హ్యుందాయ్ ఐ10

` 4.5 - 5.3 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

హ్యుందాయ్ ఇతర కారు మోడల్‌లు

 
*Rs

హ్యుందాయ్ ఐ10 వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

అవలోకనం:


హ్యుందాయ్ మోటార్స్ ఇండియా లిమిటెడ్ అనేది, ఒక ఆటోమొబైల్ తయారీ సంస్థ. ఈ సంస్థ అనేక ఆవిష్కరణలు మరియు సృజనాత్మకత ఉపయోగించి ప్రపంచ కార్ మార్కట్లో ఈ సంస్థ నుండి ఉత్పత్తి అయిన అనేక వాహనాలు చాలా సంఖ్యలో అమ్ముడుపోయేలా చేసింది. దానితో ఇతర పోటీదారులకు గట్టి పోటీను ఇచ్చింది. దీని కారణంగా ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే కార్ల తయారీదారులలో రెండవది గా నిలచింది. ఈ హ్యుందాయ్ మోటార్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా కొనుగోలుదారుల మనస్సులో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకుంది. అంతేకాకుండా కొనుగోలుదారుల అబిమానం కూడా అలాగే కొనసాగుతూ వచ్చింది. హ్యుందాయ్ i 10 సిరీస్ ప్రారంభమైన రోజు నుండి అనేక విజయవంతమైన అమ్మకాలను చోటు చేసుకుంది. ఈ సిరీస్ యొక్క ప్రామాణిక ప్రదర్శన ప్రత్యేకంగా అనేక ప్రశంసలను పొందింది మరియు కొనుగోలుదారులు ఈ సిరీస్ పై ఆదారపడ్డారు. ప్రస్తుతం ఈ మోడల్ నాలుగు పెట్రోల్ వేరియంట్ల తో మరియు ఒక LPG వేరియంట్ తో వస్తున్నాయి. ఈ సిరీస్ యొక్క వేరియంట్ల గురించి ముఖ్యంగా చెప్పాలంటే, తక్కువ నిర్వహణ ఖర్చు కావాలనుకునే కొనుగోలుదారులు LPG వేరియంట్ ను ఎంచుకోవచ్చు. ఈ హ్యాచ్‌బ్యాక్ సిరీస్ యొక్క బాహ్య బాగాల గురించి చెప్పాలంటే బాడీ రంగు బంపర్స్, డోర్ హ్యాండిల్స్, బాహ్య అద్దాలు ఈ హాచ్బాక్ కు అందించటం జరిగింది. డ్రైవింగ్ సమయం లో డ్రైవర్ కు రోడ్ ప్రత్యక్షత కోసం ఒక జత హెడ్‌ల్యాంప్స్ తో పాటు ఒక జత ఫాగ్ ల్యాంప్స్ ను కలిగి ఉన్నాయి. వీటి పై బాగం లో రెండు టోన్ ల క్రోమ్ గార్నిష్ తో విస్తారమైన రేడియేటర్ గ్రిల్ అమర్చబడి ఉంటుంది. దీని మద్య బాగం లో కంపెనీ యొక్క లోగో బిగించబడి ఉంటుంది. ఈ సిరీస్ యొక్క వాహనాల చక్రాలు పూర్తి వీల్ కవర్స్ తో కప్పబడి ఉంటాయి. అంతేకాకుండా సైడ్ ప్రొఫిల్ లో ఒక వేస్ట్లైన్ అమర్చబడి ఉంటుంది. ఈ వాహనాల అంతర్గత బాగాల గురించి చెప్పాలంటే, వీటి యొక్క లోపలి బాగాలు బహుళ అంశాలతో నవీకరించబడ్డాయి. ఈ కంపార్ట్మెంట్ లోపలి బాగం అంతా ఒక భిన్నమైన అప్పీల్ ఇచ్చే రెండు టోన్ లేత గోధుమరంగు మరియు గోధుమ రంగులతో ఉంటుంది. క్యాబిన్ లోపలి బాగం నీలి రంగు ప్రకాశాన్ని కలిగి ఉంటుంది. మొత్తం సెంటర్ ఫేసియా మెటల్ తో కప్పబడి ఉండటం వలన ఒక ప్రత్యేకమైన లుక్ ను సొంతం చేసుకుంది. అంతేకాకుండా వినోదం కోసం ఒక ఆడియో సిస్టమ్ ను కూడా అమర్చారు. ఈ ద్వని శబ్దం మొత్తం సమంగా విస్తరింపచేయడానికి నాలుగు స్పీకర్లను కూడా కార్ యొక్క డోర్లకు అమర్చారు. దీనిలో రెండు ముందు బాగంలో మరియు మిగిలిన రెండు కారు వెనుక బాగంలో బిగించబడి ఉంటాయి. కాబిన్ లోపలి ఉష్ణోగ్రత ను నియంత్రించడానికి ఎయిర్ కండీషనింగ్ యూనిట్‌ను మరియు దీనితో పాటుగా డాష్‌బోర్డ్ పై ఆఛ్ వెంట్లను అమర్చారు. లోపలి బాగంలో పుష్కల నిల్వ స్థలాలను కలిగి ఉంది. దానిలో బాగంగా ముందు తలుపులకు, డీలక్స్ ముందు కన్సోల్కు, సెంటర్ కన్సోల్ ట్రే కు మరియు అలాగే రియర్ పార్సెల్ ట్రే లకు పాకెట్లను కలిగి ఉన్నాయి. అంతేకాక, ఈ వాహనాలలో 225 లీటర్ల గొప్ప బూట్ కంపార్ట్మెంట్ సామర్థ్యం తో వస్తున్నాయి. ఈ హ్యాచ్‌బ్యాక్ పనితీరు లో అనేక ప్రశంసలను అందుకుంది మరియు ఈ హాట్చ్బాక్ సిరీస్ పెట్రోల్ ఇంజెన్ల విషయానికి వస్తే, అత్యధికంగా 19.8 kmpl మైలేజ్ ను ఉత్పత్తి చేస్తాయి. మరోవైపు, ఈ వాహనాల యొక్క LPG వేరియంట్లు 19.2 kmpl మైలేజ్ ను అందిస్తాయి. ఈ క్యాబిన్ లోపలి బాగం చాలా విశాలంగా మరియు అయిదుగు వ్యక్తులు సౌకర్యవంతంగా కూర్చునే అవకాశాన్ని తయారీదారుడు కల్పించాడు. వీటి యొక్క సీట్లు, ఒక ఇంటిల్జెంట్ రిలాక్స్ సిస్టమ్ తో మరియు అలాగే ఈ-రిలాక్స్ గేర్ కన్సోల్ తో కొనుగోలుదారులకు అందించబడతాయి, ఇది సెంట్రల్ కన్సోల్ లో మాత్రమే. డ్రైవింగ్ సమయం లో డ్రైవర్ కు శ్రమను తగ్గించేండుకు పవర్ స్టీరింగ్ ఫీచర్ తో పాటుగా అది టిల్ట్ సర్దుబాటు ఫంక్షన్ కూడా కలిగి ఉంది. వీటి యొక్క అన్ని డోర్లు పవర్ విండోస్ తో వస్తున్నాయి. వీటితో పాటు, డ్రైవర్ సైడ్ విండో ఆటో డౌన్ ఫంక్షన్ స్విచ్ ను కూడా కలిగి ఉన్నాయి. అంతేకాకుండా విద్యుత్‌తో సర్దుబాటయ్యే వెలుపలి అద్దాలు మరియు విద్యుత్‌తో విడుదల చేసే ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్ వంటి అదనపు అనుకూలమైన లక్షణాలను తో అందుబాటులో ఉంది. ముందు సహ ప్రయాణికుడి సన్ వైసర్ కి ఒక వానిటీ మిర్రర్ అమర్చబడి ఉంటుంది, ఇది కూడా ఒక సౌకర్యవంతమైన కారకం అని చెప్పవచ్చు. ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్లలో ఒక ఇన్స్ట్రుమెంట్ పానెల్ ఉంది, ఈ పానెల్ లో గేర్ షిఫ్ట్, ఒక టాకొమీటర్, డిజిటల్ ఓడోమీటార్ మరియు ట్రిప్ మీటర్, ఇంధనం తక్కువగా ఉన్నప్పుడు హెచ్చరిక మరియు ఆడియో ప్రదర్శనకు ఒక డిజిటల్ గడియారాల సూచికలను కలిగి ఉంది. అంతేకాకుండా కొనుగోలుదారులు, అధికారం డీలర్స్ నుండి అదనపు ఖర్చు తో వారికి కావలసిన పరికరాలు తో తమ కారు ను ఎంపిక చేసుకోవచ్చు. ఈ హాచ్బాక్ చూడటానికి చాలా ప్రకాశవంతంగా మరియు చాలా సొగసైనదిగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ సిరీస్ యొక్క అన్ని వాహనాలు విభిన్న రంగులలో లభ్యమౌతుంది. ఈ వాహనాల యొక్క వీల్‌బేస్ చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వలన లోపలి బాగం చాలా విశాలంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది. ఈ వాహనాలు అసమాన రోడ్ లపై స్థిరత్వంగా ఉండటానికి నైపుణ్యమైన బ్రేకింగ్ మరియు సస్పెన్షన్ విధానాలను కూడా కలిగి ఉన్నాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు మరియు వెనుక చక్రాలు వరుసగా ఒక జత డిస్క్ మరియు ఒక జత డ్రమ్ ల కలయికతో వస్థాయి. మరోవైపు, సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందు ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్టట్ తో మరియు వెనుక ఆక్సిల్ టోరిసన్ బీమ్ సస్పెన్షన్ తో బిగించబడి ఉంటాయి. అంతేకాకుండా ఈ నాలుగు చక్రాలు, కాయిల్ స్ప్రింగ్స్ తో బిగించబడి ఉంటాయి. ఈ సంస్థ గురించి ఇంకా చెప్పలంటే, ఈ సంస్థ యొక్క తర్వాత అమ్మకాల సేవ కూడా పేరుగాంచింది. వాహనం కొనుగోలు చేసిన తేదీ నుండి వారెంటీ సమయం ముగిసే వరకు కూడా అన్ని సర్వీస్ లను మరియు నిర్వహణ సంబంధించిన సర్వీస్ లను జాగ్రత్తగా తీసుకుంటుంది. అంతేకాకుండా, ఒక ప్రామాణిక వారంటీ తో వస్తుంది. ఈ వారెంటీ ను అధనపు ఖర్చు తో మరింత పెంచవచ్చు. ఈ ఖర్చును నేరుగా డీలర్ కు చెల్లించవచ్చు.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


దీని యొక్క ఇంధన సరఫరా వ్యవస్థ, ఒక బహుళ పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ తో అమర్చబడి ఉంతుంది. ఈ మోడల్ యొక్క అన్ని వేరియంట్లు 1.1 లీటర్ iRDE2 పెట్రోల్ ఇంజన్ ను కలిగి ఉంటాయి. ఈ ఇంజెన్లు నగరాలలో 14 kmpl మైలేజ్ ను ఉత్పత్తి చేస్తాయి మరియు రహదారుల్లో 19.8 kmpl మైలేజ్ ను అందిస్తాయి.

శక్తి సామర్థ్యం:


ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్లు, సిలండర్లను మరియు SOHC వాల్ ఆకృతీకరణ ఆదారంగా 12 వాల్వ్ లను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఈ ఇంజెన్లు సింగిల్ ఓవర్‌హెడ్ క్యామ్ షాఫ్ట్ వాల్వ్ సిస్టమ్ ను కలిగి ఉంటాయి. ఈ ఇంజెన్లు 1.1 లీటర్ పెట్రోల్ మోటార్ ను కలిగి 5500 rpm వద్ద 68.05 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తాయి. మరియు దీనితో పాటుగా 4500 rpm వద్ద 99.04 Nm గల టార్క్ ను విడుదల చేస్తాయి.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్లు, ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో బిగించబడి ఉంటాయి. ఈ ఇంజెన్లు 1086 cc స్థానభ్రంశాన్ని కలిగి ఉంటాయి. ఈ ఇంజెన్లు 0 kmph నుండి 100 kmph వేగాన్ని చేరడానికి 14.3 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ ఇంజెన్లు 165 kmph వేగాన్ని కూడా చేరుకోగలవు.

వెలుపలి డిజైన్:


ఈ హ్యుందాయ్ i 10 సిరీస్ యొక్క అన్ని వేరియంట్ల బాహ్య చిత్రాలు చాలా చక్కగా మరియు సొగసైన రూపాన్ని కలిగి ఉంటాయి. ఈ కారు పై చాలా రకాల అంశాలను కలిగి ఉండటమే కాకుండా, ఒక ప్రశంసాత్మక డిజైన్ ను కూడా కలిగి ఉంది. కారు యొక్క ముందు బాగానికి వస్తే, డ్రైవింగ్ సమయం లో డ్రైవర్ కు రోడ్ ప్రత్యక్షత కోసం ఒక జత హెడ్‌ల్యాంప్స్ కలిగి ఉంది. దీనికి తోడుగా మరింత రక్షణ కోసం ఒక జత ఫాగ్ ల్యాంప్స్ ను కలిగి ఉన్నాయి. వీటి పై బాగం లో రెండు టోన్ ల క్రోమ్ గార్నిష్ తో విస్తారమైన రేడియేటర్ గ్రిల్ అమర్చబడి ఉంటుంది. ఇది చూడటానికి మరింత ప్రకాశవంతంగా ఉంటుంది, దీని మద్య బాగం లో కంపెనీ యొక్క లోగో బిగించబడి ఉంటుంది. అంతేకాకుండా కారుకి ఇరువైపులా అంటే డ్రైవర్ వైపు మరియు ముందు ప్రయాణికుడి వైపు రెండు రేర్ వ్యూ మిర్రర్ లు బిగించబడి ఉంటాయి. ఈ వాహనాల, మద్య మరియు అగ్ర శ్రేణి వేరియంట్ల యొక్క వెలుపలి మిర్రర్లు కారు శరీర రంగు లోనే ఉంటాయి. ముందు మరియు వెనుక బాగాలలో బంపర్లు బిగించబడి ఉంటాయి. ఇవి కూడా కారు శరీర రంగులోనే ఉంటాయి. ఇలా ఉండటం వలన కారు మరింత ఆకర్షణీయంగా మరియు కారు అంతా ఏకరీతి లో కనబడుతుంది. ఈ బంపర్లు, కారు కి ఏ రకమైన నష్టం జరగకుండా కాపాడతాయి. కారు యొక్క పైకప్పు బాగం లో ఒక యాంటిన్నా అమర్చబడి ఉంటుంది, ఇది రేడియో ట్యూనర్ సంకేతాలను అందిస్తుంది. ప్రక్క ప్రొఫైల్ విషయానికి వస్తే, ఒక పదునైన అంచుగల మంచి అప్పీల్ ను ఇచ్చే వేస్ట్లైన్ ఉంటుంది. ఈ వాహనాల యొక్క డోర్ హాండిల్స్ కారు శరీర రంగులోనే ఉంటాయి. అంతేకాకుండా బూట్ డోర్ హాండిల్ కూడా అదే రంగులో మరియు సంస్థ యొక్క చిహ్నం అమర్చబడి ఉంటుంది. దీని వలన వెనుక బాగం నుండి చాలా బాగా కనబడుతుంది. ఈ సిరీస్ యొక్క ఎక్కువ వేరియంట్లలో అధునాతన పూర్తి వీల్ కవర్స్ తో కప్పబడి ఉంటాయి. ఇది కారు మోత్తానికి అదనపు స్టైలింగ్ అని చెప్పవచ్చు. మరోవైపు, 1.1 iTech SE వేరియంట్ లో అదనపు శరీరం గ్రాఫిక్స్ మరియు బయట ప్రత్యేక చేరికలతో అలంకరించబడి ఉంటుంది. ఇది చూడటానికి చాలా ప్రతేకంగా ఉంటుంది.

వెలుపలి కొలతలు:


ఈ మోడల్ యొక్క వేరియంట్ల బాహ్యకొలతల గురించి మాట్లాడటానికి వస్తే, ఈ వాహనాల యొక్క మొత్తం పొడవు 3585 mm, మొత్తం వెడల్పు 1595 mm, మొత్తం ఎత్తు 1550 mm, వీటి యొక్క వీల్‌బేస్ 2380 mm, ఇంత ఎక్కువ వీల్‌బేస్ ఉండటం వలన అంతర్బాగం లో సౌకర్యవంతంగా అయిదుగురు కూర్చునే సదుపాయం ఉంటుంది. అంతేకాకుండా వీటి యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 165 mm, ఫ్రంట్ ట్రాక్ 1400 mm, మరియు వెనుక ట్రాక్ 1385 mm.

లోపలి డిజైన్:


ఈ హ్యుందాయ్ i 10 హ్యాచ్‌బ్యాక్ సిరీస్ యొక్క క్యాబిన్, బాగా రూపొందించబడింది మరియు తయారీదారులు కూడా చిన్న చిన్న బాగాలను కూడా బాగా రూపొందించారు. దీని యొక్క లోపలి బాగం అంతా ఒక నీలి రంగు ప్రకాశంతో అలంకరించబడి ఉంటుంది. ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్లు ఒక సంగీత వ్యవస్థ ను కలిగి ఉన్నాయి. అయితే, 1.1 iTech SE వేరియంట్ లో, సీట్లు ఎరుపు మరియు లేత గోధుమ రంగు షేడ్స్ ను కలిగి ఒక స్పోర్టీ రూపాన్ని అందిస్తాయి. ఇది కేవలం ఒక అత్యాధునిక లుక్ ను మాత్రమే కాకుండా, లోపలి బాగం అంతా వైవిధ్యభరితంగా ఉంటుంది. ప్రయాణీకులు ఏదైనా చదువుకోవడానికి క్యాబిన్ ముందర పైకప్పు బాగం లో ఒక రీడింగ్ ల్యాంప్ బిగించబడి ఉంటుంది. దీని యొక్క సెంటర్ కన్సోల్ లో ఒక ట్రే అందుబాటులో ఉంటుంది, ఈ ట్రే వివిధ రకాలుగా ఉపయోగపడుతుంది. కుడివైపు డాష్‌బోర్డ్ లో అంతర్గత లుక్ మెరుగుపరచడానికి మెటల్ ఫినిషింగ్ తో పొరలుగా అమర్చబడి ఉంటుంది. ఈ వాహనల యొక్క మద్య మరియు అగ్ర శ్రేణి వేరియంట్లలో మరిన్ని ఎక్కువ అంశాలతో అలంకరిస్తారు. వీటి జాబితాలో ముందు డోర్లకు ఒక జత మ్యాప్ పాకెట్స్ ఉంటాయి. వీటిలో చాలా రకాల న్యూస్ పేపర్లు, మేగ్జిన్స్ వంటివి పెట్టుకోవడానికి ఉపయోగపడతాయి. అలాగే, ఒక మంచి నిల్వ సామర్థ్యం కలిగిన డీలక్స్ ఫ్లోర్ కన్సోల్ ను కూడా కలిగి ఉంది. ప్రయాణీకుల సౌకర్యాన్ని మరింత పెంచడానికి ఆర్మ్‌రెస్ట్ లను కూడా కలిగి ఉన్నాయి. ఈ ఆర్మ్‌రెస్ట్ లు అన్ని డోర్లకు బిగించబడి ఉంటాయి. మరోవైపు, వీటి అగ్ర శ్రేణి వేరియంట్ల డోర్ హేండిల్స్ పై క్రోమ్ తో అలంకరించబడి ఉంటాయి. దీని వలన లోపలి బాగం అంతా మరింత ఆకర్షణీయంగా కనబడుతుంది. అంతేకాకుండా వీటిలో ఆఛ్ వెంట్లు కూడా క్రోమ్ రేకులతో అమర్చబడి ఉంటాయి. ఇది, ఈ క్యాబిన్ యొక్క అదనపు ఆభరణము అని చెప్పవచ్చు. అదనపు వస్తువులు పెట్టుకోవడానికి రేర్ పార్సిల్ ట్రే ను కూడా కలిగి ఉంటుంది. క్యాబిన్ లోపలి బాగంలో ఒక ఇన్స్ట్రుమెంట్ పానెల్ బిగించబడి ఉంటుంది, దీని లోపల చాలా సూచికలు ఉన్నాయి. ఈ ఇన్స్ట్రుమెంట్ పానెల్ లో ఒక గేర్ షిఫ్ట్ ఇండికేటర్, టాకొమీటర్, ఒక డిజిటల్ ఓడోమీటార్ మరియు ట్రిప్ మీటర్ మరియు తక్కువ ఇంధన హెచ్చరిక ల్యాంప్ వంటి నోటిఫికేషన్లను చూపిస్తుంది. అయితే అగ్ర శ్రేణి వేరియంట్లలో అదనంగా ఒక డిజిటల్ గడియార ప్రదర్శనను కూడా కలిగి ఉంటుంది.

లోపలి సౌకర్యాలు:


ఈ హాట్చ్బాక్ సిరీస్ లో ఈ-రిలాక్స్ ఫ్రంట్ సీట్లను కలిగి ఉంటాయి. మరియు ఈ-రిలాక్స్ గేర్ కన్సోల్ కూడా ఉంది. ఇది చాలా స్మార్ట్ గా మరియు ఎక్కువ సౌకర్యవంతమైన పనితీరును ఇస్తుంది. అంతేకాకుండా క్యాబిన్ యొక్క ఉష్ణోగ్రతను తగ్గించుట కొరకు ఒక ఎయిర్ కండిషనింగ్ యూనిట్ అందుబాటులో ఉంది. అవసరమైతే అదనంగా, ఒక హీటింగ్ ఫంక్షన్ ను కూడా కలిగి ఉంది. ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్లలో డ్రైవర్ కు ఒక గొప్ప ఉపసమనం కోసం ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వీల్ ను కలిగి ఉంటుంది. ట్రాఫిక్ లో ఉన్నప్పుడు ఈ ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వీల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అదనంగా, డ్రైవర్ విషయాలు సులభతరం అవ్వడానికి రిమోట్ ఎనేబుల్ ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్ అందుబాటులో ఉంది. విద్యుత్‌తో సర్దుబాటయ్యే వెలుపలి రేర్ వ్యూ మిర్రర్స్ కారు కి ఇరువైపులా బిగించి ఉంటాయి. మద్య శ్రేణి మరియు అగ్ర శ్రేణి వేరియంట్లలో కొనుగోలుదారులకు అదనపు ప్రయోజనాల కోసం అదనపు లక్షణాలను ఎంచుకోవచ్చు. డ్రైవర్ సైడ్ ఆటోమేటిక్ అప్ / డౌన్ ఫంక్షన్ తో పాటుగా ఈ వేరియంట్ల అన్ని డోర్లకు పవర్ విండోస్ ఉంటాయి. ప్రయాణీకులందరికి ఈ భారీ అనుకూలమైన అంశం అందుబాటులో ఉంది. డ్రైవర్ కు మరియు అలాగే ముందు సహ ప్రయాణికుడికి సన్ వైసర్స్ అందించబడుతున్నాయి. ప్రయాణికుడి వైపు వైసర్ కి ఒక వానిటీ మిర్రర్ బిగించి ఉంటుంది. ఈ వాహనాల యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లలో డ్రైవింగ్ లో గొప్ప సహాయంకోసం ఒక టిల్ట్ సర్దుబాటు స్టీరింగ్ వీల్ వంటి అదనపు లక్షణాలను కలిగి ఉంది. ఒక 2-దిన్ సంగీతం వ్యవస్థ, ఈ వేరియంట్ లో అందంగా అలంకరించబడి ఉంటుంది. ఇది చాలా సమర్ధవంతంగా ఉంటుంది. ఇది CD మరియు MP3 ఆడియో ఫైళ్లు, ఒక ఆక్స్-ఇన్ ఇంటర్ఫేస్ మరియు USBపోర్ట్ యూనిట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది ఒక ప్రయోజనకరమైన విషయం అని చెప్పవచ్చు. ఈ క్యాబిన్ లో నాలుగు స్పీకర్లను కలిగి ఉంది. వీటిలో రెండు ముందు బిగించి ఉంటాయి మరియు ఇతర రెండు క్యాబిన్ యొక్క వెనుక బాగంలో అమర్చబడి ఉంటాయి. ఈ స్పీకర్లు సమానంగా మరియు సమర్ధవంతంగా ధ్వని పంపిణీ చేయడం లో సహాయపడతాయి. 1.1 iTech SE వేరియంట్ లో బ్లూటూత్ కనెక్టివిటీ తో పాటుగా స్టీరింగ్ పై నియంత్రణ బటన్లు బిగించబడి ఉంటాయి. ఇది డ్రైవర్ కు ఒక భారీ సౌకర్యం అని చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ వేరియంట్ లో లోపలి రేర్ వ్యూ మిర్రర్ పై, ఒక వెనుక వ్యూ కెమెరా అమర్చబడి ఉంటుంది. ఈ రేర్ వ్యూ కెమెరా కార్ పార్కింగ్ సమయంలో బాగా ఉపయోగపడుతుంది.

లోపలి కొలతలు:


ఈ మోడల్ యొక్క వేరియంట్ల అంతర్బాగ కొలతలు గురించి చెప్పాలంటే, ఈ వాహనాల యొక్క ఇంధన ట్యాంక్ సామర్ధ్యం 35 లీటర్లు, వీటి యొక్క ఫ్రంట్ హెడ్రూం 990 mm, వెనుక హెడ్రూం 940 mm, లెగ్‌రూం విషయానికి వస్తే చాలా విశాలంగా ఉంటుంది, వీటి యొక్క లెగ్‌రూం గరిష్టంగా 1190 mm, కనిష్టంగా 1115 mm ఉంది. క్యాబిన్ వెనుక వైపు మోకాలి రూం గరిష్టంగా 819 mm మరియు అది కనిష్టంగా 640 mm ఉంది. భుజం గది చాలా విశాలవంతంగా మరియు సౌకర్యవంతంగా ఏ రాపిడి లేకుండా 1225 mm ఉంది. ఈ వాహనాల బూట్ వైశాల్యం గురించి చెప్పాలంటే చాలా ఎక్కువ లగేజ్ కు మద్దతు ఇవ్వడానికి తయారీదారుడు 225 లీటర్ల సామర్ధ్యాన్ని కల్పించాడు.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ సిరీస్ యొక్క వేరియంట్లు 1.1 లీటర్ల పెట్రోల్ ఇంజెన్ తో పొందుపరచబడి ఉంటాయి. ఈ ఇంజెన్ల స్థానబ్రంశం 1086 cc. ఈ పెట్రోల్ ఇంజెన్ 5500 rpm వద్ద 68.1 bhp పవర్ ను ఉత్పత్తి చేస్తాయి. మరియు 4500 rpm వద్ద 99.04 Nm అత్యదిక టార్క్ ను విడుదల చేస్తాయి. ఈ iRDE పెట్రోల్ ఇంజెన్ నాలుగు సిలండర్లను కలిగి మరియు ఒక VTVT ఆధారంగా 12 వాల్‌వలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఒక ఓవర్‌హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ వ్యవస్థ ను కూడా కలిగి ఉంటుంది. కొనుగోలుదారులు ఎంపిక చేసుకొనుటకు ఒక LPG ఎంపిక వేరియంట్ ను కూడా అందుబాటులో ఉంచారు. ఈ LPG వేరియంట్ అతి తక్కువ నిర్వహణ ను కలిగి ఉంటుంది. ఈ LPG వేరియంట్ 19.2 km / kg ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే ఈ సిరీస్ యొక్క పెట్రోల్ వేరియంట్లు 19.8 kmpl మైలేజ్ ను అందిస్తాయి.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ హ్యుందాయ్ i 10 యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లలో ఒక సమగ్ర సంగీతం వ్యవస్థ తో పాటుగా CD ప్లేయర్ మరియు MP3 ప్లేయర్ కలిగిన 2-దిన్ ఆడియో సిస్టమ్, తో బిగించబడి ఉంటుంది. అంతేకాకుండా ఇది ఆక్స్-ఇన్ మరియు USB పోర్ట్ ను కూడా కలిగి ఉంది. మరియు సమర్థవంతమైన ధ్వని సమంగా విస్తరింప చేయడానికి నాలుగు స్పీకర్లను అమర్చారు. ఈ 1.1 iTech SE వేరియంట్ లో బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది మరియు వీటి నియంత్రణలు స్టీరింగ్ వీల్ పై అమర్చబడి ఉంటాయి. కాని ఇతర వేరియంట్ లలో ఒక సమగ్ర సంగీతం వ్యవస్థ లేదు, కాని ఒక ఆడియో యూనిట్ అందించబడుతుంది. అంతేకాకుండా కొనుగోలుదారులు ఈ సిరీస్ హాచ్బాక్ కు మరిన్ని ఉపకరణాలను ఎంచుకోవచ్చు. కాని, బాహ్య బాగం మరినత ఆకర్షణీగా కనబడుతుంది. ఈ జాబితాలో కారు ని క్లీన్ గా ఉంచడానికి డోర్ మాట్స్ మరియు సౌకర్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు లెదర్ అపోలిస్ట్రీ అందించబడుతుంది. ఒక నావిగేషన్ సిస్టమ్ లేదా ఒక టచ్ స్క్రీన్ ఇంటర్ఫేస్ డాష్‌బోర్డ్ పై అమర్చబడి ఉంటుంది. అంతేకాకుండా అదనపు శక్తి సాకెట్లు, కోట్ హుక్స్ మరియు కోట్ పాకెట్స్ వంటి ఇతర లక్షణాలు అదనపు సౌలభ్యం కోసం చేర్చుకోవచ్చు.

వీల్స్ పరిమాణం:


ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్ల చక్రాలు, 13 అంగుళాల స్టీల్ వీల్స్ తో బిగించబడి ఉంటాయి. వీటి యొక్క వీల్స్ ట్యూబ్ లెస్ టైర్లతో కప్పబడి ఉంటాయి. వీటి యొక్క పరిమాణం 155/80R13. ఇంకా దీని యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన స్పోర్ట్ వేరియంట్ వీల్స్ వీల్ కవర్ల తో కప్పబడి ఉంటాయి. చూడటానికి ఇది చాలా స్టైలిష్ గా ఉంటుంది.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ హాచ్బాక్ సిరీస్ యొక్క అన్ని వేరియంట్లు ఒక ప్రత్యేకమైన బ్రేకింగ్ వ్యస్థను అలాగే సస్పెన్షన్ వ్యవస్థను కలిగి ఉన్నాయి. రోడ్లపై గట్టి పటుత్వాన్ని ఇవ్వడానికి, ఈ వాహనాల ముందు చక్రాలు వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ లతో మరియు వెనుక చక్రాలు ఒక జత డ్రమ్ బ్రేక్‌ల తో బిగించబడ్డాయి. సస్పెన్షన్ వ్యవస్థ విషయానికి వస్తే, ముందరి ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్టట్ తో పాటుగా కాయిల్ స్ప్రింగ్ తో బిగించబడి ఉంటాయి. మరోవైపు, వెనుక ఆక్సిల్ కాయిల్ స్ప్రింగ్ పాటు టోరిసన్ బీమ్ తో బిగించి ఉంటాయి. ఈ వాహనాల యొక్క కనీస టర్నింగ్ వ్యాసార్ధం 4.5 మీటర్లు. ఈ విబాగంలో ఇది చాలా మంచి టర్నింగ్ వ్యాసార్ధం.

భద్రత మరియు రక్షణ:


ఈ కారు తయారీదారుదు, ఈ హ్యుందాయ్ i 10 సిరీస్ డ్రైవర్ కు మరియు ప్రయాణీకులకు అనేక భద్రతా సౌకర్యాలను కల్పించాడు. ఈ సిరీస్ యొక్క అన్ని వేరియంట్లకు అధునాతన ఇంజెన్ ఇమ్మోబిలైజర్ ను అందించాడు. ఇది ఉండటం వలన దొంగతనాల బారి నుండి కారుని రక్షించుకోవచ్చు. అంతేకాకుండా, ఈ వ్యవస్థ ను కలిగి ఉండటం వలన అపరిచిత వ్యక్తి కారు ఇంజెన్ ను స్టార్ట్ చేయదలచుకుంటే ఇంజెన్ స్తబించిపోతుంది. అన్ని వేరియంట్లలో ఒక ప్రామాణికమైన అంశం గా ఉంది. ఈ వాహనాల యొక్క మద్య శ్రేణి మరియు అగ్ర శ్రేణి వేరియంట్లలో డే అండ్ నైట్ రేర్ వ్యూ మిర్రర్ క్యాబిన్ లో బిగించబడి ఉంటుంది. అంతేకాకుండా ఈ వేరియంట్లలో సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ సిస్టమ్, ఈ వాహనాల యొక్క అన్ని డోర్లకు అలాగే బూట్ డోర్ కు కూడా ఉంటుంది. వీటి అగ్ర శ్రేణి వేరియంట్లలో ఒక జత ఫాగ్ ల్యాంప్స్ ముందు బాగంలో అమర్చబడి ఉంటాయి. ఈ ల్యాంప్స్ రోడ్ ప్రత్యక్షంగా కనబడటం లో సహాయపడతాయి. ఆపై, ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఇది మరొక భద్రత కొలత అని చెప్పవచ్చు అంతేకాకుండా ఈ వేరియంట్లలో కీ లెస్ ఎంట్రీ తో పాటు అదనంగా అలారం ను కూడా కలిగి ఉంటాయి.

అనుకూలాలు:


1. ఈ వాహనాలకు అనేక లక్షణాలు కలిగి ఉండి కూడా కొనుగోలుదారులకి సరసమైన ధరలలో లబిస్తుంది.
2. ఈ వాహనా యొక్క సీట్లు చాలా విశాలవంతంగా మరియు సౌకర్యవంతంగా ఉంటాయి.
3. ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్ అనేక సూచికలను కలిగి ఉండటమనేది ఒక అనుకూలమైన అంశంగా బావించవచ్చు.
4. కంఫర్ట్ విభాగాన్ని చాలా బాగా తయారుచేశారు.
5. ఈ వాహనాల యొక్క క్యాబిన్ భాగం చాలా విశాలంగా ఉంటుంది.

ప్రతికూలాలు:


1. ఈ వాహనాల యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ ను మరింత పెంచవచ్చు.
2. ఈ వాహనాల యొక్క బాహ్య బాగాలను ఇంకా మెరుగుపరచే అవకాశం ఉంది.
3. ఈ వాహనాల యొక్క ఇంధన సామర్ధ్యం ఆకట్టుకునే విధంగా లేదు.
4. ఈ వాహనాల యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లలో కూడా అల్లాయ్ వీల్స్ లేకపోవడం ఒక ప్రతికూలతగా బావించవచ్చు.
5. ఈ వాహనాల యొక్క భద్రత విభాగం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.