టయోటా ఇతియోస్

` 6.6 - 9.2 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

టయోటా ఇతర కారు మోడల్‌లు

 
*Rs

టయోటా ఇతియోస్ వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
మార్కెట్ లో చాలా ప్రారంభాలు జరిగాక టయోటా సంస్థచే ప్రారంభించబడిన ఆధునిక ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ టయోటా ఎతియోస్. ఇది అంతర్గత మరియు బాహ్య భాగాలలో కొన్ని కీలక నవీకరణలను పొందింది. అదే సమయంలో, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ మరియు డ్రైవర్ యొక్క సీట్ బెల్ట్ నోటిఫికేషన్ ఇవన్నీ ప్రస్తుతం అన్ని వేరియంట్లకి ప్రామాణికంగా అందుబాటులో ఉన్నాయి. అయితే, అగ్ర శ్రేణి వేరియంట్లు వెనుక పార్కింగ్ సెన్సార్లు మరియు విద్యుత్‌తో సర్దుబాటు చేయగల బయటవైపు మిర్రర్స్ తో అమర్చబడి ఉన్నాయి. ఇది కొనుగోలుదారులు ఎంచుకునేందుకు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో ప్రస్తుతం అందుబాటులో ఉంది. అన్ని పెట్రోల్ వేరియంట్లు 1.5-లీటర్ ఇంజన్ తో అమర్చబడి ఉన్నాయి. అలానే అన్ని డీజిల్ వేరియంట్లు 1.4 లీటర్ ఇంజిన్ తో అమర్చబడి ఉన్నాయి. ఈ రెండు ఇంజన్లు కూడా ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ వ్యవస్థ తో అమర్చబడి ఉన్నాయి. ఈ ఇంజిన్లలో వివరణలు ఎటువంటి నవీకరణలు లేకుండా అవుట్గోయింగ్ మోడల్ లానే ఉంటుంది. బాహ్య స్వరూపాల పరంగా ఈ సెడాన్ క్రోమ్ ట్రీట్ మెంట్ తో ఒక కొత్త రేడియేటర్ గ్రిల్ ని పొంది ఉంది. బేస్ వేరియంట్ కూడా ఒక కొత్త గ్రిల్ ని శరీర రంగులో పొంది ఉంది. అయితే దీనిలో ఉన్న ఇతర బాహ్య లక్షణాలు అయినటువంటి హెడ్‌లైట్ క్లస్టర్, అల్లాయ్ వీల్స్, బంపర్ మరియు టెయిల్‌గేట్ లో ఎటువంటి మార్పు లేదు. కార్ల తయారీదారుడు అగ్ర శ్రేణి వేరియంట్లలో అల్లాయ్ వీల్స్ ని ఒక ప్రామాణిక లక్షణంగా అందించారు. ఈ సెడాన్ యొక్క లోపల భాగాలు ఇప్పుడు క్రోమ్ చేరికలతో మరింత ఆకర్షణీయంగా అందుబాటులో ఉన్నాయి. దీని అంతర్భాగాలలో సీట్లు మరియు డోర్ ప్యానెల్లు కొత్త ఫాబ్రిక్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంటాయి. దీని డాష్‌బోర్డ్ యొక్క డిజైన్ మరియు ఇతర అంతర్గత అంశాలు అవుట్గోయింగ్ మోడల్ నుండి తీసుకోబడినవి. ఈ సెడాన్ లో చాలా హెడ్ స్పేస్ మరియు షోల్డర్ స్పేస్ ఉండి ఐదుగురు ప్రయాణీకులు కూర్చోడానికి సౌకర్యవంతంగా ఉంటుంది. ఇంకా దీనిలో ఏ.సి యూనిట్, విద్యుత్ పవర్ స్టీరింగ్, డ్రైవర్ సీట్ ఎత్తు సర్దుబాటు మరియు వెనుక డీఫాగర్ వంటి సౌకర్య లక్షణాలు అందుబాటులో ఉన్నాయి. అయితే, ఈ లక్షణాలన్నీ మధ్య మరియు అగ్ర శ్రేణి వేరియంట్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. సంస్థ దీని అగ్ర శ్రేణి వేరియంట్లకు లెథర్ తో చుట్టబడిన బహుళ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ని అందించింది. ఈ సెడాన్ ఇంజిన్ ఇమ్మొబలైజర్ మరియు డోర్ అజార్ వార్నింగ్ వంటి భద్రతా అంశాలతో కూడా అందించబడుతున్నది. కారు తయారీదారుడు ఈ సెడాన్ ని 3-సంవత్సరాల లేదా 100000 కిలోమీటర్లు ఒక ఆకర్షణీయమైన వారంటీ తో అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ వాహనం ప్రవేశ స్థాయి సెడాన్ విభాగంలో ఫోర్డ్ క్లాసిక్, షెవ్రొలె సెయిల్ మరియు ఫియట్ లీనియా క్లాసిక్ వంటి వాటితో పోటీ పడుతున్నది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


ఈ సెడాన్ సిరీస్ అదే పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ ఎంపికల తో అందుబాటులోనికి వస్తుంది. దీని పెట్రోల్ ఇంజిన్ ఆధునిక ఎలక్ట్రానిక్ ఇంధన ఇంజెక్షన్ వ్యవస్థను విలీనం చేసుకొని ఇంధన సామర్ధ్యాన్ని మరింత మెరుగుగా కనబరుస్తుంది. ఈ సెడాన్ హైవే పైన 16.78kmpl మైలేజ్ ని మరియు నగర రోడ్లపైన 12kmpl మైలేజ్ ని అందిస్తుంది. అయితే, డి-4డి డీజిల్ ఇంజన్ ఒక కామన్ రైల్ ఇంధన ఇంజెక్షన్ టెక్నాలజీ తో అమర్చబడి ఉంది. దీని పవర్ ప్లాంట్ నగర రోడ్లపై 18kmpl మైలేజ్ ని అలానే హైవేస్ పై 23.59kmpl మైలేజ్ ని అందిస్తుంది.

శక్తి సామర్థ్యం:


డీజిల్ ఇంజన్ 4-సిలిండర్లు మరియు 8 కవాటాలు కలిగి ఎస్ ఒహెచ్ సి వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా పనిచేస్తుంది. ఈ పవర్ ప్లాంట్ 67.04bhp గరిష్ట శక్తి మరియు 170Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అయితే దీనిలో పెట్రోల్ వెర్షన్ డబుల్ ఓవర్ హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ఇంజిన్ 88.73bhp గరిష్ట శక్తిని మరియు 132Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


రెండు పెట్రోల్ మరియు డీజిల్ వేరియంట్లు రెండూ కూడా ఒక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ సిస్టమ్ తో అమర్చబడి ఉంది. దీనిలో డీజిల్ వేరియంట్లు సుమారు 16 నుండి 17 సెకన్లలో 100 kmph వేగం వరకూ చేరుకుంటాయి. అదేసమయంలో, 160 కు 165 కిలోమీటర్ల గరిష్ట వేగం వరకూ చేరుకోగలదు. మరోవైపు, పెట్రోల్ వేరియంట్స్ 15 సెకన్లలో 100kmph వేగాన్ని చేరుకోగలదు. ఇది గరిష్టంగా 155kmph వేగాన్ని చేరుకోగలదు.

వెలుపలి డిజైన్:


ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ యొక్క బాహ్య రూపం అంతా కూడా అవుట్గోయింగ్ మోడల్ లానే కనిపిస్తుంది. అయితే, ఇది ఒక కొత్త బ్రాండ్ రేడియేటర్ గ్రిల్ పొందడం ద్వారా చూడడానికి ఆకర్షణీయమైన లుక్ వస్తుంది. కారు తయారీదారుడు ఈ గ్రిల్ కి క్రోమ్ పూత ఇచ్చారు. ఇంకా, దీనిలో సంస్థ యొక్క లోగో తిరిగి అమర్చబడింది. అయితే, దీనిలో బేస్ వేరియంట్ శరీరం రంగు గ్రిల్ తో అందజేయబడి ఉంది. అంతేకాకుండా, దీని బాహ్య స్వరూపాలు ఎటువంటి నవీకరణను పొందలేదు. దీని హెడ్‌లైట్ క్లస్టర్ చాలా పెద్దది మరియు హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు మరియు టర్న్ ఇండికేటర్లతో అమర్చబడి ఉంది. దీని ముందర శరీర రంగు బంపర్ సమాంతరమైన పొజిషన్ స్ట్రిప్స్ తో పాటూ పెద్ద ఎయిర్ డ్యామ్ తో అమర్చబడి ఉంది. దీనిలో అధిక శ్రేణి వేరియంట్లు ఒక జత ఫాగ్ ల్యాంప్స్ తో అమర్చబడి ఉన్నాయి. అలానే బేస్ మరియు మధ్య శ్రేణి వేరియంట్లు వాటిని అమర్చుకొనే సదుపాయాన్ని కలిగి ఉన్నాయి. దీని పక్క ప్రొఫైల్ పెద్దగా మార్పు చేయబడి లేదు. కానీ చూడడానికి చాలా డీసెంట్ గా కనిపిస్తుంది. దీనిలో బాహ్య వింగ్ మిర్రర్స్ తో పాటూ డోర్ హ్యాండిల్స్ శరీర రంగులో పెయింట్ చేయబడ్డాయి. అయితే బి పిల్లర్ మాత్రం నల్లని రంగులో అందించబడుతున్నది. అయితే, ఈ అత్యాధునిక లక్షణాలు ప్రవేశ స్థాయి వేరియంట్ లో లేవు. దీనిలో అగ్రశ్రేణి వేరియంట్లు స్టైలిష్ 15 అంగుళాల అల్లయి వీల్స్ తో అందించబడి హుందాగా కనిపిస్తాయి. అయితే, మిగిలిన వేరియంట్లు సంప్రదాయ స్టీల్ వీల్స్ తో అమర్చబడి పూర్తి వీల్ కవర్స్ తో కప్పబడి ఉంటాయి. దీని వెనుక ప్రొఫైల్ దీని ముందు వెర్షన్ వలే ఉంటుంది. దీనిలో గమనించదగ్గ అతి ముఖ్యమైన మార్పు ఏమిటంటే , దీనిలో బంపర్ ఇప్పుడు పార్కింగ్ సెన్సార్లతో అమర్చబడి ఉంటుంది. దీనిలో టెయిల్గేట్స్ సమాంతరంగా ఉండే క్రోమ్ స్ట్రిప్స్ తో బిగించబడి సంస్థ యొక్క లోగో తో పొందుపరచబడి ఉంటుంది. ఇది పెద్ద స్పష్టమైన లెన్స్ గల టెయిల్ లైట్ క్లస్టర్ తో చుట్టబడి, అధిక తీవ్రత బ్రేక్ లైట్లు, కర్టసీ ల్యాంప్స్ మరియు టర్న్ ఇండికేటర్లతో అమర్చబడి ఉంటుంది.

వెలుపలి కొలతలు:


ఈ సెడాన్ యొక్క మొత్తం పొడవు 4265mm, వెడల్పు 1695mm (బాహ్య వింగ్ అద్దాలతో సహా) మరియు ఎత్తు 1510mm. దీని యొక్క గ్రౌండ్ క్లెయరెన్స్ 161mm. అయితే ఈ వాహనం 2550mm వీల్‌బేస్ ని కలిగియుండి చాలా పొడుగ్గా కనిపిస్తుంది.

లోపలి డిజైన్:


దీని అంతర్భాగాలలో చాలా నవీకరణలు చేయబడి సరికొత్త లుక్ ని పొందగలిగింది. అయితే, దాని డాష్‌బోర్డ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు స్టీరింగ్ సెంట్రల్ కన్సోల్ అవుట్గోయింగ్ మోడల్ నుండి తీసుకోబడినవి. దీనిలో సీట్లు మరియు డోర్ ప్యానెల్స్ ఇప్పుడు కొత్త ఫాబ్రిక్ అపోలిస్ట్రీ తో కప్పబడి ఉంది. బేస్ వేరియంట్ కాకుండా, దీనిలో మిగతా అన్ని వేరియంట్లు సర్దుబాటు చేసుకోగలిగే హెడ్ రెస్ట్రైన్స్ , దిండు వంటి వెనుక సీటు మరియు డ్రైవర్ సీటు కి ఎత్తు సర్దుబాటు చేసుకోగలిగే సౌకర్యం వంటి లక్షణాలను కలిగి ఉన్నాయి. ఇంకా, చుట్టూ ఏ.సి వెంట్లు, సెంటర్ ఫేసియా మరియు గేర్‌షిఫ్ట్ లెవెర్ మూడు కూడా క్రోమ్ పూతతో అందించబడి చాలా ప్రత్యేఖంగా కనిపిస్తాయి. అయితే, ఈ లక్షణాలు అగ్ర శ్రేణి వేరియంట్లో మాత్రమే అందించబడుతున్నాయి. వీటితోపాటు, కారు తయారీదారుడు దీనిలో విఎక్స్ వేరియంట్ కి లెథర్ తో చుట్టబడిన మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్ ని ప్రామాణికంగా అందిస్తున్నారు. ఇది ఒక త్రీ- స్పోక్ స్టీరింగ్ వీల్ ని కలిగియుండి సిల్వర్ తో పాటుగా క్రోమ్ చేరికలతో అలంకరించబడింది. ఇవికాకుండా, మిగిలిన అన్ని అంశాలు దాని అవుట్గోయింగ్ మోడల్ నుండి తీసుకోబడినవి. ఈ సెడాన్ బయట నుండి చిన్నగా కనిపించినా దీని యొక్క పొడవైన వీల్‌బేస్ కారణంగా కాబిన్ లోపల మాత్రం చాలా విశాలంగా ఉంటుంది. ఈ సెడాన్ యొక్క ప్రధాన కీలకాంశం ఏమిటంటే, ఇది 595-లీటర్ల బూట్ కంపార్ట్మెంట్ కలిగి ఉంది. బహుశా ఈ విభాగంలో ఇదే ఉత్తమమైన అంశం. కారు తయారీదారులు ఈ సెడాన్ కి గ్లోవ్ బాక్స్, డిజిటల్ ట్రిప్ మీటర్, ఫ్రంట్ క్యాబిన్ లైట్లు మరియు ఒక కోటు హుక్ తో పాటుగా అసిస్ట్ గ్రిప్ ఇలా అనేక వినియోగ ఆధారిత లక్షణాలను అందించారు.

లోపలి సౌకర్యలు:


కార్ల తయారీ సంస్థ ప్రస్తుతం కొనుగోలుదారులు ఎంచుకోవడానికి మూడు చక్కదిద్దిన స్థాయిలలో ఈ సెడాన్ సిరీస్ ని అందిస్తోంది. ఇప్పుడు, కార్ల తయారీ సంస్థ దీని అగ్ర శ్రేణి వేరియంట్లని విద్యుత్‌తో సర్దుబాటు చేయగల బయట అద్దాలు మరియు వెనుక పార్కింగ్ సెన్సార్లు తో అందిస్తుంది. దీని ప్రవేశ స్థాయి జె వేరియంట్ టిల్ట్ అడ్జస్ట్మెంట్ తో ఎలక్ట్రిక్ పవర్ సహాయక స్టీరింగ్, ముందరి కాబిన్ లైట్లు, చల్లని గ్లోవ్ బాక్స్, డిజిటల్ ట్రిప్‌మీటర్, ఏడు సీసా హోల్డర్లు, ముందు మరియు వెనుక తలుపు పాకెట్స్, రిమోట్ ఫ్యూయెల్-మూత మరియు టెయిల్‌గేట్ ఓపెనర్, డ్యూయల్ ఫ్రంట్ సన్ విజర్స్ మరియు డే/నైట్ లోపల రేర్ వ్యూ మిర్రర్ వంటి అంశాలను కలిగి ఉంది. ఇది పక్కన పెడితే, దీని మధ్య శ్రేణి జి వేరియంట్ కోట్ హుక్ తో మూడు అసిస్ట్ గ్రిప్‌లు, పాసింజర్ వైపు సన్ విజర్, డ్రైవర్ సీట్ ఎత్తు సర్దుబాటు, దిండు వంటి వెనుక హెడ్‌రెస్ట్‌లు, 12వి అనుబంధ పవర్ అవుట్లెట్, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ మరియు డ్రైవర్ వైపు ఆటో డౌన్ ఫంక్షన్ తో పవర్ విండోలు వంటి లక్షణాలను కలిగి ఉంది. కార్ల తయారీ సంస్థ దీని ఎగువ శ్రేణి విఎక్స్ వేరియంట్ కి వెనుక డీఫాగర్, ఒక టాకొమీటర్ మరియు బహుళ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్ ని అందిస్తుంది.

లోపలి కొలతలు:


ఈ సెడాన్ లోపల నుండి చాలా విశాలంగా పుష్కలమైన సీటింగ్ స్పేస్ తో కనీసం ఐదు ప్రయాణీకులకు సరిపడే విధంగా ఉంటుంది. ఈ విభాగంలో ఏ ఇతర సెడాన్ కి లేనటువంటి విధంగా ఇది 595-లీటర్ల చాలా పెద్ద బూట్ కంపార్ట్మెంట్ ని కలిగి ఉంది. మరోవైపు, ఇది 45 లీటర్ల స్టోరేజ్ సామర్థ్యం తో ఒక మంచి ఇంధన ట్యాంక్ ని కలిగి ఉంది.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


దీనిలో పెట్రోల్ వేరియంట్లు 1.5-లీటర్ పవర్ ప్లాంట్ తో అమర్చబడి 1496cc స్థానభ్రంశాన్ని అందిస్తాయి. ఈ డిఒహెచ్ సి ఆధారిత ఇంజిన్ 4-సిలిండర్లు మరియు 16-కవాటాలు కలిగియుండి ఎలక్ట్రానిక్ ఇంజెక్షన్ వ్యవస్థ ద్వారా ఇంధనం స్వీకరిస్తుంది. ఈ పవర్ ప్లాంట్ గరిష్టంగా 5600rpm వద్ద 88.73bhp శక్తిని మరియు 3000rpmవద్ద 132Nm టార్క్ ని అందిస్తుంది. మరోవైపు, దాని డీజిల్ వేరియంట్ 1.4-లీటర్ డి-4డి పవర్ ప్లాంట్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజక్షన్ టెక్నాలజీ తో జత చేయబడి ఉంది. ఇది ఒకే ఓవర్‌హెడ్ కామ్ షాఫ్ట్ వాల్వ్ ఆకృతీకరణ ఆధారంగా 4-సిలిండర్లు మరియు 8 కవాటాలు కలిగి ఉంది. ఈ ఇంజిన్ 3800rpm వద్ద 67.04bhp గరిష్ట శక్తిని మరియు 1800 నుండి 2400rpm వద్ద 170Nm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు ఆధునిక ఫైవ్ స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్‌బాక్స్ వ్యవస్థ జతచేయబడి ముందు చక్రాలు టార్క్ అవుట్‌పుట్ సేకరించేందుకు సహకరిస్తుంది.

స్టీరియో మరియు ఉపకరణాలు:


కారు తయారీదారుడు దీని మధ్య మరియు అగ్ర శ్రేణి వేరియంట్లకు రేడియో మరియు ఎంపి3 ప్లేబాక్ తో పాటు ఒక సిడి ప్లేయర్ ని అందించారు. ఇది యుఎస్ బి పరికరాల కోసం నాలుగు స్పీకర్లు మరియు పోర్ట్ ని కలిగి ఉంది. అయితే, దీని అగ్ర శ్రేణి వేరియంట్లు ఆడియో స్ట్రీమింగ్ కొరకు ఆక్స్-సాకెట్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ని కలిగి ఉన్నాయి. దీని విఎక్స్ వేరియంట్ ఇప్పుడు త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ తో అమర్చబడి ఉంది. ఈ స్టీరింగ్ వీల్ పైన ఆడియో నియంత్రణలు పొందుపరచబడినవి. అయితే, కొనుగోలుదారులు లోపలభాగాలకి లెదర్ సీటు అపోలిస్ట్రీ, ఫ్లోర్ కార్పెట్లు, వెనుక సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌లు మరియు వుడ్ చేరికలతో అనుకూలపరచవచ్చు. కారు తయారీదారుడు దీని మధ్య మరియు అగ్ర శ్రేణి వేరియంట్లకు రేడియో మరియు ఎంపి3 ప్లేబాక్ తో పాటు ఒక సిడి ప్లేయర్ ని అందిస్తుంది. ఇది యుఎస్ బి పరికరాల కోసం నాలుగు స్పీకర్లు మరియు పోర్ట్ ని కలిగి ఉంది. అయితే, దీని అగ్ర శ్రేణి వేరియంట్లు ఆడియో స్ట్రీమింగ్ కొరకు ఆక్స్-సాకెట్ మరియు బ్లూటూత్ కనెక్టివిటీ ని కలిగి ఉన్నాయి. దీని విఎక్స్ వేరియంట్ ఇప్పుడు త్రీ స్పోక్ స్టీరింగ్ వీల్ తో అమర్చబడి ఉంది. ఈ స్టీరింగ్ వీల్ పైన ఆడియో నియంత్రణలు పొందుపరచబడినవి. అయితే, కొనుగోలుదారులు లోపలభాగాలకి లెదర్ సీటు అపోలిస్ట్రీ, ఫ్లోర్ కార్పెట్లు, వెనుక సెంటర్ ఆర్మ్‌రెస్ట్‌లు మరియు వుడ్ చేరికలతో అనుకూలపరచవచ్చు. అయితే, బాహ్య భాగాలు అందమైన శరీర డికేల్స్, డెక్ లిడ్ స్పాయిలర్, విండో విజర్, సైడ్ నమూనాలతో, , స్టైలిష్ అల్లాయ్ వీల్స్ మరియు సైడ్ స్కర్ట్స్ సమితి తో అలంకరించబడి ఉంటాయి. వీటితోపాటు, నావిగేషన్ తో కూడిన టచ్‌స్క్రీన్ సమాచార వ్యవస్థ మరియు పార్కింగ్ కోసం ఇతర సహాయకర లక్షణాలనుఎంచుకోవచ్చు.

వీల్స్ పరిమాణం:


వాహన తయరీదారుడు దీని బేస్ మరియు మధ్య శ్రేణి వేరియంట్లకు సంప్రదాయ స్టీల్ వీల్స్ సమితిని అందించారు . అగ్ర శ్రేణి వేరియంట్లలో 15 అంగుళాల అల్లయి వీల్స్ సమితి అందించారు. ఈ రిమ్స్ పరిమాణం 185/60 R15 గల అధిక పనితీరు కలిగిన ట్యూబ్ లేని రేడియల్ టైర్లు తో కప్పబడి ఉంటాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


ఈ కొత్తగా పరిచయం చేయబడిన సెడాన్ సమర్ధవంతమైన బ్రేకింగ్ మెకానిజం అందించబడి ఎటువంటి వాతావరణ పరిస్థితులలోనైనా చక్కగా పనిచేస్తుంది. దీని ముందరి వీల్స్ వెంటిలేషన్ డిస్కుల సమితితో జతచేయబడినవి అలానే దీని వెనుక వీల్స్ సాలిడ్ డ్రమ్ బ్రేక్‌లతో జతచేయబడినవి. అన్ని డీజిల్ వేరియంట్లు ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ పాటూ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ని కలిగి ఉంటాయి. ఇది ఖచ్చితంగా యంత్రాంగాన్ని పెంచుతుంది. అయితే, ఈ వ్యవస్థ మధ్య మరియు అగ్ర శ్రేణి వేరియంట్లకి ఆప్ష్నల్ గా అందుబాటులో ఉంది. దీని ముందరి ఆక్సిల్ మక్ఫెర్సొన్ స్ట్రట్ తో బిగించబడగా, దీని వెనుక ఆక్సిల్ టార్షన్ బీమ్ సస్పెన్షన్ సిస్టమ్ తో బిగించబబడి ఈ సెడాన్ ని సమతుల్యంగా ఉంచుతుంది. కారు తయారీదారుడు ఈ వాహనానికి అత్యంత పనితీరుగల విద్యుత్ శక్తి సహాయక స్టీరింగ్ వ్యవస్థను విలీనం చేశారు. దీని కనీస టర్నింగ్ రేడియస్ 49మీటర్లు.

భద్రత మరియు రక్షణ:


ఈ సెడాన్ మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ మూడు వేరియంట్లు కూడా ముఖ్యమైన సౌకర్య లక్షణాలతో అమర్చబడ్డాయి. దీనిలో అన్ని వేరియంట్లకి డ్యుయల్ ఫ్రంట్ ఎయిర్బాగ్లు ప్రామాణికంగా అందుబాటులో ఉన్నాయి. ప్రవేశస్థాయి వేరియంట్లో డోర్ అజార్ వార్నింగ్, డే/నైట్ లోపల రేర్ వ్యూ మిర్రర్, డ్రైవర్ సీట్ బెల్ట్ వార్నింగ్ మరియు ఇంజిన్ ఇమ్మొబలైజర్ వంటి లక్షణాలు అందుబాటులో ఉన్నాయి. అయితే మధ్య శ్రేణి వేరియంట్లో డోర్ అజార్ వార్నింగ్, హెడ్‌లైట్ ఆన్ నోటిఫికేహన్, ఇ బి డి తో పాటూ ఏ బి ఎస్ మరియు కీలెస్ ఎంట్రీ ఫంక్షన్ అందుబాటులో ఉంది. తయారీదారులు అగ్ర శ్రేణి వేరియంట్లలో ముందర కూర్చున్న ప్రయాణికులకి ఎస్ ఆర్ ఎస్ ఎయిర్బాగ్స్ మరియు డ్రైవర్ సీట్ బెల్ట్ నోటిఫికేషన్ మరింత భద్రత చేకూర్చేందుకు అమర్చబడి ఉంటాయి.

అనుకూలాలు:


1. అమ్మకాల తరువాత సేవలు చాలా సంతృప్తినిస్తాయి.
2. పెట్రోల్ ఇంజిన్ పనితీరు చాలా గుర్తింపు పొందింది.
3. వెనుక పార్కింగ్ సెన్సార్లు చేర్చడం వలన చాలా సౌకర్యంగా ఉంటుంది.
4. 595-లీటర్ల సామర్థ్యం గల బూట్ కంపార్ట్మెంట్ ఉండడం వలన దీనికి పెద్ద ప్లస్ పాయింట్.
5. ధర పరిధి చాలా అనుకూలంగా ఉంటుంది.

ప్రతికూలాలు:


1. దీని బాహ్య భాగాలు మరిన్ని నవీకరణలను పొందవలసి ఉంది. .
2. ఇంధన సామర్ధ్యం అంత మెరుగుగా లేకపోవడం దీనికి ప్రతికూలత .
3. డీజిల్ ఇంజిన్ సామర్థ్యం మరియు పనితీరు మరింత అభివృద్ధి చేయవచ్చు.
4. గ్రౌండ్ క్లియరెన్స్ ఇంకా అభివృద్ధి చేయవలసి ఉంది.
5. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపిక లేకపోవడం ఒక ప్రతికూలత.