రూ. 9.99 లక్షల ధరతో విడుదలైన 2023 Hyundai i20 N Line Facelift
సెప్టెంబర్ 22, 2023 03:53 pm rohit ద్వారా ప్రచురించబడింది
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ప్రస్తుత హ్యుందాయ్ i20 N లైన్, గతంలో అందించబడిన 6-స్పీడ్ iMT (క్లచ్‌లెస్ మాన్యువల్) గేర్‌బాక్స్‌కు బదులుగా సరైన 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో అందుబాటులో ఉంది. ఫలితంగా, తక్కువ ప్రారంభ ధరను కలిగి ఉంది
-
హ్యుందాయ్ i20 N లైన్ ఫేస్‌లిఫ్ట్ ధరను రూ. 9.99 లక్షల నుండి రూ. 12.32 లక్షలకు (ఎక్స్-షోరూమ్) నిర్ణయించింది.
-
కొత్త మాన్యువల్ గేర్‌బాక్స్‌తో, దీని ప్రారంభ ధర రూ. 20,000కు తగ్గింది.
-
ఐ20 N లైన్‌ను తొలిసారిగా 2021లో భారత్‌కు తీసుకొచ్చారు.
-
ఇప్పుడు కొద్దిగా నవీకరించబడిన గ్రిల్, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ మరియు అప్‌డేట్ చేయబడిన LED హెడ్‌లైట్‌లు ఉన్నాయి.
-
లోపల, ఇది ఇప్పటికీ ఎరుపు రంగు హైలైట్‌లతో పూర్తిగా నలుపు రంగు థీమ్‌తో కొనసాగుతుంది.
-
భద్రత పరంగా- ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ESC మరియు TPMSలను ప్రామాణిక అంశాలుగా పొందుతుంది.
హ్యుందాయ్ ఐ20 ఫేస్‌లిఫ్ట్‌ని పరిచయం చేసిన కొద్దిరోజులకే, స్పోర్టియర్‌గా కనిపించే హ్యుందాయ్ ఐ20 ఎన్ లైన్ ఫేస్‌లిఫ్ట్ ఇప్పుడు భారతదేశంలో ప్రారంభించబడింది. 2021లో i20 N లైన్‌ని మార్కెట్‌లోకి ప్రవేశపెట్టినప్పటి నుండి ఇదే మొదటి అప్‌డేట్. ఇది ఇప్పటికీ మునుపటి మాదిరిగానే రెండు వేర్వేరు వేరియంట్లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా N6 మరియు N8, అయితే మునుపటిది ఇప్పుడు DCTతో కూడా పొందవచ్చు.
సవరించిన వేరియంట్ వారీ ధరలు
ట్రాన్స్మిషన్ |
N6 |
N8 |
MT |
రూ.9.99 లక్షలు |
రూ.11.22 లక్షలు |
DCT |
రూ.11.10 లక్షలు |
రూ.12.32 లక్షలు |
అన్ని ధరలు ఎక్స్-షోరూమ్
ఫేస్‌లిఫ్ట్‌తో, i20 N లైన్ ఇప్పుడు iMT షిఫ్టర్ (క్లచ్‌లెస్ మాన్యువల్) స్థానంలో సరైన మాన్యువల్ గేర్‌బాక్స్‌ను పొందుతుంది. i20 N లైన్‌ను కేవలం రూ. 10 లక్షల నుండి అందించడానికి కారు తయారీదారుడికి సహాయపడింది, దీని వలన ఫేస్లిఫ్ ధర రూ. 20,000 వరకు తగ్గింది. అలాగే, దిగువ శ్రేణి N6 వేరియంట్, DCT గేర్‌బాక్స్‌తో అందించబడుతుంది.
బయట ఏమి మారింది?


సాధారణ i20 ఫేస్‌లిఫ్ట్‌లో చూసినట్లుగా, i20 N లైన్ కూడా కనీస కాస్మెటిక్ ట్వీక్‌లను పొందుతుంది. వీటిలో సవరించబడినవి ఏమిటంటే, ఫ్రంట్ బంపర్, రీడిజైన్ చేయబడిన గ్రిల్ ఇన్సర్ట్ మరియు అప్‌డేట్ చేయబడిన LED హెడ్‌లైట్‌లు (ఇప్పటికీ ఇన్వర్టెడ్ LED DRL స్ట్రిప్స్ ఉన్నాయి) వంటి అంశాలు అందించబడ్డాయి.
సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, కొత్త అల్లాయ్ వీల్ డిజైన్ మాత్రమే ప్రధాన మార్పు. కొత్త i20 N లైన్ వెనుక భాగం దాదాపుగా మారలేదు, ఎందుకంటే ఇది ఇప్పటికీ Z-ఆకారపు లైటింగ్ ఎలిమెంట్‌లను కలిగి ఉన్న అదే LED టెయిల్ లైట్ సెటప్‌ను మరియు డ్యూయల్ ఎగ్జాస్ట్ టిప్ లను స్వల్పంగా ట్వీక్ చేయబడిన బంపర్‌తో కలిగి ఉంది.
స్పోర్టియర్‌గా కనిపించే మోడల్‌గా, i20 N లైన్ రెడ్ బ్రేక్ కాలిపర్‌లు, రెడ్ ఇన్సర్ట్‌లు మరియు లోపల అలాగే వెలుపల 'N లైన్' మోనికర్‌లతో కూడా కొనసాగుతోంది. కారు తయారీదారుడు, కొత్త అబిస్ బ్లాక్ షేడ్‌తో సహా ఐదు మోనోటోన్ మరియు రెండు డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్‌లలో i20 N లైన్ 2023ని అందిస్తోంది.
ఇవి కూడా చూడండి: బాలీవుడ్ నటి తాప్సీ పన్ను, మెర్సిడెస్-మేబ్యాక్ GLS SUVని డ్రైవ్ చేసుకుంటూ వచ్చింది
క్యాబిన్‌కి పెద్దగా అప్‌డేట్‌లు లేవు
హ్యుందాయ్ నవీకరణతో i20 N లైన్ క్యాబిన్‌కు ఎటువంటి ముఖ్యమైన నవీకరణను అందించలేదు. ఇది ఇప్పటికీ ఒకే ఒక బ్లాక్ థీమ్ డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది, అయితే చుట్టూ ఎరుపు అసెంట్స్ ఉన్నాయి. 2023 i20 N లైన్- N లోగో, డిజైన్ అలాగే కాంట్రాస్ట్ రెడ్ స్టిచింగ్ మరియు రెడ్ యాంబియంట్ లైటింగ్‌తో లెథెరెట్ సీట్ కవర్‌లను పొందుతుంది. దాని ఫీచర్ల సెట్‌లో ఉన్న చిన్న మార్పు ఏమిటంటే, ముందు భాగంలో టైప్-సి USB పోర్ట్‌ని చేర్చడం.
i20 N లైన్ ఫీచర్‌ల జాబితాకు ఏ ఇతర నవీకరణలు చేయలేదు. ఇది 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే మరియు క్రూజ్ కంట్రోల్ వంటి అంశాలతో కొనసాగుతుంది.
ఇది ఇప్పుడు ప్రామాణికంగా 35 భద్రతా లక్షణాలను పొందుతుంది, అందులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ప్రయాణీకులందరికీ రిమైండర్‌తో కూడిన 3-పాయింట్ సీట్‌బెల్ట్ మరియు వెహికల్ స్టెబిలిటీ మేనేజ్‌మెంట్ (VSM) వంటివి ఉన్నాయి.
ఒక ముఖ్యమైన యాంత్రిక మార్పు
నవీకరణతో, హ్యుందాయ్ గతంలో అందించిన 6-స్పీడ్ iMT గేర్‌బాక్స్‌ను 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో భర్తీ చేసింది. స్పోర్టియర్‌గా కనిపించే హ్యాచ్‌బ్యాక్ దాని 7-స్పీడ్ DCT (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్‌మిషన్) ఎంపికను అలాగే 120PS/172Nm పవర్, టార్క్ లను విడుదల చేసే 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ని కలిగి ఉంది. ఈ రెండు గేర్‌బాక్స్ ఎంపికలు రెండు వేరియంట్‌లతో అందుబాటులో ఉన్నాయి.
ఇవి కూడా చూడండి: 5 చిత్రాలలో హ్యుందాయ్ ఎక్స్టర్ యొక్క దిగువ శ్రేణి EX వేరియంట్‌ని చూడండి
పోటీదారులు
దీని ఏకైక ప్రత్యక్ష ప్రత్యర్థి టాటా ఆల్ట్రోజ్ టర్బో, ఇది రాబోయే టాటా ఆల్ట్రోజ్ రేసర్‌తో కూడా పోటీపడుతుంది. i20 N లైన్- మారుతి బాలెనో, టయోటా గ్లాంజా మరియు టాటా ఆల్ట్రోజ్ వంటి స్పోర్టియర్‌గా కనిపించే ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌లకు ప్రత్యామ్నాయంగా కొనసాగుతోంది.
మరింత చదవండి : i20 ఆన్ రోడ్ ధర