కేవలం రూ.14.48 లక్షల ధరకే MG Astor Black Storm Edition మన సొంతం

ఎంజి ఆస్టర్ కోసం ansh ద్వారా సెప్టెంబర్ 07, 2023 01:46 pm ప్రచురించబడింది

  • 45 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ మిడ్-స్పెక్ స్మార్ట్ వేరియంట్ ఆధారంగా సింగిల్ ఇంజన్ ఆప్షన్ తో వస్తుంది.

MG Astor Black Storm Edition

  • బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ ధరలు రూ .14.48 లక్షల నుండి రూ .15.77 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి.

  • ఇది గ్లోస్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ మాదిరిగానే ఆల్-బ్లాక్ ఎక్స్టీరియర్ తో వస్తుంది.

  • ఇంటీరియర్ లో ఆల్ బ్లాక్ అప్ హోల్ స్టరీతో కూడిన ఎరుపు రంగు ఇన్సర్ట్స్ ఉన్నాయి.

  • 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, ADAS వంటి ఫీచర్లు ఉన్నాయి.

  • అస్టర్ రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలను పొందుతుంది: 110PS, 1.5-లీటర్ యూనిట్ మరియు 140PS, 1.3-లీటర్ టర్బోఛార్జ్డ్ యూనిట్.

MG ఆస్టర్, కొత్త బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ ను భారత్ లో విడుదల చేసింది. MG గ్లోస్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ మాదిరిగానే, ఈ ప్రత్యేక ఎడిషన్ కూడా ఆల్-బ్లాక్ ట్రీట్మెంట్తో ఎరుపు హైలైట్లను కలిగి ఉంది. బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ ఆస్టర్ యొక్క మిడ్-వేరియంట్ స్మార్ట్ ఆధారంగా రూపొందించబడింది. మరియు దాని ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

ధర (ఎక్స్-షోరూమ్)

వేరియంట్లు

స్టాండర్డ్

బ్లాక్ స్టార్మ్ ఎడిషన్

ధరల మధ్య వ్యత్యాసం

స్మార్ట్ MT

రూ.14.21 లక్షలు

రూ.14.48 లక్షలు

+రూ.27,000

స్మార్ట్ CVT

రూ.15.50 లక్షలు

రూ.15.77 లక్షలు

+రూ.27,000

బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ ధర సాధారణ ఆస్టర్ స్మార్ట్ కంటే రూ .27,000 ఎక్కువ.

కాస్మోటిక్ మార్పులు

MG Astor Black Storm Edition Side

ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ ఎక్ట్సీరియర్ లో ఆల్ బ్లాక్ ట్రీట్ మెంట్ తో పాటు, ప్రత్యేకమైన బ్లాక్ హనీకోంబ్ గ్రిల్, బ్లాక్ ఫ్రంట్ అలాగే రియర్ బంపర్లు, స్మోకీ హెడ్ ల్యాంప్స్ మరియు బ్లాక్ అల్లాయ్ వీల్స్ ను అందించారు. దీని ఆల్-బ్లాక్ ఎక్ట్సీరియర్లో రెడ్ కలర్ ఫ్రంట్ బ్రేక్ కాలిపర్లను కూడా అందించారు. రెగ్యులర్ మోడల్ కు భిన్నంగా కనిపించేందుకు ఈ స్పెషల్ ఎడిషన్ లో ఫ్రంట్ ఫెండర్ లో 'బ్లాక్ స్టార్మ్' బ్యాడ్జ్ కూడా ఉంది.

MG Astor Black Storm Edition Cabin

ఇంటీరియర్ లో కూడా ఎక్ట్సీరియర్ మాదిరిగానే కలర్ థీమ్ ఉంటుంది. క్యాబిన్ లోపల, సీట్లపై ఎరుపు కుట్లు ఉన్నాయి, పూర్తిగా నలుపు రంగు అప్హోల్స్టరీ ఉంది. ఇది స్టీరింగ్ వీల్ పై, AC వెంట్ ల చుట్టూ మరియు ఆల్-బ్లాక్ కన్సోల్ టన్నెల్ పై ఎరుపు రంగు ఇన్సర్ట్ లను పొందుతుంది.

ఏవైనా కొత్త ఫీచర్లు ఉన్నాయా?

MG Astor Black Storm Edition Dashboard

దాని ధరకి తగ్గట్టు ఆస్టర్ బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ లో అనేక కాస్మెటిక్ మార్పులు చేయబడ్డాయి, కానీ దీని ఫీచర్ లిస్ట్ సాధారణ మోడల్ మాదిరిగానే ఉంటుంది. రెగ్యులర్ ఆస్టర్ స్మార్ట్ వేరియంట్ తో పోలిస్తే ఇందులో డీలర్ అమర్చిన JBL సౌండ్ సిస్టమ్ ఉంది. MG కాంపాక్ట్ SUVలో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేతో కూడిన 10.1 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, పనోరమిక్ సన్ రూఫ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇది కూడా చదవండి: MG శతజయంతి సందర్భంగా కస్టమర్లకు ఆఫర్లు, డిస్కౌంట్లు

భద్రత కొరకు, స్మార్ట్ వేరియంట్ డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, ABS తో EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అండ్ డిసెంట్ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రేర్ పార్కింగ్ సెన్సార్లు మరియు రేర్ వ్యూ కెమెరాను అందిస్తుంది.

ఒక పవర్ ట్రైన్

MG Astor Turbo-petrol Engine

MG ఆస్టర్ రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది: 1.3-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (140PS/220Nm) 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్తో జతచేయబడింది మరియు 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (110PS/144Nm) 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా CVT గేర్బాక్స్తో జతచేయబడింది. బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో 1.5-లీటర్ ఇంజన్ తో మాత్రమే వస్తుంది.

ధర & ప్రత్యర్థులు

MG Astor

MG ఆస్టర్ ధర రూ .10.82 లక్షల నుండి రూ .18.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కియా సెల్టోస్ X-లైన్ కంటే బ్లాక్ స్టార్మ్ ఎడిషన్ మరింత సరసమైన ఎంపిక. ఇది హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్ మరియు స్కోడా కుషాక్ యొక్క మ్యాట్ ఎడిషన్ మరియు వోక్స్ వ్యాగన్ టిగువాన్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. ఆస్టర్ కాంపాక్ట్ SUV హ్యుందాయ్ క్రెటా,  కియా సెల్టోస్,  మారుతి గ్రాండ్ విటారా,  టయోటా హైరైడర్,  వోక్స్వాగన్ టైగూన్,  స్కోడా కుషాక్,  హోండా ఎలివేట్ మరియు రాబోయే సిట్రోయెన్ సి3 ఎయిర్ క్రాస్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

మరింత చదవండి :  MG ఆస్టర్ ఆటోమేటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన ఎంజి ఆస్టర్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience