• English
  • Login / Register

విడుదలకు ముందే డీలర్‌షిప్‌లకు చేరుకున్న Hyundai Creta Facelift

హ్యుందాయ్ క్రెటా కోసం shreyash ద్వారా జనవరి 15, 2024 07:46 pm ప్రచురించబడింది

  • 528 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2024 హ్యుందాయ్ క్రెటా డీలర్‌షిప్‌ వద్ద అట్లాస్ వైట్ ఎక్ట్సీరియర్ షేడ్ లో SUV యొక్క పూర్తి లోడ్ వేరియంట్ గా కనిపించింది

2024 Hyundai Creta

  • రూ.25,000 టోకెన్ అమౌంట్ తో ఫేస్ లిఫ్టెడ్ క్రెటా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

  • ఎక్ట్సీరియర్ లో కనెక్టెడ్ హెడ్ లైట్లు, టెయిల్ లైట్లు, కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి.

  • ఇంటీరియర్ లో డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ డిస్ ప్లే, కొత్త డిజైన్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ ఉన్నాయి.

  • ఈ SUV కారులో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ADAS, డ్యూయల్ జోన్ AC వంటి కొత్త ఫీచర్లు ఉన్నాయి.

  • ఇది మూడు ఇంజన్లు మరియు ఐదు ట్రాన్స్మిషన్ ఎంపికలతో అందించబడుతుంది.

  • భారతదేశంలో కొత్త క్రెటా ధర రూ .11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

2024 హ్యుందాయ్ క్రెటా భారతదేశంలో ఆవిష్కరించబడింది. ఈ వాహనం డిజైన్ సరికొత్తగా ఉంది మరియు క్యాబిన్ కూడా నవీకరించబడింది. కొత్త హ్యుందాయ్ క్రెటా యొక్క బుకింగ్స్ ప్రస్తుతం రూ .25,000 టోకెన్ మొత్తంతో జరుగుతున్నాయి. జనవరి 16వ తేదీన ఈ కారు భారతదేశంలో విడదలకానుంది. ఇప్పుడు కొత్త క్రెటా కారు యొక్క కొన్ని యూనిట్లు కూడా డీలర్‌షిప్‌లకు రావడం ప్రారంభించాయి.

ఫ్రంట్ & రేర్ లుక్స్

2024 Hyundai Creta Front

డీలర్‌షిప్‌ వద్ద లభించే యూనిట్ కు అట్లాస్ వైట్ ఎక్ట్సీరియర్ కలర్ షేడ్ లభిస్తుంది. హ్యుందాయ్ క్రెటా SUV యొక్క ఫ్రంట్ బంపర్ లో అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) కోసం రాడార్ ను అమార్చడం వల్ల ఇది టాప్-స్పెక్ వేరియంట్ ల కనిపించింది. ఫ్రంట్ ప్రొఫైల్ సరికొత్తది, దీని ముందు భాగంలో రీడిజైన్ చేయబడిన గ్రిల్ (కొత్త వెన్యూ మాదిరిగానే) మరియు బానెట్ వెడల్పు వరకు విస్తరించిన LED DRL స్ట్రిప్తో ఇన్వర్టెడ్ L-షేప్ ఉన్నాయి. దీని హెడ్ లైట్లు చతురస్రాకారంలో ఉంటాయి మరియు మరింత పవర్ ఫుల్ లుక్ కోసం సిల్వర్ స్కిడ్ ప్లేట్ కూడా అందించబడింది.

ఇది కూడా చదవండి: కొత్త మహీంద్రా XUV400 EL ప్రో వేరియంట్ 15 చిత్రాలలో వివరించబడింది

2024 Hyundai Creta Rear

సైడ్ ప్రొఫైల్ విషయానికి వస్తే, 2024 హ్యుందాయ్ క్రెటా లో కొత్త అల్లాయ్ వీల్స్ మినహా మరే ఇతర మార్పులను చేయలేదు. వెనుక భాగంలో కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్స్తో ఇన్వర్టెడ్ L-ఆకారంలో SUVని అమర్చారు. రేర్ బంపర్ డిజైన్ సరికొత్తగా ఉంది మరియు సిల్వర్ స్కిడ్ ప్లేట్ కూడా అందించబడుతుంది.

ఇది కూడా చదవండి: టాటా పంచ్ EV ఇంటీరియర్ లో డ్యూయల్ 10.25 అంగుళాల డిస్ప్లేలు మరియు నవీకరించిన సెంటర్ కన్సోల్

కొత్త క్యాబిన్ & ఫీచర్లు

Hyundai Creta facelift Interior

2024 క్రెటా కారు యొక్క క్యాబిన్ కొత్త డిజైన్ డ్యాష్బోర్డ్ను పొందుతుంది, దీనిలో డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ స్క్రీన్ సెటప్ (10.25-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే) ఉండనున్నాయి. కియా సెల్టోస్ మాదిరిగానే, ఇందులో టచ్-ఎనేబుల్డ్ కంట్రోల్స్ (డ్యూయల్-జోన్ ఫంక్షనాలిటీ) తో కొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్స్ ఉంటాయి. ప్యాసింజర్ సైడ్ యొక్క పై భాగంలో పియానో బ్లాక్ ప్యానెల్ ఉంటుంది, దీని సైడ్ లో AC వెంట్ లు ఉంటాయి.

కొత్త హ్యుందాయ్ క్రెటాలో 8-స్పీకర్ల బోస్ సౌండ్ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, 8-వే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్లు ఉన్నాయి. ఆరు ఎయిర్ బ్యాగులు, 360 డిగ్రీల కెమెరా, లెవల్ 2 అడ్వాన్స్ డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.

పవర్‌ట్రెయిన్ ఎంపికలు

Hyundai Creta Facelift Reaches Dealerships Ahead Of Launch

హ్యుందాయ్ క్రెటా ఫేస్ లిఫ్ట్ అవుట్ గోయింగ్ మోడల్ యొక్క పెట్రోల్ మరియు డీజిల్ పవర్ ట్రెయిన్ ఎంపికలతో లభిస్తుంది: 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా CVTతో లభించే 1.5-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ (115 PS / 144 Nm) మరియు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో జతచేయబడిన 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (116 PS / 250 Nm). ఫేస్ లిఫ్ట్ తో, హ్యుందాయ్ ఈ SUVని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (160 PS / 253 Nm) ఎంపికతో 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ మిషన్ తో జత చేయబడుతుంది.

ఆశించిన ధర & ప్రత్యర్థులు

భారతదేశంలో 2024 హ్యుందాయ్ క్రెటా ధర రూ .11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, వోక్స్వాగన్ టైగూన్ మరియు హోండా ఎలివేట్ వంటి మోడళ్లతో పోటీ పడనుంది.

మరింత చదవండి: క్రెటా ఆటోమేటిక్

was this article helpful ?

Write your Comment on Hyundai క్రెటా

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience