భారతదేశంలో 9-లక్షల విక్రయ మైలురాయిని అధిగమించిన రెనాల్ట్
రెనాల్ట్ క్విడ్ కోసం shreyash ద్వారా జూన్ 01, 2023 07:41 pm ప్రచురించబడింది
- 234 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఫ్రెంచ్ కంపెనీ 2005లో భారత కార్ మార్కెట్ విభాగంలోకి ప్రవేశించింది, అయితే 2011లో మాత్రమే తన ఉనికిని తెలిపింది
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న యూరోపియన్ కార్ బ్రాండ్‌లలో ఒకటైన రెనాల్ట్, భారతదేశంలో 9 లక్షల యూనిట్ విక్రయాల మైలురాయిని సాధించింది. ఎన్నో ఎత్తు పల్లాలతో రెనాల్ట్ బ్రాండ్ సుదీర్ఘ ప్రయాణాన్ని చూసింది.
ఫ్రెంచ్ తయారీదారుడైన రెనాల్ట్, మహీంద్రా భాగస్వామ్యంతో 2005 నుండి భారతీయ ఉనికిని ప్రారంభించింది మరియు వారి మొదటి సహ-అభివృద్ధి మోడల్ లోగాన్ సెడాన్. 2011 మధ్య నుండి రెనాల్ట్ తన సొంత బ్రాండ్ పేరుతో కొత్త ఉత్పత్తులను ప్రారంభించాలని యోచిస్తున్నందున ఆ సహకారం 2010లో ముగిసింది. నిస్సాన్ తో కలిసి తమిళనాడులోని చెన్నైలో దాని తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి రెనాల్ట్ భారీ పెట్టుబడులను పెట్టింది. చివరగా 2011లో, కంపెనీ తన సొంత బ్రాండ్ అయిన ఫ్లూయెన్స్ మరియు కోలియోస్ క్రింద భారతదేశంలో తన మొదటి కార్లను విడుదల చేసింది.
అయినప్పటికీ, ఇవి ప్రీమియం మరియు ఖరీదైన ఎంపికలు కాబట్టి కొద్దీ మొత్తంలో మాత్రమే వాహనాలు విడుదల చేసింది. ఫ్రెంచ్ కంపెనీ విక్రయాలు 2012లో దాని మొదటి కాంపాక్ట్ SUV, డస్టర్‌ను విడుదల చేయడంతో దాని అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి. ఇది గ్లోబల్ మోడల్‌గా ఉన్నప్పటికీ, ఇది కఠినమైన పవర్‌ట్రెయిన్‌ల సెట్‌తో సరసమైనదిగా అందించబడింది. భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ SUV విభాగాన్ని స్థాపించింది. కానీ, 2022 వరకు మార్కెట్లో కొనసాగిన అసలైన మోడల్‌లలో ఇది ఒకటి.
రెనాల్ట్ యొక్క ప్రస్తుత ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోలో మూడు వాహనాలు ఉన్నాయి. అవి వరుసగా, ఒక సబ్‌కాంపాక్ట్ SUV, ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ మరియు ఎంట్రీ లెవల్ MPV – కైగర్, క్విడ్ మరియు ట్రైబర్ ఉన్నాయి. 2015లో విడుదలైన క్విడ్ భారతదేశంలో రెనాల్ట్ విక్రయాల నెట్‌వర్క్‌ను విస్తరించడంలో ప్రధాన పాత్ర పోషించింది. ట్రైబర్ 2019లో 7-సీటర్ MPVగా మార్కెట్‌లోకి ప్రవేశించింది మరియు ఆ సమయంలో, ఇది భారతదేశంలో అత్యంత సరసమైన 3-వరుస వాహనాల్లో ఒకటి.
ఇది కూడా చూడండి: మొదటిసారిగా అందించిన చిత్రాలలో భారీ పరిమాణాన్ని సూచిస్తున్న సరికొత్త రెనాల్ట్ డస్టర్
2021లో, రెనాల్ట్ తన సబ్‌కాంపాక్ట్ ఎంపిక అయిన కైగర్‌ను భారతదేశంలో ప్రారంభించింది. ఇది పాత GNCAP క్రాష్ టెస్ట్‌ల ప్రకారం కొన్ని ప్రీమియం సౌకర్యాలు మరియు 4-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను అందిస్తూనే సబ్-4m SUV విభాగంలో అత్యంత సరసమైన ఆఫర్‌లలో ఒకటిగా నిలచింది.
రెనాల్ట్ ఇండియా దేశంలో స్వతంత్ర కార్యకలాపాలను ప్రారంభించినప్పటి నుండి ఈ అమ్మకాల మైలురాయిని సాధించడానికి ఈ ఇండియా-సెంట్రిక్ కాంపాక్ట్ మరియు సబ్ కాంపాక్ట్ మోడల్స్ ప్రధాన కారణం అని చెప్పవచ్చు.
ఇది కూడా చదవండి: టాటా టియాగో EVకి పోటీగా భారతదేశం కోసం ఎంట్రీ-లెవల్ EVలపై రెనాల్ట్ మరియు నిస్సాన్ ప్లాన్ చేస్తున్నాయి.
ఈ ఘనతపై రెనాల్ట్ ఇండియా ఆపరేషన్స్ కంట్రీ సీఈఓ & మేనేజింగ్ డైరెక్టర్ వెంకట్‌రామ్ మామిళ్లపల్లె మాట్లాడుతూ, “భారత్‌లో 9 లక్షల విక్రయాల మైలురాయిని దాటినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము. మా గౌరవనీయమైన కస్టమర్‌లు, అంకితమైన డీలర్ భాగస్వాములు, విలువైన సరఫరాదారులు మరియు మా అసాధారణమైన ఉద్యోగుల బృందం అలాగే ఇంజనీరింగ్ నిపుణుల నుండి బ్రాండ్‌పై తిరుగులేని మద్దతు మరియు నమ్మకంతో ఈ అద్భుతమైన ప్రయాణం సాధ్యమైంది. ఈ అద్భుతమైన విజయానికి సహకరించిన వారందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. గత కొన్ని సంవత్సరాలుగా, మేము భారతదేశంలో బలమైన పునాదిని స్థాపించాము. భారత ప్రభుత్వం యొక్క 'మేక్ ఇన్ ఇండియా' దృష్టికి కంపెనీ యొక్క నిబద్ధత తిరుగులేనిది మరియు రెనాల్ట్ తన రాబోయే ఉత్పత్తుల కోసం 90 శాతం స్థానికీకరణను సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఫిబ్రవరి 2023లో, రెనాల్ట్ తన భాగస్వామి అయిన నిస్సాన్‌తో భారతదేశంలో తన భవిష్యత్తు రోడ్‌మ్యాప్‌ను రూపొందించింది. రెండు కార్ల తయారీదారులు కలిసి దేశంలో నాలుగు SUVలు మరియు రెండు EVలతో సహా ఆరు కొత్త మోడళ్లను విడుదల చేయడానికి ప్రణాళికలు కలిగి ఉన్నారు. ప్రస్తుతం, రెనాల్ట్ భారతదేశంలో 450 సేల్స్ పాయింట్లు మరియు 530 సర్వీస్ పాయింట్లను కలిగి ఉంది.
మరింత చదవండి: రెనాల్ట్ క్విడ్ ఏఎంటి