హ్యుందాయ్ ఇయాన్

` 3.2 - 4.5 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

హ్యుందాయ్ ఇతర కారు మోడల్‌లు

 
*Rs

హ్యుందాయ్ ఇయాన్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 

ముఖ్యాంశాలు


జూలై 21, 2015: హ్యుందాయ్ తమ వర్షాకాల స్ప్లాష్ ఆఫర్ లో EON వాహనాన్ని రూ .26,000 వరకు తగ్గింపుని అందిస్తుంది. పెట్రోల్ వేరియంట్ రూ .26,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. సిఎన్జి వేరియంట్ 23.500 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. అయితే ముఖ్యమయిన విషయం ఏమిటంటే ఈ ఆఫర్ జూలై చివర వరకు మాత్రమే ఉంటుంది. 2014 మే నెలలో హ్యుందాయ్ ఇండియా EON మాగ్నా + ని రూ 3.83 లక్ష కే (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అందించింది. ఇది డ్యుయల్ టోన్ ఇంటీరియర్స్ తో పాటూ USB మరియు ఆక్స్ కనెక్టివిటీతో మ్యూజిక్ సిస్టమ్ ని లేత గోధుమరంగు మరియు గోధుమ రంగు పథకం లో అందించింది. ఈ కారు ఇంజిన్ డ్యుయల్ VTVT, 1.0 లీటర్ 3- సిలిండర్ 3500 ఆర్‌పిఎమ్ వద్ద 94 ఎన్ఎమ్ల టార్క్ ని మరియు 68bhp గరిష్ట శక్తి ని ఉత్పత్తి చేస్తుంది.

అవలోకనం


పరిచయం


IMAGE1

హ్యుందాయ్ ఇయాన్ ప్రారంభమైనప్పుడు, అది దాదాపు దాని విభాగంలో అందరి దృష్టినీ దాని వైపు ఆకర్షించేలా ప్రత్యేకంగా రూపుదిద్ద్దుకున్నది. అవును, మారుతి ఆల్టో 800 దేశంలో ఉత్తమ అమ్ముడైన కారు అయి ఉండవచ్చు కానీ అది అంత ప్రత్యేకంగా ఏమీ లేదు అనగా దీనిలో ప్రత్యేకంగా ఆకర్షించే లక్షణాలు ఏమీ లేవు. కాబట్టి ఆ సమయంలో , హ్యుందాయ్ ఈన్ కొన్ని ప్రత్యేకమయిన లక్షణాలతో ప్రారంభించబడింది. ఇది ప్రారంభించబడిన ఒక్కరోజు తర్వాత మళ్ళీ మారుతీ ఆల్టో యొక్క ప్రత్యేక ఎడిషన్ వేరియంట్‌ని ప్రవేశపెట్టడం జరిగింది. హ్యుందాయ్ ఇయాన్ కొరియా కార్ల కంపెనీ పెట్టే దిగ్గజ శాంత్రో అడుగుజాడల్లో అనుసరించడాన్ని పెద్ద బాద్యత గా తీసుకుంది.

అనుకూలతలు


1. ముఖ్యంగా దాని విభాగంలో వాహనాలని పరిగణనలోకి తీసుకున్నట్లయితే ఈ వాహనం చాలా అద్భుతంగా ఉంది. ఇది ప్రవేశపెట్టబడిన 5 సంవత్సరాల తర్వాత ఈ డిజైను చాలా కొత్తగా ప్రారంభించబడినది. 2. నిర్మాణ నాణ్యత పరంగా ఇది దాని విభాగంలో ఉత్తమ కారు. ఈ వాహనం ఆల్టో కన్నా కొన్ని మైళ్ళు ముందుకి ప్రయాణించింది. 3. దీని యొక్క ఇంటీరియర్స్ యొక్క ముగింపు అధిక స్థాయిలో మంచి నాణ్యత కలిగి ఉండటం వలన అన్ని లెవల్స్ లో మంచి అనుభూతిని కలిగిస్తాయి.

ప్రతికూలతలు


1. స్టీరింగ్ బరువుగా లేని కారణంగా హై వే మీద స్పీడ్‌గా వెళ్ళగలదు కానీ ఈ విషయంలో డ్రైవర్ యొక్క నమ్మకాన్ని కోల్పోయింది.

నాయిస్ & కంపనం స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఎందుకనగా 3-సిలిండర్ ఇంజిన్లు ఉండటం కారణంగా.

సమగ్రమయిన లక్షణాలు


1. ఫస్ట్-ఇన్-సెగ్మెంట్ లక్షణాలు అయినటువంటి టిల్ట్ స్టీరింగ్ & డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్ వంటి లక్షణాలు ఉంటాయి.

0.8l & 1.0l ఇంజన్ వేరియంట్లు లభ్యమవుతాయి.

బయటి పరికరాలు


IMAGE2

హ్యుందాయ్ ఇయాన్ కంపెనీ వెర్నా డిజైన్ కలిగి ఉన్నటువంటి చిన్న కారు. దీని డిజైను కొత్తగా ఉండటం వలన ఇది ఉత్తమంగా ఉంటుంది. దాని విభాగంలో ఇయాన్ అధిక వక్రతలు మరియు లైన్లు కలిగి ఉన్న ఉత్తమమయిన కారు ఇది కావచ్చు.

IMAGE 3

హెడ్స్ పైన, హ్యుందాయ్ ఈన్ చక్కగా హెడ్‌ల్యాంప్స్ ని తిరిగి అలంకరించాటానికి క్రోమ్ స్ట్రిప్ హ్యుందాయ్ లోగో ని కలిగి ఉంటుంది. షట్కోణ గ్రిల్ కూడా నిజంగా ముందు బంపర్ లో ఒక భాగం. ఇది నిజంగా చాలా పెద్దది. మరియు ఇది వాహనానికి ఒక ప్రత్యేకమయిన లుక్ ని ఇస్తుంది.

IMAGE4

చెక్కిన బోనెట్ మరియు విలక్షణముగా రూపకల్పన చేసిన ఫాగ్ ల్యాంప్స్ ఈ కార్ల విభాగంలో అరుదుగా ఉంటాయి.

IMAGE5

ప్రక్క భాగాన్ని గనుక చూసినట్లయితే దాని యొక్క ఫ్లూయిడిక్ ప్రత్యేకమయిన డిజైను మాత్రమే కాకుండా కారు అంతటా కూడా కట్టుదిట్టం అయిన వీల్ ఆర్చేస్ మరియు ఒక షోల్డర్ లైను కూడా ముందలి హెడ్ ల్యాంప్స్ నుండి వెనుక టెయిల్ ల్యాంప్స్ వరకి ప్రవహిస్తున్నట్టుగా ఉంటుంది. అంతే కాకుండా మరో చెక్కిన లైన్ మాదిరి ముందు మరియు వెనుక చక్రాలు మధ్య కూడా పొడవయిన లైను ఉంటుంది.

IMAGE6

షోల్డర్ లైను స్కూప్ వెనుక వరకూ ఉండి కారు యొక్క ప్రొఫైలుకి ఒక ప్రత్యేకతని కలుగ జేస్తుంది. అంతే కాకుండా దీని యొక్క డోర్ హ్యండిల్స్ కూడా ఈ లైను ని అనుసరిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అయితే వెనుక డోర్ హ్యండిల్స్ మాత్రం ఈ ముందరి లైనుకి కొంచెం పైన ఉన్నట్లు కనిపిస్తుంది.

IMAGE7

వెనుక భాగాన్ని గనుక చూసినట్లయితే పెద్ద టెయిల్ ల్యాంప్స్ చాలా అందంగా డిజైను చేయబడి ఉంటాయి. ఈ డిజైను కారు యొక్క నూతనత్వాన్ని ప్రతిబింబింప జేసేలాగా ఉంటుంది. వెనుక గ్లాస్ అందంగా ఉంటుంది మరియు విశాలమైనది గా ఉంటుంది మరియు రేర్ స్పాయిలర్ చక్కగా అనుసంధానమై ఉంటుంది.

అయితే దీని వెనుక బంపర్ అందంగా ఉంటుంది కానీ అవసరమయిన దానికన్నా పెద్దగా ఉంటుంది. దీని వలన దీని బూట్ కొంచెం చిన్నగా అయినట్టుగా కనిపిస్తుంది. ఎగ్సాస్ట్ పైపు విలక్షణముగా చక్కగా లేఅవుట్ కలిగిస్తూ వెనుక బంపర్ కింద దాగినట్లు ఉంటుంది.

IMAGE8

ఇయాన్ 145mm టైర్లు మరియు డి-లైట్ + 12 అంగుళాల రిమ్స్, మరియు ఏరా + వేరియంట్స్ మరియు 155mm టైర్లతో 13 అంగుళాల రిమ్స్ అనే స్పోర్ట్స్ రకాలని కలిగి ఉంటుంది. ఈ రెండూ కూడా సన్నగా అందంగా ఉంటాయి. మరియు వీరు భద్రత కోసం 165 లేదా వెడల్పాటి టైర్లు ఒక నవీకరణ సిఫార్సు మేరకు అందిస్తున్నారు.

Table 1

లోపలి భాగాలు


అయితే అంతర్గత భాగాలు చాలా నాణ్యతతో ఉత్తమ రూపకల్పనతో చేయబడటం వలన ఇది స్వాగతించ బడింది. ఇయాన్ ఈ విభాగంలో ఉత్తమ మయిన డాష్ బోర్డ్ కలిగి ఉంటుంది. బహుశా ఇది ఇటీవల విడుదలయిన రెనాల్ట్ తో సమానం. హ్యుందాయ్ యొక్క అద్భుతమైన నిర్మాణ నాణ్యత వలన లోపలి భాగాలు చూడటానికి అద్భుతంగా ఉంటాయి.

IMAGE9

లోపలి పరికరాలు ఒక నలుపు మరియు లేత గోధుమరంగు లేఅవుట్ ని కలిగి ఉంటాయి.

IMAGE10

ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఫీచర్స్ ఒక పెద్ద వృత్తాకార పాడ్ కలిగి ఉంటుంది. దీని ట్రిప్ మీటర్ మరియు షిఫ్ట్ ఇండికేటర్ లు స్పీడోమీటర్ మరియు దిగువన ఒక MIDని కలిగి ఉంది. ఇంధన స్థాయి మరియు ఇంజిన్ ఉష్ణోగ్రత ప్రమాణాలు ఇరువైపులా రెండు చిన్న వృత్తాకార ప్యాడ్లు కలిగి ఉన్నాయి. మొత్తంమీద, మీటర్లు సులభంగా రీడబుల్ గా ఉంటాయి మరియు విలక్షణముగా రూపొందించబడ్డాయి. టాకొమీటర్ లేకపోవడం చాలా చిన్న విషయంగా భావించారు. అయితే టాప్ వేరియంట్లలో అదే విధమయినవి కలిగి ఉన్నాయి.

IMAGE11

స్టీరింగ్ వీల్ చక్కగా మధ్యలో ఒక V- ఆకారపు వెండి హైలైట్‌గా రూపకల్పన చేయబడి ఒక టాడ్ పెద్దవిగా ఒక మంచి పరిమాణం కలిగి ఉంటుంది. స్టీరింగ్ వీల్ కూడా ఈ సెగ్మెంట్ లో మొదటి సారిగా వంపు సర్దుబాటు కలిగి ఉంటుంది.

IMAGE12

సెంటర్ కన్సోల్ క్రింద మధ్య ఎసి వెంట్స్ మరియు ఒక 2 దిన్ ఆడియో వ్యవస్థ మరియు ఎయిర్ కండిషనింగ్ నియంత్రణలు ఉన్నాయి. దాని స్విచ్‌లు మరియు నాబ్స్ మంచి పరిమాణం మరియు నాణ్యతని కలిగి ఉంటాయి.

IMAGE13

గ్లోవ్ బాక్స్ విసృతంగా మరియు లోతుగా ఉంటుంది. ఇతర నిల్వ ఖాళీలు డాష్ బోర్డ్ పైన నిల్వ స్పాట్ రూపంలో ఉంటాయి. మధ్యలో ఫ్రంట్ డోర్లు, డోర్ పాకెట్స్ మరియు కప్ హోల్డర్లు మరియు బాటిల్ హోల్డర్స్ ని కలిగి ఉంటాయి.

IMAGE14

ముందు మరియు వెనుక సీట్లు రెండు ముఖ్యంగా ఈ విభాగంలో వీరు అద్భుతమైన సౌకర్యంతో అందిస్తున్నారు. ముందు సీట్లు చాలా సమర్ధవంతంగా ఇంటిగ్రేటెడ్ హెడ్ రెస్ట్ కలిగి మరియు మంచి కుషన్ ని వాడబడటం వలన చాలా మెత్తగా ఉంటాయి. వెనుక వైపు కూడా ఈ విభాగంలో ఉత్తమమయిన లక్షణం ఏమిటంటే అత్యధిక స్పేస్ కలిగి ఉండటం. ( ఈ విషయంలో ఆశ్చర్యం ఏమీ లేదు ఎందుకనగా ఇయాన్ లో శాంత్రో మరియు ఐ 10 లాగా అదే వీల్‌బేస్ ని కలిగి ఉంటుంది)

IMAGE15

బూట్ స్పేస్ 215 లీటర్లు ఉంటుంది. అనగా మీ లగేజ్ విలక్షణముగా వెనుక ఉంచుకుని ప్రయాణం కొనసాగించ వచ్చును. బూట్ స్పేస్ ఆల్టో యొక్క 177 లీటర్ల మరియు nanos అంతులేని 80 లీటర్ల విభాగంలో అతి పెద్ద మైళ్ళలో ఒకటి. కొత్తగా వచ్చినటువంటి రెనాల్ట్ వాహనం 300 ల లీటర్ల అత్యధిక స్పేస్ తో ఈ ఇయాన్ వాహనాన్ని బీట్ చేసింది.

Table 2

పనితీరు


హ్యుందాయ్ ఇయాన్ ఇప్పుడు రెండు రకాల పెట్రోల్ ఆప్షన్స్ తో అందుబాటులో ఉంది. 0.8L IRDE ఇంజిన్ మరియు 1.0L కప్పా ఇంజిన్ ని కలిగి ఉంటుంది.

ఇయాన్ 0.8L IRDE


IMAGE16

హ్యుందాయ్ ఇయాన్ 0.8L 814 సిసి, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ శక్తితో 55 బిహెచ్‌పిల శక్తిని 5500 ఆర్‌పిఎమ్ వద్ద మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 76 ఎన్ఎమ్ల గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఒకే రకమయిన పరిమాణంలో ఐ 10, 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో ఒక సిలిండర్‌ను కలిగి వస్తుంది. ఇంజిన్ చక్కగా శుద్ధి చేయబడింది. కానీ ఇప్పటికీ గేర్ లివర్ ద్వారా మొదలు అయిన ఇంజిన్ అని దీనిని చెప్పవచ్చును.

ఇంజిన్ గరిష్ట ఇంధన సామర్ద్యం చే రూపొందించబడింది. కాబట్టి బొత్తిగా దీని పనితీరు అద్భుతంగా ఉంటుందని ఆశించకండి. 3-సిలిండర్ యూనిట్ ఉత్తమ నగర డ్రైవింగ్ కి సరిపోతుంది. థొరెటల్ స్పందన మరియు తక్కువ ముగింపు విద్యుత్ సరఫరా అంత చెడ్డగా ఏమీ లేదు. ఇంజిన్ త్వరణం రహదారుల లో 120 km / h గా ఉంటుంది. కానీ అది ట్రాఫిక్ లాడెన్ నగరం రోడ్లు లేదా రహదారుల లో గేర్‌బాక్స్ ఉండటం వలన మీరు ఆశించిన పనితీరును ఇవ్వగలుగుతుంది.

దీని క్లచ్ కొంచెం పెద్దగా ఉండి తేలికయిన అనుభవాన్ని ఇస్తుంది. దీని స్టీరింగ్ బరువు లేకుండా ఉండటం వలన దీని డ్రైవింగ్ ని అలవోకగా చేయవచ్చును. అయితే దీని స్టీరింగ్ మరీ బరువు లేకుండా వుండటం వలన హై వే మీద వెళ్ళేటప్పుడు చాలా కష్టతరంగా మారుతుంది. అంటే మూడంకెల వేగంతో వెళ్ళేటప్పుడు మాత్రమే. ఇంకా వక్ర ప్రాంతాలలో వెళ్ళేటప్పుడు ఇది ఎలాంటి అనుభూతిని ఇస్తుందో ఇంకా వివరాలు తెలియలేదు.

Table3

ఇయాన్ 1.0L కప్పా


IMAGE17

హ్యుందాయ్ ఒక 1.0 లీటర్ ఇంజన్ ఎంపికను ఆల్టో వాహనానికి పోటీగా కలిగి ఉండ బోతోంది. ఇది ఒక 0.8-లీటరు మరియు 1.0 లీటర్ ఇంజన్ ని కలిగి ఉంటుంది.ఇయాన్ 1.0 లీటర్ కప్పా 998 సీసీ, 3-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ ని కలిగి ఉండి 6200 ఆర్‌పిఎమ్ వద్ద 68 బిహెచ్పి శక్తిని మరియు 94 ఎన్ఎమ్ల గరిష్ట స్థాయికి టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ సిస్టమ్‌తో, ఇయాన్ 1.0L 0.8L ఇయాన్ ఒక బిట్ నెమ్మదిగా అని భావించే వారికి ఇది అందుబాటులో ఉంటుంది. భారీ తేడా కాకపోయినప్పటికీ, 1.0-L బిట్ మరింత జిప్పీ ఇంజిన్ అందిస్తున్నాయి. మరియు హ్యుందాయ్ కూడా చిన్న ఇంజిన్లతో జేర్కినేస్స్ జాగ్రత్త తీసుకున్నారు. అయితే యాంత్రికంగా ఎటువంటి మార్పులూ ఉండవు మరియు ఇయాన్ 1.0L 0.8L వంటి బ్రిస్క్ నెస్ తో ప్రవర్తిస్తుంది. ఇయాన్ లో 1.0L మాగ్నా + (పి) వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.

రైడ్ మరియు హాండ్లింగ్


IMAGE18

రైడ్ నాణ్యత మరియు నిర్వహణ లక్షణాలు చాలా బావున్నాయి. 0.8L మరియు 1.0L రెండు సస్పెన్షన్ సెటప్ లలో ఎటువంటి విభేదాలు ఉండవు. హ్యుందాయ్ ఇయాన్ సాధారణ సస్పెన్షన్ బాధ్యత లు అయినటువంటి మాక్‌ఫెర్సన్ ముందు మరియు వెనుక బీమ్ ఆక్సిల్ లని కలిగి ఉంటుంది. ఇయాన్ వాహనం రోడ్లు నునుపుగా ఉన్నప్పుడు ఎటువంటి సమస్య లేకుండా వేల్లగాలుగుతుంది. అయితే కటినమ్గా వెళ్తున్నప్పుడు దీని యొక్క ప్రతీ బిట్లో కూడా మంచి అనుభూతిని పొందుతారు.

దీని నిర్వహణ విషయానికి వస్తే ఈ ఇయాన్ గురించి వివరించడానికి మాటలు సరిపోవు. హ్యుందాయ్ ఇయాన్ ఏ డ్రామా లేకుండా దాని యొక్క ప్రయాణం సాగిపోతుంది. అలాగే ట్రాఫ్ఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా దీని ప్రయాణం మనకి సహకరిస్తుంది. రహదారుల మీద సరళ రేఖా స్థిరత్వం చాలా బాగా ఉంటుంది. ఇది వక్రంగా ఉన్న ప్రాంతాలలో కూడా దూసుకేల్లగలుగుతుంది అని నమ్మకంగా చెప్పవచ్చు.

అయితే బరువు లేకుండా తేలికగా ఉన్న స్టీరింగ్ సిటీ వాతావరణం లో అయితే బాగానే ఉంటుంది. అయితే రహదారులపై దీని డ్రైవ్ ఎలా ఉందొ ఎటువంటి సమాచారం లేదు. దీని బ్రేకింగ్ వ్యవస్థ కూడా చాలా బాగా పని చేస్తుంది. ఎక్కువ వేగంతో వెళ్ళేటప్పుడు కూడా ఈ బ్రేకులు సమర్దవంతంగా పని చేస్తాయి.

భద్రత


IMAGE19

హ్యుందాయ్ EON యొక్క భద్రతా లక్షణాలను చూసినట్లయితే రెయిన్ ఫోర్సేడ్ బాడీ స్ట్రక్చర్ ముందు మరియు వెనుక సీట్ బెల్ట్స్, పిల్లల భద్రత కోసం వెనుక డోర్ల లాకింగ్ సిస్టం, ఇంజిన్ ఇమ్మోబిలయిజర్, ముందువైపు ఫాగ్ ల్యాంప్స్ మరియు డ్రైవర్ ఎయిర్ బ్యాగ్ లు ఉన్నాయి. ఇవి స్పోర్ట్ వేరియంట్లో మాత్రమే.

Table 4

వేరియంట్స్


హ్యుందాయ్ ఇయాన్ ఆరు రకాల వేరియంట్స్ తో లభ్యమవుతుంది. దీనిలో అయిదు 0.8L వెర్షన్ కోసం అవి డి-లైట్, డి-లైట్ + ఎరా + మాగ్న మరియు స్పోర్ట్ లు మరియు 1.0-ఎల్ వెర్షన్ కోసం ఒక మాగ్నా + (పి) ఉంటుంది.

Table5

డి-లైట్ వేరియంట్ లో ముందు మరియు వెనుక సీట్ బెల్ట్స్ అత్యంత ప్రాధమిక మరియు వైవిధ్యమయిన ఇంజిన్ ఇమ్మోబిలైజార్,ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, బెంచ్ వెనుక సీట్, ద్వంద్వ ట్రిప్ మీటర్, రిమోట్ ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్ మరియు టేయిల్గేట్ లు ఉంటాయి.

డి-లైట్ + తో, మీరు ముందు స్పీకర్ గ్రిల్ మరియు చాలా అవసరమైన వాయివుని కండీషనర్ తో మరియు పవర్ స్టీరింగ్ ని కూడా పొందండి.

ఎరా + వేరియంట్ మీకు ఎల్ ఫై జి ఇందన ఉపాది మరియు రంగు షేడ్ ఉన్న అద్దం, మరియు బాడి కలర్ బంపర్, సిల్వర్ టచ్ ఉన్న సెంటర్ ఫేషియా, బాటిల్ హోల్డర్, ఫ్రంట్ పవర్ విండోస్ మరియు ముందు డోర్ అర్మ్రేస్ట్ వంటి లక్షణాలు కలిగి ఉంటుంది.

మన అభిమాన మాగ్నా + సెంట్రల్ లాకింగ్, అంతర్గతంగా సర్దుబాటు చేసుకోగల వింగ్ మిర్రర్స్, రూఫ్ ఆన్టేనా, ముందు మరియు వెనుక స్పీకర్ గ్రిల్, రియర్ పార్సెల్ ట్రే మరియు 2 DIN రేడియో + MP3 ఆడియోలు అందించబడతాయి.

టాప్ ఎండ్ స్పోర్ట్స్ కీ లెస్ ఎంట్రీ, ముందువైపు ఫాగ్ ల్యాంప్స్, డ్రైవర్ ఎయిర్‌బ్యాగ్, బాడీ రంగు ORVMs మరియు డోర్ మరియు లోహ ముగింపు 3-స్పోక్ స్టీరింగ్ వీల్ ని పొందుతారు.

మాగ్నా+ (0) లో ఉన్న ఫీచర్స్ ఏమిటంటే ముందు ఫాగ్ ల్యాంప్స్, బాడీ రంగు వింగ్ అద్దాలు మరియు డోర్ హ్యాండిల్స్ ఉంటాయి.

తుది విశ్లేషణ


IMAGE20

హ్యుందాయ్ ఇయాన్ ఇతర కార్ల యొక్కలక్షణాలతో స్ఫూర్తి పొందింది. రెనాల్ట్ క్విడ్ గనుక చూసినట్లయితే ఇది చూడటానికి అద్భుత లక్షణాలని కలిగి ఉంటుంది. అయితే ఇది దాని తరగతిలో ఉత్తమ నాణ్యతని కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది మంచి ఇందన సామర్ధ్యాన్ని మరియు పొదుపు లక్షణాలని కలిగి ఉంటుంది. అందువలన ఈ కారు ఈ విభాగంలో చూడటానికి గొప్పగా విలక్షణ లక్షణాలని కలిగి ఉంటుంది. మీరు నిరభ్యంతరంగా ఈ కారుని ఎంపిక చేసుకోవచ్చును.

ఇయాన్ ని ఖచ్చితంగా ఆల్టో అందిస్తుంది. ఇది దాదాపు రెనాల్ట్ క్విడ్తో ఖచ్చితంగా పోటీపడనుంది. అయితే ఈ రెండింటి మద్య ఒక నిర్ధారణకి వచ్చారు. అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే ఇయాన్ క్విడ్ కి పైగా కొత్త K బ్లాక్ ని కలిగి ఉంటుంది. ఏది ఏమయినా ఇది క్విడ్ కన్నా మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది ఇప్పుడు అందుబాటులో ఉంది. దీని కొనుగోలు కోసం ఎక్కువ కాలం వేచి చూడాల్సిన అవసరం లేదు.