• English
  • Login / Register

Citroen C3 Aircross ధరలు రూ. 9.99 లక్షల నుండి మొదలు, బుకింగ్‌లు ప్రారంభం

సిట్రోయెన్ aircross కోసం rohit ద్వారా సెప్టెంబర్ 18, 2023 02:30 pm సవరించబడింది

  • 78 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

సిట్రోయెన్ అక్టోబర్ 15 నుండి C3 ఎయిర్‌క్రాస్‌ను కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభిస్తుంది

Citroen C3 Aircross

  • C3 ఎయిర్‌క్రాస్ ధర రూ. 9.99 లక్షల నుండి రూ. 12.45 లక్షల వరకు ఉంది.

  • ఆన్‌లైన్ మరియు సిట్రోయెన్ డీలర్‌షిప్‌ రెండింటిలోనూ రూ. 25,000 మొత్తంతో బుకింగ్‌లు చేయవచ్చు.

  • C3 ఎయిర్‌క్రాస్ 5- మరియు 7-సీటర్ లేఅవుట్‌లతో అందించబడుతుంది.

  • ఎక్స్‌టీరియర్ హైలైట్‌లలో LED DRLలు మరియు C-ఆకారపు టెయిల్‌లైట్‌లతో కూడిన సొగసైన హెడ్‌లైట్లు ఉన్నాయి.

  • లోపల భాగంలో, ఇది 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్, మాన్యువల్ AC మరియు 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేను పొందుతుంది.

  • ఒక ఏకైక 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతుంది, ఇది 6-స్పీడ్ MTతో జతచేయబడింది.

  • భద్రతా జాబితాలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, TPMS మరియు రివర్సింగ్ కెమెరా ఉన్నాయి.

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్ రాకతో కాంపాక్ట్ SUV సెగ్మెంట్ త్వరలో మరింత విస్తరిస్తుంది. సిట్రోయెన్ దీని కోసం ముందస్తు -బుకింగ్‌లను ప్రారంభించింది మరియు

దాని మొత్తం ధర శ్రేణిని కూడా వెల్లడించింది, ఇది రూ. 9.99 లక్షల నుండి రూ. 12.45 లక్షల మధ్య ఉంటుంది (పరిచయ ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా). ఫ్రెంచ్ కాంపాక్ట్ SUV కోసం వేరియంట్ వారీ ధరలు ఇక్కడ ఉన్నాయి:

వేరియంట్లు

5-సీటర్

5+2 ఫ్లెక్సీ ప్రో

యు

రూ.9.99 లక్షలు

N.A.

ప్లస్

11.30 లక్షల వరకు

11.45 లక్షల వరకు

మాక్స్

11.95 లక్షల వరకు 

12.10 లక్షల వరకు

స్టాండర్డ్ 5-సీటర్ కాన్ఫిగరేషన్ కంటే 7-సీటర్ లేఅవుట్ కోసం అధనంగా రూ.35,000 ప్రీమియం ధర ఉంది. డ్యూయల్-టోన్ ఎంపిక మరియు వైబ్ ప్యాక్ ధరలు వరుసగా రూ. 20,000 మరియు రూ. 25,000. బేస్ వేరియంట్‌తో ఆ ఎంపికలు ఏవీ అందుబాటులో లేవు. మీరు ఆన్‌లైన్‌లో మరియు కార్‌మేకర్ యొక్క పాన్-ఇండియా డీలర్‌షిప్‌లలో రూ. 25,000 డిపాజిట్ తో ఈరోజు నుండి C3 ఎయిర్‌క్రాస్‌ను బుకింగ్ చేసుకోవచ్చు. సిట్రోయెన్ అక్టోబర్ 15 నుండి SUV యొక్క డెలివరీలను ప్రారంభించనుంది.

C3 ఎయిర్‌క్రాస్ ఏ ఏ అంశాలను అందిస్తుందో వాటి యొక్క శీఘ్ర వివరణ ఇక్కడ ఉంది:

తెలిసిన డిజైన్

Citroen C3 Aircross front

C3 ఎయిర్‌క్రాస్ యొక్క డిజైన్, C3 హ్యాచ్‌బ్యాక్‌తో సమానమైన డిజైన్ అంశాలను చిన్న చిన్న మార్పులతో కలిగి ఉంది. SUV యొక్క ముందు భాగం సొగసైన LED DRLలు మరియు గ్రిల్‌కు చుట్టుముట్టే హెడ్‌లైట్‌లతో సహా సారూప్య స్టైలింగ్‌ను కలిగి ఉంది. ఇది చంకీ బంపర్‌ని పొందుతుంది, అయితే చాలా వరకు ఎయిర్ డ్యామ్ ద్వారా కింద స్కిడ్ ప్లేట్, రెండు డోర్‌లపై క్లాడింగ్ మరియు C-ఆకారపు టైల్‌లైట్‌లు మరియు భారీ బంపర్‌తో మాస్కులార్ లుక్ తో వెనుక భాగం అద్భుతంగా ఉంటుంది.

లోపల కూడా మునుపటి వలె

Citroen C3 Aircross cabin

C3 ఎయిర్‌క్రాస్ క్యాబిన్ కూడా కొన్ని చిన్న సవరణలతో ఉన్నప్పటికీ, C3ని పోలి ఉంటుంది. సిట్రోయెన్ కాంపాక్ట్ SUVకి డ్యూయల్-టోన్ క్యాబిన్ థీమ్‌ను అందించింది, అయితే AC వెంట్స్ మరియు డ్యాష్‌బోర్డ్ లేఅవుట్ అలాగే ఉంటుంది.

Citroen C3 Aircross third row

అయితే, పెద్ద వ్యత్యాసం ఏమిటంటే, C3 ఎయిర్‌క్రాస్ రెండు రకాల సీటింగ్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా ఐదు మరియు ఏడు. వ్యక్తుల కంటే ఎక్కువ లగేజీని కలిగి ఉన్నప్పుడు మూడవ వరుస సీట్లను కూడా తొలగించుకునే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: ICC పురుషుల క్రికెట్ ప్రపంచ కప్ 2023 యొక్క అధికారిక కారు నిస్సాన్ మాగ్నైట్

ముఖ్యమైన ఫీచర్లు

Citroen C3 Aircross 10.2-inch touchscreen

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్‌లో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేతో కూడిన 10.2-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, ఐదు ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్‌లు, రూఫ్-మౌంటెడ్ AC వెంట్‌లు మరియు మాన్యువల్ AC వంటి అంశాలను కలిగి ఉంది.

హిల్-హోల్డ్ అసిస్ట్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, రివర్సింగ్ కెమెరా మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ ద్వారా ప్రయాణికుల భద్రత మరింత మెరుగుపడుతుంది.

హుడ్ కింద

Citroen C3 Aircross 1.2-litre turbo-petrol engine

C3 ఎయిర్‌క్రాస్ ప్రస్తుతానికి ఒక పవర్‌ట్రైన్ ఎంపికను మాత్రమే పొందుతుంది: 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (110PS/190Nm). ఈ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే జత చేయబడింది, ఇది 18.5kmpl ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుంది. C3 ఎయిర్‌క్రాస్ తదుపరి రోజులలో ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందిస్తుంది.

సంబంధిత: సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ సమీక్ష: ఇది భిన్నమైనది

పోటీదారులు

Citroen C3 Aircross rear

సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్- మారుతి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, వోక్స్వాగన్ టైగూన్, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, టయోటా హైరైడర్, హోండా ఎలివేట్ మరియు MG ఆస్టర్‌లకు గట్టి పోటీని ఇస్తుంది.

మరింత చదవండి : సిట్రోయెన్ C3 ఆన్ రోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Citroen aircross

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience