బాలెనో, ఎర్టిగా & XL6లకు వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ؚప్లే మరియు మరిన్ని సాంకేతికతలను అందిస్తున్న మారుతి
మారుతి ఎర్టిగా కోసం shreyash ద్వారా ఫిబ్రవరి 08, 2023 01:42 pm ప్రచురించబడింది
- 59 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
హ్యాచ్ؚబ్యాక్, MPVలకు ఈ కొత్త కనెక్టివిటీ ఫీచర్‌లు OTA (ఓవర్-ది-ఎయిర్) అప్ؚడేట్ తరువాత అందుబాటులోకి వస్తాయి.
-
ఈ మూడు కార్‌లలో ఇప్పుడు వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ؚప్లే అందుబాటులో ఉన్నాయి.
-
మోడల్‌పై ఆధారపడి, MID మరియు HUDలపై టర్న్-బై-టర్న్(TBT) డైరెక్షన్ؚలు కూడా కొత్త అప్ؚడేట్‌లలో ఉంటాయి.
-
ఎర్టిగా, XL6 రెండిటిలో ARKAMYS సరౌండ్ సెన్స్ ఆడియో ట్యూనింగ్ ఉంటుంది.
-
ఇప్పుడు బాలెనోలో కూడా ESP మరియు హిల్ హోల్డ్ అసిస్ట్ ప్రామాణికంగా ఉంటుంది.
బాలెనో, ఎర్టిగా, XL6లకు మారుతి సుజుకి కొత్త కనెక్టివిటీ ఫీచర్‌లను పరిచయం చేసింది. స్మార్ట్‌ప్లే ప్రో(ఏడు-అంగుళాలు) మరియు స్మార్ట్‌ప్లే ప్రో+(తొమ్మిది-అంగుళాల) ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్ؚ వంటి అనేక ఫీచర్‌లను మునపట ఈ వేరియెంట్ కార్‌లు కలిగి ఉండేవి. కాని, ఇపుడు ఇవి కొత్త సాంకేతికతను అందుకున్నాయి. ప్రస్తుత కస్టమర్ؚలు కూడా ఈ అప్ؚడేట్ؚలను OTA (ఓవర్-ది-ఎయిర్) అప్‌డేట్ ద్వారా పొందవచ్చు.
అదనపు సౌకర్యం కోసం మరింత సాంకేతికత
ఈ మూడు వాహనాలు ఇప్పుడు వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో & ఆపిల్ కార్ؚప్లేలను పొందుతాయి. MPVలు ఏడు-అంగుళాల టచ్ స్క్రీన్ؚతో వస్తాయి, ఈ శ్రేణిలో-ఉత్తమమైన బాలెనో తొమ్మిది-అంగుళాల యూనిట్ؚతో వస్తుంది. కొత్త MID (మల్టి-ఇన్ఫర్మేషన్ డిస్ప్లే) మరియు టాప్-స్పెక్ బాలెనో HUD (హెడ్-అప్-డిస్ప్లే) పై TBT (టర్న్-బై-టర్న్) నావిగేషన్ ఫీచర్ ఈ కార్‌లలో భాగంగా ఉంది, అయితే ఎర్టిగా, XL6ల MID డిస్ప్లేలపై TBT నావిగేషన్, ఆపిల్ కార్ؚప్లే ద్వారా యాపిల్ మ్యాప్స్ؚతో కాకుండా, ఆండ్రాయిడ్ ఆటోతో గూగుల్ ప్లే ద్వారానే అందుబాటులో ఉంటుంది.
ఇది కూడా చదవండి: ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, మరియు ఇతర ప్రధాన నగరాలలో మారుతి హ్యాచ్ؚబ్యాక్ؚల వెయిటింగ్ పీరియడ్
డిజిటల్ؚగా మెరుగైన ఆడియో
ఎర్టిగా, XL6లకు ప్రత్యేకమైన ఈ అప్ؚడేట్ؚలో మెరుగైన స్పీకర్ సౌండ్ నాణ్యత, వివిధ మూడ్ؚలకు అనుగుణంగా సిగ్నేచర్ ఆంబియన్స్ సెట్టింగ్ؚల కోసం ARKAMYS సరౌండ్ సెన్స్ ఆడియో ట్యూనింగ్ ఉంటుంది. ఈ మోడల్‌ల తాజా వర్షన్ؚల ప్రస్తుత యజమానులు, ఈ సాఫ్ట్ؚవేర్ ఫీచర్ అప్ؚడేట్ؚను స్మార్ట్‌ప్లే ప్రో సింక్ అప్లికేషన్ؚను ఉపయోగించి ఫోన్ ద్వారా ఇన్ؚస్టాల్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి: ఈ ఫిబ్రవరిలో మారుతి ఇగ్నిస్, సియాజ్ؚలపై రూ.45,000 వరకు ప్రయోజనాలను పొందండి
బాలెనోలో మరింత భద్రత
బాలెనోలో ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం), హిల్ అసిస్ట్‌లను ప్రామాణికంగా అందిస్తూ మారుతి ప్రయాణీకుల భద్రతను మరింతగా మెరుగుపరచింది. ఎర్టిగా, XL6లలో కూడా ఇవే ప్రామాణిక పరికారాలను అందిస్తుంది.
ఇది కూడా చదవండి: 2030 నాటికి గరిష్ట విక్రయాలు ICE మోడల్‌ల నుండి, కనిష్ట విక్రయాలు EVల నుండి వస్తాయని మారుతి అంచనా వేస్తుంది
ధరలలో మార్పు లేదు
ప్రతి సంవత్సరంలాగే, 2023లో కూడా మారుతి అన్నీ వాహనాల ధరలను పెంచవచ్చు, ఈ ధరల పెరుగుదలకు సాఫ్ట్ؚవేర్ అప్ؚడేట్‌లు కారణం కాకపోవచ్చు. బాలెనో ధర రూ.6.49 లక్షల నుండి 9.83 లక్షలు, XL6 రూ.11.41 లక్షల నుండి 14.55 లక్షలు & ఎర్టిగా ధర రూ.8.49 లక్షల నుండి 12.93 లక్షల వరకు ఉన్నాయి.
అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు
ఇక్కడ మరింత చదవండి: ఎర్టిగా ఆటోమ్యాటిక్
0 out of 0 found this helpful