2 నెలలలో 50,000 కంటే ఎక్కువ బుకింగ్ؚలను అందుకున్న Kia Seltos Facelift, ఈ పండుగ సీజన్‌లో రానున్న రెండు కొత్త ADAS వేరియెంట్ؚలు
కియా సెల్తోస్ కోసం shreyash ద్వారా సెప్టెంబర్ 21, 2023 03:49 pm ప్రచురించబడింది
- 56 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టాప్-స్పెక్ వేరియెంట్‌లతో పోలిస్తే, ఈ కొత్త వేరియెంట్‌ల ధర రూ.40,000 వరకు తక్కువగా ఉంటుంది. అయితే, ఫీచర్‌ల విషయంలో కొంత రాజీ పడవలసి ఉంటుంది అనే విషయాన్ని పరిగణించాలి.
-
మొత్తం బుకింగ్ؚలలో 77 శాతం వరకు 2023 సెల్టోస్ టాప్ వేరియెంట్ؚలు (HTX నుండి) ఉన్నాయి.
-
47 శాతం బుకింగ్‌లు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలను (ADAS) కలిగి ఉన్న వేరియెంట్ؚల కోసం జరిగాయి.
-
మరింత చవకైన ADAS GTX+(S) మరియు X-లైన్(S) వేరియెంట్ؚలను కూడా కియా పరిచయం చేసింది.
-
ఈ కొత్త వేరియెంట్ؚలు పెట్రోల్ؚలో 7-స్పీడ్ DCT మరియు డీజిల్ؚలో ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚతో మాత్రమే అందిస్తున్నారు.
ఈ సంవత్సరం జూలైలో కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్ విడుదల అయ్యింది, కేవలం రెండు నెలలలో 50,000 బుకింగ్ؚలను అందుకోవడం ద్వారా మార్కెట్ దృష్టిని మళ్ళీ ఆకర్షించింది. 2023 సెల్టోస్ కోసం ప్రతి రోజు 806 బుకింగ్‌లను అందుకుంటున్నట్లు కారు తయారీదారు తెలియచేసారు.
77 శాతం బుకింగ్ؚలలో సెల్టోస్ టాప్ వేరియెంట్ؚలు ఉండగా (HTX వేరియెంట్ నుండి) అందులో 47 శాతం బుకింగ్‌లు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలను (ADAS) కలిగి ఉన్న వేరియెంట్ؚలవే, కాబట్టి కియా మరొక రెండు కొత్త ADASను వేరియెంట్ؚలను - GTX+(S) మరియు X-లైన్(S)లను పరిచయం చేసింది. వీటి ధరలు క్రింద పట్టికలో వివరించబడ్డాయి.
కొత్త వేరియెంట్ؚలు |
ప్రస్తుత GTX+ మరియు X-లైన్ వేరియెంట్ؚలు |
తేడా |
GTX+ (S) 1.5 టర్బో-పెట్రోల్ 7-స్పీడ్ DCT – రూ. 19.40 లక్షలు |
GTX+ 1.5 టర్బో-పెట్రోల్ 7-స్పీడ్ DCT – రూ. 19.80 లక్షలు |
- రూ. 40,000 |
X-లైన్ (S) 1.5 టర్బో-పెట్రోల్ 7-స్పీడ్ DCT – రూ. 19.60 లక్షలు |
X-లైన్ 1.5 టర్బో-పెట్రోల్ 7-స్పీడ్ DCT – రూ. 20 lakh |
- రూ. 40,000 |
GTX+ (S) 1.5 డీజిల్ 6-స్పీడ్ AT – రూ. 19.40 లక్షలు |
GTX+ 1.5 డీజిల్ 6-స్పీడ్ AT – రూ. 19.80 లక్షలు |
- రూ. 40,000 |
X-లైన్ (S) 1.5 డీజిల్ 6-స్పీడ్ AT – రూ. 19.60 లక్షలు |
X-లైన్ 1.5 డీజిల్ 6-స్పీడ్ AT- రూ. 20 లక్షలు |
- రూ. 40,000 |
GTX+(S), GTX+ కంటే దిగువన మరియు X-లైన్(S), టాప్-స్పెక్ X-లైన్ కంటే దిగువన నిలుస్తాయి. 360-డిగ్రీల కెమెరా స్థానంలో రివర్సింగ్ కెమెరాను, 8-స్పీకర్‌ల బోస్ ఆడియో సిస్టమ్ స్థానంలో బ్రాండెడ్ కాని 6-స్పీకర్ సెట్-అప్ؚను అంగీకరిస్తే, మీరు ఈ వేరియెంట్ؚలను ఎంచుకొని రూ.40,000 వరకు ఆదా చేయవచ్చు.
GTX+ మరియు X-లైన్ؚల కొత్త (S) వేరియెంట్‌లలోని ఇతర ముఖ్యమైన ఫీచర్‌లలో 10.25-అంగుళాల ఇంటిగ్రేటెడ్ స్క్రీన్ సెట్అప్, డ్యూయల్-జోన్ ఆటోమ్యాటిక్ AC, ఎయిర్ ప్యూరిఫయ్యర్, 8-వే అడ్జస్టబుల్ పవర్డ్ డ్రైవర్ సీట్, ఆంబియెంట్ లైటింగ్ మరియు పనోరమిక్ సన్ؚరూఫ్ ఉన్నాయి. భద్రత సాంకేతికతల విషయంలో కొత్త వేరియెంట్ؚలు టాప్-స్పెక్ వేరియెంట్ؚలతో సమానంగా ఉన్నాయి. లేన్-కీప్ అసిస్ట్, ఫార్వార్డ్-కొలిజన్ వార్నింగ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ADAS ఫీచర్‌లతో పాటుగా ఇవి ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్-అసిస్ట్ కంట్రోల్ (HAC) మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ వంటి ADAS ఫీచర్‌లను (TPMS) ప్రామాణికంగా కలిగి ఉన్నాయి.
ఇది కూడా చదవండి: సన్‌రూఫ్‌తో కియా సోనెట్ మరింత సరసమైన ధరను పొందుతుంది
ఇంజన్ & ట్రాన్స్ؚమిషన్
కియా ఈ కొత్త సెల్టోస్ వేరియెంట్ؚలను 1.5-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌లతో వరుసగా 7-స్పీడ్ DCT మరియు 6-స్పీడ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపికలతో అందిస్తుంది. ఈ రెండు ఇంజన్ؚలు సెల్టోస్ దిగువ మరియు మిడ్-స్పెక్ వేరియెంట్ؚలతో ఐచ్ఛిక 6-స్పీడ్ iMT (క్లచ్ؚలెస్ మాన్యువల్) ట్రాన్స్ؚమిషన్ؚతో కూడా లభిస్తాయి.
వెయిటింగ్ పీరియడ్ؚ తగ్గుతుందని ఆశిస్తున్నాము
ఈ కొత్త వేరియెంట్ؚల పరిచయంతో, 15 నుండి 16 వారాల వరకు ప్రస్తుతం ఉన్న సెల్టోస్ వెయిటింగ్ పీరియడ్ 7 నుండి 9 వారాలకు తగ్గుతుందని కియా ఆశిస్తోంది. భారతదేశంలో 2019లో పరిచయం చేసిన తరువాత ఇప్పటివరకు, సెల్టోస్ 4 లక్షల కంటే ఎక్కువ మంది కస్టమర్‌లను చేరుకుంది.
ధర పరిధి & పోటీదారులు
కియా సెల్టోస్ ధర రూ.10.90 లక్షల నుండి రూ.20 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంది. ఇది మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, వోక్స్వ్యాగన్ టైగూన్, స్కోడా కుషాక్, హ్యుందాయ్ క్రెటా మరియు MG ఆస్టర్ؚలతో పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: కియా సెల్టోస్ డీజిల్