• English
  • Login / Register

సెప్టెంబర్ 2023లో విడుదల అయిన 7 కార్‌ల వివరాలు

హోండా ఎలివేట్ కోసం shreyash ద్వారా సెప్టెంబర్ 29, 2023 07:50 pm సవరించబడింది

  • 208 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొత్త మోడల్‌లు మరియు నవీకరణలు మాత్రమే కాకుండా రెనాల్ట్, స్కోడా, MG, జీప్, ఆడి మరియు BMWల నుండి కొన్ని ఎడిషన్ ఆవిష్కరణలను కూడా చూశాము

These Are The 7 Car Launches We Saw In September 2023

సెప్టెంబర్ నెలలో మాస్-మార్కెట్ మరియు ప్రీమియం కార్ బ్రాండ్‌ల విభాగాలలో కొత్త కార్ؚలు ఆవిష్కరించబడ్డాయి. ఎంతగానో ఎదురుచూసిన ఆవిష్కరణలలో 2023 టాటా నెక్సాన్ మరియు హోండా ఎలివేట్ ఈ నెలలో విడుదల అయ్యాయి, అంతేకాకుండా వోల్వో C40 రీఛార్జ్, మెర్సిడెస్-బెంజ్ EQE మరియు BMW iX1 వంటి లగ్జరీ EVలు కూడా మన దేశంలోకి ప్రవేశించాయి. కేవలం సెప్టెంబర్ؚలోనే, భారతదేశంలో ఏడు కొత్త మోడల్‌లు మరియు కొన్ని ప్రత్యేక ఎడిషన్ؚలు విడుదల అయ్యాయి.

ఈ నెలలో భారతదేశం విడుదల అయిన ప్రతి కొత్త కార్ؚను, ఒక దాని తరువాత మరొకటి నిశితంగా పరిశీలిద్దాం.

హోండా ఎలివేట్ 

ధర పరిధి: రూ. 11 లక్షల నుండి 16 లక్షల వరకు

Honda Elevate

సుమారు ఏడు సంవత్సరాల దీర్ఘ కాలం తరువాత, హోండా ఎట్టకేలకు తన సరికొత్త ఉత్పత్తి ఎలివేట్ కాంపాక్ట్ SUV రూపంలో భారతదేశంలో విడుదల చేసింది. హోండా ఎలివేట్ తన ప్లాట్ؚఫారంను మరియు ఇంజన్/ట్రాన్స్ؚమిషన్ ఎంపికలను హోండా సిటీతో పంచుకుంది. అదనంగా హోండా రిఫైన్డ్ ఇంజన్ మరియు బ్రాండ్ విశ్వసనీయతతో పాటు, ఎలివేట్ అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్ లను కూడా కలిగి ఉంది.

అయితే, హోండా సిటీలో ఉన్నట్లుగా కాకుండా, ఎలివేట్‌లో హైబ్రిడ్ పవర్ؚట్రెయిన్ ఎంపికలు లేవు. కానీ భవిష్యత్తులో, ఎలివేట్ కాంపాక్ట్ SUV పూర్తి-ఎలక్ట్రిక్ వర్షన్ؚను విడుదల చేయానికి హోండా ప్రణాళికలను కలిగి ఉంది.

వోల్వో C40 రీఛార్జ్

ధర: రూ. 61.25 లక్షలు

Volvo C40 Recharge

భారతదేశంలో వోల్వో తన రెండవ పూర్తి ఎలక్ట్రిక్, C40 రీఛార్జ్ؚను విడుదల చేసింది. ఇది XC0 రీఛార్జ్ యొక్క కూపే-SUV వర్షన్, అదే 78kWh బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుంది, కాని మెరుగైన 530కిమీ డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఈ మెరుగుదల, మెరుగైన ఇంధన సామర్ధ్య బ్యాటరీ ప్యాక్ మరియు C40 రీఛార్జ్ నాజూకైన ఏరోడైనమిక్ డిజైన్ కారణంగా సాధ్యమైంది.

హ్యుందాయ్ i20 మరియు i20 N లైన్ ఫేస్ؚలిఫ్ట్

ధర పరిధి

  • 2023 హ్యుందాయ్ i20: రూ.6.99 లక్షల నుండి రూ.11.01 లక్షలు

  • 2023 హ్యుందాయ్ i20 N లైన్: రూ.9.99 లక్షల నుండి రూ.12.47 లక్షలు 

Hyundai i20 N Line Facelift

భారతదేశంలో హ్యుందాయ్ i20 ఫేస్ؚలిఫ్ట్ కూడా ఈ నెలలోనే విడుదలైంది, ఇందులో తేలికపాటి స్టైలింగ్ మార్పులు మరియు కేవలం టైప్-C USB ఛార్జర్ ఫీచర్ జోడింపుతో వచ్చింది. దీని ఇంజన్ మరియు ట్రాన్స్ؚమిషన్ ఎంపికలు తిరిగి అమర్చబడ్డాయి. సాధారణ i20 ఇకపై 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ؚను అందించదు; బదులుగా, ఇది ప్రస్తుతం 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚతో మాత్రమే లభిస్తుంది. టర్బో-పెట్రోల్ ఇంజన్ ప్రస్తుతం హ్యుందాయ్ i20 N లైన్లో మాత్రమే అందిస్తున్నారు. 

హ్యుందాయ్ i20 N లైన్ నవీకరించిన వర్షన్ؚను కూడా పరిచయం చేసింది, ఇది ఇప్పుడు 6-స్పీడ్ iMT (క్లచ్ లేని మాన్యువల్) స్థానంలో సరైన 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో వస్తుంది. i20 N లైన్ 7-స్పీడ్ DCT ఎంపికను నిలుపుకుంది.

2023 టాటా నెక్సాన్ మరియు టాటా నెక్సాన్ EV

ధర పరిధి

  • 2023 టాటా నెక్సాన్: రూ.8.10 లక్షల నుండి రూ.15.50 లక్షలు

  • 2023 టాటా నెక్సాన్ EV: రూ.14.74 లక్షల నుండి రూ.19.94 లక్షలు

2023 Tata Nexon
Tata Nexon EV Facelift

ఎంతగానో ఎదురుచూస్తున్న ఆవిష్కరణలు అయిన నవీకరించిన టాటా నెక్సాన్ మరియు నెక్సాన్ EVల విడుదల మరియు విక్రయాలు సెప్టెంబర్ మధ్యలో ప్రారంభమయ్యాయి. 2023 టాటా నెక్సాన్ రెండు వర్షన్ؚలు సమగ్ర డిజైన్ నవీకరణలను మరియు కొత్త సాంకేతిక ఫీచర్‌లను అందుకున్నాయి.

నెక్సాన్ పెట్రోల్ వర్షన్ ప్రస్తుతం మరిన్ని ట్రాన్స్ؚమిషన్ ఎంపికలతో అందించబడుతుంది, ఇందులో 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్ؚమిషన్ (DCT) కూడా ఉంది. మరొక వైపు, నెక్సాన్ EV నవీకరించిన లైట్‌వెయిట్ ఎలక్ట్రిక్ మోటార్ؚతో వస్తుంది, ఇది 465కిమీ మెరుగైన డ్రైవింగ్ పరిధిని ఇస్తుంది.

సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్

ధర పరిధి: రూ. 9.99 లక్షల నుండి రూ.12.10 లక్షలు

Citroen C3 Aircross

హోండా ఎలివేట్ విడుదల తరువాత, కాంపాక్ట్ SUV విభాగంలో వచ్చిన మరొక కొత్త వాహనం C3 ఎయిర్ؚక్రాస్. C3 ఎయిర్ؚక్రాస్ؚను ఇతర కాంపాక్ట్ SUVల నుండి విభిన్నంగా ఉంచేది 5-సీటర్ మరియు 7-సీటర్ రెండు కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉండటం (తొలగించగలిగే మూడవ వరుస సీట్లు). 

C3 ఎయిర్ؚక్రాస్, ఇంటీరియర్ మరియు ఎక్స్ؚటీరియర్ డిజైన్ రెండిటిలో తన తోటి హ్యాచ్ؚబ్యాక్ వాహనం అయిన సిట్రోయెన్ C3 నుండి ప్రేరణ పొందింది. ఈ కాంపాక్ట్ SUV అదే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ؚను ఉపయోగిస్తుంది, ఎందుకంటే C3 కేవలం 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో మాత్రమే అందించబడుతుంది.

మెర్సిడెస్-బెంజ్ EQE 

ధర: రూ. 1.39 కోట్లు

మెర్సిడెస్-బెంజ్ తన పూర్తి ఎలక్ట్రిక్ ఆఫరింగ్ EQEని భారతదేశంలో పరిచయం చేసింది. ఈ జర్మన్ ఆటో మేకర్ ప్రస్తుత భారతదేశ లైన్అప్ؚలో ఇది మూడవ EV. EQE ఎలక్ట్రిక్ SUVని కేవలం సింగిల్ ఫుల్లీ లోడెడ్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) వేరియెంట్ؚతో మాత్రమే అందిస్తున్నారు, ఇది WLTP క్లెయిమ్ చేసిన పరిధి 550కిమీలకు హామీ ఇస్తుంది. 

ఈ లగ్జరీ ఆటో మేకర్ EQEని 10 సంవత్సరాల వారెంటీ కలిగిన బ్యాటరీతో అందిస్తున్నారు, ఒక ఎలక్ట్రిక్ వాహనంపై ఏ తయారీదారు అందించని అత్యధిక వారెంటీ పీరియడ్ ను ఇది అందిస్తుంది.

BMW iX1

ధర: 66.90 లక్షలు

భారతదేశంలో ఈ నెల విడుదల అయిన మరొక ప్రీమియం ఎలక్ట్రిక్ SUV BMW iX1. ఇది BMW X1 ICE (ఇంటర్నల్ కంబుషన్ ఇంజన్) పూర్తి ఎలక్ట్రిక్ వర్షన్ SUV. iX, i7 మరియు i4తో పాటు బారతదేశంలో విడుదల చేసిన నాలుగవ BMW EV iX1.

ఇండియా-స్పెక్ BMW iX1 కేవలం సింగిల్ ఫుల్లీ-లోడెడ్ ఆల్-వీల్ డ్రైవ్ వేరియెంట్ؚతో మాత్రమే అందించబడుతుంది, WLTP క్లెయిమ్ చేసిన డ్రైవింగ్ పరిధి 440కిమీగా ఉంది. 

ప్రత్యేక ఎడిషన్ & కొత్త వేరియెంట్ؚలు

Renault Kwid, Kiger and Triber

  • రెనాల్ట్ అర్బన్ నైట్ ఎడిషన్ؚలు: మూడు రెనాల్ట్ మోడల్‌లు – క్విడ్, కైగర్, మరియు ట్రైబర్ؚలు ప్రస్తుతం లిమిటెడ్-రన్ అర్బన్ నైట్ ఎడిషన్ؚలో లభిస్తున్నాయి, ఈ ప్రత్యేక ఎడిషన్ؚలో, మూడు కార్‌లు కొత్త స్టెల్త్ బ్లాక్ ఎక్స్ؚటీరియర్ రంగును కలిగి ఉన్నాయి. అదనంగా, కైగర్ మరియు ట్రైబర్ؚలలో స్మార్ట్ వ్యూ మానిటర్ ఉంది, ఇది లోపలి రేర్-వ్యూ మిర్రర్ؚగా మరియు డ్యూయల్ డ్యాష్ؚకామ్ؚగా పని చేస్తుంది. అయితే, ఈ ప్రత్యేక ఎడిషన్ మోడల్‌లు ఒక్కొకటి కేవలం 300 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కస్టమర్‌లు క్విడ్ ప్రత్యేక ఎడిషన్ కోసం అదనంగా రూ.6,999 మరియు ట్రైబర్ మరియు కైగర్ ప్రత్యేక వర్షన్‌ల కోసం రూ.14,999 అదనంగా చెల్లించాల్సి ఉంది.

Skoda Slavia and Kushaq

Hyundai Venue

MG Astor Black Storm Edition

  • 2023 కియా సెల్టోస్ కొత్త ADAS వేరియెంట్ؚలు: 2023 కియా సెల్టోస్ ప్రస్తుతం మరొక రెండు ADAS కలిగిన చవక వేరియెంట్ؚలను పొందింది. GTX+ (S) మరియు X-లైన్ (S), వీటి ధరలు రూ.19.40 లక్షల నుండి రూ.19.60 లక్షల వరకు ఉంది. మొత్తం బుకింగ్ؚలలో 77 శాతం సెల్టోస్ హయ్యర్ వేరియెంట్ؚల కోసం అందుకున్నాము అని కియా వెల్లడించింది, ఇందులో 47 శాతం బుకింగ్ؚలు ADAS-కలిగిన మోడల్‌ల కోసమే.

BMW 2 Series M Performance Edition

  • BMW 2 సీరీస్ గ్రాన్ కూపే M పర్ఫార్మెన్స్ ఎడిషన్: ఈ పండుగ సీజన్ؚలో BMW 2 సీరీస్ గ్రాన్ కూపే M పర్ఫార్మెన్స్ ఎడిషన్ؚను పొందింది. ఇది నలుపు రంగు సఫైర్ మెటాలిక్ పెయింట్ మరియు సీరియమ్ గ్రే ఇన్సర్ట్ؚతో ఎంపికతో వస్తుంది. ఈ ప్రత్యేక ఎడిషన్ కేవలం టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపిక ఎంట్రీ-లెవెల్ BMW సెడాన్ؚకు మాత్రమే పరిమితం. BNW2 సిరీస్ గ్రాన్ కూపే ప్రత్యేక ఎడిషన్ కోసం కస్టమర్‌లు రూ.50,000 అదనంగా వెచ్చించాల్సి ఉంది. 

Audi Q5 limited edition

  • ఆడి Q8 & ఆడి Q5 లిమిటెడ్ ఎడిషన్‌లు: ప్రత్యేక ఎడిషన్ మోడల్‌ల లైన్అప్ؚలో ఆడి Q5 మరియు Q8 లగ్జరీ SUVల లిమిటెడ్ ఎడిషన్ వర్షన్ؚను పరిచయం చేసింది. మొదటి వాహనం ధర రూ.69.72 లక్షలు ఉండగా, రెండవదాని ధర రూ.1.18 కోట్లు. Q5 ప్రత్యేక ఎడిషన్ దాని టెక్నాలజీ వేరియెంట్ Q5 పై ఆధారపడింది, ఇది మైతోస్ బ్లాక్ ఎక్స్ؚటీరియర్ రంగులో లభిస్తుంది. మరొక వైపు, Q8 ప్రత్యేక ఎడిషన్ మూడు ఎక్స్ؚటీరియర్ రంగులలో లభిస్తుంది: మైటోస్ బ్లాక్, గ్లేసియర్ వైట్ మరియు డేటోనా గ్రే.

Jeep Compass Black Shark and Meridian Overland

  • జీప్ కంపాస్ కొత్త వేరియెంట్ؚలు: వరుసగా బ్లాక్ షార్క్ మరియు ఓవర్‌ల్యాండ్ ఎడిషన్‌లతో జీప్ కంపాస్ మరియు జీప్ మెరీడియన్‌లు కూడా ప్రత్యేక ఎడిషన్ల జాబితాలోకి చేరాయి. అంతే కాకుండా, జీప్ ప్రస్తుతం భారతదేశంలో కంపాస్ 4X2ను ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికతో కూడా అందిస్తోంది. కంపాస్ MT ప్రస్తుతం రూ.20.49 లక్షలతో ప్రారంభం అవుతుంది, దీని ఆటోమ్యాటిక్ వేరియెంట్ ధర రూ.23.99 లక్షలు, దీని పైన మీరు మునుపటి కంపాస్ ఆటోమ్యాటిక్ వేరియెంట్ కంటే రూ.6 లక్షలు ఆదా చేయవచ్చు.

ఇక్కడ మరింత చదవండి: ఎలివేట్ ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Honda ఎలివేట్

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience