• English
  • Login / Register

నమూనా Vs వాస్తవం: 2023 వెర్నా ఖచ్చితంగా టీజర్‌లో చూపించినట్లుగా ఎందుకు ఉండకపోవచ్చు.

హ్యుందాయ్ వెర్నా కోసం ansh ద్వారా ఫిబ్రవరి 27, 2023 12:28 pm ప్రచురించబడింది

  • 37 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

నమూనాలో చూపించిన కొత్త శక్తివంతమైన మరియు స్పోర్టీ డిజైన్ؚతో రానున్న హ్యుందాయ్ సెడాన్ కొనుగోలుదారులలో ఆసక్తిని రేకెత్తిస్తుంది, కానీ అంచనాలకు తగినట్లుగా వాస్తవానికి ఉండవని అనుభవాలు చెపుతున్నాయి.

Sketches: Hyundai Creta, 2023 Verna and Skoda Slavia

చివరి లుక్‌ను నిర్ణయించే ఆటోమోటివ్ డిజైన్ అనే దీర్ఘ ప్రక్రియలో ఎన్నో దశలు ఉంటాయి, వీటిలో వివిధ రకాల మెటీరియల్స్ؚను ఉపయోగించడం కూడా ఉంటుంది. ఇది ముందుగా ఒక ఆలోచనతో ప్రారంభం అయ్యి, స్కెచ్ؚగా కాగితంపై చిత్రంగా గీస్తారు. ఈ ఆలోచన డిజైన్ؚగా మారుతుంది, తరువాత తయారీకి సిద్దమవుతుంది. డిజైన్ؚను నిర్ణయించిన తరువాత కూడా చివరి ఉత్పత్తి, స్కెచ్ؚలో కంటే చాలా భిన్నంగా ఉండవచ్చు, దీనికి గల కారణాలు ఏమిటంటే తక్కువ ఖర్చుతో భారీగా ఉత్పత్తి చేయడంలో ఉండే పరిమితులు, మార్కెట్ డ్రైవింగ్ పరిస్థితులు.

2023 Hyundai Verna Sketch

ఇటీవల, హ్యుందాయ్ తన తదుపరి ఆరవ-జనరేషన్ వెర్నా స్కెచ్ؚలను విడుదల చేసింది, ఈ స్కెచ్‌లు కొనుగోలుదారులలో ఎంతో గానో ఆసక్తిని రేకెత్తించాయి. ఈ స్కెచ్ؚలో స్పోర్టీ, ప్రీమియం డిజైన్ కోసం షార్ప్‌లైన్‌లు, పెద్ద వీల్స్ؚతో సరికొత్త డిజైన్‌ను ప్రదర్శించారు. కానీ, ఈ కాంపాక్ట్ సెడాన్ కారు తయారీదారు విడుదల చేసినట్లుగా ఈ వాహనం ఖచ్చితంగా ఇలానే కనిపించే అవకాశాలు తక్కువ. 

ఇది కూడా చదవండి: భారతదేశంలో, హ్యుందాయ్ క్రెటా EV మరింతగా ఆదరించే మొదటి ఎలక్ట్రిక్ కార్ కాగలదా?

మా అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా వివరించడానికి క్రింద కొన్ని ఉదాహరణలను చూద్దాం, ముందుగా విడుదల చేసిన టీజర్ స్కెచ్‌తో పోలిస్తే ఈ ఐదు కార్‌ల చివరి ఉత్పత్తి ఎంత భిన్నంగా ఉందో చూడవచ్చు, వీటిలో చాలా వరకు హ్యుందాయ్ؚకు చెందిన వాహనలే.

హ్యుందాయ్ క్రెటా

Hyundai Creta Sketch
Hyundai Creta

నమూనాలో ఉన్నవాహనాన్ని మరియు మనకు అందించిన SUVల మధ్య తేడాను స్పష్టంగా చూడవచ్చు. ముందు భాగం దాదాపుగా ఒకేలా కనిపించినా, స్కెచ్ؚలో సైడ్ ప్రొఫైల్ కొలతలు అతిశయోక్తిగా ఉండి, అందించిన కారు కంటే చాలా భిన్నంగా ఉన్నాయి. స్కెచ్ؚలో విండోలు, ORVMలు నాజూకుగా ఉన్నాయి, డోర్‌లు పెద్దవిగా కనిపిస్తున్నాయి. వీల్స్ؚ విషయంలో తేడాను స్పష్టంగా చూడవచ్చు, ఇవి అందించిన కారులో ఉన్న 17-అంగుళాల వీల్స్ కంటే ఎక్కువగా వంపులను కలిగి ఉంది. 

హ్యుందాయ్ ఆరా

Pre-facelift Hyundai Aura Sketch
Pre-facelift Hyundai Aura

టీజర్ స్కెచ్ కంటే చివరి ఉత్పత్తి చాలా భిన్నంగా ఉన్న కార్‌కు మరొక గొప్ప ఉదాహరణ ఆరా. ఈ స్కెచ్ؚలో నవీకరణకు ముందు అందించిన ఆరా వెడల్పైన వీల్ వంపులతో, లోతైన ఇండెంట్ ప్రొఫైల్ మరియు తక్కువ రైడింగ్ లుక్స్ؚతో స్పోర్ట్స్ కార్ؚలా కనిపిస్తుంది. హ్యుందాయ్ అసలైన కార్ؚను విడుదల చేసినపుడు చూస్తే కుదించిన సబ్-కాంపాక్ట్ కొలతలతో, అది ఒక సాధారణ సెడాన్ؚలాగే కనిపించింది.

హ్యుందాయ్ ఆల్కజార్

Hyundai Alcazar Sketch
Hyundai Alcazar

హ్యుందాయ్ స్కెచ్ చివరి ఉత్పత్తికి దగ్గరగా ఉన్న ఉదాహరణ ఇది. స్కెచ్, అందించిన కారులో A-పిల్లర్ రేక్, ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్ؚలను మినహాయించి స్కెచ్ؚలో చూపిన విధంగా దాదాపుగా ఒకేలా ఉంది.

స్కోడా కుషాక్ 

Skoda Kushaq Sketch
Skoda Kushaq

ఆవిష్కరణకు ముందు, డిజైన్ స్కెచ్ؚతో కొత్త మోడల్‌ను టీజ్ చేసిన భారతదేశంలోని అతి కొన్ని కారు బ్రాండ్ؚలలో స్కోడా ఒకటి. హ్యుందాయ్ ఇటీవలి వాహనాలతో పోలిస్తే, ప్రత్యేకించి కుషాక్ విషయంలో ఈ బ్రాండ్ స్కెచ్ؚలు అసలైన కారుకు దగ్గరగా ఉన్నాయి. అన్ని స్కెచ్ؚలలో లాగే, చూపించిన టీజర్‌లోని స్కెచ్, అసలైన SUVలలో అల్లాయ్ వీల్స్ డిజైన్ మరియు పరిమాణంలో మాత్రమే గమనించగలిగిన తేడాలు ఉన్నాయి. 

స్కోడా స్లావియా

Skoda Slavia Sketch
Skoda Slavia

కుషాక్ తర్వాత మరొక సెడాన్ స్కోడా స్లావియా. మరొకసారి టీజర్ స్కెచ్, అసలైన సెడాన్ మధ్య ఉన్న భారీ తేడాను వీల్స్ మరియు కార్ లుక్స్ ؚలో చూడవచ్చు. స్కెచ్ؚలో ఉన్న డిజైన్ విధంగా అందిస్తున్న కారు ఉన్నప్పటికీ, స్కెచ్ మరింత వెడల్పుగా కనిపిస్తుంది. 

2023 Hyundai Verna Sketch

అయితే, 2023 హ్యుందాయ్ వెర్నా సంగతి ఏంటి? సరళంగా చెప్పాలంటే, కారు తయారీదారు టీజ్ చేసే డిజైన్ స్కెచ్ అనేది అందించే సెడాన్ ఎలా కనిపిస్తుంది అనే దానికి దగ్గరగా ఉంటుంది, భారత డ్రైవింగ్ పరిస్థితులకు మరింత అనుకూలంగా ఉండటానికి ఉత్పత్తిలో కొన్ని మార్పులను గమనించవచ్చు. వీల్స్ పరిమాణం, గ్రౌండ్ క్లియరెన్స్ మరియు సెడాన్ రోడ్ ప్రెజెన్స్ؚను ఇది ఎలా ప్రభావితం చేస్తుంది అనేది ఆశించగలిగిన పెద్ద తేడా. 

ఇది కూడా చదవండి: కొత్త హ్యుందాయ్ వెర్నా దాని విభాగంలో అత్యంత శక్తివంతమైన సెడాన్ కావచ్చు

కొత్త హ్యుందాయ్ వెర్నా బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి, మార్చి 21న మార్కెట్‌లోకి రానుంది. ఈ కాంపాక్ట్ సెడాన్ ధర రూ.10 లక్షల (ఎక్స్-షోరూం) నుండి ప్రారంభమవుతుందని అంచనా ఇది స్కోడా స్లావియా, వోక్స్ వ్యాగన్ విర్టస్, నవీకరించబడిన హోండా సిటీలతో పోటీ పడనుంది.

was this article helpful ?

Write your Comment on Hyundai వెర్నా

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience