ESC ప్రామాణికంగా రూ.10 లక్షల కంటే తక్కువ ధరగల 10 కార్లు
రెనాల్ట్ క్విడ్ కోసం shreyash ద్వారా ఫిబ్రవరి 23, 2023 04:06 pm ప్రచురించబడింది
- 53 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ జాబితాలో రెనాల్ట్, మారుతి మోడల్ కార్‌లు ఎక్కువగా ఉండగా, హ్యుందాయ్ నుండి ఒక కారు కూడా లేదు
ఇటీవలి కాలంలో, భారత ఆటోమోటివ్ రంగంలో కారు తయారీదారులు భద్రతపై దృష్టి సారిస్తూ, తాము అందించే ప్రామాణిక ఉత్పత్తులను భద్రత పరంగా నవీకరించి, విస్తరిస్తున్నారు. ఇందులో భాగంగా ఇకపై ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) భద్రత ఫీచర్ తప్పనిసరి కానుంది. ఇది ఇప్పటికే నవీకరించిన గ్లోబల్ NCAP పరీక్షలలో మెరుగైన స్కోర్ؚను పొందేందుకు కనీస అవసరంగా మారింది.
ESC అనేది ఒక క్రియాశీల భద్రతా ఫీచర్, హఠాత్తుగా బ్రేక్ వేసినప్పుడు లేదా హఠాత్తుగా స్టీరింగ్ తిప్పినప్పుడు వాహనం నియంత్రణ కోల్పోకుండా ఉండేలా ఈ ఫీచర్ సహాయపడుతుంది. ఇప్పటికే కారు తయారీదారులు తమ జాబితాలో ఈ ఫీచర్‌ను జోడించడం ప్రారంభించారు, రూ.10 లక్షల కంటే తక్కువ ధర కలిగి ESCను ప్రామాణికంగా అందిస్తున్న 10 కార్‌ల జాబితా ఇక్కడ ఇవ్వబడింది.
రెనాల్ట్ క్విడ్
ధర పరిధి: రూ.4.70 లక్షల నుండి 6.33 లక్షల వరకు ఉంది
ESC ప్రామాణికంగా ఉన్న జాబితాలో క్విడ్ అత్యంత చవకైన వాహనం, ఈ ఫీచర్ అన్ని వేరియెంట్‌లలో అందుబాటులో ఉంది. 2023 ప్రారంభంలో రెనాల్ట్ తమ పూర్తి వాహన శ్రేణిని ఈ ఫీచర్‌తో నవీకరించింది. అంతేకాకుండా, దీని భద్రత ఫీచర్‌లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, హిల్ స్టార్ట్ అసిస్ట్ (HAS), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) కూడా ఉన్నాయి.
ఇది కూడా చదవండి: రెనాల్ట్ ట్రైబర్ؚ పోలీకలతో కాకుండా విభిన్న లుక్స్ తో రానున్న నిస్సాన్ MPV
రెనాల్ట్ ట్రైబర్
ధర పరిధి: రూ. 6.33 లక్షల నుండి 8.97 లక్షల వరకు ఉంది
రెనాల్ట్ ట్రైబర్, భారతదేశ ఎంట్రీ-లెవెల్ కాంపాక్ట్ MPV క్రాస్ؚఓవర్, దీని వేరియెంట్‌ల అన్నిటిలో ESCను ప్రామాణికంగా అందిస్తుంది. ఈ వాహనంలోని ఇతర భద్రత పరికరాలలో నాలుగు వరకు ఎయిర్ బ్యాగులు, EBDతో ABS, హిల్ స్టార్ అసిస్ట్ (HAS), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.
ఇది కూడా చదవండి: భారతదేశానికి మరో ఆరు సరికొత్త వాహనాలను (4 SUVలు, 2 EVలు) పరిచయం చేయనున్న నిస్సాన్ & రెనాల్ట్
మారుతి స్విఫ్ట్
ధర పరిధి: రూ. 6 లక్షల నుండి 8.98 లక్షల వరకు ఉంది
అత్యంత ప్రజాదరణ పొందిన మారుతి హ్యాచ్ؚబ్యాక్ స్విఫ్ట్, ఇప్పుడు ESCతో ప్రామాణికంగా వస్తుంది. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, EBDతో ABS, హిల్-హోల్డ్ కంట్రోల్, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు కూడా ఉంటాయి.
ఇంతకు ముందు స్విఫ్ట్‌లో అవసరమైన భద్రత ప్రమాణాలు లేనందున, నవీకరించబడిన గ్లోబల్ NCAP ప్రోటోకాల్‌పై ఆధారపడిన క్రాష్ టెస్ట్ؚలో కేవలం ఒక్క స్టార్ؚను మాత్రమే పొందింది. తిరిగి క్రాష్-టెస్ట్ నిర్వహిస్తే, నవీకరించిన ప్రామాణిక భద్రతా కిట్ కారణంగా ఈ కారు మెరుగైన భద్రతా రేటింగ్ పొందుతుందని ఆశించవచ్చు.
ఇది కూడా చదవండి: గ్రాండ్ విటారా బుకింగ్ؚలలో నాలుగో వంతు కంటే ఎక్కువ స్ట్రాంగ్ హైబ్రిడ్‌లు ఉన్నాయి: మారుతి
మారుతి డిజైర్
ధర పరిధి: రూ. 6.44 లక్షల నుండి 9.31 లక్షల వరకు ఉంది
సబ్ కాంపాక్ట్ సెడాన్ విభాగంలో కేవలం డిజైర్ మాత్రమే ESCని ప్రామాణికంగా అందిస్తుంది. ఈ సెడాన్ ఇతర భద్రతా ఫీచర్‌లలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, ISOFIX చైల్డ్-సీట్ యాంకర్‌లు, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి.
మారుతి బాలెనో
ధర పరిధి: రూ. 6.56 లక్షల నుండి 9.83 లక్షల వరకు ఉంది
మారుతి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ బాలెనో, ఇటీవల అదనపు కనెక్టివిటీ మరియు భద్రతా ఫీచర్‌లతో నవీకరించబడింది. ఇందులో ESC ప్రామాణికంగా, హిల్-హోల్డ్ అసిస్ట్ؚను కూడా కలిగి ఉంది. అంతేకాకుండా, ఆరు ఎయిర్ బ్యాగులు, 360-డిగ్రీ కెమెరాలతో వస్తుంది.
గమనిక: బాలెనో క్రాస్-బాడ్జెడ్ వెర్షన్ అయిన టొయోటా గ్లాంజాలో కూడా ESC, హిల్-హోల్డ్ؚలు ప్రామాణికంగా ఉంటాయి. దీని ధర రూ. 6.66 లక్షల నుండి 9.99 లక్షల వరకు ఉంటుంది.
నిస్సాన్ మాగ్నైట్
ధర పరిధి: రూ. 6 లక్షల నుంచి 10.94 లక్షల వరకు ఉంది
రెనాల్ట్ కైగర్ పోలీకలతో కనిపించే నిస్సాన్ వెర్షన్ మాగ్నైట్ కూడా, ఇటీవలి నవీకరణతో అన్ని వేరియెంట్‌లలో ESCను ప్రామాణికంగా అందిస్తోంది. ఇతర భద్రతా పరికరాలలో 360-డిగ్రీల కెమెరా, హిల్-స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) ఉన్నాయి.
రెనాల్ట్ కైగర్
ధర పరిధి: రూ. 6.50 లక్షల నుండి 11.23 లక్షల వరకు ఉంది
రెనాల్ట్ సబ్ కాంపాక్ట్ SUV కైగర్ పూర్తి శ్రేణిలో ESC ప్రామాణికంగా ఉంది. దీనితో పాటు నాలుగు ఎయిర్ బ్యాగులు, EBDతో ABS, హిల్ స్టార్ట్ అసిస్ట్ (HAS), ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), స్పీడ్-సెన్సింగ్ డోర్ లాక్ؚలు, రేర్-వ్యూ కెమెరా, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు ఉన్నాయి.
టాటా నెక్సాన్
ధర పరిధి: రూ. 7.80 లక్షల నుండి 14.30 లక్షల వరకు ఉంది
నెక్సాన్ అన్ని వేరియెంట్‌లలో ESC ప్రామాణిక భద్రతా పరికరంగా అందించబడుతోంది. గ్లోబల్ NCAP నుండి ఐదు-స్టార్ భద్రత రేటింగ్ పొందిన మొదటి భారతీయ కారుగా నెక్సాన్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, EBDతో ABS, వెనుక పార్కింగ్ సెన్సార్‌లు, ISOFIX చైల్డ్-సీట్ యాంకర్‌లు వంటి ప్రాధమిక భద్రత ఫీచర్‌లؚను కొనసాగిస్తుంది.
మారుతి బ్రెజ్జా
ధర పరిధి: రూ. 8.19 లక్షల నుండి 14.04 లక్షల వరకు ఉంది
బ్రెజ్జా పూర్తి శ్రేణిలో కూడా ESC ప్రామాణికంగా ఉండగా, దాని టాప్ వేరియెంట్‌లు రూ.10 లక్షల కంటే ఎక్కువ ధరతో మరియు ఆరు ఎయిర్ బ్యాగులు, హిల్-హోల్డ్ అసిస్ట్, EBDతో ABS, 360-డిగ్రీ కెమెరాలతో అందిస్తున్నారు.
మారుతి ఎర్టిగా
ధర పరిధి: రూ. 8.35 లక్షల నుండి 12.79 లక్షల వరకు ఉంది
ట్రైబర్ తరువాత, ESC ప్రామాణికంగా వస్తున్న ఒకే ఒక MPV ఎర్టిగా. దీని ఖరీదైన వేరియెంట్‌లు నాలుగు ఎయిర్ బ్యాగులు మరియు హిల్-హోల్డ్ అసిస్ట్ؚలతో అందిస్తున్నారు.
ESCను ప్రామాణికంగా కలిగి ఉన్న 10 అత్యంత చవకైన వాహనాలు ఇవే. అయితే, కారులు అన్నిటిలో ఆరు ఎయిర్ బ్యాగులతో పాటు ESC తప్పనిసరిగా ప్రామాణికంగా వచ్చేలా ఈ సంవత్సరం చివరి నాటికి ప్రభుత్వం ప్రవేశపెట్టాలని ఆశిస్తున్నాం.
ఇక్కడ మరింత చదవండి : క్విడ్ AMT