ఈ జనవరిలో ఎంపిక చేసిన Hyundai కార్లపై రూ.3 లక్షల వరకు ఆదా

హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ కోసం shreyash ద్వారా జనవరి 15, 2024 07:43 pm ప్రచురించబడింది

 • 191 Views
 • ఒక వ్యాఖ్యను వ్రాయండి

MY23 (మోడల్ ఇయర్) హ్యుందాయ్ మోడళ్లపై అధిక ప్రయోజనాలను అందిస్తున్నారు.

Hyundai Tucson, Kona, Verna

 • హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్తో గరిష్టంగా రూ.3 లక్షల వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు.

 • జనవరిలో, మీరు హ్యుందాయ్ టక్సన్ కారుపై రూ.2 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు.

 • హ్యుందాయ్ i20 హ్యాచ్ బ్యాక్ ధర రూ.63,000 వరకు ఉంది.

 • వెర్నా కారుపై రూ.55,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

 • హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్పై రూ.48,000 వరకు, హ్యుందాయ్ ఆరాపై రూ.33,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

 • ఈ నెలలో హ్యుందాయ్ అల్కాజార్ కారుపై మీరు రూ.45,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

 • హ్యుందాయ్ వెన్యూపై రూ.33,000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు

 • అన్ని డిస్కౌంట్ ఆఫర్లు 2024 జనవరి చివరి వరకు చెల్లుబాటు అవుతాయి.

హ్యుందాయ్ కార్లపై ఈ జనవరిలో రూ.3 లక్షల వరకు డిస్కౌంట్లను అందిస్తున్నారు. ఈ నెలలో, హ్యుందాయ్ క్రెటా, హ్యుందాయ్ ఎక్స్టర్, హ్యుందాయ్ అయోనిక్ 5 మినహా, , మిగిలిన అన్ని మోడళ్లకు ప్రయోజనాలను అందిస్తున్నారు. 2024 మోడల్ కంటే 2023లో తయారైన యూనిట్లకు ఎక్కువ డిస్కౌంట్లు ఇస్తున్నారు. హ్యుందాయ్ యొక్క మోడళ్ల వారీగా డిస్కౌంట్ ఆఫర్లు ఇక్కడ ఉన్నాయి:

హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్

2023 Hyundai Grand i10 Nios

ఆఫర్లు

మొత్తం

MY23

MY24

క్యాష్ డిస్కౌంట్

రూ.35,000 వరకు

రూ.20,000 వరకు

ఎక్స్ఛేంజ్ బోనస్

రూ.10,000 వరకు

రూ.10,000 వరకు

కార్పొరేట్ డిస్కౌంట్ 

రూ.3,000 వరకు

రూ.3,000 వరకు

మొత్తం ప్రయోజనాలు

రూ.48,000 వరకు

రూ.33,000 వరకు

 • పైన పేర్కొన్న 2023 మోడల్ డిస్కౌంట్ ఆఫర్లు CNG వేరియంట్పై మాత్రమే చెల్లుబాటు అవుతాయి. వాహనం యొక్క పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లు మరియు AMT వేరియంట్లపై వరుసగా రూ.20,000 మరియు రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.

 • పైన పేర్కొన్న 2024 మోడల్ డిస్కౌంట్ ఆఫర్లు ఈ హ్యాచ్బ్యాక్ కారు యొక్క CNG వేరియంట్పై మాత్రమే అందించబడుతున్నాయి. రెగ్యులర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్, AMT వేరియంట్లపై రూ.5,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.

 • ఈ రెండు మోడళ్లపై ఒకే ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తున్నారు.

 • హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ ధర రూ.5.93 లక్షల నుంచి రూ.8.56 లక్షల మధ్యలో ఉంది.

హ్యుందాయ్ ఆరా

Hyundai Aura Front Left Side

ఆఫర్లు

మొత్తం

MY23

MY24

క్యాష్ డిస్కౌంట్

రూ.20,000 వరకు

రూ.15,000 వరకు

ఎక్స్ఛేంజ్ బోనస్

రూ.10,000 వరకు

రూ.10,000 వరకు

కార్పొరేట్ డిస్కౌంట్ 

రూ.3,000 వరకు

రూ.3,000 వరకు

మొత్తం ప్రయోజనాలు

రూ.33,000 వరకు

రూ.28,000 వరకు

 • పట్టికలో పేర్కొన్న 2023 మోడల్ డిస్కౌంట్ ఆఫర్లు దాని CNG వేరియంట్పై మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఆరా సెడాన్ యొక్క రెగ్యులర్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.

 • పైన పేర్కొన్న 2024 మోడల్ డిస్కౌంట్ ఆఫర్లు CNG వేరియంట్పై మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 2024 ఆరా పెట్రోల్ వేరియంట్లపై క్యాష్ బెనిఫిట్ రూ.5,000కు తగ్గుతుంది.

 • హ్యుందాయ్ ఆరా ధర రూ.6.49 లక్షల నుంచి రూ.9.04 లక్షల మధ్యలో ఉంది.

Also Check Out: Hyundai Creta Facelift Reaches Dealerships Ahead Of Launch

ఇది కూడా చదవండి:  విడుదలకు ముందే డీలర్షిప్లకు చేరుకున్న హ్యుందాయ్ క్రెటా ఫేస్లిఫ్ట్

హ్యుందాయ్ i20

Hyundai i20 Front Left Side

ఆఫర్లు

మొత్తం

MY23

MY24

క్యాష్ డిస్కౌంట్

రూ.50,000 వరకు

N.A.

ఎక్స్ఛేంజ్ బోనస్

రూ.10,000 వరకు

రూ.10,000 వరకు

కార్పొరేట్ డిస్కౌంట్ 

రూ.3,000 వరకు

N.A.

మొత్తం ప్రయోజనాలు

రూ.63,000 వరకు

రూ.10,000 వరకు

 • పైన పేర్కొన్న డిస్కౌంట్ ఆఫర్లు హ్యుందాయ్ i20 కారు యొక్క ప్రీ-ఫేస్ లిఫ్ట్ DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్) వేరియంట్లపై మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రీ-ఫేస్ లిఫ్ట్ i20 స్పోర్ట్జ్ మాన్యువల్ వేరియంట్ పై రూ.25,000 క్యాష్ డిస్కౌంట్ తో లభిస్తుంది, మిగిలిన వేరియంట్లపై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. హ్యాచ్ బ్యాక్ యొక్క DCT మరియు స్పోర్ట్స్ మాన్యువల్ వేరియంట్లతో మాత్రమే కార్పొరేట్ డిస్కౌంట్ అందించబడుతుందని గమనించాలి.

 • i20 ఫేస్ లిఫ్ట్ యొక్క 2023 మోడల్ ఇయర్ యూనిట్లు రూ.15,000 క్యాష్ డిస్కౌంట్ మరియు రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్తో లభిస్తాయి.

 • 2024 హ్యుందాయ్ i20పై రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది.

 • హ్యుందాయ్ i20 ధర రూ.7.04 లక్షల నుంచి రూ.11.21 లక్షల మధ్యలో ఉంది.

హ్యుందాయ్ i20 N లైన్

Hyundai i20 N-Line Front Left Side

ఆఫర్లు

మొత్తం (MY23)

క్యాష్ డిస్కౌంట్

రూ.50,000 వరకు

ఎక్స్ఛేంజ్ బోనస్

రూ.10,000 వరకు

కార్పొరేట్ డిస్కౌంట్ 

N.A.

మొత్తం ప్రయోజనాలు

రూ.60,000 వరకు

 • హ్యుందాయ్ i20 N లైన్ కారు యొక్క ప్రీ-ఫేస్ లిఫ్ట్ వెర్షన్ యొక్క 2023 యూనిట్లపై మాత్రమే ఈ డిస్కౌంట్లు ఉన్నాయి.

 • ఫేస్ లిఫ్ట్ i20 N లైన్ 2023 మోడల్ పై క్యాష్ డిస్కౌంట్ రూ.15,000కు తగ్గించగా, ఎక్స్ఛేంజ్ బోనస్ అందించడంలేదు.

 • హ్యుందాయ్ i20 N లైన్ యొక్క MY24 యూనిట్లపై హ్యుందాయ్ ఎటువంటి ప్రయోజనాలను అందించడం లేదు.

 • హ్యుందాయ్ i20 N లైన్ ధర రూ.10 లక్షల నుంచి రూ.12.52 లక్షల మధ్యలో ఉంది.

హ్యుందాయ్ వెన్యూ

Hyundai Venue

ఆఫర్లు

మొత్తం (MY23)

వెన్యూ

వెన్యూ N లైన్

క్యాష్ డిస్కౌంట్

రూ.15,000 వరకు

రూ.30,000 వరకు

ఎక్స్ఛేంజ్ బోనస్

రూ.15,000 వరకు

N.A.

కార్పొరేట్ డిస్కౌంట్ 

N.A.

N.A.

మొత్తం ప్రయోజనాలు

రూ.30,000 వరకు

రూ.30,000 వరకు

 • ఈ డిస్కౌంట్ ఆఫర్లు హ్యుందాయ్ వెన్యూ యొక్క MY23 యూనిట్లపై మాత్రమే ఇవ్వబడుతున్నాయి.

 • పైన పేర్కొన్న ఆఫర్లు సాధారణ హ్యుందాయ్ వెన్యూ SUV యొక్క 1-లీటర్ టర్బో-పెట్రోల్ మాన్యువల్ వేరియంట్లపై మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అయితే ఈ వాహనం DCT వేరియంట్పై రూ.10,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది.

 • టేబుల్ లో పేర్కొన్న డిస్కౌంట్ ఆఫర్లు వెన్యూ N లైన్ యొక్క పాత DCT మరియు కొత్త మాన్యువల్ వేరియంట్లపై మాత్రమే చెల్లుబాటు అవుతాయి.

 • హ్యుందాయ్ వెన్యూ యొక్క కొత్త DCT వేరియంట్ కేవలం రూ.20,000 క్యాష్ డిస్కౌంట్ తో లభిస్తుంది.

 • హ్యుందాయ్ వెన్యూ ధర రూ.7.94 లక్షల నుంచి రూ.13.44 లక్షల మధ్యలో ఉండగా, వెన్యూ N లైన్ ధర రూ.12.08 లక్షల నుంచి రూ.13.90 లక్షల మధ్యలో ఉంది.

ఇది కూడా చూడండి: ఇండియా-స్పెక్ హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ వర్సెస్ ఇంటర్నేషనల్ క్రెటా ఫేస్ లిఫ్ట్: వ్యత్యాసం ఏమిటి?

హ్యుందాయ్ వెర్నా

Hyundai Verna

ఆఫర్లు

మొత్తం

MY23

MY24

క్యాష్ డిస్కౌంట్

రూ.30,000 వరకు

రూ.10,000 వరకు

ఎక్స్ఛేంజ్ బోనస్

రూ.25,000 వరకు

రూ.15,000 వరకు

మొత్తం ప్రయోజనాలు

రూ.55,000 వరకు

రూ.25,000 వరకు

 • 2024 తో పోలిస్తే, హ్యుందాయ్ వెర్నాపై ఎక్కువ క్యాష్ డిస్కౌంట్లు మరియు ఎక్స్ఛేంజ్ బోనస్లు లభిస్తున్నాయి.

 • హ్యుందాయ్ వెర్నా ధర రూ.11 లక్షల నుంచి రూ.17.42 లక్షల మధ్యలో ఉంది.

హ్యుందాయ్ అల్కాజార్

Hyundai Alcazar Front Left Side

ఆఫర్లు

మొత్తం

MY23

MY24

క్యాష్ డిస్కౌంట్

రూ.25,000 వరకు

N.A.

ఎక్స్ఛేంజ్ బోనస్

రూ.20,000 వరకు

రూ.15,000 వరకు

మొత్తం ప్రయోజనాలు

రూ.45,000 వరకు

రూ.15,000 వరకు

 • అల్కాజార్ 2023 మోడల్ కోసం డిస్కౌంట్ ఆఫర్లు పెట్రోల్ వేరియంట్లపై మాత్రమే చెల్లుబాటు అవుతాయి. ఈ SUV కారు డీజిల్ వేరియంట్లపై ఎలాంటి క్యాష్ డిస్కౌంట్ అందించడంలేదు.

 • హ్యుందాయ్ అల్కాజార్ 2024 మోడల్ కేవలం రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్తో లభిస్తుంది.

 • హ్యుందాయ్ అల్కాజార్ ధర రూ.16.78 లక్షల నుంచి రూ.21.28 లక్షల మధ్యలో ఉంది.

హ్యుందాయ్ టక్సన్

Hyundai Tucson

ఆఫర్లు

మొత్తం

MY23

MY24

క్యాష్ డిస్కౌంట్

రూ.2 లక్షల వరకు

N.A.

ఎక్స్ఛేంజ్ బోనస్

N.A.

రూ.15,000 వరకు

మొత్తం ప్రయోజనాలు

రూ.2 లక్షల వరకు

రూ.15,000 వరకు

 • టక్సన్ మోడల్ ఇయర్ 23 కోసం ప్రకటించిన క్యాష్ డిస్కౌంట్ డీజిల్ వేరియంట్లపై మాత్రమే వర్తిస్తుంది. అయితే దీని పెట్రోల్ వేరియంట్లపై రూ.50,000 క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది.

 • హ్యుందాయ్ ఫ్లాగ్షిప్ SUV యొక్క 2024 మోడల్ యూనిట్లు రూ.15,000 ఎక్స్ఛేంజ్ బోనస్తో మాత్రమే లభిస్తాయి.

 • హ్యుందాయ్ టక్సన్ ధర రూ.29.02 లక్షల నుంచి రూ.35.94 లక్షల మధ్యలో ఉంది.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్

Hyundai Kona Electric

ఆఫర్లు

మొత్తం (MY23)

క్యాష్ డిస్కౌంట్

రూ.3 లక్షల వరకు

మొత్తం ప్రయోజనాలు

రూ.3 లక్షల వరకు

 • హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ 2023 మోడల్పై అత్యధికంగా రూ.3 లక్షల క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది.

 • ఈ నెలలో ఈ ఎలక్ట్రిక్ SUV కారు యొక్క 2024 మోడల్ యూనిట్లపై ఎటువంటి ఆఫర్లు లేవు.

 • హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ ధర రూ.23.84 లక్షల నుండి రూ.24.03 లక్షల మధ్య ఉంది.

గమనికలు

 • ఈ డిస్కౌంట్ ఆఫర్లు రాష్ట్రం మరియు నగరాన్ని బట్టి మారవచ్చు. సరైన సమాచారం కోసం, సమీపంలోని హ్యుందాయ్ డీలర్షిప్ను సంప్రదించండి.

 • అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ.

మరింత చదవండి : గ్రాండ్ i10 నియోస్ AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ Grand ఐ10 Nios

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

కార్ వార్తలు

 • ట్రెండింగ్ వార్తలు
 • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

 • లేటెస్ట్
 • రాబోయేవి
 • పాపులర్
×
We need your సిటీ to customize your experience