2023 వెర్నాను మార్చిలో లాంచ్ చేయనున్న హ్యుందాయ్
హ్యుందాయ్ వెర్నా కోసం ansh ద్వారా ఫిబ్రవరి 17, 2023 04:55 pm ప్రచురించబడింది
- 77 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ జనరేషన్‌కు తగిన సరికొత్త డిజైన్‌తో వస్తున్న ఈ కాంపాక్ట్ సెడాన్ ధర మునపటి వెర్షన్‌తో పోలిస్తే అధికంగా ఉంటుంది, ఇప్పటి వరకు లేని అత్యంత శక్తివంతమైన ఇంజన్ؚను కలిగి ఉంది.
-
2023 వెర్నా బుకింగ్ؚలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
-
EX, S, SX, SX(O) అనే నాలుగు వేరియెంట్ؚలలో దీన్ని అందిస్తున్నారు.
-
రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులోకి రానుంది: 1.5-లీటర్ సహజ సిద్ధమైన ఇంజన్ మరియు 1.5-లీటర్ టర్బో ఇంజన్.
-
పెద్ద పరిమాణాలు, కొత్త ఫీచర్‌లు కలిగి ఉంటుంది అని అంచనా.
-
ధర రూ.10 లక్షల నుండి ప్రారంభం అవుతుంది (ఎక్స్-షోరూమ్) అని ఆశిస్తున్నాము.
కొత్త-జనరేషన్ వెర్నా మొదటి అధికారిక టీజర్ؚను విడుదల చేసిన కొద్ది రోజులలోనే, ఈ సెడాన్ మార్చి 21న మార్కెట్‌లోకి అడుగుపెడుతుంది అని హ్యుందాయ్ స్పష్టం చేసింది. అయితే, దీని కంటే ముందే, హోండా సిటీతో పోటీపడే వాహన బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి.
పవర్ؚట్రెయిన్ؚలు
కొత్త వెర్నా రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో వస్తుంది. నిలిపివేస్తున్న వెర్నా మోడల్‌లో ఉన్న 1.5-లీటర్ సహజ సిద్ధమైన ఇంజన్ 115PS, 144Nm పవర్, టార్క్‌ను అందిస్తుంది, అయితే కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ 150PS, 254Nm పవర్, టార్క్‌ను అందిస్తుందని అంచనా. డీజిల్ ఇంజన్ అందుబాటలో ఉండదు.
ఫీచర్‌ల జాబితా
ఫీచర్‌ల విషయానికి వస్తే, నిలిపివేస్తున్న మోడల్ؚలో లేని పెద్ద టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్ؚ, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కొత్త వెర్నాలో ఉండవచ్చు. వెంటిలేటెడ్ ముందు సీట్లు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఇప్పటికే ఈ కొత్త వాహనంలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: క్రెటా శ్రేణి వాహనాల నుండి టర్బో-పెట్రోల్ & DCT ఎంపికను నిలిపివేస్తున్న హ్యుందాయ్
ADASతో భద్రత మెరుగుపడుతుంది, దీనిలో బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉన్నాయి. ఈ సెడాన్ ఫీచర్‌ల జాబితా ఇప్పటికీ ప్రకటించబడలేదు, ఇది EX, S, SX, SX(O) అనే నాలుగు వేరియెంట్ؚలలో రానుంది.
ధర మరియు పోటీదారులు
నిలిపివేస్తున్న వర్షన్ ధర రూ.9.64 లక్షల నుండి 15.72 లక్షలగా (ఎక్స్-షోరూమ్) ఉంది, 2023 వెర్నా ధర నిలిపివేస్తున్న వెర్షన్‌తో పోలిస్తే అధికంగా ఉండవచ్చు. కొత్త వెర్నా- హోండా సిటీ, స్కోడా స్లావియా, వోక్స్ؚవ్యాగన్ వర్చుస్ؚలతో పోటీ పడుతుంది.
0 out of 0 found this helpful