రూ. 10 లక్షల కంటే తక్కువ ధరను కలిగిన 10 ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ కార్‌ల వివరాలు
మారుతి ఆల్టో కె కోసం rohit ద్వారా మార్చి 16, 2023 12:06 pm ప్రచురించబడింది
- 22 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జాబితాలో అందించిన అన్ని కార్‌లు సాపేక్షంగా చవకైన ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ (AMT) ఎంపిక కలిగి ఉన్నాయి, ఇవి మీ రోజువారీ డ్రైవింగ్ؚను మరింత సౌకర్యవంతం చేస్తాయి.
ఈ రోజుల్లో, కారును కేవలం ఒక చోట నుండి మరొక చోటకు వెళ్లడానికి ఉపయోగించే వాహనంలా మాత్రమే కాకుండా, ఇల్లుతో సమానంగా భావిస్తున్నారు. కేవలం ప్రయాణించడానికి కాకుండా తమ వాహనాలలో సాంకేతికత, సౌకర్యాలు వంటి ఫీచర్‌లతో మరిన్ని సౌకర్యాలు ఉండాలని కోరుకుంటున్నారు. నేడు కొనుగోలుదారులు ఎంచుకుంటున్న సౌకర్యవంతమైన ఫీచర్‌లలో ఒకటి ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ మోడల్‌లు. ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚలో అనేక రకాలు ఉంటాయి, బడ్జెట్ؚ అనుకూల కార్‌లలో మీరు సాధారణంగా చూసేది AMT లేదా ఆటోమేటెడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్.
మీరు కొత్త కారును కొనుగోలు చేయాలని చేస్తుంటే, రూ.10 లక్షల లోపు అత్యంత సరసమైన ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో కూడిన మోడల్‌లను ఇక్కడ చూడవచ్చు:
మారుతి ఆల్టో K10
-
ప్రస్తుత మార్కెట్‌లో కొనుగోలు చేయగలిగిన, అత్యంత చవకైన ఆటోమ్యాటిక్ గేర్‌బాక్స్-గల కారు ఆల్టో K10.
-
ఎంట్రీ లెవెల్ హ్యాచ్‌బ్యాక్ హయ్యర్-స్పెక్ VXi మరియు VXi+ వేరియెంట్‌లను మారుతి రెండు-పెడల్ ఎంపికతో అందిస్తుంది (5-స్పీడ్ AMT).
-
వీటి ధర రూ. 5.59 లక్షలు మరియు రూ. 5.88 లక్షల మధ్య ఉంది.
మారుతి S-ప్రెస్సో
-
మారుతి లైన్అప్ؚలోని మరొక ఎంట్రీ-లెవెల్ హ్యాచ్‌బ్యాక్, S-ప్రెస్సో, ఈ మోడల్ లోని కొన్ని వేరియెంట్‌లను ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్‌తో అందిస్తున్నారు.
-
కారు తయారీదారు ఈ హ్యాచ్‌బ్యాక్ టాప్ రేంజ్ VXi (O) మరియు VXi+(O) వేరియెంట్‌లలో 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ؚను అందిస్తున్నారు.
-
మారుతి వీటిని రూ.5.75 లక్షల నుండి రూ.6.04 లక్షల ధర పరిధిలో అందిస్తుంది.
రెనాల్ట్ క్విడ్
-
భారతదేశంలో రెనాల్ట్ అందిస్తున్న ఏకైక హ్యాచ్ؚబ్యాక్ క్విడ్ؚ, ఇది రెండు-పెడల్ వెర్షన్‌లో కూడా వస్తుంది.
-
హయ్యర్ వేరియెంట్‌లు RXT మరియు క్లైంబర్ؚలలో 5-స్పీడ్ AMT ఎంపికతో కూడా వస్తుంది.
-
క్విడ్ ఆటోమ్యాటిక్ వేరియెంట్‌ల ధర రూ.6.12 లక్షల నుండి రూ.6.33 లక్షల మధ్య ఉంటుంది.
మారుతి సెలెరియో
-
కాంపాక్ట్ హ్యాచ్‌బ్యాక్ శ్రేణిలో మారుతి రెండు మోడల్‌లను కలిగి ఉంది, ఆ రెండూ AMT గేర్ؚబాక్స్ ఎంపికతో వస్తాయి.
-
సెలెరియో మిడ్-స్పెక్ VXi, ZXi వేరియెంట్‌లలో మరియు టాప్ రేంజ్ ZXi+ వేరియెంట్ؚలో 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌ను కలిగి ఉంటుంది.
-
సెలెరియో AMT ధరలు రూ. 6.37 లక్షల నుండి రూ. 7.13 లక్షల వరకు ఉన్నాయి.
మారుతి వ్యాగన్ R
-
వ్యాగన్ R రెండు ఇంజన్ ఎంపికలను పొందింది – 67PS 1-లీటర్ పెట్రోల్ మరియు 90PS 1.2-లీటర్ పెట్రోల్ – ఈ రెండు 5-స్పీడ్ AMT గేర్ؚబాక్స్ ఎంపికతో వస్తాయి.
-
ఆటోమ్యాటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపిక కేవలం 1-లీటర్ వ్యాగన్ R మిడ్-స్పెక్ VXi వేరియెంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంది, పెద్ద ఇంజన్ ఎంపికతో దీన్ని మూడు హయ్యర్-స్పెక్ వేరియెంట్‌లలో (ZXi, ZXi+ మరియు ZXi+ DT) కూడా పొందవచ్చు.
-
వ్యాగన్ R AMT ధరలను మారుతి రూ.6.53 లక్షల నుండి రూ.7.41 లక్షల మధ్య నిర్ణయించింది.
ఇది కూడా చదవండి: ESCని ప్రామాణికంగా పొందుతూ రూ.10 లక్షల కంటే తక్కువ ధర కలిగిన 10 కార్‌లు
టాటా టియాగో
-
5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికను పొందిన మరొక కాంపాక్ట్ హ్యాచ్ؚబ్యాక్ టాటా టియాగో.
-
టాటా, ఈ హ్యాచ్‌బ్యాక్ హయ్యర్-స్పెక్ XTA, XAZ+, XZA+ DT వేరియెంట్‌లలో రెండు-పెడల్ ఎంపికను అందిస్తుంది.
-
టియాగో క్రాస్ఓవర్ వెర్షన్ – టియాగో NRG కూడా ఉంది, దీన్ని XZA వేరియెంట్ؚలో అదే ప్రత్యామ్నాయ గేర్ؚబాక్స్ؚతో పొందవచ్చు.
-
టాటా టియాగో AMTని రూ.6.87 లక్షల నుండి రూ.7.70 లక్షల ధరతో విక్రయిస్తుంది, అలాగే టియాగో NRG AMT ధర రూ. 7.60 లక్షలు ఉంది.
మారుతి ఇగ్నిస్
-
మారుతి, ఇగ్నిస్ؚను 5-స్పీడ్ AMT గేర్ؚబాక్స్ؚతో అందిస్తుంది.
-
దీన్ని మిడ్-స్పెక్ డెల్టా మరియు జెటా వేరియెంట్‌లలో మరియు టాప్-స్పెక్ ఆల్ఫా వేరియెంట్ؚలో కూడా పొందవచ్చు.
-
ఇగ్నిస్ AMT ధర రూ.6.91 లక్షలు మరియు రూ.8.14 లక్షల మధ్య ఉంటుంది.
హ్యుందాయ్ గ్రాండ్ I10 నియోస్
-
ఆటోమ్యాటిక్ గేర్‌బాక్స్ ఎంపిక కలిగిన అత్యంత చవకైన హ్యుందాయ్ వాహనం గ్రాండ్ I10 నియోస్.
-
హ్యుందాయ్, ఈ మిడ్ؚసైజ్ హ్యాచ్ؚబ్యాక్ؚను మిడ్-స్పెక్ మాగ్నా, స్పోర్ట్జ్ ఎగ్జిక్యూటివ్ మరియు స్పోర్ట్జ్ వేరియెంట్‌లలో 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ؚతో అందిస్తుంది.
-
వీటి ధర రూ. 7.23 లక్షల నుండి రూ. 8.46 లక్షల మధ్య ఉంటుంది.
సంబంధించినది: GM టాలెగావ్ ప్లాంట్ కొనుగోలు కోసం టర్మ్ షీట్‌పై సంతకం చేసిన హ్యుందాయ్ ఇండియా
మారుతి స్విఫ్ట్
-
మిడ్-స్పెక్ VXi మరియు ZXi వేరియెంట్‌లతో పాటు టాప్-స్పెక్ ZXi+ మరియు ZXi+ DT వేరియెంట్‌లలో కూడా స్విఫ్ట్ؚను 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో మారుతి అందిస్తోంది.
-
స్విఫ్ట్ AMT ధరలు రూ. 7.45 లక్షల నుండి రూ.8.98 లక్షల పరిధిలో ఉంటాయి.
టాటా పంచ్
-
ఈ జాబితాలో టియాగోలో ఉన్న అదే 5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ؚను కలిగి ఉన్న ఒకే ఒక SUV టాటా పంచ్.
-
దీన్ని బేస్-స్పెక్ ప్యూర్ؚలో తప్ప అన్ని వేరియెంట్‌లలో పొందవచ్చు (అడ్వెంచర్, అకాంప్లిష్డ్ మరియు క్రియేటివ్). పంచ్ కేమో ఎడిషన్ؚలో కూడా దీన్ని అందిస్తున్నారు.
-
పంచ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ వేరియెంట్ؚలను టాటా రూ. 7.45 లక్షల నుండి రూ. 9.47 లక్షల ధరతో విక్రయిస్తుంది.
అన్ని ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
ఇక్కడ మరింత చదవండి: ఆల్టో K10 ఆన్ؚరోడ్ ధర
0 out of 0 found this helpful