• English
  • Login / Register

సిట్రోయెన్ eC3 Vs పోటీదారులు: ధర చర్చ

సిట్రోయెన్ ఈసి3 కోసం shreyash ద్వారా మార్చి 02, 2023 12:24 pm ప్రచురించబడింది

  • 50 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

మూడు EVలలో, eC3 29.2kWh అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ సామర్థ్యంతో, 320కిమీ వరకు మైలేజ్‌ను అందించగలదు.

Citroen eC3 Vs Tata Tiago EV vs Tata Tigor EV

భారతదేశంలో, తన మొదటి పూర్తి-ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్ eC3 ధరలను సిట్రోయెన్ ఇటీవల వెల్లడించింది, వీటి ధరలు రూ.11.50 లక్షల వద్ద ప్రారంభమవుతున్నాయి. ఎంట్రీ-లెవెల్ EVగా వస్తున్న వేరియంట్‌కు, టాటా టియాగో EV మరియు టిగోర్ EV ప్రధాన పోటీదారులు. ధర విషయంలో వీటి పోలిక ఎలా ఉందో చూద్దాం. 

ధర పరిశీలన 

సిట్రోయెన్ eC3

టాటా టియాగో EV

టాటా టిగోర్ EV

 

3.3kW చార్జర్ؚతో 19.2kWh 

 

XE – రూ. 8.69 లక్షలు

XT – రూ. 9.29 లక్షలు

3.3kW ఛార్జర్ؚతో 24kWh 

XT – రూ. 10.19 లక్షలు

XZ+ - రూ. 10.99 లక్షలు

XZ+ టెక్ లక్స్- రూ. 11.49 లక్షలు

29.2kWh బ్యాటరీ ప్యాక్

7.2kW ఛార్జర్ؚతో 24kWh

26kWh బ్యాటరీ ప్యాక్

లైవ్ – రూ. 11.50 లక్షలు

XZ+ - రూ. 11.49 లక్షలు

 

ఫీల్ – రూ. 12.13 లక్షలు

XZ+ టెక్ లక్స్- రూ. 11.99 లక్షలు

XE – రూ. 12.49 లక్షలు

ఫీల్ వైబ్ ప్యాక్ – రూ. 12.28 లక్షలు

   

ఫీల్ డ్యూయల్-టోన్ వైబ్ ప్యాక్–రూ. 12.43 లక్షలు

XT – రూ. 12.99 లక్షలు

 

XZ+ -రూ. 13.49 లక్షలు

XZ+ లక్స్ – రూ. 13.75 లక్షలు

Citroen eC3

  • టాటా టియాగో EV ధర eC3 ధరతో పోలిస్తే చాలా తక్కువ. ఈ రెండు మోడల్‌ల బేస్ వేరియెంట్‌ల మధ్య ధర వ్యత్యాసం రూ. 2.81 లక్షలుగా ఉంది. టియాగో EV దీర్ఘ-పరిధి వేరియెంట్ కూడా రూ. 1.31 లక్షల తక్కువ ధరకు వస్తుంది. 

  • రెండు EV హ్యాచ్‌బ్యాక్‌ల కంటే టిగోర్ EV ప్రారంభ ధర చాలా అధికంగా ఉంది. దీని బేస్ వేరియెంట్ ధర టాప్ స్పెక్ eC3 కంటే రూ.6,000 అధికం. 

  • eC3కి సమానమైన మైలేజ్‌ను(312కిమీ) అందించే, మరింత శక్తివంతమైన మోటార్, అదనపు ఫీచర్‌లు కలిగి ఉన్న టాటా నెక్సాన్ EV ప్రైమ్ ధర రూ.14.49 లక్షల వద్ద ప్రారంభమవుతుంది. ఇది టాప్-స్పెక్ eC3 కంటే రూ.2 లక్షల కంటే కొంత ఎక్కువ. 

ఇది కూడా చదవండి: కొత్త రికార్డును నెలకొల్పనున్న టాటా నెక్సాన్ EV 

Tata Tiago EV

  • 3.3kW ఛార్జింగ్ ఎంపికతో ఆటోమ్యాటిక్ AC, పవర్డ్-ORVMలు, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్ వంటి ఫీచర్‌లు కలిగిన టియాగో EV XZ+ టెక్ లక్స్ వేరియెంట్ ధర, eC3 బేస్-స్పెక్ వేరియెంట్ ధరకు సమానంగా, రూ.1,000 నామమాత్రపు తేడాతో ఉంది.  

  • 24kWh బ్యాటరీ ప్యాక్ؚ, 7.2kW ఛార్జింగ్ ఎంపికతో టాటా టియాగో XZ+ వేరియెంట్ ధర eC3 ఫీల్ వేరియెంట్‌తో పోలిస్తే రూ. 1.13 లక్షలు తక్కువగా ఉంది, అంతేకాకుండా టియాగో XZ+ వేరియంట్ లో మరిన్ని ఫీచర్‌లు ఉన్నాయి. 

  • eC3 టాప్-స్పెక్ ఫీల్ వేరియెంట్ؚలో 10.2-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే, కనెక్టెడ్ కార్ టెక్ మరియు నాలుగు-స్పీకర్‌ల సౌండ్ సిస్టమ్ؚతో అందిస్తున్నారు. 

  • వైబ్ ప్యాక్, దాని ఖరీదైన వేరియెంట్ؚకు ఎక్స్ؚటీరియర్ కస్టమైజేషన్ؚను మాత్రం జోడిస్తుంది, అందిస్తున్న ఫీచర్‌లు, సౌకర్యాల పరంగా eC3, టియాగో EV దరిదాపులో కూడా ఉండదు.

  • భద్రత విషయంలో మూడు EVలు డ్యూయల్-ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, రేర్-పార్కింగ్ సెన్సర్‌లతో వస్తున్నాయి.

పైన పేర్కొన్నవి అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు

ఇది కూడా చదవండి: eC3 ఎలక్ట్రిక్ హ్యాచ్ؚబ్యాక్ؚతో ఫ్లీట్ మార్కెట్ؚలోకి ప్రవేశించనున్న సిట్రోయెన్

పవర్ؚట్రెయిన్ వివరాలు

స్పెక్స్

సిట్రోయెన్ eC3

టాటా టియాగో EV

టాటా టిగోర్ EV

బ్యాటరీ ప్యాక్

29.2kWh

19.2kWh/24kWH

26kWh

పవర్

57PS

61PS/75PS

75PS

టార్క్ 

143Nm

110Nm/114Nm

170Nm

పరిధి

320km (MIDC రేటెడ్)

250km/315km

315km

  • వీటిలో eC3 అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ؚను కలిగి ఉండి, అత్యధిక డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది, కానీ ఇది ఇతర వాహనాలతో పోలిస్తే కేవలం 5కిమీ ఎక్కువ.

  • టియాగో రెండు బ్యాటరీ ప్యాక్‌ల ఎంపికతో వస్తుంది – మిడ్-రేంజ్ 19.2kWh మరియు లాంగ్-రేంజ్ 25kWh – మైలేజ్ వరుసగా 250కిమీ నుండి 315కిమీ వరకు అందిస్తాయి. రెండు వేరియంట్‌లో ఇది ఎక్కువ శక్తిని అందిస్తుంది, కానీ eC3తో పోలిస్తే టార్క్ తక్కువగా ఉంటుంది. 

Tata Tigor EV

టాటా టిగోర్ EV 

  • టిగోర్ Evలో 315కిమీ మైలేజ్‌ను అందించడానికి సరిపోయే 26kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది, ఈ EVలలో ఇది అత్యంత శక్తివంతమైన EV. 

ఛార్జింగ్ వివరాలు

ఛార్జర్

సిట్రోయెన్  eC3

టాటా టియాగో EV

టాటా టిగోర్ EV

 

29.2kWh

19.2kWh

24kWh

26kWh

15A ప్లగ్ పాయింట్ (10 నుండి 100% వరకు)

10 గంటల 30 నిమిషాలు

6.9 గంటలు

8.7 గంటలు

9.4 గంటలు 

3.3kW AC (10 నుండి 100% వరకు)

NA

5.1 గంటలు

6.4 గంటలు

NA

7.2kW AC (10 నుండి 100% వరకు)

NA

2.6 గంటలు

3.6 గంటలు

NA

DC ఫాస్ట్ ఛార్జింగ్ (10 నుండి 80% వరకు)

57 నిమిషాలు

57 నిమిషాలు 

57 నిమిషాలు

59 నిమిషాలు (25kW)

  • నిస్సందేహంగా, అతి పెద్ద బ్యాటరీ పరిమాణం కారణంగా, 15A ప్లగ్ పాయింట్ ఉపయోగించి 10 నుండి 100 శాతం వరకు ఛార్జ్ చేయడానికి eC3 ఎక్కువ సమయం తీసుకుంటుంది. DC ఫాస్ట్ ఛార్జింగ్ విషయానికి వస్తే, ఈ EVల ఛార్జింగ్ సమయాల మధ్య పెద్ద తేడా ఏమి లేదు.

ముగింపు 

Tata Tiago EV rearటాటా టియాగో EV రేర్

ధరల పట్టిక ప్రకారం, మూడు EVల స్పెసిఫికేషన్‌లను పోల్చి చూస్తే, ఖర్చు చేస్తున్న డబ్బుకు అత్యంత ఎక్కువ విలువను టియాగో EV అందిస్తుంది, ఎందుకంటే ఇది మంచి ఫీచర్‌లను, 315కిమీ వరకు మైలేజ్‌ను అందిస్తుంది, ఇది eC3 కంటే కేవలం 5కిమీ తక్కువ.

మరింత బూట్ స్పేస్, శక్తిగల సెడాన్ؚను కోరుకునే వారు, ఈ EVలలో అత్యంత ఖరీదైన EV అయినప్పటికీ టిగోర్ EVని ఎంచుకోవచ్చు, మరోవైపు, eC3లో విశాలమైన క్యాబిన్ స్పేస్, ప్రీమియం ఇన్ఫోటైన్ؚమెంట్ సిస్టమ్, ఫ్రెంచ్ స్టైలింగ్ؚతో మరింత స్పష్టమైన రోడ్ ప్రెజన్స్ కలిగి ఉంటుందని పేర్కొంటున్నారు. 

ఇక్కడ మరింత చదవండి: సిట్రోయెన్ eC3 ఆటోమ్యాటిక్ 

was this article helpful ?

Write your Comment on Citroen ఈసి3

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
×
We need your సిటీ to customize your experience