• English
  • Login / Register

తాజా సమాచారం: కొత్త & మరిన్ని ఫీచర్‌లు కలిగిన టాప్ వేరియెంట్ؚను పొందనున్న సిట్రోయెన్ C3

సిట్రోయెన్ సి3 కోసం tarun ద్వారా ఏప్రిల్ 05, 2023 12:49 pm ప్రచురించబడింది

  • 30 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఫీల్ వేరియెంట్ؚలో లేని అన్నీ ఫీచర్‌లు ఈ కొత్త షైన్ వేరియెంట్ భర్తీ చేస్తుంది. 

Citroen C3

  • సిట్రోయెన్ C3 ప్రస్తుతం బేసిక్ ఫీచర్‌లతో లైవ్ మరియు ఫీల్ వేరియెంట్‌లలో వస్తుంది. 

  • కొత్త టాప్ వేరియెంట్ రేర్ వైపర్/వాషర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMలు, బటన్ స్టార్ట్-స్టాప్ మరియు రేర్ కెమెరాలతో వస్తుంది. 

  • అలాయ్ వీల్స్ మరియు లెదర్-చుట్టిన స్టీరింగ్ వీల్ؚను కూడా పొందవచ్చు. 

  • మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో 1.2-లీటర్ నేచురాల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్‌లను కొనసాగిస్తుంది. 

  • టాప్-ఎండ్ వేరియెంట్ ధర, ప్రస్తుత టాప్-స్పెక్ ఫీల్ వేరియెంట్‌తో పోలిస్తే రూ.1 లక్ష ఎక్కువ ఉంటుందని అంచనా.

  • eC3లో కూడా ఈ ఫీచర్‌లు ఉంటాయని ఆశించవచ్చు. 

సిట్రోయెన్ C3 త్వరలో కొత్త టాప్-ఎండ్ “షైన్” వేరియెంట్‌ను పొందుతుందని ఇటీవల అందిన సమాచారం. ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుతం “లైవ్” మరియు “ఫీల్” వేరియెంట్‌లలో అందించబడుతోంది మరియు ఖచ్చితంగా అనేక ఇతర ఫీచర్ అప్ؚగ్రేడ్ؚలను పొందనుంది.

Citroen C3

దీని ప్రస్తుత ధరకు అందించే ఫీచర్‌లను పోటీదారులతో పోలిస్తే, ఇది అందించే ఫీచర్‌లు చాలా తక్కువగా ఉన్నాయని C3 విమర్శలను ఎదుర్కొంది. రేర్ వైపర్ మరియు వాషర్, డిఫోగ్గర్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMలు, బటన్ స్టార్ట్/స్టాప్ మరియు రేర్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్‌లతో వచ్చే కొత్త షైన్ వేరియెంట్ ఈ విమర్శలకు జవాబిస్తుంది. ఐదుగురు ప్రయాణీకులకు త్రీ-పాయింట్ సీట్ బెల్ట్ؚలు, అలాయ్ వీల్స్ మరియు లెదర్-చుట్టిన స్టీరింగ్ వీల్ వంటి ఫీచర్‌లు కూడా ఉంటాయి. 

ఇది కూడా చదవండి: ఏప్రిల్ 27వ తేదీన భారతదేశంలో తన నాలుగవ మోడల్‌ను విడుదల చేయనున్న సిట్రోయెన్

ప్రస్తుతం, ఈ హ్యాచ్ؚబ్యాక్ 10.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే, హైట్-అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, రేర్ పార్కింగ్ సెన్సర్‌లతో వస్తుంది. 

Citroen C3

టాప్-ఎండ్ వేరియెంట్ 82PS పవర్, 1.2-లీటర్ పెట్రోల్ మరియు 110PS, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌లు రెండిటితో అందించబడుతుందని అంచనా. ప్రస్తుతం ఇది మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్‌తో ప్రామాణికంగా అందిస్తున్నారు. అయితే సమీప భవిష్యత్తులో ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ జోడించబడుతుంది అని ఆశిస్తున్నాము. 

ఇది కూడా చదవండి: సిట్రోయెన్ eC3 Vs పోటీదారులు: ధర చర్చ

కొత్త టాప్-ఎండ్ వేరియెంట్ అయిన ఫీల్ వేరియెంట్‌తో పోలిస్తే గణనీయంగా అధిక ధరతో వస్తుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ ప్రస్తుత ధర రూ.6.16 లక్షల నుండి రూ.8.43 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంది. హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్, మారుతి స్విఫ్ట్ మరియు టాటా పంచ్ వంటి వాటితో పోటీ పడుతుంది. 

ఇక్కడ మరింత చదవండి: సిట్రోయెన్ C3 ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Citroen సి3

Read Full News

explore మరిన్ని on సిట్రోయెన్ సి3

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience