• English
  • Login / Register

సరికొత్త వెర్నా అధికారిక టీజర్ؚను విడుదల చేసిన హ్యుందాయ్, ప్రారంభమైన బుకింగ్ؚలు

హ్యుందాయ్ వెర్నా కోసం shreyash ద్వారా ఫిబ్రవరి 14, 2023 04:23 pm ప్రచురించబడింది

  • 38 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

హ్యుందాయ్ కొత్త జనరేషన్ కాంపాక్ట్ సెడాన్ మరింత పెద్దదిగా, సరికొత్తగా, మరింత శక్తివంతమైన 1.5 లీటర్ TGDi పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది

Fourth-gen Hyundai Verna Teaser

  • కొత్త జనరేషన్ వెర్నాను రూ.25,000 ముందస్తు ధరతో బుక్ చేసుకోవచ్చు. 

  • కారు పూర్తి డిజైన్‌తో పాటుగా, సరికొత్త ముందు మరియు వెనుక భాగాలను చూపిస్తూ టీజర్ؚను విడుదల చేసింది.

  • ఈ సెడాన్ؚలో 1.5 లీటర్‌ల TGDi పెట్రోల్ ఇంజన్ కలిగి ఉంటుందని హ్యుందాయ్ ధృవీకరించింది. 

  • ఈ కొత్త జనరేషన్ؚ సెడాన్ డీజిల్ ఇంజన్ ఎంపికను కోల్పోయింది. 

  • EX, S, SX మరియు SX(O) నాలుగు వేరియెంట్‌లలో అందుబాటులో ఉంటుంది

కొత్త జనరేషన్ వెర్నా త్వరలోనే అధికారికంగా విడుదల కానుంది, రూ.25,000 ముందస్తు ధరؚతో ఈ వాహన బుకింగ్ؚలను హ్యుందాయ్ ప్రారంభించింది. ఈ సెడాన్ తయారీదారు, నవీకరించిన డిజైన్‌తో పాటు, సరికొత్త ముందు మరియు వెనుక భాగాల వీక్షణలను క్లుప్తంగా ప్రదర్శించే మొదటి టీజర్ؚను కూడా విడుదల చేసింది. 

కొత్త లుక్స్

Fourth-gen Hyundai Verna Front

టీజర్ؚలో చూపినట్లుగా, ఈ కారు వెనుక ప్రొఫైల్ నాచ్‌బ్యాక్ డిజైన్‌తో ఎలాంట్రాను పోలి ఉన్నట్లు కనిపిస్తోంది. ముందు భాగంలో బోనెట్ లైన్‌కు పొడుగుతా LED DRLలు కనెక్ట్ చేయబడ్డాయి, ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులో ఉన్న సోనాటా వాహనం ద్వారా ప్రేరణ పొంది సరికొత్త డిజైన్   గల గ్రిల్ؚను కలిగి ఉంది. వెనుక భాగంలో, ఈ సెడాన్ కోరల-వంటి లైట్ ఆకారంలో కనిపించే కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంపులను కూడా కలిగి ఉంది. 

Fourth-gen Hyundai Verna Rear

కొత్త వెర్నా భారీ పరిమాణాలను కలిగి ఉన్నట్లు కనిపిస్తుంది, ఈ విభాగంలోని కాంపాక్ట్ సెడాన్ పోటీదారులలో కూడా ఈ మార్పును గమనించవచ్చు. ఈ కారు తయారీదారు దీన్ని ఏడు మోనోؚటోన్ؚలు, రెండు డ్యూయల్-టోన్ ఎక్స్ؚటీరియర్ షేడ్ؚలలో అందిస్తున్నారు, ఇందులో మూడు సరికొత్త మోనోؚటోన్ రంగులు: అబిస్ బ్లాక్, అట్లాస్ వైట్, టెల్యూరియన్ బ్రౌన్ؚలను కూడా పరిచయం చేస్తుంది. 

ఇది కూడా చదవండి: ఈ ఫిబ్రవరిలో హ్యుందాయ్ కార్ లపై రూ.33,000 వరకు ప్రయోజనాలను పొందండి

మరిన్ని ఫీచర్‌లు 

Current Hyundai Verna

కొత్త వెర్నాలో నవీకరించబడిన ఫీచర్‌ల జాబితాను హ్యుందాయ్ వివరించకపోయిన, ఇంతకు ముందు టెస్ట్ డిజైన్‌ؚలో చూసినట్లుగా ఈ సెడాన్ కనెక్టెడ్ డిస్ప్లేలతో (ఇన్ఫోటైన్ؚమెంట్, డిజిటల్ క్లస్టర్ కోసం) వస్తుంది. దీనిలో డ్యూయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ముందు సీట్‌లు, ప్రీమియం సౌండ్ సిస్టమ్ కూడా ఉండవచ్చు. 

ఇది కూడా చదవండి: 2 నెలల కంటే తక్కువ సమయంలో 650 యూనిట్‌ల బుకింగ్ؚలు అందుకున్న హ్యుందాయ్ ఐయానిక్ 5 EV

మెరుగైన భద్రత

Current Hyundai Verna

దీని సేఫ్టీ కిట్ؚలో ADAS సాంకేతికత కూడా ఉండవచ్చు, ఇది దీన్ని డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్ؚలను కలిగి ఉన్న రెండవ కాంపాక్ట్ ؚసెడాన్ؚగా నిలుపుతుంది. కొత్త వెర్నా ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సర్‌లు, నాలుగు డిస్క్ బ్రేకులను కలిగి ఉండవచ్చు. 

నవీకరించబడిన పవర్ ట్రెయిన్ؚలు

Current Hyundai Verna Engine

ప్రస్తుతం ఉన్న కొత్త ఉద్గార నియమాలకు అనుగుణంగా, వెర్నా ఇంజన్ ఎంపికలు RDEకి అనుకూలంగా, E20 ఇంధనానికి అనువుగా ఉంటుంది. కొత్త వెర్నా రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో లభిస్తుంది: ఆరు-స్పీడ్‌ల MT లేదా ఏడు-స్పీడ్‌ల DCT ట్రాన్స్మిషన్ؚకు జతచేసిన 1.5-లీటర్‌ల TGDi టర్బో-పెట్రోల్ మరియు ఆరు-స్పీడ్‌ల MT, iVT ట్రాన్స్మిషన్ؚతో అందుబాటులో ఉండే 1.5-లీటర్ MPi పెట్రోల్ ఇంజన్ؚ. 

ఇది కూడా చదవండి: కియా సెల్టోస్ తరువాత ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు ప్రామాణికంగా కలిగిన రెండవ కాంపాక్ట్ SUVగా నిలిచింది హ్యుందాయ్ క్రెటా

ఇందులో మొదటిది కొత్త ఇంజన్ అవ్వగా, రెండవది ప్రస్తుతం నిలిపివేస్తున్న మోడల్ؚలో 115PS, 144Nm పవర్, టార్క్‌లను అందిస్తుంది. 1.5 లీటర్ TGD పెట్రోల్ యూనిట్ పవర్ వివరాలు ప్రస్తుతానికి వెల్లడించలేదు. మరింత ముఖ్యంగా, కొత్త వెర్నాలో 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికను హ్యుందాయ్ నిలిపివేసింది. దీని ప్రధాన పోటీదారులలాగే, ఇది కూడా కేవలం పెట్రోల్ మోడల్ؚగా వస్తుంది. 

అంచనా ధర & పోటీదారులు 

నాలుగవ-జనరేషన్ హ్యుందాయ్ వెర్నా రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరను కలిగి ఉంటుందని అంచనా. హోండా సిటి, మారుతి సియాజ్, వోక్స్ؚవ్యాగన్ వర్టస్ మరియు స్కోడా స్లావియా వంటి వాటితో తన పోటీని కొనసాగిస్తుంది. 

was this article helpful ?

Write your Comment on Hyundai వెర్నా

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience