మునపటి కంటే మరిన్ని ఫీచర్‌లؚతో వస్తున్న సిట్రోయెన్ C3, కొత్త టాప్-స్పెక్ షైన్ వేరియెంట్
ప్రస్తుతం షైన్ వేరియెంట్ కేవలం నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚతో మాత్రమే అందుబాటులో ఉంది కానీ త్వరలోనే టర్బో-పెట్రోల్ యూనిట్ؚతో కూడా అందించబడుతుంది
-
సవరించిన C3 వేరియెంట్ లైనప్ ప్రస్తుతం ఇలా ఉంది: లైవ్, ఫీల్ మరియు షైన్ (కొత్తది).
-
దీని ధర మునుపటి టాప్-స్పెక్ ఫీల్ మోడల్ కంటే రూ.50,000 ఎక్కువ.
-
షైన్ వేరియెంట్‌ల ధర రూ.7.60 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ప్రారంభం అవుతాయి.
-
ప్రస్తుతానికి, షైన్ వేరియెంట్ 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ؚకు మాత్రమే పరిమితం అయింది.
-
షైన్ వేరియెంట్ కొత్త ఫీచర్‌లలో ఫాగ్ ల్యాంప్ؚలు, 15-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్ మరియు రివర్సింగ్ కెమెరా వంటివి ఉన్నాయి.
-
సిట్రోయెన్, షైన్ వేరియెంట్‌ను త్వరలోనే 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ؚతో కూడా అందిస్తుంది.
-
C3 ఎలక్ట్రిక్ ఉత్పత్తి, eC3 కూడా త్వరలోనే కొత్త షైన్ వేరియెంట్ؚను పొందనుంది.
సిట్రోయెన్, మరిన్ని ఫీచర్‌లు కలిగిన కొత్త C3 హ్యాచ్ؚబ్యాక్ టాప్-స్పెక్ షైన్ؚ వేరియెంట్ؚను విడుదల చేసింది. మునుపటి టాప్-స్పెక్ ఫీల్ వేరియెంట్ؚతో పోలిస్తే ఇది రూ.50,000 అధిక ధరతో అనేక ఉపయోగకరమైన ఫీచర్‌లతో వస్తుంది. ప్రస్తుతానికి, కొత్త వేరియెంట్ కేవలం C3 వేరియెంట్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ؚతో మాత్రమే అందుబాటులో ఉంది.
నవీకరించిన వేరియెంట్-వారీ ధరల జాబితా
వేరియెంట్ |
ధర |
లైవ్ |
రూ. 6.16 లక్షలు |
ఫీల్ |
రూ. 7.08 లక్షలు |
ఫీల్ వైబ్ ప్యాక్ |
రూ. 7.23 లక్షలు |
ఫీల్ డ్యూయల్ టోన్ |
రూ. 7.23 లక్షలు |
ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్ |
రూ. 7.38 లక్షలు |
షైన్ (కొత్తది) |
రూ. 7.60 లక్షలు |
షైన్ వైబ్ ప్యాక్ (కొత్తది) |
రూ. 7.72 లక్షలు |
షైన్ డ్యూయల్ టోన్ (కొత్తది) |
రూ. 7.75 లక్షలు |
షైన్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్ (కొత్తది) |
రూ. 7.87 లక్షలు |
ఈ ధరలు కేవలం 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్-ఎక్విపెడ్ C3 వేరియెంట్‌వి అని గమనించండి. త్వరలోనే C3 మరియు eC3 కూడా షైన్ వేరియెంట్ؚను పొందుతాయని ఆశిస్తున్నాము.
ఇది చూడండి: C3 హ్యాచ్‌బ్యాక్ కంటే భారీగా కనిపిస్తూ, మళ్ళీ ఫోటోలకు చిక్కిన 3-వరుసల సిట్రోయెన్ C3
“షైన్” వేరియెంట్ؚతో ఏమి పొందగలరు?
ఈ కొత్త వేరియెంట్‌లో డే/నైట్ ఇన్ؚసైడ్ రేర్ వ్యూ మిర్రర్ (IRVM), 15-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అవుట్ؚసైడ్ రేర్ వ్యూ మిర్రర్ؚలు (ORVM) మరియు ఫాగ్ ల్యాంప్ؚలు ఉంటాయి. వీటితో పాటుగా రేర్ స్కిడ్ ప్లేట్ؚలు, రివర్సింగ్ కెమెరా, రేర్ డిఫోగ్గర్, రేర్ వైపర్ మరియు వాషర్, కనెక్టెడ్ కార్ టెక్ మరియు ఇతర 35 ఫీచర్‌లను సిట్రోయెన్ అందిస్తుంది.
పవర్ؚట్రెయిన్ వివరాలు
సిట్రోయెన్ షైన్ వేరియెంట్ؚను మాత్రమే ఐదు-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించిన 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్‌తో(82PS/115Nm) అందిస్తుంది. ప్రస్తుతానికి, C3 ఆరు-స్పీడ్‌ల MTతో జోడించిన 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో (110PS/190Nm) వస్తుంది, అయితే ఇది మిడ్-స్పెక్ ఫీల్ వేరియెంట్ؚలో మాత్రమే వస్తుంది. సిట్రోయెన్ త్వరలోనే టర్బో చార్జెడ్ యూనిట్ؚతో షైన్ వేరియెంట్ؚను అందిచనుంది.
పోటీదారుల వివరాలు
వేరియెంట్ మరియు ఫీచర్ నవీకరణతో, ఇప్పుడు C3 మారుతి వ్యాగన్ R, సెలెరియో మరియు టాటా టియాగో వంటి వాటికి బలమైన ప్రత్యర్ధిగా నిలుస్తుంది. దీని ధర మరియు పరిమాణం కారణంగా మారుతి బాలెనో, హ్యుందాయ్ i20, టాటా ఆల్ట్రోజ్ వంటి ప్రీమియం హ్యాక్ బ్యాక్ؚలతో, రెనాల్ట్ కైగర్, నిసాన్ మాగ్నైట్ మరియు రాబోయే మారుతి ఫ్రాంక్స్ వంటి సబ్-4m SUVలతో పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: సిట్రోయెన్ C3 ఆన్ؚరోడ్ ధర