జనవరి 2023లో అత్యంత ప్రాచుర్యం పొందిన 15 కార్‌ల జాబితాలో మారుతి ఆధిపత్యం
మారుతి ఆల్టో 800 కోసం rohit ద్వారా ఫిబ్రవరి 09, 2023 12:49 pm ప్రచురించబడింది
- 63 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
2023 ప్రారంభంలో, కేవలం రెండు మోడల్‌లు మాత్రమే నెలసరి అమ్మకాలలో 20,000 యూనిట్‌ల మైలురాయిని అధిగమించాయి
2023 సంవత్సరం ఆటోమోటివ్ రంగానికి చక్కని ప్రారంభాన్ని ఇచ్చింది, అత్యంత ప్రాచుర్యం పొందిన కారు మోడల్‌ల అమ్మకాల సంఖ్య దీన్ని సూచిస్తోంది. జనవరి అమ్మకాల జాబితాలో ఏ కారు తయారీదారు మొదటి స్థానంలో(మారుతి అని చెపవచ్చు) ఉన్నారో ఊహించగలరా? ఆల్టో, వాగన్ R మరియు స్విఫ్ట్ వాహన అమ్మకాలు మారుతిని మొదటి స్థానంలో నిలిపాయి.
జనవరి 2023లో అధికంగా కొనుగోలు చేసిన 15 కార్‌లను ఇప్పుడు చూద్దాం.
మోడల్ |
జనవరి 2023 |
జనవరి 2022 |
డిసెంబర్ 2022 |
మారుతి ఆల్టో |
21,411 |
12,342 |
8,648 |
మారుతి వాగన్ R |
20,466 |
20,334 |
10,181 |
మారుతి స్విఫ్ట్ |
16,440 |
19,108 |
12,061 |
మారుతి బాలెనో |
16,357 |
6,791 |
16,932 |
టాటా నెక్సాన్ |
15,567 |
13,816 |
12,053 |
హ్యుందాయ్ క్రెటా |
15,037 |
9,869 |
10,205 |
మారుతి బ్రెజ్జా |
14,359 |
9,576 (విటారా బ్రెజ్జా) |
11,200 |
టాటా పంచ్ |
12,006 |
10,027 |
10,586 |
మారుతి ఎకో |
11,709 |
10,528 |
10,581 |
మారుతి డిజైర్ |
11,317 |
14,967 |
11,997 |
హ్యుందాయ్ వెన్యూ |
10,738 |
11,377 |
8,285 |
కియా సెల్టోజ్ |
10,470 |
11,483 |
5,995 |
మారుతి ఎర్టిగా |
9,750 |
11,847 |
12,273 |
కియా సోనెట్ |
9,261 |
6,904 |
5,772 |
టాటా టియాగో |
9,032 |
5,195 |
6,052 |
ఇది కూడా చదవండి: బాలెనో, ఎర్టిగా & XL6లకు వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ؚప్లే మరియు మరిన్ని సాంకేతికతలను అందిస్తున్న మారుతి
టేక్ అవే
- ప్రతి సంవత్సరం(YoY) 70 శాతం వృద్ధితో, జనవరిలో 21000 యూనిట్‌ల అమ్మకాలతో మారుతి ఆల్టో బెస్ట్-సెల్లింగ్ కార్‌ల జాబితాలో మొదటి స్థానాన్ని సంపాదించింది. ఈ సంఖ్యలో ఆల్టో 800, ఆల్టో K10 రెండు ఉన్నాయి.
-
జనవరి 2023లో 20000-యూనిట్ మార్క్‌ను దాటిన మరొక మోడల్ మారుతి వాగన్ R. దీని నెలవారీ(MoM) అమ్మకాల సంఖ్య రెట్టింపు కంటే ఎక్కువ పెరిగింది.
- వాగన్ R తరువాత స్థానంలో స్విఫ్ట్, బాలెనో వాహనాలు నిలిచాయి, ఈ రెండు వాహనాలు విడివిడిగా 16,000 కంటే ఎక్కువ యూనిట్‌లను విక్రయించాయి.
- జనవరి 2023లో, 15000 కంటే ఎక్కువ యూనిట్‌ల అమ్మకాలతో టాటా నెక్సాన్ అత్యధికంగా అమ్ముడైన SUVగా నిలిచింది. టాటా 15,500 కంటే ఎక్కువ SUVలను డెలివరి చేసింది, దీనిలో నెక్సాన్ EV ప్రైమ్, మ్యాక్స్ ఉన్నాయి.
-
హ్యుందాయ్ క్రెటా అమ్మకాలు కూడా మెరుగ్గానే ఉంది, 2023 మొదటి మాసంలో 15,000 కంటే ఎక్కువ యూనిట్‌లను విక్రయించింది, డిసెంబర్ 2022 కంటే ఇది సుమారు 5,000 యూనిట్‌లు ఎక్కువ.
-
ప్రాచుర్యం పొందిన, తరుచుగా మొదటి స్థానంలో నిలిచే మరొక కారు మారుతి బ్రెజ్జా, క్రెటా తరువాతి స్థానంలో ఉంది. దీని సంవత్సరం వారిగా చూసినట్లైతే వీటి సంఖ్య 50 శాతం పెరిగింది.
-
2023 మొదటి నెలలో టాటా మైక్రో SUV, పంచ్ అమ్మకాలు 12,000 కంటే ఎక్కువ ఉన్నాయి. ఇది నెలవారీ, సంవత్సరంవారీగా చూసినట్లైతే రెండిటిలో వృద్ధిని చూసింది.
-
జనవరి 2023లో, తరువాతి స్థానంలో మారుతి రెండు మోడల్‌లు ఎకో మరియు డిజైర్ విడివిడిగా 11,000 కంటే ఎక్కువ యూనిట్‌ల అమ్మకాలను నమోదు చేశాయి, ఇక్కడ జాబితా చేసిన అన్నీ మోడల్‌లలో డిజైర్ సంవత్సరంవారీగా అమ్మకాలలో(సుమారు 25 శాతం) గరిష్టంగా తగ్గింది.
-
వీటి తరువాత అత్యధికంగా అమ్ముడైన కార్ SUVలు – హ్యుందాయ్ వెన్యూ, కియా సెల్టోజ్. వీటిలో రెండవది, ఈ జాబితాలో 10000 యూనిట్ అమ్మకాల మైలురాయిని దాటిన చివరి కారు.
-
అత్యధికంగా అమ్ముడైన MPV మారుతి ఎర్టిగా నెలవారీ, సంవత్సరం వారీగా అమ్మకాల పరంగా తగ్గిపోయాయి అని చెప్పవచ్చు. మరొక వైపు కియా సోనెట్ అమ్మకాలలో భారీ వృద్ధిని చూసింది, 9,000 యూనిట్‌ల మార్క్ؚను దాటింది.
-
చివరిగా, సోనెట్‌కు సమానంగా వృద్ధి సాధించి మొత్తం 9,000 కంటే ఎక్కువ యూనిట్‌ల అమ్మకాల మార్కును టాటా టియాగో అందుకుంది. టియాగో అంకెలలో టియాగో EV అమ్మకాలు కూడా ఉన్నాయని గమనించండి.
ఇక్కడ మరింత చదవండి: ఆల్టో 800 ఆన్-రోడ్ ధర
0 out of 0 found this helpful