పండుగ సీజన్ లో తగ్గిన Citroen C3 ధరలు; 'కేర్ ఫెస్టివల్' సర్వీస్ క్యాంప్ ని ప్రారంభించిన Citroen
సిట్రోయెన్ సి3 క ోసం shreyash ద్వారా అక్టోబర్ 24, 2023 02:04 pm ప్రచురించబడింది
- 71 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
సిట్రోయెన్ C3 హ్యాచ్ బ్యాక్ పండుగ ధరలు అక్టోబర్ 31 వరకు చేసిన డెలివరీలకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి.
-
C3 హ్యాచ్ బ్యాక్ కారుపై రూ.57,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది.
-
వినియోగదారులు ఇప్పుడు సిట్రోయెన్ C3 హ్యాచ్బ్యాక్ను కొనుగోలు చేయవచ్చు అలాగే 2024 నుండి దాని EMIలను చెల్లించడం ప్రారంభించవచ్చు.
-
అక్టోబర్ 17 నుంచి నవంబర్ 4 వరకు 'కేర్ ఫెస్టివల్' సర్వీస్ క్యాంప్ ను నిర్వహిస్తోంది.
-
ఈ సర్వీస్ క్యాంప్ లో వినియోగదారులు 40 పాయింట్ల వెహికల్ హెల్త్ చెక్ ప్యాకేజీని కూడా పొందవచ్చు.
-
కార్ కేర్ ఉత్పత్తులపై 15 శాతం వరకు అలాగే ఎంపిక చేసిన యాక్సెసరీస్, లేబర్ ఛార్జీలపై 10 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది.
పండుగ సీజన్ లో సిట్రోయెన్ దేశవ్యాప్తంగా ఉన్న తన అధీకృత డీలర్షిప్లలో 'కేర్ ఫెస్టివల్' సర్వీస్ క్యాంప్ లను నిర్వహిస్తోంది. అక్టోబర్ 17 నుంచి నవంబర్ 4 వరకు ఈ క్యాంప్ జరగనుంది. ఈ సమయంలో, కంపెనీ C3 హ్యాచ్బ్యాక్ కారును పరిమిత కాలానికి కొనుగోలు చేయడంపై చాలా ఆదా చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. ఈ హ్యాచ్బ్యాక్ కారు యొక్క వేరియంట్ల వారీగా ధరల జాబితా ఇక్కడ ఉంది:
వేరియంట్లు |
రెగ్యులర్ ధర |
ఆఫర్ ధర |
వ్యత్యాసం |
లివ్ |
రూ.6.16 లక్షలు |
రూ.5.99 లక్షలు |
(-) రూ.17 వేలు |
ఫీ |
రూ.7.08 లక్షలు |
రూ.6.53 లక్షలు |
(-) రూ.55 వేలు |
షైన్ |
రూ.7.60 లక్షలు |
రూ.7.03 లక్షలు |
(-) రూ.57 వేలు |
ఫీల్ టర్బో |
రూ.8.28 లక్షలు |
రూ.7.79 లక్షలు |
(-) రూ.49 వేలు |
షైన్ టర్బో |
రూ.8.80 లక్షలు |
రూ.8.29 లక్షలు |
(-) రూ.51 వేలు |
ఈ హ్యాచ్ బ్యాక్ కారు టాప్ స్పెక్ షైన్ వేరియంట్ పై అత్యధికంగా రూ.57,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ధరలన్నీ అక్టోబర్ 31 డెలివరీలు చేసిన కార్లకు మాత్రమే వర్తిస్తాయి.
ఈ కాలంలో, C3 హ్యాచ్బ్యాక్ 5 సంవత్సరాల లేదా 50,000 కిలోమీటర్ల నిర్వహణ కార్యక్రమం మరియు 5 సంవత్సరాలు లేదా 100,000 కిలోమీటర్ల వారంటీని పొడిగించడంతో సహా అనేక ప్రయోజనాలను అందిస్తుంది. మీరు ఇప్పుడు C3 హ్యాచ్బ్యాక్ను కొనుగోలు చేస్తే, మీరు 2024 నుండి ఈ కారు యొక్క EMIలను చెల్లించడం ప్రారంభించవచ్చు. C3 హ్యాచ్బ్యాక్ కారు లో మొత్తం రూ. 99,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.
ఇది కూడా చదవండి: సిట్రోయెన్ C3 ఎయిర్క్రాస్ వర్సెస్ ప్రత్యర్థులు: ధర పోలిక
కేర్ ఫెస్టివల్ ప్రయోజనాలు
ఈ సర్వీస్ క్యాంప్ లో, ప్రస్తుత సిట్రోయెన్ వినియోగదారులకు కాంప్లిమెంటరీ 40-పాయింట్ల వెహికల్ హెల్త్ చెక్ ప్యాకేజీ కూడా లభిస్తుంది. సర్వీస్ అపాయింట్మెంట్లను షెడ్యూల్ చేసుకునే వినియోగదారులు కార్ కేర్ ఉత్పత్తులపై 15 శాతం వరకు, ఎంపిక చేసిన యాక్సెసరీలపై 10 శాతం వరకు, లేబర్ ఛార్జీలపై 10 శాతం వరకు తగ్గింపు పొందవచ్చు.
మరింత చదవండి: టిహాన్ IIT హైదరాబాద్ క్యాంపస్లో డ్రైవర్ లెస్ ఎలక్ట్రిక్ షటిల్స్
సిట్రోయెన్ ప్రస్తుతం భారతదేశంలో నాలుగు కార్లను విక్రయిస్తోంది: C3 హ్యాచ్ బ్యాక్, eC3 ఎలక్ట్రిక్ హ్యాచ్బ్యాక్, C3 ఎయిర్క్రాస్ కాంపాక్ట్ SUV మరియు C5 ఎయిర్క్రాస్ మిడ్-సైజ్ SUV. కంపెనీ ఇటీవల eC3 యొక్క యూరోపియన్ వెర్షన్ ను ఆవిష్కరించింది, ఇది దాని ఇండియా-స్పెక్ వెర్షన్ తో ఎంత భిన్నంగా ఉందో ఇక్కడ తెలుసుకోండి.
మరింత చదవండి : సిట్రోయెన్ C3 ఆన్ రోడ్ ధర
0 out of 0 found this helpful