హోండా సిటి

` 8.5 - 13.6 Lac*

:బ్రాండ్ :మోడల్ నమూనాలు మరియు ధరలు

క్రింద వీక్షించండి - జాబితా యొక్క

ప్రకటన

హోండా ఇతర కారు మోడల్లు

 
*Rs

హోండా సిటి వీడియోలు

మేము యూట్యూబ్ నుండి ఉత్తమ వీడియోలను తీసుకున్నాము - అన్నింటిని వీక్షించండి

యొక్క సమీక్ష :బ్రాండ్ :నమూనా :దేశం

 
హోండా సిటీ కారు ని ఎంచుకోవడానికి కొనుగోలుదారులకు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది . ఈ కంపని ఇటీవల కొన్ని అదనపు ఫీచర్లతో ఒక కొత్త వేరియంట్ VX ఒప్టిఒన్ ను జోడించారు. ఈ వేరియంట్ వైట్ ఆర్కిడ్ పెర్ల్ అనె కొత్త బాహ్య రంగులొ అందుబాటులో ఉంటుంది. ఇందులొ ఆధునికమైన ఆVణ్ (ఆడియొ విడియొ నావిగెషన్ ) సిస్టెం అందజేసారు . ఇది 15.7cమ్ టచ్స్క్రీన్ ప్యానెల్ తొ వస్తుంది . అది భ్లుఎటూత్ కనెక్టివిటీ, Cఢ్/ఢ్Vఢ్ ప్లేబ్యాక్ కు మద్దతు ఇస్తుంది మరియు, రియర్ వ్యువ్ కెమెరా కుడా అందించబడినది . అదే సమయంలో, సాంకేతిక వివరణలు పరంగా, ఇందులొ ఎలాంటి మార్పులు చెయబడలెదు. రెండు ఇంజన్లు అదే శక్తి మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దాని యొక్క పెట్రోల్ వేరియంట్లు 1.5-లీటర్ ఇంజన్ తొ బిగించి ఉంటాయి. ఇది 1497cc డిస్ప్లేస్మెంట్ సామర్థ్యంతొ వస్తుంది . ఇది గరిష్ట శక్తి 117.3భ్ప్ మరియు 145ణ్మ్ టార్క్ ను ఉత్పత్తి చెస్తుంది. మరోవైపు, దాని డీజిల్ వేరియంట్లు 1.5-లీటర్, 1498cc మోటార్ తో వస్తాయి. ఈ మిల్లు వరుసగా 98.6భ్ప్ మరియు 200ణ్మ్ గరిష్ట శక్తి మరియు టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వేరియంట్ల ఆధారముగ, ఈ రెండు ఇంజన్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ లతొ జతపరచబడ్డాయి. ఇవి కారు ముందు చక్రాలకు ఇంజిన్ శక్తిని పంపిణీ చేస్తుంది మరియు రోడ్లపై మంచి పనితీరు అందచేస్తుంది. ఈ కంపెనీ యాంటి-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి మరింత ఆధునిక సధుపాయాలను అందచేసింది. దాని సస్పెన్షన్ వ్యవస్థ కూడా చాలా ప్రభావవంతమైనది. ఇది వాహనాన్ని బాగా సమతుల్య మరియు స్థిరంగా చేయడానికి సహాయపడుతుంది.

ఈ కారు బయట నుండి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. వెనుక ప్రొఫైల్ తో ప్రారంభిస్తే, దీనికి డీఫొగ్గెర్, బంపర్, ప్రకాశవంతమైన టైల్ లైట్ క్లస్టర్, మరియు పెద్ద విండ్స్క్రీన్ ఉంది. దీని ఎదురుగుండా ఒక ఆకర్షణీయమైన క్రోమ్ రేడియేటర్ గ్రిల్ ఉంది. ఇది మధ్యలో ప్రముఖ కంపెనీ లోగో తో పొందుపరచబడింది. వీటితో పాటు, ఒక పెద్ద హెడ్లైట్ క్లస్టర్, బంపర్ మరియు అనేక ఇతర అంశాలు కూడా ఉన్నాయి. ఈ వాహనం యొక్క వీల్ ఆర్చ్లులు విలక్షణముగా ఏర్పరచబడ్డాయి. వేరియంట్ల ఆధారముగ, ఉక్కు లేదా మిశ్రమ లోహ చక్రాలు బిగించబడి ఉన్నాయి. మరోవైపు, దాని అంతర్గత క్యాబిన్ లో గది దీపం, సన్ వైసర్స్, నిల్వ కంపార్ట్మెంట్ మరియు అనేక వినియోగ ఆధారిత కోణాలను అమర్చారు. ఈ క్యాబిన్ అద్భుతముగ, రెండు వేరు రంగులతో అలంకరించబదినది. ఇందులో నలుపు రంగు డాష్బోర్డ్ మరియు చెక్క పలుకులు అత్యాకర్షితంగా కనిపిస్తాయి. ఈ కంపెనీ వివిధ భద్రత అంశాలను ఈ కారు లో అందజెసింది. ఈ కంపెనీ వివిధ భద్రత అంశాలను ఈ కారు లో అందజేసింది . అవి ఏంటంటే ముందు ప్రయాణికుల కొరకు ఎయిర్ బ్యాగులు, పాదచారుల గాయం తీవ్రతను తగ్గించే సాంకేతికం, మరియు ఆCఏ (అడ్వ్యాన్సెడ్ కంప్యాటిబిలిటి ఇంజినీరింగ్) శరీర నిర్మాణం, డ్రైవర్ సీటు బెల్ట్ రిమైండర్ నోటిఫికేషన్, ఇంజన్ ఇమ్మొబిలైజెర్ తో భద్రతా అలారం ఇంకా మరెన్నొ రక్షణాత్మక సధుపాయాలు అందించారు. సెడాన్ విభాగంలో ఈ వాహనం టొయోటా ఇటియోస్, మారుతి సియాజ్, ఫోర్డ్ ఫియస్టా, స్కోడా రాపిడ్ మరియు ఫియట్ లీనియా తో పోటీ పడుతుంది.

మైలేజ్ మరియు ఇంధన సామర్థ్యం:


దీని యొక్క పెట్రోల్ ఇంజన్ మల్టీ పాయింట్ ఫ్యూయెల్ ఇంజెక్షన్ వ్యవస్థ తో చేర్చబడింది. ఇది మంచి మైలేజ్ అందించటానికి అనుమతిస్తుంది. దీని మాన్యువల్ వేరియంట్లు నగరం ట్రాఫిక్ పరిస్థితులలో 13.5క్మ్ప్ల్, మరియు పెద్ద రోడ్లపై 17.8క్మ్ప్ల్ మైలేజ్ ను ఉత్పత్తి చేయవచ్చు. అయితే, దాని ఆటోమేటిక్ వేరియంట్లు, రహదారులు మరియు నగరం రోడ్లపై 18క్మ్ప్ల్ మరియు 14.5క్మ్ప్ల్ ఉత్పత్తి చేస్తుంది . మరోవైపు, దాని డీజిల్ ఇంజన్ వేరియంట్లు కామన్ రైల్ ఆధారిత ఫ్యూయెల్ ఇంజెక్షన్ సరఫరా వ్యవస్థతో అమర్చబడి ఉన్నాయి. ఇది రహదారులపై సుమారు 26క్మ్ప్ల్ గరిష్ట మైలేజ్ ను ఇస్తుంది అదేసమయంలో, ఇది నగర పరిధిలో సుమారు 21.5క్మ్ప్ల్ ను ఇస్తుంది.

శక్తి సామర్థ్యం:


దీని డీజిల్ మిల్లు 3600ర్ప్మ్ వద్ద 98.6భ్ప్ గరిష్ట శక్తిని మరియు 1750ర్ప్మ్ వద్ద 200ణ్మ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, దీని 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ 6600ర్ప్మ్ వద్ద 117.3భ్ప్ అత్యధిక శక్తి మరియు 4600ర్ప్మ్ వద్ద 145ణ్మ్ టార్క్ ను పంపిణీ చేస్తుంది.

ఏక్సలరేషన్ మరియు పికప్:


ఈ కారు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్సులతో అందించబడింది. దీని మాన్యువల్ పెట్రోల్ వేరియంట్లు 170 నుండి 180 క్మ్ఫ్ పరిధిలో అత్యధిక వేగాన్ని సాధించగలవు అయితే, దాని ఆటోమేటిక్ వేరియంట్లు 185 క్మ్ఫ్ వేగాన్ని సాధించవచ్చు. అంతేకాక, ఈ వాహననికి 100 క్మ్ఫ్ వేగ పరిమితి దాటడానికి సుమరుగా 10-12 సెకన్లు పడుతుంది. మరోవైపు, దీని డీజిల్ పవర్ ప్లాంట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ తో జత చేయబడింది. ఇది కారుని సుమారు 180 క్మ్ఫ్ గరిష్ట వేగం సాధించడానికి సహాయపడుతుంది . ఇది 100 క్మ్ఫ్ వేగమును దగ్గరగా 13 సెకన్ల లో దాటగలదు .

వెలుపలి డిజైన్:


ఈ వాహనము ఏరోడైనమిక్ శరీర నిర్మాణం కలిగి ఉంటుంది. దాని ముందు ప్రొఫైల్ లొ క్రోమ్ రేడియేటర్ గ్రిల్ చాలా ఆకర్షనీయంగా కనిపిస్తుంది. దీని చుట్టూ పెద్ద హెడ్లైట్ క్లస్టర్ బిగించబడి ఉంది. ఇది శక్తివంతమైన హాలోజన్ హెడ్ల్యాంప్స్ తో అమర్చబడి ఉంది. దీని క్రింద బంపర్ శరీర రంగులో వస్తుంది. ఇది తదుపరి పెద్ద ఎయిర్ దం మరియు రెండు ఫాగ్ ల్యాంపులతో అమర్చబడి ఉంది. దీని గ్రీన్ టింటెద్ విండ్స్క్రీన్ రెండు వైపర్లతో వస్తుంది అయితే బోనెట్ దీని ముందు ప్రొఫైల్ని మరింత ఆకర్షనీయంగా కనిపించేల చేస్తుంది. దీని సైడ్ ప్రొఫైల్ లో శరీరం రంగు కలిగిన డోర్ హ్యాండిల్స్ మరియు వెనుక వీక్షణ అద్దాలు ఉన్నయి. వేరియంట్ల ఆధారముగ, దీని విలక్షణముగా ఏర్పరచబడిన వీల్ ఆర్చ్లులు ఉక్కు లేదా మిశ్రమ లోహ చక్రాలతో వస్తాయి. ఇవి తదుపరి వివిధ రహదారుల పరిస్థితులపై ఉన్నతమైన పట్టును ఇస్తాయి. మరొ వైపు, దీని వెనుక ప్రొఫైల్ చాల ఆకట్టుకునే విధముగా రూపొందించబడింది. ఇది కొన్ని గుర్తించదగిన అంశాలలో వస్తుంది. అవి ఏంటంటె ప్రకాశవంతమైన టైల్ లైట్ క్లస్టర్, రెందు రిఫ్లెక్టర్లతో సహ శరీర రంగు కలిగిన బంపర్ , డీఫొగ్గెర్, ఒక పెద్ద విండ్స్క్రీన్ ఇంక ఇతర అంశాలు కలిగి ఉన్నయి. క్రోమ్ పూతను కలిగిన టైల్ గేట్ సంస్థ యొక్క లోగో మరియు మోడల్ అక్షరాలతో చాలా ఆకర్షనియముగా కనిపిస్తుంది.

వెలుపలి కొలతలు:


ఈ వాహనం యొక్క మొత్తం పొడవు 4440మ్మ్ మరియు 1695మ్మ్ వెడల్పు కలిగి ఉంటుంది. దీని ఎత్తు సుమారుగా 1495మ్మ్ ఉంటుంది ఇంక ఇది ప్రయాణికులకు సౌకర్యవంతమైన అనుభూతిని ఇస్తుంది. అయితే, దీని యొక్క వీల్ బేస్ 2600మ్మ్ పొడవుతొ నిర్మించబడింది. అంతేకాకుండా, ఈ సెడాన్ కనీస గ్రౌండ్ క్లియరెన్స్ 165మ్మ్ వరకు వస్తుంది.

లోపలి డిజైన్:


హోండా సిటీ యొక్క అంతర్గత భాగము చాలా అందముగా అలంకరించబదినది. దీని విశాలమైన క్యాబిన్ అధిక నాణ్యత గల మరియు స్క్రాచ్ నిరోధక ప్లాస్టిక్ తో రూపొందించబడింది. డాష్బోర్డ్ నలుపు రంగులో చాలా బాగా కనిపిస్తుంది. ఇది తదుపరి ఇన్స్ట్రుమెంట్ పానెల్, ఆఛ్ యూనిట్, స్టీరింగ్ వీల్ మరియు ఆధునిక ఆడియో సిస్టమ్ తో అమర్చబది ఉంది. దీని యొక్క కొత్త VX ఓప్టిఒన్ వేరియంట్ ను అదనంగా ఆVణ్ (ఆడియొ విడియొ నావిగెషన్ ) సిస్టెం తో అందజెసారు. ఇది ఇది 15.7cమ్ టచ్స్క్రీన్ ప్యానెల్ తో వస్తుంది . ఇందులో అమర్చబడిన సీట్లు ప్రయాణికులకు చాలా సౌకర్యాన్ని ఇస్తాయి. ఇందులో విద్యుత్ సహాయంతో సర్దుబాటు అయ్యే డ్రైవర్ సీట్ మరియు, రెండవ వరుసలోని సీటుకు 60:40 స్ప్లిట్ ఆధారంగా మడత పెత్తె సౌకర్యం ఉంది. ఇవి కాకుండా, ఈ కారు లొ కొన్ని వినియోగ ఆధారిత అంశాలను అందజేసారు. అవి ఎంటంటే రియర్ పార్సిల్ షెల్ఫ్, కప్ మరియు బాటిల్ హోల్డర్స్, డ్రైవర్ సైడ్ ఆటో డౌన్ ఫంక్షన్, సన్ వైసర్స్, రిమోట్ ఫ్యూయెల్ లిడ్ ఓపెనర్, నాలుగు పవర్ విండోస్, ముందు మరియు వెనుక ఆర్మ్ రెస్ట్, మరియు అనేక ఇతర అంశాలు ఉన్నాయి.

లోపలి సౌకర్యలు:


ఈ కొంపెనీ ఎన్నో సౌకర్యవంతమైన అంశాలను ఈ సెడాన్ సిరీస్ లొ ప్రసాదించింది. అన్ని వేరియంట్లలో ఎయిర్ కండీషనింగ్ యూనిట్ అమర్చబడి ఉంది. ఈ సిస్టమ్ రెయర్ ఆC వెంట్స్ తో సహా వస్తుంది. అయితె దీని యొక్క అగ్ర ష్రేణి వేరియంట్ ఆటోమేటిక్ ఆC యూనిట్ తో వస్తుంది. ఇది ఉష్ణోగ్రత మరియు గాలి పంపిణీని నియంత్రిస్తూ ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏర్పరుస్తుంది. దీని యొక్క ఆధునిక ఇన్స్ట్రుమెంట్ పానెల్ ఎన్నో అంశాలతో కలిగి ఉంటుంది. అవి ఏంటంటె ఎలక్ట్రానిక్ ట్రిప్ మీటర్, డిజిటల్ టాకొమీటర్, డిజిటల్ గడియారం, తక్కువ ఇంధన హెచ్చరిక కాంతి, డోర్ అజార్ కాంతి, ఇంక మరెన్నో సూచికలను ఇస్తూ డ్రైవర్ ను అప్రమత్తంగా ఉంచుతుంది. ఈ కారులో అధునాతన ఆడియో సిస్టమ్ అమర్చబడి ఉంది. ఈ యూనిట్ ంP3 ప్లేయర్, ఆం/Fం రేడియో, ఈ-Pఒడ్ మరియు ఊSభ్ పరికరాల కోసం పొర్ట్లతో కలిగి ఉంది. ఇవి కాకుండా, ఇందులో ఆడియో మరియు కాల్ నియంత్రణ బటన్లను సంఘటిత చేసుకున్న బహుళ స్టీరింగ్ వీల్, సన్ గ్లాస్ హోల్డర్, ప్రకాషవంతమైన వ్యానిటీ అద్దం, డిజిటల్ గడియారం, రియర్ ఆఛ్ వెంట్లు, రియర్ వ్యూ పార్కింగ్ కెమెరా ఇంకా మరెన్నో అంశాలు ఉన్నాయి.

లోపలి కొలతలు:


ఈ కారు ఐదుగురు ప్రయణీకులకు తగినంత తల మరియు భుజ స్థలాన్ని అందిస్తుంది. ఇది విషాలమైన 510 లీటర్ల బూట్ కంపార్ట్మెంట్ తో వస్తుంది. వెనుక సీట్ మడవటం ద్వారా ఈ స్థలాన్ని మరింత పెంచవచ్చు. అంతే కాకుండా, ఇది ఒక పెద్ద ఇంధన ట్యాంక్ తో అమర్చబడి ఉంది. ఈ ట్యాంక్ సుమారు 40 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ ను నిల్వ చెయగలదు.

ఇంజిన్ మరియు దాని పనితీరు:


ఈ సెడాన్ ఎంచుకోవడానికి కొనుగోలుదారులకు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. ఇది 1.5-లీటర్, ఇ-VఠేC పెట్రోల్ ఇంజన్ తో వస్తుంది. దీని యొక్క డిస్ప్లేస్మెంట్ సామర్ధ్యం 1497cc ఉండగా ఇది నాలుగు సిలిండర్లు మరియు పదహారు కవాటాలు కలిగి ఉంటుంది. ఇది 6600ర్ప్మ్ వద్ద 117.3భ్ప్ శక్తిని మరియు 4600ర్ప్మ్ వద్ద 145ణ్మ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు, దాని 1.5-లీటర్ ఇ-ఢ్ఠేC ఇంజిన్ ఢోఃC కవాటాల ఆకృతీకరణ ఆధారంగా అమర్చబడి ఉంది. ఈ 1498cc ఇంజిన్ 3600ర్ప్మ్ వద్ద 98.6భ్ప్ శక్తి మరియు 1750ర్ప్మ్ వద్ద 200ణ్మ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది భారత రహదారి మరియు ట్రాఫిక్ పరిస్థితులకు చాలా అనుకూలంగా ఉంది. ఈ రెండు ఇంజన్లు మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ లతో జతపరచబడ్డాయి.

స్టీరియో మరియు ఉపకరణాలు:


ఈ వాహనంలో ఒక ఆధునిక ఆడియో సిస్టమ్ అమర్చబడి ఉంది. దీని యొక్క S మరియు SV వేరియంట్లు 3.5-అంగుళాల టచ్స్క్రీన్ ప్యానెల్, ఊSభ్, Cఢ్, ంP3 ప్లేయర్, ఆం/Fం రేడియో ట్యూనర్ తో సహ్హా వస్తాయి. అయితే , దాని V మరియు VX వేరియంట్లు 12.7-cమ్ టచ్స్ర్కీన్ డిస్ప్లే కలిగి ఉంటుంది. మరోవైపు, దీని VX ఓప్టిఒన్ వేరియంట్ ఆధునిక ఆVణ్ (ఆడియొ విడియొ నావిగెషన్ ) సిస్టెం తో లభ్యమవుతుంది. ఇది 15.7cమ్ టచ్స్క్రీన్ ప్యానెల్ తొ వస్తుంది. అంతే కకుందా, ఇది భ్లుఎటూత్ కనెక్టివిటీ, SVC ఫంక్షన్ మరియు రియర్ వ్యువ్ కెమెరా తో సహా అందించబడినది.

వీల్స్ పరిమాణం:


ప్రవేశ స్థాయిలో ని వేరియంట్ యొక్క వీల్ ఆర్చ్లులు 15 అంగుళాల స్టీల్ చక్రాలతో బిగించబడి ఉన్నాయి. తదుపరి, ఇవి వీల్ కవర్లు కలిగి ఉంటాయి. అయితే, మిగతా వేరియంట్లు మిశ్రమ లోహ చక్రాలతో బిగించబడ్డాయి. ఇవన్నీ 175/65 ఱ్15 పరిమాణంగల రేడియల్ టైర్లతో అమర్చబడి ఉన్నాయి.

బ్రేకింగ్ మరియు హ్యాండ్లింగ్:


హోండా సిటీ కారు యొక్క ముందు చక్రాలు డిస్క్ బ్రేకులు మరియు వెనుక చక్రాలు డ్రమ్ బ్రేకులతో అమర్చబడి ఉన్నాయి. ఇలా ఉండగా, ఆభ్S మరియు ఏభ్ఢ్ సిస్టమ్స్ ఈ బ్రేకింగ్ విధానాన్ని మరింత మెరుగుపరుస్తుంది. మరోవైపు, దాని ముందు ఆక్సిల్ ఒక మక్ఫెర్సొన్ స్ట్రట్ తో మరియు వెనుక ఆక్సిల్ డబుల్ విష్బోన్ తో బిగించబడి ఉన్నాయి. ఇంతేకాకుండా, ఇది ఎలక్ట్రానిక్ పవర్ స్టీరింగ్ సిస్టమ్ తో చేర్చబడి ఉంది.

భద్రత మరియు రక్షణ:


ఈ వాహనం ఆCఏ శరీర నిర్మాణం కలిగి ఉంటుంది. ఇది ఎటువంటి ప్రమాదంలో కాని పూర్తి రక్షణ ఇస్తుంది. ఇవి కాకుండా, ఇందులో ముందు ప్రయాణీకులకు రెండు ఎయిర్ బ్యాగులు, భద్రతా అలారం తో సహా ఇంజన్ ఇమ్మొబిలైజెర్, 3-పాయింట్ సీటు బెల్టులు, సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇంకా మరెన్నో భద్రత అంశాలు ఉన్నాయి.

అనుకూలాలు:1. డీజిల్ వెర్షన్ యొక్క ఇంధన సామర్థ్యం చాలా బాగుంది.
2. వెలుపలి డిజైన్ కొనుగోలుదారులను ఆకట్టుకొనే విధంగా ఉంది.
3. ఇంజిన్ పనితీరు బాగుంది.
4. అమ్మకాల తర్వాత సర్వీసు సంతృప్తినిస్తుంది.
5. అంతర్గత కాబిన్ చాలా విషాలంగా ఉంది.

ప్రతికూలాలు:1. భారీ ట్రాఫిక్ పరిస్థితులలో హ్యాండ్లింగ్ కష్టంగా ఉండొచ్చు.
2. నావిగేషన్ సిస్టమ్ లేకపోవడం దనికి ప్రతికూల అంశం.
3. దాని లోపలి ఆకృతిని ఇంకా మెరుగు పరచాలి.
4. పెట్రోల్ ఇంజిన్ యొక్క ఇంధన సామర్ధ్యం సంతృప్తికరంగా లేదు.
5. డీజిల్ మిల్లు యొక్క శబ్దం తగ్గించవచ్చు.