది 1765మ్మ్ అందించడం జరిగింది. ఇక ఎత్తు విషయానికి వస్తే, ఇది ఎత్తైన కారు అనే చెప్పాలి. దీని మొత్తం ఎత్తు 1708మ్మ్ గా ఉంటుంది. 2520మ్మ్ యొక్క ఎంతో భారీ వీల్ బేస్ కలిగి ఉండటం వలన ఈ వాహనం లోపలి భాగం, అనగా, క్యాబిన్ లోపల బాగా ఖాళీ వచ్చి ప్రయాణికులు అందరు సౌకర్యవంతంగా కూర్చునేందుకు వీలు ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ ఐతే 200మ్మ్ గా నమోదు అయ్యింది.

లోపలి డిజైన్:


ఇది కాంపాక్ట్ SఊV అయినప్పట్టికీ దీని అంతర్గత క్యాబిన్ చాలా విశాలంగా ఉంటుంది. ఇందులో అమర్చబడిన సీట్లు ప్రయాణీకులకు ఎంతో సౌకర్యాన్ని ఇస్తాయి. వీటిని తదుపరి మంచి నాణ్యత గల కవర్లతో అందించారు. దీని కాక్పిట్ చాలా అందంగా రూపొందించబడింది. దాని డాష్బోర్డ్ డార్క్ బూడిద / వెండి మరియు చ్చార్కోల్ బ్లాక్ రంగులో వస్తుంది. దీనిని తదుపరి కొన్ని ఆధునిక పరికరాలతో పొందుపరచబడింది. అవి ఏంటంటే, స్టీరింగ్ వీల్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆC వెంట్లు మరి సెంటర్ క్లస్టర్ కూడా ఉంటుంది. డ్రైవర్ సీటుకు ఎత్తు సర్దుబాటు చేయగల ఫంక్షన్ ఉంది. దీని యొక్క శ్తీరింగ్ వీల్ ఇంకా గేర్ నాబ్ నాణ్యత గల లెదర్ తో చుట్టబడి ఉంది. మొత్తం క్యాబిన్ లో సుమారు 20 స్టూవేజ్ స్పేసెస్ ఉన్నాయి. ఇంతే కాకుండా, రెండు 12V పవర్ అవుట్లెట్లు కూడా వున్నాయి. అయితే, ముందు సీట్ల మ్యాప్ పాకెట్లు, సన్ గ్లాస్ హోల్డర్, ముందు ప్రయాణీకుడి సీటు క్రింద నిల్వ స్పేస్, 60/40 స్ప్లిట్ ఫంక్షన్ గల వెనుక సీటు వంటి అంశాలు కూడా ఇందులో వున్నాయి.

లోపలి సౌకర్యలు:


ఈ కాంపాక్ట్ SఊV ని కంపెనీ కొన్ని ఆసక్తికరమైన అంశాలతో కొనుగోలుదారులకు అందజేసింది. వేరియంట్ల ఆధారంగా, మాన్యువల్ ఇంకా ఆటోమేటిచ్ ఎయిర్ కండీషనింగ్ యూనిట్ ను అందిస్తుంది. ఈ సిస్టెం హీటర్ తో సహా వస్తుంది. దీని యొక్క స్టీరింగ్ కాలమ్ టిల్ట్ మరియు టేలీస్కోపిక్ సర్దుబాటు ఫంక్షన్లతో వస్తుంది. ముందు మరియు వెనుక వరుస సీట్లలో 12V పవర్ సాకెట్లు ఉన్నాయి. వాటితో ప్రయాణీకులు వారి మొబైల్ ఫోన్లను చార్జ్ చేసుకొవచ్చు. దీనికి విద్యుత్ సహాయంతో సర్దుబాటు చేయగల డోర్ అద్దాలు ఉన్నాయి. అవి తదుపరి టర్న్ ఇండికేటర్లతో బిగించబడి ఉన్నాయి. ఇంతే కాకుండా, ఈ వాహనం పవర్ విండోస్, సన్ గ్లాస్ హోల్డర్, బయట ఉష్ణోగ్రత డిస్ప్లే వంటి ఇతర అంశాలతో వస్తుంది.

లోపలి కొలతలు:


లోపల ఈ కారుకి మొత్తం ప్రయాణికులు అందరూ సాఫీగా కూర్చునే వీలుని కల్పించే విధంగా తీర్చిదిద్దడమైంది. దీని భారీ వీల్ బేస్ వలన ఇది సాధ్యమైందని చెప్పొచ్చు. మొత్తం అయిదుగురు పత్తేంత చోటు కల్పించడం జరిగింది. బూట్ స్పేస్ 346 లీటర్లు ఇవ్వగా, ఇందులో ఎంతో సామనుని పెట్టుకోవచ్చును. ఇందు వలన ఈ కారు దూర ప్రయాణాలకు ఎంతో సౌఖ్యంగా వుంటుంది అని చెపొచ్చు. వెనుక ఉన్న సీట్లు మడవడం వలన ఈ చొటు 705 లీటర్లకు పెరుగుతుంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ ప్రఖ్యాత కంపెనీ, ఈ వాహనాన్ని మొత్తం మూడు ఇంజన్లతో మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ మూడింటిలో, ఒకటి డీజిల్ మరియు రెండు పెట్రోల్ మిల్లులు కొనుగోలుదారులకు ఎంచుకొవడానికి అందుబాటులో ఉన్నాయి. ఇందులో 1.0-లీటర్ ఇకోబూస్ట్ పెట్రోల్ ఇంజన్ 999cc డిస్ప్లేస్మెంట్ సామర్థ్యం తో వస్తుంది. ఇది 123.28భ్ప్ గరిష్ట శక్తి మరియు 170ణ్మ్ టార్క్ ను ఇస్తుంది. ఇదిలా ఉండగా, ఇంకొక పెట్రోల్ మోటర్ కు 1499cc డిస్ప్లేస్మెంట్ సామర్థ్యం కలదు. ఈ 1.5-లీటర్ ఠి-VCఠ్ ఇంజన్ 110.46భ్ప్ శక్తి ఇంకా 140ణ్మ్ టార్క్ ను పంపిణీ చేస్తుంది. ఇది నాలుగు సిలిండర్లు, పదహారు కవాటాలతో బిగించబడి ఉంటుంది. మరో వైపు, కారు తయారీదారు దీనిని డీజిల్ మోటర్ తో కూడా కొనియోగదారులకు అందించారు. ఈ 1.5-లిటర్, 1498cc డీజిల్ మిల్లు ఢోఃC వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా ఉంటుంది. ఇది వాహనాన్ని నుమారుగా 180క్మ్ఫ్ గరిష్ట వేగాన్ని చేరడానికి సహకరిస్తుంది. ఇంతే కాకుండా, దీనిని మ్యానువల్ మరియు ఆటోమేటిచ్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఆప్షన్లతో అందించబడింది. ఇవి ఇంజన్ శక్తి ని ముందు చక్రాలకు అందిస్తుంది.

వీల్స్ పరిమాణం:


ఈ వహానం యొక్క వీల్ ఆర్చులని వేరియంట్ల ఆధారంగ ఉక్కు మరియు అల్లయ్ చక్రాలతో బిగించబడ్డాయి. వీటిని తదుపరి 15 మరియు 16 అంగులాల పరిమానం గల ట్యుబ్ లెస్ టైర్లతో అమర్చారు.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ కారులో ఎన్నో ఉపయోగకరమైన ఉపకరణాలు పొదుపరచి ఉన్నాయి. వినోదానికై ఇందులో మల్టీ ఫంక్షనల్ డిస్ప్లెయ్ ఇవ్వడంతో పాటుగా మిడిల్ మరియు టాప్ ఏండ్ వేరియంట్స్ కి 3.5 ఇంచ్ స్క్రీను అందించడం జరుగుతుంది. అంతే కాకుండా, ఇందులో అమర్చిన స్టీరిఒ యూనిట్ లో, ప్లేయరు మరియూ ఏంపీత్రీ ప్లేయరు అందుబాటులో ఉండడం జరుగుతుంది. రేడియో యూనిట్ కి ఏఫెం ఏఏం అందుబాటులో ఉన్నాయి. ఇంతే కాకుండా, ఇందులో యూఏస్బీ మరియూ ఔక్స్-ఇన్ ని పెట్టుకోగల పోర్ట్లను ఇవ్వడం జరిగిఒంది. క్యాబిన్ లో నాలుగు స్పీకర్లు ఇవ్వగా, అందులో రెండు ముందు వైపు అమర్చగా మరో రెండు వనక వైపు ఉన్న క్యాబిన్ కి బిగించడం జరిగింది. ఇవే కాకుండా, వినియోగదారుడు వారికి నచిన విధంగా ఈ కారుని మలుచుకునే అవకాసం కల్పించబడింది. అవసరానికి అనుగుణంగా అన్నో ఉపకరణాలు ఇందులో అమర్చుకోవచు. మురికి మట్టీ అంటకుండా ఫ్లోర్ మ్యాట్స్ ని పెట్టించుకోవచ్చు. బయటి నుండి మరింతగా అందంగా తీర్చిదిద్దుకోవడానికి గాను గ్రాఫిక్స్ వేయించుకోవచ్చు. వీటిని వినియోగదారుడు అహిక ధరకి కొనుగోలు చేయవచ్చును.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


దీని యొక్క ముందు ఆక్సిల్ ను ఇండిపెండెంట్ మెక్ఫెర్సన్ స్ట్రట్ తో పాటు కాయిల్ స్ప్రింగ్ మరియు యాంటి-రోల్ బార్ తో బిగించారు. అయితే దాని వెనుక ఆక్సిల్ సెమి-ఇండిపెండెంట్ ట్విస్ట్ బీం మరియు ట్విన్ గ్యాస్ ఇంకా షాక్అబ్జార్బర్లతో వస్తుంది. ఈ కాంపాక్ట్ SఊV యొక్క బ్రేకింగ్ సిస్టెం ను గమనిస్తే, దీని ముందు చక్రాలకు వెంటిలేటెడ్ మరియు వెనుక వాటికి డ్రమ్ బ్రేకులను అమర్చారు. ఇది యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ తో సహా వస్తుంది. ఇది దీని యొక్క బ్రేకింగ్ విధనాన్ని ఇంకా మెరుగుపరచడానికి సహకరిస్తుంది.

భద్రత మరియు రక్షణ:


ఈ కారు తయారీదారు ఇందులో కొన్ని ముఖ్యమైన భద్రతా అంశాలను అందించింది. డ్రైవర్ మరియు ఇతర ప్రయాణీకుల కోసం కొన్ని పరికరాలను అమర్చారు. ఇందులో ఎమర్జెన్సీ అస్సిస్ట్, ఫ్యుయల్ కంప్యూటర్ లో స్పీడ్ అలారం, ప్రమాదంలో ఆటోమేటిక్ గా అన్లాక్ అయ్యే డోర్లు, స్పేర్ చక్రం కోసం లాకింగ్ వీల్ నట్, ఇంకా ఎలెక్ట్రికల్ స్వింగ్ గేట్ రిలీజ్ ఉన్నాయి. ఇంతే కాకుండా, ఇందులో డ్రైవర్ మరియు ప్రయాణీకుల వైపు ఎయిర్బ్యాగ్స్, సైడ్ మరియు కర్టెన్ ఎయిర్బ్యాగ్స్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, అత్యవసర బ్రేక్ విపత్తు హెచ్చరిక ఇంకా 3-పాయింట్ సీటు బెల్టులు ముందూ వెనుకా అమర్చబడి ఉన్నాయి. ఈ వాహనాన్ని సరైన నియంత్రణలో వుంచేందుకు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, అత్యవసర బ్రేక్ అసిస్ట్, హిల్ స్టార్ట్ అసిస్ట్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అయితే, ప్రయాణీకుల భద్రతను ఇంకా పెంచేందుకు ఇందులో ఈSఓFఈX (బాల సీటు ఫిక్సింగ్ పాయింట్లు), కీ లెస్ ఎంట్రీ, ఇంజిన్ ఇమ్మొబిలైజెర్, మరియు ఫ్లిప్ కీ తో పాటు రిమోట్ సెంట్రల్ లాకింగ్ వంటి అంశాలను కూడా అందించారు.

అనుకూలాలు:1) బలీయమైన ఇంకా ఆకర్షణీయమైన బాహ్య రూపం కలదు.
2) ఆకట్టుకొనే అంతర్గత డిజైన్.
3) ఇంజన్ పనితీరు సంతృప్తికరంగా ఉంది.

ప్రతికూలాలు:1) బూట్ స్పేస్ ను మరింతగా పెంచవచ్చు.
2) భద్రతా అంశాలను ఇంకా మెరుగుపరచవచ్చు.
3) ఈ మోడల్ పరిమిత లభ్యత దీని యొక్క పెద్ద ప్రతికూలత.