• English
  • Login / Register

భారతదేశంలో నాలుగవ మోడల్ؚను ఏప్రిల్ 27న విడుదల చేయనున్న సిట్రోయెన్

సిట్రోయెన్ aircross కోసం tarun ద్వారా మార్చి 30, 2023 01:05 pm ప్రచురించబడింది

  • 29 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

అందిన రహస్య చిత్రాలను బట్టి, ఇది మూడు-వరుసల కాంపాక్ట్ SUV కావచ్చు.

Citroen SUV

  • రానున్న సిట్రోయెన్ SUV పేరు ‘C3 ఎయిర్ؚక్రాస్’గా ఉండవచ్చు. 

  • దీని స్టైలింగ్ C3 హ్యాచ్ؚబ్యాక్ నుంచి ప్రేరణ పొందిందని ఆశిస్తున్నాము కానీ కొన్ని ధృఢమైన విజువల్ ఎలిమెంట్స్ؚతో రావచ్చు. 

  • 10-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, ఆటోమ్యాటిక్ AC, రేర్ పార్కింగ్ కెమెరా మరియు ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలను కలిగి ఉంటుంది. 

  • మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚలతో C3లో ఉండే 110PS 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను ఇది పొందవచ్చు. 

  • దీని ధర సుమారుగా రూ.9 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. 

ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న సరికొత్త SUVని భారతదేశంలో ఏప్రిల్ 27 తేదీన ఆవిష్కరిస్తామని సిట్రోయెన్ ప్రకటించింది. ఇది భారతదేశంలో అనేకసార్లు రహస్యంగా టెస్ట్ చేసిన కప్పి ఉంచబడినట్లుగా కనిపించే మోడల్ అయ్యి ఉండవచ్చు. దీన్ని మూడు-వరుసల సీటింగ్ కాన్ఫిగరేషన్ؚతో అందిస్తారని అంచనా, దీని “C3 ఎయిర్ؚక్రాస్”గా నామకరణం చేయవచ్చు. 

Citroen SUV

రహస్య చిత్రాల ప్రకారం, కొత్త సిట్రోయెన్ SUV స్టైలింగ్ C3 హ్యాచ్ؚబ్యాక్ నుంచి ప్రేరణ పొందినట్లు కనిపిస్తుంది. బహుశా మరింత ధృఢంగా కనిపించే ఎలిమెంట్‌లతో, బంపర్‌లు, గ్రిల్ మరియు ఆలాయ్ వీల్స్ؚకు తేలికపాటి సవరణలు ఉంటాయని ఆశించవచ్చు. పొడిగించిన పరిమాణం కారణంగా వెనుక ప్రొఫైల్ కొంత మేరకు భిన్నంగా కనిపించవచ్చు మరియు బూట్ ఆకారం సరికొత్తగా ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: సిట్రోయెన్ eC3 Vs పోటీదారులు: ధర చర్చ

సిట్రోయెన్ SUV క్యాబిన్ విలక్షణమైన రంగులు మరియు విచిత్రమైన విజువల్ టచ్ లؚతో C3 వంటి స్టైలింగ్ؚనే కలిగి ఉంటుందని ఆశించవచ్చు. ఫీచర్‌ల విషయానికి వస్తే దీనిలో 10-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, డిజిటల్ స్పీడో మీటర్, మరియు C3లో లేని ఆటోమ్యాటిక్ AC, రేర్ పార్కింగ్ కెమెరా, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు ఉండవచ్చు.

Citroen SUV

నాచురల్లీ ఆస్పిరేటెడ్ మోటార్ؚ ఇందులో లేనప్పటికీ, C3లో ఉన్న 110PS 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ֶను ఈ SUV పొందింది. మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚలు రెండిటిలో దీన్ని అందిస్తున్నారు. ఎలక్ట్రిక్ C3 అందుబాటులో ఉంది కాబట్టి, ఈ సరికొత్త SUV ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అందబాటులోకి రావచ్చు. మీకు దీని మూడు-వరుసల వెర్షన్ కావాలా? క్రింది కామెంట్ సెక్షన్‌లో మాకు తెలియజేయండి. 

కొత్త సిట్రోయెన్ SUV ధర సుమారుగా రూ.9 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ఉండవచ్చని అంచనా వేస్తున్నాము. C3పై స్థానంలో ఉండే మోడల్ؚగా ఇది హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, వోక్స్వాగన్ టైగూన్ మరియు ఇతర ఇప్పటికే స్థిరపడిన కాంపాక్ట్ SUVలకు ప్రత్యామ్నాయం కాగలదు. 

was this article helpful ?

Write your Comment on Citroen aircross

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience