టాటా ఆల్ట్రోజ్ Vs మారుతి బాలెనో Vs టయోటా గ్లాంజా – CNG మైలేజ్ పోలిక
టాటా ఆల్ట్రోస్ కోసం tarun ద్వారా ఆగష్టు 14, 2023 12:51 pm ప్రచురించబడింది
- 48 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి బాలెనో మరియు టయోటా గ్లాంజాలలో ఎంచుకునేందుకు కేవలం రెండు CNG వేరియెంట్ؚలు ఉండగా, టాటా ఆల్ట్రోజ్ మాత్రం ఆరు వేరియెంట్ؚలలో లభిస్తుంది
ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ విభాగంలో CNG ఎంపిక కోసం చూస్తుంటే, మీకు ఉన్న ఎంపికలలో టాటా అల్ట్రోజ్, మారుతి బాలెనో మరియు టయోటా గ్లాంజా మోడల్‌లు ఉన్నాయి. వీటి అన్నిటి ధరలు ఒకే పరిధిలో ఉన్నాయి మరియు వీటి ఫీచర్‌ల జాబితా కూడా ఒకేలా ఉన్నాయి. ఈ విభాగంలో స్పోర్టియర్ హ్యుందాయ్ i20 అందుబాటులో లేదు.
ఆల్ట్రోజ్ CNG మొదటిసారి మే 2023లో మార్కెట్ؚలోకి ప్రవేశించింది, టాటా ఇటీవలే దీని ఇంధన సామర్ధ్య గణాంకాలను వెల్లడించింది. ఈ సెగ్మెంట్ టాప్ మోడల్‌తో మరియు తన తోటి వాహనాలతో దీని పోలిక ఎలా ఉందో చూద్దాం.
మైలేజ్ పోలిక
స్పెక్స్ |
ఆల్ట్రోజ్ |
బాలెనో/గ్లాంజా |
ఇంజన్ |
1.2-లీటర్ పెట్రోల్-CNG |
1.2-లీటర్ పెట్రోల్-CNG |
పవర్ |
73.5PS |
77.5PS |
టార్క్ |
103Nm |
98.5Nm |
ట్రాన్స్ؚమిషన్ |
5-స్పీడ్ MT |
5- స్పీడ్ MT |
ఇంధన సామర్ధ్యం |
26.2km/kg |
30.61 km/kg |
బాలెనో మరియు గ్లాంజా CNGల క్లెయిమ్ చేసిన సామర్ధ్యం ఆల్ట్రోజ్ కంటే 4కిమీ/కిగ్రా ఎక్కువగా ఉంది. స్పెసిఫికేషన్‌ల పరంగా ఆల్ట్రోజ్ ఎక్కువ టార్క్ؚను అందిస్తుంది, బాలెనో మరింత శక్తివంతమైనది. ఈ మూడు కార్‌లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో జోడించబడ్డాయి.
ఆల్ట్రోజ్ CNGకి ఎక్కువ విలువను జోడించేది దాని డ్యూయల్-సిలిండర్ సెట్అప్, ఇది 210 లీటర్‌ల ఎక్కువ బూట్ స్పేస్ؚను అందిస్తుంది.
ఇది కూడా చదవండి: టయోటా గ్లాంజా Vs హ్యుందాయ్ i20 N లైన్ Vs టాటా ఆల్ట్రోజ్ – స్ప్రేస్ మరియు ప్రాక్టికాలిటీ పోలిక
ఫీచర్‌లతో కూడిన CNG ఎంపికలు
ఈ మూడు CNG-ఆధారిత ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ؚలు ఆటోమ్యాటిక్ AC, క్రూయిజ్ కంట్రోల్, 7-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు రేర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్‌లను కలిగి ఉన్నాయి. బాలెనో-గ్లాంజ జంట ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, హిల్ హోల్డ్ అసిస్ట్ؚతో ESP వంటి ప్రయోజనాలను అందిస్తుంది. ఆల్ట్రోజ్ విషయానికి వస్తే, ఇది అదనంగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రెయిన్-సెన్సింగ్ వైపర్‌లు, యాంబియంట్ లైటింగ్, డిజిటలైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను పొందుతుంది.
ధర తనిఖీ
|
ఆల్ట్రోజ్ CNG |
బాలెనో CNG |
గ్లాంజా CNG |
ధర పరిధి |
రూ. 7.55 లక్షల నుండి రూ. 10.55 లక్షల వరకు |
రూ. 8.35 లక్షల నుండి రూ. 9.28 లక్షల వరకు |
రూ. 8.60 లక్షల నుండి రూ. 9.63 లక్షలు |
టాటా ఆల్ట్రోజ్ CNG ఆరు వేరియెంట్‌లలో లభిస్తుంది, తద్వారా బడ్జెట్ పరంగా మోడల్‌ను ఎంచుకునే అవకాశం ఉంటుంది. మారుతి బాలెనో మరియు టయోటా గ్లాంజాల CNG ఎంపిక కేవలం రెండు వేరియెంట్ؚలలో మాత్రమే అందిస్తున్నారు.
ఇక్కడ మరింత చదవండి: టాటా ఆల్ట్రోజ్ ఆన్ؚరోడ్ ధర