2023 సంవత్సరం ద్వితీయార్ధంలో విడుదల కానున్న 10 కార్‌ల వివరాలు
కియా సెల్తోస్ కోసం tarun ద్వారా జూన్ 27, 2023 03:24 pm ప్రచ ురించబడింది
- 106 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
వచ్చే ఆరు నెలలలో, ఆరు సరికొత్త కార్‌ల విడుదలను చూడవచ్చు
2023 సంవత్సరంలో మొదటి ఆరు నెలలు అనేక ముఖ్యమైన విడుదలలతో చాలా హడావుడిగా గడిచింది. మిగిలిన సంవత్సరం కూడా అనేక కొత్త కార్‌ల విడుదలతో అంతే ప్రత్యేకంగా మరియు ఉత్తేజకరంగా ఉండబోతోంది. ఒక కొత్త EV, ఒక నవీకరించిన మోడల్ మరియు ఐదు సరికొత్త మోడల్‌లను ఆశించవచ్చు. విడుదల కానున్న మోడల్‌లలో మా మొదటి 10 ఎంపికలు మరియు వాటి గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇక్కడ అందించబడ్డాయి:
కియా సెల్టోస్ ఫేస్ؚలిఫ్ట్
అంచనా ధర – రూ. 10 లక్షల నుంచి
విడుదల అయిన నాలుగు సంవత్సరాల తరువాత కియా సెల్టోస్ కాంపాక్ట్ SUV మొదటిసారిగా భారీ అప్‌డేట్‌ను అందుకుంటోంది. ఇన్ఫోటైన్ؚమెంట్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం 10.25-అంగుళాల స్క్రీన్ؚలు, పనోరమిక్ సన్ؚరూఫ్, రాడార్-ఆధారిత ADAS సాంకేతికత వంటి అనేక కొత్త ఫీచర్‌ల జోడింపుతో పాటు నవీకరించిన ఎక్స్ؚటీరియర్ మరియు ఇంటీరియర్ డిజైన్ ఇందులో ఉన్నాయి. 1.5-లీటర్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లతో కొనసాగుతుంది, అంతేకాకుండా కొత్త 160PS 1.5-లీటర్ టర్బో పెట్రోల్ యూనిట్‌లో కూడా అందించనున్నారు.
మారుతి ఇన్విక్టో
అంచనా ధర – రూ. 19 లక్షల నుండి
మారుతి ఇన్విక్టో ఈ బ్రాండ్ లైన్అప్ؚలో అత్యంత ఖరీదైన మోడల్, ఇది జూలై 6న విడుదల కానుంది. టయోటా ఇన్నోవా హైక్రాస్ؚ రీబ్యాడ్జ్ వెర్షన్‌గా ఇన్విక్టో MPV విడుదల కానుంది కానీ ప్రత్యకత కోసం లుక్ పరంగా తేలికపాటి మార్పులను పొందనుంది. పనోరమిక్ సన్ؚరూఫ్, 10-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, పవర్డ్ రెండవ-వరుస ఒట్టోమాన్ సీట్లు, డ్యూయల్-జోన్ AC, మరియు ADAS వంటి ఫీచర్‌లతో ఇది ప్రీమియం ఆఫరింగ్ؚగా వస్తుంది. ఇన్విక్టోకి శక్తిని అందించేది బలమైన హైబ్రిడ్ సాంకేతికతతో వచ్చే 2-లీటర్‌ల పెట్రోల్ ఇంజన్, హైక్రాస్ؚలో ఇది 23.2kmpl సామర్ధ్యాన్ని క్లెయిమ్ చేస్తుంది.
హ్యుందాయ్ ఎక్స్టర్
అంచనా ధర – రూ. 6 లక్షల నుండి
హ్యుందాయ్ ఎక్స్టర్ ఈ కారు తయారీదారు ఎంట్రీ-లెవెల్ SUVగా మరియు టాటా పంచ్ؚకు ప్రత్యర్ధిగా జూలై 10న విడుదల కానుంది. 1.2-లీటర్‌ల పెట్రోల్ ఇంజన్ؚను ఉపయోగించే ఈ మైక్రో SUV మాన్యువల్ మరియు AMT ట్రాన్స్ؚమిషన్‌ల ఎంపికతో వస్తుంది. దిని CNG వెర్షన్ కూడా మార్కెట్‌లో విక్రయానికి అందుబాటులోకి రానుంది. ఫీచర్‌ల విషయానికి వస్తే, ఇది ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, 8-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, మరియు రేర్ పార్కింగ్ కెమెరాలతో వస్తుంది.
హోండా ఎలివేట్
అంచనా ధర – రూ. 12 లక్షల నుండి
కాంపాక్ట్ SUV విభాగంలోకి ప్రవేశించే తొమ్మిదవ మోడల్‌గా హోండా ఎలివేట్ నిలుస్తుంది. దీన్ని కేవలం పెట్రోల్ వెర్షన్ లోనే అందిస్తున్నారు, ఇది సిటీలోని 121 PS 1.5-లీటర్ i-VTEC ఇంజన్ؚను ఉపయోగిస్తుంది. బలమైన-హైబ్రిడ్ ఇంజన్ ఉండకపోవచ్చు, కానీ దీని EV వెర్షన్ 2026లో విడుదల కానుంది. అందుబాటులో ఉండే ఫీచర్‌లలో ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు మరియు ADAS ఉంటాయి.
సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్
అంచనా ధర – రూ. 9 లక్షల నుండి
హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా మరియు హోండా ఎలివేట్ వంటి వాటికి మరొక పోటీదారుగా సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ రాబోతోంది. భారతదేశానికి అనుగుణమైన C3 ఎయిర్ؚక్రాస్ ఒక మూడు-వరుసల SUV, పైన పేర్కొన్న కాంపాక్ట్ SUVలకు పోటీగా దిని ధర ఉంటుంది అని అంచనా. 110PS 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో వస్తుంది మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ కూడా ఉంటుంది అని అంచనా. సౌకర్యం మరియు అనుకూలత కోసం 10-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ؚలు, హిల్ హోల్డ్ అసిస్ట్, మరియు TPMS ఉంటాయి.
హ్యుందాయ్ i20 ఫేస్ؚలిఫ్ట్
అంచనా ధర – రూ. 7.60 లక్షల నుండి
ఈ ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ రాబోయే నెలలలో ఫేస్ؚలిఫ్ట్ؚను పొందునుంది, ఇప్పటికే ఇది భారతదేశంలో టెస్ట్ చేయబడింది. ఫేస్ؚలిఫ్ట్ హ్యుందాయ్ i20 సరికొత్త ఎక్స్ؚటీరియర్ డిజైన్ؚతో వస్తుంది, ఇంటీరియర్ థీమ్ؚలో కూడా తేలికపాటి మార్పులు ఉండవచ్చు. డ్యూయల్ కెమెరా డ్యాష్-కామ్ మినహా ఫీచర్‌ల జాబితాకు మరీ ఎక్కువ జోడింపులు ఉండకపోవచ్చు. మునపటి పవర్‌ట్రెయిన్ؚలు కొనసాగించవచ్చని అంచనా, వీటిలో 1.2-లీటర్ మరియు 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚలు ఉంటాయి, ఇవి మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ రెండూ ఎంపికలతో వస్తాయి.
5-డోర్‌ల ఫోర్స్ గూర్ఖా
అంచనా ధర – రూ. 16 లక్షలు
ఐదు-డోర్‌ల ఫోర్స్ గూర్ఖా వెర్షన్ వచ్చే ఆరు నెలలలో విడుదల అవ్వడానికి మరింత అవకాశం ఉంది. ఇది పూర్తిగా మూడు-డోర్‌ల వెర్షన్ విధంగానే కనిపిస్తుంది కానీ రేర్ ప్రొఫైల్ కొద్దిగా పొడిగించబడి ఉంటుంది. దీనిని బహుళ సీటింగ్ కాన్ఫిగరేషన్‌లలో అందిస్తారని ఆశిస్తున్నాము. మరింత ఆచరణాత్మకమైన ఈ గూర్ఖాకు 5-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో వచ్చే 90PS 2.6-లీటర్ డీజిల్ ఇంజన్ శక్తిని అందిస్తుంది.
BYD సీల్
అంచనా ధర – రూ. 60 లక్షలు
భారతదేశంలో BYD విడుదల చేస్తున్న మూడవ ఎలక్ట్రిక్ కార్, సీల్, ఇది సెప్టెంబర్-అక్టోబర్ 2023 మధ్య విడుదల కావచ్చు. ఈ ప్రీమియం సెడాన్ 82.5kWH గల భారీ బ్యాటరీ ప్యాక్ؚతో రావచ్చు ఇది 700 కిలోమీటర్‌ల పరిధిని క్లెయిమ్ చేస్తుంది. రొటేటింగ్ 15.6-అంగుళాల టచ్ؚస్క్రీన్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, పనోరమిక్ సన్ؚరూఫ్, మరియు రాడార్-ఆధారిత ADAS (అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) వంటి ఫీచర్‌లు కూడా ఉంటాయని అంచనా.
టాటా పంచ్ EV
అంచనా ధర – రూ. 12 లక్షల నుండి
పంచ్ CNG వెర్షన్ మాత్రమే కాకుండా ఈ సంవత్సరంలో EV వెర్షన్‌లో కూడా రావచ్చు. టియాగో మరియు నెక్సాన్ EVల విధంగానే ఇది కూడా బహుళ బ్యాటరీ ప్యాక్ؚతో అందించబడవచ్చు, దీని క్లెయిమ్ చేసే పరిధి 350 కిలోమీటర్‌ల వరకు ఉండవచ్చు. ఈ మైక్రో SUV ఎలక్ట్రిక్ వెర్షన్ؚను ఇప్పటికే టెస్ట్ చేస్తున్నట్లు కొన్నిసార్లు కనిపించింది, ఇందులో లుక్ పరంగా భారీ మార్పులు ఉండకపోవచ్చు. ఫీచర్‌ల జాబితా కూడా ICE వెర్షన్ؚకు సారూప్యంగా ఉంటుంది. ఇది టాటా EV లైన్ؚఅప్ؚలోని టియాగో EV మరియు టిగోర్ EVల కంటే పై స్థానంలో నిలుస్తుంది.
నిస్సాన్ X-ట్రెయిల్
అంచనా ధర – రూ. 40 లక్షలు
నిస్సాన్ X-ట్రెయిల్ విడుదల ఈ సంవత్సరం చివరిలో ఆశించవచ్చు; ఎందుకంటే ఈ కారు తయారీదారు ప్రస్తుతం పూర్తి-సైజ్ SUVని టెస్ట్ చేస్తోంది. ఇది టయోటా ఫార్చ్యూనర్ మరియు MG గ్లోస్టర్ వంటి వాటితో పోటీ పడుతుంది. X-ట్రెయిల్ؚకి శక్తిని అందించేది 1.5-లీటర్ మైల్డ్-హైబ్రిడ్ టర్బో-పెట్రోల్ ఇంజన్ లేదా AWD ఎంపికతో బలమైన –హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ కావచ్చు. ఇది ఇంపోర్ట్ రూట్ؚలో విక్రయించబడే, అనేక ఫీచర్‌లు కలిగిన ప్రీమియం మోడల్.
(అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు)
0 out of 0 found this helpful