తన మొదటి ఎలక్ట్రిక్ వాహనంగా MG Comet EVని ఎంచుకున్న Suniel Shetty
ఎంజి కామెట్ ఈవి కోసం rohit ద్వారా డిసెంబర్ 27, 2023 01:30 pm ప్రచురించబడింది
- 230 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
నిరాడంబరమైన MG EV ఇప్పుడు ఈ నటుడి విలాసవంతమైన కలెక్షన్ؚలో భాగము. వీరి కలెక్షన్ؚలో హమ్మర్ H2, ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110వంటివి ఉన్నాయి.
ఈ పండుగ సీజన్ؚలో ఎందరో బాలీవుడ్ తారలు కొత్త కారును కొనుగోలు చేశారు, కొందరు నటులు ఇటీవల ఎలక్ట్రిక్ విప్లవంలో భాగస్వాములు అయ్యారు. వీరిలో ఒకరు ‘హేరా ఫేరీ’ చిత్రాలతో ప్రసిద్ధి చెందిన సునీల్ శెట్టి. నగరానికి-హితమైన MG-కామెట్ EVని కొనుగోలు చేసిన B-టౌన్ నటులలో వీరు కూడా ఒకరు, ఇది ఆయన కొన్న మొదటి ఎలక్ట్రిక్ కారు.
కామెట్ EV గురించి మరిన్ని వివరాలు
ఈ బాలీవుడ్ స్టార్ MG EV ఫుల్లీ లోడెడ్ ప్లష్ వేరియెంట్ؚను ఎంచుకున్నారు, దీని ఖరీదు రూ. 9.98 లక్షలు (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా). కామెట్ EVతో లభించే కష్టమైజేషన్ డెకాల్ ప్యాక్ؚలు లేకుండా సరళమైన మోనోటోన్ స్టారీ బ్లాక్ రంగును ఆయన ఎంచుకున్నారు.
ఆయన గ్యారేజీలోని ఇతర కార్ؚలు
మరింత మాస్-మార్కెట్ కామెట్ EV కాకుండా, సునీల్ శెట్టి కలెక్షన్ؚలో విస్తృత శ్రేణి విలాసవంతమైన వాహనాలు ఉన్నాయి. వీటిలో ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110, మెర్సిడెస్-బెంజ్ GLS 350, BMW X5, మరియు హమ్మర్ H2 ఉన్నాయి.
కామెట్ EVకి శక్తిని అందించేది ఏమిటి?
కామెట్ EVలో MG 17.3kWh బ్యాటరీ ప్యాక్ؚను అందిస్తోంది, దీని క్లెయిమ్ చేసిన పరిధి 230 km. రేర్-వీల్-డ్రైవ్ ఎలక్ట్రిక్ మోటార్ రేటింగ్ 42 PS మరియు 110 Nm. 3.3 kW ఛార్జర్ؚతో చార్జింగ్ పూర్తి కావడానికి ఏడు గంటల సమయం పడుతుంది.
ఇది కూడా చదవండి: 2023 లో భారతీయ మార్కెట్ నుంచి వీడ్కోలు పలుకనున్న 8 కార్లు
ఇందులో ఉన్న ఫీచర్లు మరియు భద్రత పరికరాలు
MG EV 10.25-అంగుళాల డిస్ప్లేలు (ఇన్ఫోటైన్మెంట్ కోసం ఒకటి మరియు ఇన్స్ట్రుమెంటేషన్ కోసం ఒకటి), కీలెస్ ఎంట్రీ, కనెక్టెడ్ కార్ టెక్, ఫ్రంట్ పవర్ విండోలు, మరియు 2-స్పీకర్ సౌండ్ సిస్టమ్ؚతో వస్తుంది.
దీని భద్రత నెట్ؚలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ؚబ్యాగ్ؚలు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ؚలు, మరియు రివర్సింగ్ కెమెరా ఉన్నాయి.
సునీల్ శెట్టి కొత్త EV కొనుగోలు గురించి మీరు ఏమి అనుకుంటున్నారు? కామెంట్లలో మాకు తెలియజేయండి.
ఇక్కడ మరింత చదవండి: కామెట్ EV ఆటోమ్యాటిక్
0 out of 0 found this helpful