• English
  • Login / Register

భారతదేశంలో రూ. 61.25 లక్షల ధరతో విడుదలైన Volvo C40 Recharge EV

వోల్వో సి40 రీఛార్జ్ కోసం rohit ద్వారా సెప్టెంబర్ 04, 2023 10:18 pm ప్రచురించబడింది

  • 97 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఇది XC40 రీఛార్జ్‌పై ఆధారపడి ఉంటుంది, అయితే 530km వరకు WLTP-క్లెయిమ్ చేసిన మైలేజ్ ను అందించడం కోసం నవీకరించబడిన 78kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది.

Volvo C40 Recharge

  • C40 రీఛార్జ్ అనేది XC40 రీఛార్జ్ తర్వాత భారతదేశంలో వోల్వో యొక్క రెండవ EV ఉత్పత్తి.

  • XC40 రీఛార్జ్ యొక్క థోర్'స్ హామర్-ఆకారపు LED DRLలు మరియు అల్లాయ్ వీల్స్‌ను వేరే వాహనం నుండి తీసుకుంటుంది, కానీ విలక్షణమైన వాలుగా ఉండే రూఫ్‌లైన్‌ను పొందుతుంది.

  • అందించబడిన ఫీచర్లలో 9-అంగుళాల టచ్‌స్క్రీన్, పనోరమిక్ గ్లాస్ రూఫ్ మరియు ADAS ఉన్నాయి.

  • ఇది 150kW DC ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇస్తుంది, దీని బ్యాటరీ 27 నిమిషాల్లో 10-80 శాతం వరకు ఛార్జ్ చేయగలదు.

  • డ్యూయల్-మోటార్ AWD పవర్‌ట్రెయిన్, 408PS పనితీరు రేటింగ్‌ను కలిగి ఉంది.

జూన్ 2023లో భారతదేశంలో బహిర్గతం అయిన తర్వాత, వోల్వో C40 రీఛార్జ్  ఇప్పుడు రూ. 61.25 లక్షల ధరతో విక్రయించబడింది (పరిచయ, ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా). ఇది XC40 రీఛార్జ్ యొక్క కూపే వెర్షన్. అలాగే ఇది, కూపే ఆధారంగా రూపొందించబడిన ఎలక్ట్రిక్ SUV. వోల్వో C40 రీఛార్జ్‌ను సెప్టెంబర్ చివరిలోపు వినియోగదారుల వద్దకు చేరనుంది.

స్పోర్టియర్ లుక్స్

Volvo C40 Recharge

C40 రీఛార్జ్ యొక్క ముందు భాగం XC40 రీఛార్జ్‌తో సమానంగా ఉంటుంది, ఇందులో క్లోజ్డ్ గ్రిల్ మరియు థోర్ యొక్క హేమర్ -ఆకారపు LED DRLలు ఉంటాయి. ఇది, ముందు అందించబడిన 19-అంగుళాల అల్లాయ్ వీల్స్‌ను పొందినప్పటికీ, ప్రొఫైల్‌లో C40 రీఛార్జ్ యొక్క ప్రధాన వ్యత్యాసం ఏటవాలుగా ఉండే రూఫ్‌లైన్ మరియు స్పోర్టియర్ గా కనిపించే వెనుక భాగం. ఇవన్నీ కలిపి మరింత స్పోర్టియర్ లుక్ ను అందిస్తాయి. ఫంకీ పెయిర్ LED టెయిల్‌లైట్‌లు, టెయిల్‌గేట్‌లోకి చొచ్చుకునేంతగా కనిపిస్తాయి. ఇది, ఈ SUV కూపే యొక్క ముఖ్యమైన అంశం అని చెప్పవచ్చు.

లోపల అందించబడిన అంశాలు

Volvo C40 Recharge Interior

ఇతర వోల్వో కార్లతో చూసినట్లుగా, C40 రీఛార్జ్ క్యాబిన్ కూడా XC40 రీఛార్జ్ వలె అదే లేఅవుట్‌తో మినిమలిస్టిక్ అప్పీల్‌ను కలిగి ఉంది. ఇది పూర్తిగా లెదర్-ఫ్రీ ఇంటీరియర్‌ను పొందిన కార్‌మేకర్ యొక్క మొదటి మోడల్. EV క్యాబిన్‌లో పాక్షికంగా రీసైకిల్ చేసిన అప్హోల్స్టరీలు మరియు కార్పెట్‌లు కూడా ఉన్నాయి.

అందించబడిన పరికరాలు

వోల్వో EVలో, 9-అంగుళాల నిలువు -ఆధారిత టచ్‌స్క్రీన్ యూనిట్, 12.3-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, హీటింగ్ మరియు కూలింగ్ ఫంక్షన్‌తో కూడిన పవర్డ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ గ్లాస్ రూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ అలాగే 13-స్పీకర్ హర్మాన్ కార్డాన్‌ సౌండ్ సిస్టం వంటి అంశాలు అందించబడ్డాయి.

భద్రత విషయంలో, వోల్వో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా, హిల్-అసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, కొలిషన్ అవాయిడెన్స్ మరియు బ్లైండ్-స్పాట్ డిటెక్షన్ వంటి అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌ల (ADAS) వంటి అంశాలతో అందించబడింది.

ఇంజన్ల వివరాలు

C40 రీఛార్జ్ 78kWh బ్యాటరీ ప్యాక్‌తో అందించబడింది, WLTP-క్లెయిమ్ చేసిన 530కిమీ పరిధిని అందిస్తుంది. ఇది 408PS మరియు 660Nm పవర్, టార్క్ లను అందించే డ్యూయల్-మోటార్ AWD సెటప్‌ను కలిగి ఉంది, ఇది 4.7 సెకన్లలో 0-100kmph వేగాన్ని చేరుకోగలుగుతుంది.

వోల్వో తన బ్యాటరీని ఫాస్ట్ ఛార్జింగ్‌కు మద్దతు ఇచ్చే 150kW చార్జర్ ను ఉపయోగించి, 10 నుండి 80 శాతం వరకు చార్జ్ చేయడానికి కేవలం 27 నిమిషాల సమయం పడుతుంది. 

పోటీ తనిఖీ

వోల్వో యొక్క ఎలక్ట్రిక్ SUV కూపేకి ప్రత్యక్ష పోటీదారులు లేరు, అయితే హ్యుందాయ్ ఆయానిక్ 5, కియా EV6, BMW i4 మరియు దాని తోటి వాహనం అయిన XC40 రీఛార్జ్ వంటి అదే ధర కలిగిన EV లకు గట్టి పోటీని ఇస్తుంది.

was this article helpful ?

Write your Comment on Volvo సి40 రీఛార్జ్

explore మరిన్ని on వోల్వో సి40 రీఛార్జ్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience