• Toyota Fortuner Front Left Side Image
 • Toyota Fortuner
 • Toyota Fortuner
 • Toyota Fortuner
 • Toyota Fortuner

టయోటా ఫార్చ్యూనర్

కారును మార్చండి
179 సమీక్షలుఈ కారుకి రేటింగ్ ఇవ్వండి
Rs.27.58 - 33.28 లక్ష*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
Don't miss out on the offers this month

టయోటా ఫార్చ్యూనర్ యొక్క కిలకమైన నిర్ధేశాలు

మైలేజ్ (వరకు)15.04 kmpl
ఇంజిన్ (వరకు)2755 cc
బిహెచ్పి174.5
ట్రాన్స్మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
సీట్లు7
ఎయిర్బ్యాగ్స్అవును

ఫార్చ్యూనర్ తాజా నవీకరణ

టొయోట దాని సరికొత్త వెర్షన్ అయిన టొయోట TRD స్పోర్టీవో ని థాయిల్యాండ్ లో ప్రదర్శించింది. ఈ కారు దాని మునుపటి వెర్షన్ తో పోలిస్తే స్టయిలింగ్ లో చిన్న చిన్న మార్పులతో పాటూ విభిన్నమైన సస్పెన్షన్ మరియు సరికొత్త లక్షణాలని కలిగి ఉంది.ఈ కొత్త TRD స్పోర్టీవో వచ్చే సంవత్సరం భారతదేశంలో ప్రవేశిస్తుందని అంచనా.

వేరియంట్స్ మరియు ధరలు:  ఈ టొయోట ఫార్చూనర్ పెట్రోల్ మరియు డీజల్ వెర్షన్ రెండు ఆప్షన్ లలో అందుబాటులో ఉంది. ధరల విషయానికి వస్తే రూ.27.27 లక్షలు పెట్రోల్ లో మరియు రూ.32.97 లక్షలు డీజల్(ఎక్స్-షోరూం ఢిల్లీ) లో అందుబాటులో ఉంది.ఈ టొయోటో ఇటీవల కాలంలో దాని ధరలని పెంచింది మరియు అన్ని వేరియంట్స్ యొక్క లక్షణాలని మెరుగుపరిచింది. 

ఫార్చూనర్ ఇంజన్ మరియు ట్రాన్స్మిషన్:  దీనిలో 2.8 లీటర్ 4 సిలెండర్ టర్బో డీజల్ వేరియంట్ 6 స్పీడ్ మాన్యువల్ తో అనుసంధానించబడి 177ps పవర్ ను మరియు 420Nm టార్క్ ని అందిస్తుంది. అదే ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ అయితే 30Nm టార్క్ ని అధనంగా అందిస్తుంది. 2.7 లీటర్ 4 సిలెండర్ పెట్రోల్ వేరియంట్ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో పాటుగా ఆటోమెటిక్ ట్రాన్స్మిషన్ ని కలిగి ఉండి 166ps పవర్ ని మరియు 245Nm టార్క్ ని అందిస్తుంది. ఇది 2WD కాన్‌ఫిగరేషన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. అదే డీజల్ వేరియంట్ అయితే 2WD మరియు 4WD రెండిటిలో ని అందుబాటులో ఉంది. ఈ ఫార్చూనర్ 20mm గ్రౌండ్ క్లియరెన్స్ తో దాని యొక్క SUV సత్తా ని చాటుతుంది.

ఫార్చూనర్ లక్షణాలు: ఈ టొయోట ఫార్చూనర్ ప్రీమియం 7 సీటర్ SUV, LED DRLS తో LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్,LED ఫాగ్ ల్యాంప్, పవర్ అడ్జస్టబుల్ మరియు ఫోల్డబుల్ ORVMs లతో పాటూ లోపల క్యాబిన్ ని కలిగి ఉంది. అలాగే ఈ ఫార్చూనర్ పవర్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు,ఆటోమెటిక్ క్లైమేట్ కంట్రోల్,పుష్-బటన్ స్టాప్/స్టార్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్ ని కలిగి ఉంది. 

ఫార్చూనర్ భద్రతా లక్షణాలు:  ఈ టొయోట ఫార్చూనర్ 7 ఎయిర్ బ్యాగ్స్,హిల్ అసిస్ట్ కంట్రోల్,బ్రేక్ అసిస్ట్ తో వెహికిల్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు EBD తో ABS ని కలిగి ఉంది.

ఫార్చూనర్  పోటీదారులు: ఈ టొయోట ఫార్చూనర్ ఫోర్డ్ ఎండీవర్,స్కోడా కొడియాక్,మిత్సుబిషి పజేరో స్పోర్ట్, ఇసుజు MUX మరియు అతి త్వరలో ప్రారభం కానున్న మహీంద్ర అల్ట్రాస్ G4 తో పోటీ పడుతుంది.   

ఎక్కువ మొత్తంలో పొదుపు!!
14% ! ఉపయోగించిన ఉత్తమ ఒప్పందాలను కనుగొనండి వరకు సేవ్ చేయండి

టయోటా ఫార్చ్యూనర్ ధర list (Variants)

ఫార్చ్యూనర్ 2.7 2డబ్ల్యూడి ఎంటి 2694 cc , మాన్యువల్, పెట్రోల్, 10.01 kmplRs.27.58 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
ఫార్చ్యూనర్ 2.7 2డబ్ల్యూడి వద్ద 2694 cc , ఆటోమేటిక్, పెట్రోల్, 10.26 kmplRs.29.17 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
ఫార్చ్యూనర్ 2.8 2డబ్ల్యూడి ఎంటి 2755 cc , మాన్యువల్, డీజిల్, 14.24 kmplRs.29.59 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
ఫార్చ్యూనర్ 2.8 2డబ్ల్యూడి వద్ద 2755 cc , ఆటోమేటిక్, డీజిల్, 12.9 kmpl
Top Selling
Rs.31.38 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
ఫార్చ్యూనర్ 2.8 4డబ్ల్యూడి ఎంటి 2755 cc , మాన్యువల్, డీజిల్, 14.24 kmplRs.31.49 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
ఫార్చ్యూనర్ 2.8 4డబ్ల్యూడి వద్ద 2755 cc , ఆటోమేటిక్, డీజిల్, 15.04 kmplRs.33.28 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
వేరియంట్లు అన్నింటిని చూపండి

టయోటా ఫార్చ్యూనర్ సమీక్ష

టొయోట బ్రాండ్ భారతదేశంలో పెరిగింది అంటే దాని యొక్క విశ్వసనీయత వలనే. జపనీస్ ఆటో దిగ్గజం నుండి వచ్చిన క్వాలిస్ నుండి ఇన్నోవా వరకూ మరియు ఫార్చూనర్ ప్రొడక్ట్స్ కూడా ఇవన్నీ ప్రజలచే బాగా అధారింపబడినవి. ఫార్చూనర్

భారతదేశంలోనే మొదటి ఫోర్ వీల్ డ్రైవ్. గత ఏడు సంవత్సరాలుగా దాని ప్రత్యర్ధులను ఓడుస్తూ మార్కెట్ లో రారాజుగ నిలిస్తుంది. పైన చెప్పుకున్న దాని బట్టీ చూస్తుంటే ఇది కొంచెం పాతది అని తెలుస్తుంది. కాని ఈ ప్రస్తుత తరాల వారి కోసం ఈ పెద్ద టొయోటా దాని మరింత మెరుగైన అవతారంలో రాబోతుంది.  ఈ కొత్త ఫార్చూనర్ మునుపటిలానే ధృడంగా ఉంటూ దాని యొక్క లక్షణాలను మరియు పనితీరు ని మునుపటి కంటే మరింత పెంచుకుంది.  ఈ కారు ఖచ్చితంగా దాని పోటీదారులైన ఫోర్డ్ ఎండీవర్ మరియు షెవర్లె ట్రయిల్బ్లేజర్ కు గట్టి పోటీ ఇస్తుంది.

Toyota Fortuner Exterior

ఈ ఫార్చూనర్ యొక్క రెండు తరాల కారులను పక్క పక్కన పెట్టి చూస్తే ఈ రెండూ ఒకే జాతి కి చెందినవా అని నమ్మలేని విధంగా కనిపిస్తాయి. టయోటా డిజైనర్ దీనిలో ఒక్క చిన్న పానెల్ కూడా దాని మునుపటి వర్షన్ లో లాగా లేకుండా డిజైన్ చేశారు.

ఈ కారు HiLUX పికప్ ట్రక్ నుండి దృఢంగా ఉద్భవించింది.ఈ కారుని రేర్ వ్యూ మిర్రర్ నుండి అదే దూకుడు తత్వంతో కనిపిస్తుంది. దీని మునుపటి వెర్షన్ తో పోలిస్తే బాగా పొడవైనది మరియు విశాలమైనది.దీనిలో కూర్చునే వారికి మరింత సౌకర్యాన్ని అందిస్తుంది.

ఈ కారు ముందు ముందు టయోటో బ్రాండ్ ని మరింత పెంచుతుంది. జపనీస్ ఆటోమేకర్ నుండి కొత్త డిజైనర్ లు దీనిని మరింత దూకుడు తో షార్ప్ గా చేస్తారు. కొత్త ఫార్చూనర్ దీనికి భిన్నం ఏమీ కాదు. దీని మునుపటి వర్షన్ యొక్క ముక్కు సూటి తత్వపు డిజైన్ తో పోలిస్తే ఇది మరింత దూకుడు తత్వాన్ని కలిగి ఉంటుంది. ఈ కారు ముందు భాగం పెద్ద బంపర్ ని కలిగి ఉంటుంది. దీని యొక్క లోగో త్రీ స్లాట్ క్రోం గ్రిల్ మీద అమర్చబడి ఉంటుంది. దీని యొక్క హెడ్ల్యాంప్స్ మరింత సన్నంగా అయ్యాయి మరియు LED డే టైం రన్నింగ్ ల్యాంప్స్ తో LED ప్రొజక్టర్ హెడ్ల్యాంప్స్ అమర్చబడి ఉన్నాయి.దీనిలో ఎయిర్డాం మిమిక్స్ గ్రిల్ ఫాగ్ల్యాంప్ తో అమర్చబడిన క్రోం ని కలిగి ఉంటుంది.

ఈ క్రోం డిజైన్ కారు ప్రక్క భాగం అంతా కూడా కొనసాగించబడి ఉంటుంది. అలానే కారు ప్రక్క భాగం C పిల్లర్ వరకూ కూడా చక్కటి స్ట్రైప్ లైన్ తో కూడిన విండో లైన్ ఉంటుంది. ఈ కారు ప్రక్క నుండి చూస్తే ఫార్చునర్ యొక్క గొప్పతనం అంతా కనిపిస్తుంది. దీనిలో 18 ఇంచ్ వీల్స్(4WD లో మాత్రమే) రాజుకున్న వీల్ ఆర్చులతో మరింత అందాన్ని చేకూరుస్తున్నాయి. అదే 2WD వర్షన్ అయితే 17 ఇంచ్ అలాయ్ వీల్స్ ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా దీనిలో ఫ్లష్ ఫిట్టింగ్ రూఫ్ రైల్స్,నల్లని క్లాడింగ్ మరియు మాకో లుక్ సైడ్ స్టెప్ సిమెంట్ ఫార్చూనర్ SUV లుక్ ని ప్రతిబింబింపజేస్తున్నాయి.

ఈ క్రోం డిజైన్ హాచ్ భాగంలో కి చొచ్చుకుపోయే D పిల్లర్ వరకూ కొనసాగించబడి ఉంటుంది. ఈ కారు వెనక నుండి చూస్తే చాలా ఎత్తుగా కనిస్తుంది మరియు దీనిలో ఎత్తుగా అమర్చబడిన రేర్ విండ్ స్క్ర్రీన్ LED టెయిల్ ల్యాంప్స్ తో అమర్చబడి ఉంటుంది.

దీని యొక్క స్పేర్ వీల్ దీని యొక్క వెనుక బంపర్ క్రింద అమర్చబడి ఉంటుంది. దీని వెనుక బంపర్ రివర్స్  పార్కింగ్ సెన్సార్ మరియు కొన్ని రిఫ్లెక్టర్స్ ని కలిగి ఉంటుంది. అలానే దీని వెనుక భాగంలో క్రోం స్ట్రిప్ మీద పెద్ద అక్షరాలతో ఫార్చూనర్ అని రాసి ఉంటుంది. 

పరిమాణం పరంగా, ఈ ఫార్చూనర్ చాలా పెద్దది మరియు దాని పోటీదారు అయిన ఫోర్డ్ ఎండీవర్ కి గట్టి పోటీ ని ఇస్తుంది.ఈ కారు చాలా విశాలవంతమైనది, పొడవైనది మరియు పొడవైన వీల్ బేస్ ని కలిగి ఉంటుంది. ఈ కారు మొత్తం గా చూసుకుంటే చాలా రిచ్ లుక్ ని కలిగి ఉంటుంది. అలానే దీని మరింత దూకుడు తత్వపు డిజైన్ తో SUV అభిమానులని మరింత ఆకర్షిస్తుంది.  

Fortuner Interior

ఈ కొత్త ఫార్చునర్ లోపల భాగంలో కి చూస్తే ఒక మంచి ఫీల్ కలుగుతుంది.ఈ కారు యొక్క డిజైన్ చాలా అద్భుతంగా ఉంటుంది. దీని డాష్ బోర్డ్ యొక్క లేఅవుట్ అలానే స్విచ్లు అమర్చబడినటువంటి విధానం MPV కి దగ్గరగా ఉంటుంది.

దీని యొక్క క్యాబిన్ సాఫ్ట్ టచ్ ప్లాస్టిక్స్,లెథర్ మరియు ప్రీమియం మెటీరియల్స్ తో అందంచబడి అధిక ధరను కలిగి ఉంటుంది. దీని యొక్క మొత్తం బ్లాక్ థీం సిల్వర్ మరియు గ్లోస్ బ్లాక్ అసెంట్స్ తో స్పోర్టీ లుక్ ని అందిస్తుంది. దీని యొక్క ఎయిర్ కాన్ కంట్రోల్స్ మీద గ్లోస్ బ్లాక్ అమరిక ఫింగర్ ప్రింట్ మాగ్నెట్ ని కలిగి ఉంది. ఇవి నిరంతరం వాడే స్విచ్చులు కనుక దీని బదులుగా మేము ఇక్కడ వేరే ఫినిషింగ్ కోరుకుంటున్నాము. 

దీనిలో డాష్‌బోర్డ్ సెంటర్ కన్సోల్ తో ఉంటుంది. దీని మధ్య భాగంలో 7 ఇంచ్ టచ్‌స్క్రీన్ ఇంఫోటైన్మెంట్ స్క్రీన్, నావిగేషన్ మరియు పార్కింగ్ కెమేరా డిస్ప్లే అమర్చబడి ఉంటుంది.  ఇది మునుపటి ఫార్చూనర్ లా కాకుండా,దీనిలో ఆడియో సిస్టం మరియు ఏ.సి కంట్రోల్స్ చాలా కొత్తగా చూడానికి ఆపరేట్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే దీనిలో డ్యుయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్,12V సాకెట్, USB పోర్ట్, ట్రాక్షన్ కంట్రోల్ మరియు హిల్ డెసెంట్ కంట్రోల్ స్విచ్చులు ఉంటాయి. అలానే దీనిలో 4 వీల్ డ్రైవ్ సిస్టం యొక్క రోటరీ నాబ్ ఉంటుంది. 

దీనిలో క్యాబిన్ లేఅవుట్ మనకి కావలసిన విధంగా అందుబాటులో ఉంటుంది. దీనిలో డ్రైవర్ సీటు విద్యుత్తు తో రిక్లైన్, రీచ్ మరియు లుంబర్ సపోర్ట్ మరియు ఎత్తు కి తగినట్టు సర్దుబాటు చేసుకొనే విధంగా ఉంటుంది. దీనిలో స్టీరింగ్ మంచి పొసిషన్ లో ఉండేటట్టు సర్దుబాటు చేసుకోవచ్చు. దీనిలో ముందరి సీట్లు కూర్చునే వారికి వెనకాతల చారబడే విధంగా సౌకర్యంగా ఉంటాయి. దీనిలో క్యూబీ హోల్స్ కూడా చాలా లాజికల్ గా అమర్చబడినవి. అలానే దీనిలో ట్విన్ గ్లోవ్ బాక్సెస్, సెంట్రల్ ఆర్మ్రెస్ట్ స్టోరేజ్ మరియు పెద్ద  డోర్ బిన్స్ తో చాలా స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది.   

అలాగే దీనిలో లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్స్, డార్క్ బ్రౌన్ లెథర్ అపోలిస్ట్రీ, మల్టీ ఇన్‌ఫర్మేషన్ డిస్ప్లే కి చిన్న LCD, అన్ని నాలుగు విండోస్ కి ఆటో అప్ అండ్ డౌన్ ఆప్షన్ మరియు వెనకల ఎయిర్ కాన్ అందించబడుతున్నాయి.ఈ కారు కూడా ఇన్నోవా క్రిస్టా లానే విశాలంగా ఉంటుంది. దీనికి దానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏమిటంటే క్రిస్టా వెనకాల కూర్చొనే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. అదే ఫార్చూనర్ అయితే డ్రైవర్ కోసమే ప్రత్యేఖంగా  తయారుచేయబడినదా అన్న విధంగా ఉంటుంది.    

డ్రైవర్ సీటు బాగుంది, అంటే దాని అర్ధం వెనకతల సీటు బాగోలేదని కాదు. ఇప్పుడు వెనకాల సీట్లు గురించి మాట్లాడుకుంటే పరిపూర్ణంగా విశాలంగా ఉంటుంది. ఫోర్డ్ ఎండీవర్ లానే దీని రెండవ వరసలో ముగ్గురు దృఢంగా ఉన్నవారు కూర్చోవచ్చు. ప్రస్తుతానికి దీనిలో కెప్టెన్ సీటు వెర్షన్ లేదు, కానీ బెంచ్ మాత్రం కొంచెం రిక్లీన్ అయ్యే విధంగా సౌకర్యవంతంగా ఉంటుంది. దీనిలో కొంచెం మిల్లీమీటర్ ల లెగ్‌రూం అందుబాటులో ఉండి ప్రయణాలకు సౌకర్యవంతంగానే ఉంటుంది.

దీనిలో మూడవ వరసలోకి వస్తే, పెద్దవాళ్ళు కూడా కూర్చోవచ్చు. దీనిలో కూర్చొనే వారి మోకాలు నేరుగా పైన రూఫ్ వైపు తగిలినట్టుగా ఉంటుంది మరియు దీనిలో బ్యాక్ రెస్ట్ కొద్దిగా పైన ఉంటుంది. అందువలన దూరపు ప్రయాణాలు చేసేవారికి కష్టం గా అనిపిస్తుంది. అందువలన ఈ మూడవ వరస  పిల్లలకి మరియు యువకులకు అయితే సౌకర్యవంతంగా ఉంటుంది.  

ఫార్చూనర్ క్యాబిన్ ప్రీమియం మెటీరీల్స్ తో చేయబడిన లక్షణాలని కలిగి ఉంటుంది. దీనిలో ఎంచే విధంగా ఏమీ లేదు మరియు దీనిలో యాక్టివ్ నాయిస్ కాన్సిలేషన్ మరియు ఎలక్ట్రిసిటీ ఫోల్డింగ్ థర్డ్ రో(ఫోర్డ్ ఎండీవర్ కి ఉన్న ఆప్షన్)లేవు. కానీ అవి లేకపోయిన కూడా ప్రజలు దీనిని బాగా ఆధరిస్తారు.

Toyota Fortuner Performance

టొయోట ఫార్చూనర్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఆశ్చర్యం ఏమిటంటే అందులో ఒకటి పెట్రోల్ తో నడుస్తుంది. దీని మునుపటి వర్షన్ 2.5 లీటర్ మరియు 3.0 రెండూ డీజల్ మోటార్‌లో అందుబాటులో ఉండగా, ఇది  2.7లీటర్ పెట్రోల్ 2.8 లీటర్ డీజల్ తో అందుబాటులో ఉంది.   

పెట్రోల్: ఈ మోటార్ ఇటీవల భారతదేశంలో తొలిసారి తయారుచేయబడి ఇన్నోవా క్రిస్టా ద్వారా ప్రదర్శించబడినది. ఈ 4 సిలెండర్ యూనిట్ 166PS పవర్ ను మరియు 245Nm టార్క్ ని అందిస్తుంది. ఈ 2.7 లీటర్ ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్  కాని 6 స్పీడ్ మాన్యువల్ ఇంజిన్ తో కాని లభిస్తుంది.  దీని పెద్ద మోటార్ శుద్ధిచేబడినటువంటింది. అంతేకాకుండా దీనిని బ్రొటన వేలితో స్టార్ట్ మరియు స్టాప్ చేయవచ్చు. దీని NVH లెవెల్స్ చాలా చక్కగా కంట్రోల్ చేయబడతాయి మరియు దీని ఇంజిన్ క్యాబిన్ లోపల మరియు బయట చాలా తక్కువ శబ్దం  మాత్రమే వినిపిస్తుంది. అయితే ఈ ఇంజిన్ లోపల కూర్చొనేవారికి బాగా లగ్జరీ కారులో ఉన్నామనే భావన కలుగజేస్తుంది.హైవే లో వెళితే మాత్రం దీని యొక్క పనితీరు మామూలుగా ఉంటుందనే చెప్పాలి, కాని పరవాలేదు. దీని వెనుక ఉన్న కారణం ఏమిటంటే, ఎక్కువ శాతం పవర్ ఆక్జిలరేషన్ యొక్క అత్యధిక స్థాయి లో స్టోర్ అయి ఉండడం వలన. దీనిలో ఆటోమెటిక్ షిఫ్ట్ లు చాలా స్మూత్ గా ఉంటాయి. దీని యొక్క స్టీరింగ్ మౌంటెడ్ పెడల్స్ వలన కిక్ డవున్ కింద అద్భుతమైన ఫీలింగ్ కలుగుతుంది.

డీజిల్  ఈ ఇంజన్ 2.8 లీటర్ 4 సిలిండర్ ఇంజన్. ఇది పాత 3.0 లీటర్ మోటార్ తో పోలిస్తే దీని డిస్ప్లేస్మెంట్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇది 177Ps  అద్భుతమైన పవర్ మరియు 420Nm టార్క్ ని అందిస్తుంది. అదే ఆటోమెటిక్ అయితే 450Nm టార్క్ ని అందిస్తుంది.         ఈ డీజిల్ ఇంజిన్ రెండిటితో పోలిస్తే చాలా బాగుంటుంది. దీనికి టర్బో లాగ్ అసలు లేదు.దీని గేర్‌బాక్స్ లో ఉన్న అధనపు కాగ్ ఫార్చూనర్ ని అద్భుతమైన టూరింగ్ మెషిన్ లా తీర్చిదిద్దుతుంది.  

 

Fortuner Safety

టొయోట భద్రతా విషయంలో కొంచెం కూడా రాజీ పడదు.ఇంజిన్ మరియు ట్రాన్స్మిషన్ తో సంబందం లేకుండా ఫార్చూనర్ 7 ఎయిర్‌బ్యాగ్స్,ఎలక్ట్రిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ తో కూడిన యాంటీ లాక్ బ్రేక్స్ ని కలిగి ఉంటుంది. అధనంగా, రెండవ వరసలో పిల్లల సీట్లకి ISOFIX అమర్చబడి ఉంటుంది మరియు ఏడుగురు కూర్చున్నవారందరికీ 3 పాయింట్ సీట్ బెల్ట్ ఉంటుంది. ఆటోమెటిక్ వేరియంట్స్ కూడా వెహికల్ స్టెబిలిటీ కంట్రోల్ (VSC) మరియు హిల్ అసిస్ట్ కంట్రోల్ ని కలిగి ఉంటుంది. 4WD వేరియంట్స్ అన్ని భద్రతా లక్షణాలతో పాటూ డవున్ హిల్ అసిస్ట్ కంట్రోల్ ని కలిగి ఉంటుంది.  

Toyota Fortuner Variants

టొయోట ఫార్చూనర్ మొత్తం 6 వేరియంట్స్,2 ఇంజిన్ ఆప్షన్స్,2 ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ మరియు 2 డ్రైవ్ టైప్స్ తో అందుబాటులో

ఉంది.  పెట్రోల్: 4x2(MT), 4X2(AT) 

డీజిల్: 4x2(MT), 4X2(AT), 4x4(MT), 4X4(AT)

టయోటా ఫార్చ్యూనర్ యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

టయోటా ఫార్చ్యూనర్ ఇలాంటి కార్లుతో సరిపోల్చండి

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

టయోటా ఫార్చ్యూనర్ కొనుగోలు ముందు కథనాలను చదవాలి

టయోటా ఫార్చ్యూనర్ వినియోగదారుని సమీక్షలు

5.0/5
ఆధారంగా179 వినియోగదారుని సమీక్షలు
Chance to win image iPhone 6s & image vouchers - T&C *

ధర & సమీక్ష

 • తాజా సమీక్షలు
 • చాలా ఉపయోగకరమైన సమీక్షలు
 • Toyota Fortuner

  Toyota Fortuner is very useful car and when we drive it we feel like we are driving a luxury car. ఇంకా చదవండి

  p
  prithesh mangla
  On: Feb 20, 2019 | 45 Views
 • Toyota Forturner

  Toyota Fortuner is the best vehicle for both business and the political people and coming to safety and others it is ultimate. ఇంకా చదవండి

  L
  Lakshmi Ganesh
  On: Feb 19, 2019 | 62 Views
 • for 2.8 4WD MT

  Toyota Fortuner

  Indian buyers are hard to please, specially when they want a car which has very nice road presence, provides class and is value for money. Toyota Fortuner is the answer, ... ఇంకా చదవండి

  J
  Jay
  On: Feb 19, 2019 | 52 Views
 • for 2.8 2WD AT

  Toyota Fortuner

  Toyota Fortuner is a smart car and its driving is very comfortable. It first model was so beautiful and it has a good quality music player. ఇంకా చదవండి

  V
  Vikaspandit
  On: Feb 18, 2019 | 45 Views
 • for 2.7 2WD AT

  Toyota Fortuner

  Very bad experience with my new Toyota Fortuner 2018 model. Some quality issues from starting as a major jeering problem while using the brake and Toyota is not accepting... ఇంకా చదవండి

  m
  maninder singh
  On: Feb 18, 2019 | 41 Views
 • ఫార్చ్యూనర్ సమీక్షలు అన్నింటిని చూపండి
 • Toyota Fortuner - High Hopes - Disappointing attitude

  Today I have spoken to Toyota Bangalore, according to them dealers have started taking bookings, I asked for specs & to my HIGH disappointment, I was told this much await... ఇంకా చదవండి

  M
  Mahesh Lekhi
  On: Aug 10, 2009 | 30534 Views
 • Excellant road presence but Highly overpriced SUV comparing to it...

  Look and Style The only best thing in Toyota Fortuner is its truly SUV robust look. Inside decor is well managed but the same is availble in Mahindra XUV at a much lower ... ఇంకా చదవండి

  a
  avijit
  On: Feb 16, 2013 | 15898 Views
 • Trouble in brakes, lack of stability, road grip and interiors sam...

  Look and Style exterior good, stylish but interiors are same as Innova. Comfort lack of comfort, even the interiors are same as Innova but Fortuner is not comfortable eve... ఇంకా చదవండి

  R
  Ram sevak yadav
  On: May 01, 2013 | 6147 Views
 • I am using toyota fortuner since 3 - 4 months.

  I am very luckey to have vehicle like this.. It make us feel royal while driving & siting. but it has too many maintainance this thing make me little unsatisfyed. buying ... ఇంకా చదవండి

  D
  Deepesh sahu
  On: May 29, 2018 | 2733 Views
 • for 3.0 Diesel

  the car is like innova its better to buy an innova than fortuner ...

  This car costs more than it is buying an innova is better just for four wheel drive why shall I spent so much and i dont need it also it just has few differences than inn... ఇంకా చదవండి

  s
  sagnik kundu
  On: May 22, 2010 | 13788 Views
 • ఫార్చ్యూనర్ సమీక్షలు అన్నింటిని చూపండి

టయోటా ఫార్చ్యూనర్ మైలేజ్

The claimed ARAI mileage: Toyota Fortuner Diesel is 14.24 kmpl | Toyota Fortuner Petrol is 10.01 kmpl. The claimed ARAI mileage for the automatic variants: Toyota Fortuner Diesel is 15.04 kmpl | Toyota Fortuner Petrol is 10.26 kmpl.

ఇంధన రకంట్రాన్స్మిషన్ARAI మైలేజ్
డీజిల్ఆటోమేటిక్15.04 kmpl
డీజిల్మాన్యువల్14.24 kmpl
పెట్రోల్ఆటోమేటిక్10.26 kmpl
పెట్రోల్మాన్యువల్10.01 kmpl

టయోటా ఫార్చ్యూనర్ వీడియోలు

 • Toyota Fortuner Hits & Misses | CarDekho.com
  5:56
  Toyota Fortuner Hits & Misses | CarDekho.com
  Jan 09, 2018
 • Toyota Fortuner vs Ford Endeavour | ZigWheels
  9:52
  Toyota Fortuner vs Ford Endeavour | ZigWheels
  Jan 16, 2017
 • Toyota Fortuner : First Impressions : PowerDrift
  6:18
  Toyota Fortuner : First Impressions : PowerDrift
  Nov 26, 2016
 • Toyota Fortuner : First Impressions : PowerDrift
  6:18
  Toyota Fortuner : First Impressions : PowerDrift
  Nov 26, 2016
 • 2016 Toyota Fortuner | First Drive Review
  11:43
  2016 Toyota Fortuner | First Drive Review
  Nov 09, 2016
 • 2015 Toyota Fortuner :: WalkAround :: ZigWheels
  1:50
  2015 Toyota Fortuner :: WalkAround :: ZigWheels
  Sep 04, 2015
 • Toyota Fortuner | Review of Features | CarDekho.com
  8:29
  Toyota Fortuner | Review of Features | CarDekho.com
  May 04, 2015
 • Toyota Fortuner AT 4X4 | Expert Review | CarDekho.com
  7:49
  Toyota Fortuner AT 4X4 | Expert Review | CarDekho.com
  May 04, 2015

టయోటా ఫార్చ్యూనర్ రంగులు

 • Color
  ఫాంటమ్ గోధుమ
 • Color
  అవాంట్ గార్డె కాంస్య
 • Color
  తెలుపు పెర్ల్ క్రిస్టల్ షైన్
 • Color
  సూపర్ తెలుపు
 • Color
  వైఖరి బ్లాక్
 • Color
  గ్రీ మెటాలిక్
 • Color
  సిల్వర్ మెటాలిక్

టయోటా ఫార్చ్యూనర్ చిత్రాలు

టయోటా ఫార్చ్యూనర్ వార్తలు

టయోటా ఫార్చ్యూనర్ రహదారి పరీక్ష

వాడిన కారు కొనుగోలు చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలొ లాభపడండి.

 • ఉపయోగించిన టయోటా ఫార్చ్యూనర్
 • అదేవిధమైన ధర

ఇటీవల టయోటా ఫార్చ్యూనర్ గురించి వినియోగదారులు ప్రశ్నలను అడిగారు

 • Aata_Jaata has asked a question about Fortuner

  Which variant of the car would be the best to buy?

  • 1 Answer
  • Cardekho_Experts
  • on 5 Feb 2019

  That's a beautiful beast you are looking for yourself. According to us the best Toyota Fortuner is 2.8 4WD AT but we suggest if you needed an automatic transmission and a 4X4 then you can go for 2.8 4WD AT variant, If you need an STD variant then you can go for Fortuner 2.7 2wd MT. Whereas we suggest you to take a test drive of this giant and the only then take a decision. Because in the end you will judge.

  Helpful (0)

Have any question? Ask now!

Guaranteed response within 48 hours

Write your Comment పైన టయోటా ఫార్చ్యూనర్

98 comments
1
C
CarDekho
Jul 30, 2018 5:13:42 AM

As of now, there is no news for the same. Stay tuned to CarDekho for more updates.

  సమాధానం
  Write a Reply
  1
  S
  Sarath Vijay
  Jul 29, 2018 3:21:35 PM

  Is it get sunroof in future

  సమాధానం
  Write a Reply
  2
  C
  CarDekho
  Jul 30, 2018 5:13:42 AM

  As of now, there is no news for the same. Stay tuned to CarDekho for more updates.

   సమాధానం
   Write a Reply
   1
   C
   CarDekho
   Jun 30, 2017 6:34:22 AM

   It's good to hear that. :)

    సమాధానం
    Write a Reply
    Calculate EMI of Toyota Fortuner×
    డౌన్ చెల్లింపుRs.0
    0Rs.0
    బ్యాంకు వడ్డీ రేటు 10.5 %
    8%22%
    రుణ కాలం (సంవత్సరాలు)
    • మొత్తం రుణ మొత్తంRs.0
    • చెల్లించవలసిన మొత్తంRs.0
    • మీరు అదనంగా చెల్లించాలిRs.0

    Calculated on Ex-Showroom price

    Rs. /month
    Apply రుణం

    టయోటా ఫార్చ్యూనర్ భారతదేశం లో ధర

    సిటీఆన్-రోడ్ ధర
    ముంబైRs. 32.8 - 40.2 లక్ష
    బెంగుళూర్Rs. 34.67 - 41.75 లక్ష
    చెన్నైRs. 33.49 - 40.28 లక్ష
    హైదరాబాద్Rs. 33.22 - 39.96 లక్ష
    పూనేRs. 32.76 - 40.13 లక్ష
    కోలకతాRs. 30.66 - 36.91 లక్ష
    కొచ్చిRs. 33.32 - 40.14 లక్ష
    మీ నగరం ఎంచుకోండి

    ట్రెండింగ్ టయోటా కార్లు

    • ప్రాచుర్యం పొందిన
    • రాబోయే
    ×
    మీ నగరం ఏది?