కొత్త తయారీ ప్లాంట్ ఏర్పాటుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న Toyota
టయోటా గ్లాంజా కోసం dipan ద్వారా ఆగష్టు 02, 2024 03:32 pm ప్రచురించబడింది
- 135 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టయోటా ఈ కొత్త ప్లాంట్‌తో భారతదేశంలో మొత్తం నాలుగు తయారీ ప్లాంట్లను కలిగి ఉంటుంది.
టయోటా కిర్లోస్కర్ మోటార్ ఇండియా కొత్త గ్రీన్ ఫీల్డ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి మహారాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకుంది. గతంలో ఔరంగాబాద్‌గా పిలిచే ఛత్రపతి శంభాజీ నగర్‌లో ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది భారతదేశంలో టయోటా యొక్క నాల్గవ తయారీ ప్లాంట్ అవుతుంది మరియు దాని గ్రీన్ ప్రొడక్ట్ పోర్ట్ ఫోలియోను విస్తరించడానికి కార్ల తయారీదారు యొక్క నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. స్థిరమైన మరియు అధునాతన హరిత సాంకేతికతలు, ఉత్పత్తులు మరియు సేవలపై దాని దృష్టిని నొక్కి చెబుతుంది.
టయోటా గ్రూప్‌కు ప్రస్తుతం భారతదేశంలోని కర్ణాటకలోని బిడదిలో మొత్తం రెండు తయారీ ప్లాంట్లు ఉన్నాయి. మూడవ కొత్త ప్లాంట్ కూడా బిడదిలో ఏర్పాటు చేయబడుతుంది, ఇందులో కంపెనీ సుమారు రూ. 3300 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
టయోటా యొక్క ప్రస్తుత తయారీ ఫెసిలిటీలు
టయోటా క్రిలోస్కర్ మోటార్స్ యొక్క మొదటి ప్లాంట్ 1997లో కర్ణాటకలోని బిడదిలో స్థాపించబడింది, దీని ఉత్పత్తి 1999 చివరలో ప్రారంభమైంది. టయోటా ఇన్నోవా హైక్రాస్, ఇన్నోవా క్రిస్టా, ఫార్చ్యూనర్ మరియు లెజెండర్ ఈ ప్లాంట్‌లో తయారు చేయబడుతున్నాయి. ఈ ప్లాంట్ ఏడాదికి 1.32 లక్షల కార్లను ఉత్పత్తి చేయగలదు.
ఇది కూడా చూడండి: కారు ఎలా డిజైన్ చేయబడింది
రెండవ ప్లాంట్ కూడా బిడదిలో ఉంది, 2010 డిసెంబరులో ఉత్పత్తిని ప్రారంభం అయ్యింది. క్యామ్రీ హైబ్రిడ్, అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మరియు హిలక్స్ ఈ ప్లాంట్‌లో తయారు చేయబడుతున్నాయి. ఈ ప్లాంట్ ఏడాదికి 2 లక్షలకు పైగా వాహనాలను ఉత్పత్తి చేయగలదు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మూడో ప్లాంట్‌ను కూడా బిడదిలో ఏర్పాటు చేయనున్నామని, ఇందుకోసం 2023 నవంబర్‌లో కర్ణాటక ప్రభుత్వంతో MoU కుదుర్చుకుంది. ఈ కొత్త ప్లాంట్‌తో కంపెనీ ఉత్పత్తి సామర్థ్యం ఏడాదికి లక్షయూనిట్లు పెరగవచ్చు. దీని ప్రకారం కర్ణాటకలోని మూడు ప్లాంట్ల నుంచి కంపెనీ ఏడాదిలో దాదాపు 4.42 లక్షల కార్లను ఉత్పత్తి చేయగలదు.
భారతదేశంలో టయోటా ఆఫర్లు
ప్రస్తుతం, భారతదేశంలో 12 టయోటా కార్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి, వీటిలో మారుతి బాలెనో ఆధారిత గ్లాంజా చౌకైన కారు కాగా, ల్యాండ్ క్రూయిజర్ 300 SUV అత్యంత ఖరీదైన కారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, టయోటా వెల్ఫైర్ MPV మరియు LC300 భారతదేశంలో తయారు చేయబడవు, కానీ విదేశాల నుండి ఇక్కడకు దిగుమతి చేయబడి విక్రయించబడుతున్నాయి.
ఆటోమోటివ్ ప్రపంచం నుండి మరిన్ని అప్‌డేట్‌ల కోసం కార్దెకో యొక్క వాట్సప్ ఛానెల్‌ని ఫాలో అవ్వండి.
మరింత చదవండి గ్లాంజా AMT