• English
  • Login / Register

2023లో రూ.30 లక్షల లోపు ADAS ఫీచర్‌తో లభించిన 7 కార్లు

ఎంజి హెక్టర్ కోసం rohit ద్వారా డిసెంబర్ 28, 2023 01:13 pm ప్రచురించబడింది

  • 329 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ జాబితాలోని చాలా కార్లు టాప్ మోడల్‌లో మాత్రమే ఈ భద్రతా ఫీచర్‌ను కలిగి ఉండగా, దాదాపు అన్ని వేరియంట్‌లలో ఈ ఫీచర్‌ను పొందుతున్న ఏకైక కారు హోండా సిటీ.

New cars priced under Rs 30 lakh with ADAS launched in India in 2023

భారతదేశంలో, ప్రజలు ఇప్పుడు కొత్త కారును కొనుగోలు చేసేటప్పుడు భద్రతకు ప్రాముఖ్యత ఇస్తున్నారు మరియు అందుకే కంపెనీలు కూడా తమ వాహనాలలో ఒకటి కంటే ఎక్కువ భద్రతా ఫీచర్లను చేర్చుతున్నారు. కార్లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, రియర్ పార్కింగ్ అలర్ట్స్ ఉన్న అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS)కు ఈ మధ్య డిమాండ్ పెరిగింది.

రూ.30 లక్షల బడ్జెట్లో ADAS ఫీచర్తో 2023లో భారత్లో విడుదల అయిన కార్ల జాబితాను ఇక్కడ మేము సిద్ధం చేశాం. ఆ జాబితాను మీరు ఇక్కడ చూడవచ్చు:

MG హెక్టార్/హెక్టార్ ప్లస్ ఫేస్‌లిఫ్ట్‌లు

MG Hector

  • 2023 ప్రారంభంలో, MG హెక్టార్ మరియు MG హెక్టార్ ప్లస్ రెండూ కొత్త నవీకరణ పొందాయి. ఈ సమయంలో, వాటి డిజైన్ మరియు కంఫర్ట్ స్థాయిని మెరుగుపరచడమే కాకుండా, ప్రయాణీకుల భద్రతను మెరుగుపరచడానికి ADAS ఫీచర్ కూడా చేర్చబడింది.

  • SUV యొక్క రెండు వెర్షన్లలో, ADAS పూర్తిగా లోడ్ చేయబడిన ప్రో ట్రిమ్ లో మాత్రమే అందించబడుతుంది.

  • ADAS కింద అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, ట్రాఫిక్ జామ్ అసిస్ట్, ఆటోనోస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB) వంటి ఫీచర్లు లభిస్తాయి.

హోండా సిటీ ఫేస్‌లిఫ్ట్‌

Honda City

  • నవీకరించబడిన హోండా సిటీ మార్చి 2023 లో విడుదల అయ్యింది, ఇది గతంలో హోండా సిటీ హైబ్రిడ్కు పరిమితం చేయబడిన ADAS తో కూడా వచ్చింది.

  • ఈ సెడాన్ కారులో, ఈ అధునాతన భద్రతా ఫీచర్ V వేరియంట్ నుండి లభిస్తుంది.

  • ADAS కింద, ఇది ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్, లాన్ కీప్ అసిస్ట్ మరియు లీడ్ కార్ డిపార్చర్ అలర్ట్ వంటి ఫీచర్లను పొందుతుంది.

ఆరవ తరం హ్యుందాయ్ వెర్నా

Hyundai Verna

  • హ్యుందాయ్ వెర్నా భారతదేశంలో కంపెనీ యొక్క పాపులర్ సెడాన్. ఇది 2023 లో కొత్త తరం నవీకరణను పొందింది. కొత్త వెర్నా భారతదేశంలో ADAS ఫీచర్ ఉన్న మొదటి హ్యుందాయ్ కారు.

  • హ్యుందాయ్ SX (O) CVT మరియు SX (O) టర్బో అనే రెండు వేరియంట్లలో మాత్రమే ADAS ఫీచర్ను అందిస్తుంది.

  • ADAS కింద ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్, లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, హైబీమ్ అసిస్ట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇది కూడా చూడండి:  సునీల్ శెట్టి తన మొదటి ఎలక్ట్రిక్ వాహనంగా MG కామెట్ EV ని ఎంచుకున్నారు 

హోండా ఎలివేట్

Honda Elevate

  • కాంపాక్ట్ SUV సెగ్మెంట్ లో సరికొత్త కారు హోండా ఎలివేట్. ఇది ADAS తో సహా కొన్ని సెగ్మెంట్ ఉత్తమ ఫీచర్లను పొందుతుంది.

  • హోండా ఈ SUV కారు టాప్ మోడల్ ZX లో ఈ భద్రతా ఫీచర్ ను అందించారు.

  • ADAS కింద అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్ మరియు ఫార్వర్డ్ కొలిషన్ అవాయిడెన్స్ వంటి ఫీచర్లు ఎలివేట్ లో ఉన్నాయి.

హ్యుందాయ్ వెన్యూ మరియు వెన్యూ N లైన్

Hyundai Venue

  • ఫేస్‌లిఫ్ట్‌ చేసిన హ్యుందాయ్ వెన్యూ మరియు హ్యుందాయ్ వెన్యూ N లైన్ 2022 లో విడుదల అయినప్పటికీ, కార్ల తయారీదారు వాటిని 2023 లో మాత్రమే ADAS టెక్నాలజీతో నవీకరించాలని నిర్ణయించారు.

  • హ్యుందాయ్ సబ్-4m SUV యొక్క రెండు వెర్షన్లలో, పూర్తిగా లోడ్ చేయబడిన వేరియంట్లు - SX (O), N8 వేరియంట్లలో మాత్రమే ADAS ఫీచర్ ఉంది.

  • ADAS టెక్నాలజీ కింద, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, డ్రైవర్ అటెండెన్స్ అలర్ట్ మరియు లీడ్ వెహికల్ డిపార్చర్ వార్నింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి, కానీ వాటికి అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్ లేదు.

కియా సెల్టోస్ ఫేస్‌లిఫ్ట్‌

Kia Seltos

  • ఫేస్‌లిఫ్ట్‌ కియా సెల్టోస్ ADAS తో సహా అనేక ఫీచర్ల జాబితాతో 2023 మధ్యలో భారతదేశంలో విడుదల చేయబడింది.

  • సెల్టోస్ టాప్-లైన్ వేరియంట్లలో ADAS ఫీచర్ను పొందుతుంది: GTX+ మరియు X-లైన్.

  • ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ మరియు అవాయిడెన్స్, డ్రైవర్ అటెండెన్స్ అలర్ట్, రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, హై బీమ్ అసిస్ట్ వంటి 17 ADAS ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఈ ఏడాది రూ.30 లక్షల లోపు ఫేస్‌లిఫ్ట్‌ నవీకరణ పొందిన టాప్ 10 కార్లు, పూర్తి జాబితా చూడండి. 

టాటా హారియర్-సఫారీ ఫేస్‌లిఫ్ట్‌లు

Tata Harrier
Tata Safari

  • అక్టోబర్ 2023 లో, టాటా హారియర్ మరియు టాటా సఫారీ మొదటి ప్రధాన నవీకరణను పొందాయి. ఈ రెండింటినీ ఎక్ట్సీరియర్, ఇంటీరియర్ లో నవీకరణ చేయడంతో పాటు పలు కొత్త ఫీచర్లను కూడా పొందుపరిచారు. అయితే 2023 ఆటో ఎక్స్ పోలో ప్రవేశపెట్టిన రెడ్ డార్క్ ఎడిషన్ లో ఇప్పటికే ADAS ఫీచర్ ను అందించారు.

  • ఈ రెండు SUVల్లో అడ్వెంచర్ ప్లస్ ఏ వేరియంట్ నుంచి ADAS ఫీచర్ లభిస్తుంది.

  • ADAS కింద అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ (AEB), రేర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, లేన్ డిపార్చర్ వార్నింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. త్వరలో ఈ రెండు SUVలలో ఫీచర్ సూట్ కు లేన్ కీప్ అసిస్ట్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ ఫీచర్లను జోడించనున్నారు.

రూ.30 లక్షల బడ్జెట్లో ADAS ఫీచర్తో 2023లో భారత్లో విడుదల కానున్న కార్లు ఇవే. వీటిలో దేనిని మీరు తీసుకోవాలనుకుంటున్నారు? కామెంట్స్ లో మాకు తెలియజేయండి.

మరింత చదవండి :  MG హెక్టార్ ఆన్ రోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on M జి హెక్టర్

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience