• English
  • Login / Register

భారతదేశానికి మరో ఆరు సరికొత్త వాహనాలను (4 SUVలు, 2 EVలు) పరిచయం చేయనున్న నిస్సాన్ & రెనాల్ట్

ఫిబ్రవరి 14, 2023 04:27 pm sonny ద్వారా ప్రచురించబడింది

  • 51 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ ఆటోమోటివ్ దిగ్గజాల భాగస్వామ్యంలోని తాజా పెట్టుబడులతో రానున్న ఆరు కొత్త వాహనాలలో మొదటిది 2025లో రానుంది.

  • నిస్సాన్, రెనాల్ట్ؚలు వేరువేరుగా రెండు కొత్త కాంపాక్ట్ SUVలను, ఎంట్రీ-లెవెల్ EVని పరిచయం చేస్తున్నాయి. 

  • వీటిలో ఒకటి ఖచ్చితంగా కొత్త డస్టర్ అవ్వగా, మరొక వాహనం డస్టర్ మోడల్ؚؚను తలపించే నిస్సాన్ వర్షన్. 

  • ఈ కార్‌ల తయారీదారుల నుండి రానున్న మోడల్‌లు పూర్తిగా విభిన్నంగా, ప్రత్యేకమైన గుర్తింపును కలిగి ఉండవచ్చు. 

  • ఈ EVలు - సిట్రియోన్ eC3, టాటా టియాగో EV వంటి వాటితో పోటీ పడతాయి. 

  • కొత్త మోడల్‌లు వచ్చే వరకు నిస్సాన్ CBUలను, రెనాల్ట్ ట్రైబర్ؚ పోలిన నిస్సాన్ వర్షన్ؚను  విడుదల చేస్తుంది. 

Nissan logo

2025 నుండి భారతదేశంలో ప్రవేశపెట్టనున్న తమ భవిష్య మోడల్‌ల ప్రణాళికలను నిస్సాన్ ప్రకటించింది. ఈ జపనీస్, దాని అనుబంధ ఫ్రెంచ్ భాగస్వామి రెనాల్ట్ బ్రాండ్ నుండి వేరువేరుగా మూడు చొప్పున ఆరు కొత్త మోడల్‌లను మార్కెట్ؚలోకి ప్రవేశపెట్టాలని భావిస్తున్నాయి. వీటిలో నాలుగు కాంపాక్ట్ SUVలు, రెండు ఎంట్రీ-లెవెల్ EVలు ఉన్నాయి. భారతదేశంలో, రెనాల్ట్-నిస్సాన్ ఉనికికి కొత్త ఉత్తేజాన్ని ఇవ్వడానికి రూ.5,300 కోట్ల రూపాయల తాజా పెట్టుబడులతో ఈ కొత్త మోడల్‌లు విడుదల అవ్వనున్నాయి. 

ఎలాంటి SUVలు రానున్నాయి? 

భారతదేశ మార్కెట్ؚలో ప్రవేశపెట్టనున్న వాహనాల జాబితాలో ఉన్న కొత్త మోడల్‌ల ప్రత్యేకతలను నిస్సాన్ వెల్లడించలేదు, కానీ ఈ SUVలు C-సెగ్మెంట్ లేదా కాంపాక్ట్ SUV సెగ్మెంట్ؚకు చెందినవిగా ప్రకటించింది. వీటిలో ఒకటి బహుశా ప్రజాదరణ పొందిన రెనాల్ట్ డస్టర్, నిస్సాన్ నుంచి వచ్చిన దాని తోటి వాహనం టెరానో తరువాతి వర్షన్ కావచ్చు. మిగిలిన రెండు SUVలు మూడు-వరుసలు కలిగిన టాప్ వేరియంట్‌లు కావొచ్చు. 

ఇది కూడా చదవండి: కొత్త SUVలతో పాటుగా తిరిగి డస్టర్ؚను కూడా భారతదేశానికి పరిచయం చేయనున్న రెనాల్ట్-నిస్సాన్

Dacia Bigster Concept

ఈ SUVలు- హైబ్రిడ్ؚలు మరియు బ్యాటరీ EVల వంటి ఎలక్ట్రిఫైడ్ పవర్ ట్రెయిన్ؚల అనుకూలతను కలిగి ఉండే కొత్త జనరేషన్ ప్లాట్ؚఫారమ్ మద్దతును కలిగి ఉంటాయి. అయితే, భారతదేశంలో ఈ ఎలక్ట్రిఫైడ్ పవర్ ట్రెయిన్ؚ  SUVలను నిస్సాన్ లేదా రెనాల్ట్ రెండిటీలో ఎవరు ప్రవేశపెడతారో ప్రస్తుతానికి స్పష్టంగా తెలియదు. 

ఎలక్ట్రిక్ SUVలు ఉండవా?

భారతదేశంలో, EVలను ప్రవేశపెట్టే విషయంలో నిస్సాన్, రెనాల్ట్ؚలు ఎంట్రీ-లెవెల్ మార్గాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఈ EVలు, రెండు బ్రాండ్‌లు ఉపయోగించే అతి చిన్న ప్లాట్ ఫారంలో ఒకటైన CMF-Aపై ఆధారపడుతున్నాయి, ఇవి మాగ్నైట్ మరియు కైగర్ సబ్-కాంపాక్ట్ SUVల కంటే చిన్నది, బహుశా రెనాల్ట్ క్విడ్ కంటే పెద్దవి కావచ్చు. 

Dacia Spring 2022

సంబంధించినది: టాటా టియాగో EVతో పోటీకి, భారతదేశంలో ఎంట్రీ-లెవెల్ EVలను ప్రవేశపెట్టాలని భావిస్తున్న రెనాల్ట్-నిస్సాన్ 

ఈ ఎంట్రీ-లెవెల్ EVలు, రూ.10 లక్షల కంటే తక్కువ ప్రారంభ ధరతో వస్తాయని, 50kW ఫాస్ట్ ఛార్జింగ్ؚ మద్దతుతో కనీసం 300 కిమీ పరిధి కలిగి ఉంటాయని ఆశిస్తున్నాము. ఇవి SUV-వలె క్రాస్ఓవర్ స్టైలింగ్ؚను కలిగి ఉంటు సిట్రియోన్ eC3, టాటా టియాగో EVతో పోటీ పడే చవకైన వాహనం కానుంది.

ఈ కొత్త కార్ లు ఎప్పుడు మార్కెట్ లోకి ప్రవేశిస్తాయి?

ఈ ఆరు కార్‌లలో మొదటిది 2025లో మార్కెట్ؚలోకి వస్తుందని నిస్సాన్ ప్రకటించింది. మాగ్నైట్, కైగర్ؚల విషయంలో మనం చూసినట్లు నిస్సాన్ SUV, కొత్త డస్టర్ కంటే ముందే మార్కెట్‌లోకి ప్రవేశిస్తుందని ఆశించవచ్చు. 

అప్పటివరకు, ప్రస్తుత రెనాల్ట్-నిస్సాన్ లైన్అప్ వాహనాలకు లుక్స్, సాంకేతికత-ఆధారిత ఫీచర్ అప్ؚగ్రేడ్‌లు వంటి నవీకరణలు ఉండవచ్చు అని భావిస్తున్నాము. అంతేకాకుండా, రెనాల్ట్ ట్రైబర్ ను ఆధారం చేసుకొని నిస్సాన్ తన సొంత సబ్ కాంపాక్ట్ మూడు వరుసల క్రాస్ ఓవర్ؚను, X-ట్రెయిల్ వంటి CBU మోడల్‌లను పరిచయం చేయడానికి ప్రణాళికలు వేస్తుంది. 

was this article helpful ?

Write your వ్యాఖ్య

ట్రెండింగ్‌లో ఉంది కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
  • కియా syros
    కియా syros
    Rs.9.70 - 16.50 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • M జి Majestor
    M జి Majestor
    Rs.46 లక్షలుఅంచనా ధర
    ఫిబరవరి, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా be 6
    మహీంద్రా be 6
    Rs.18.90 - 26.90 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • కొత్త వేరియంట్
    మహీంద్రా xev 9e
    మహీంద్రా xev 9e
    Rs.21.90 - 30.50 లక్షలుఅంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
  • ఆడి క్యూ6 ఇ-ట్రోన్
    ఆడి క్యూ6 ఇ-ట్రోన్
    Rs.1 సి ఆర్అంచనా ధర
    మార, 2025: అంచనా ప్రారంభం
×
We need your సిటీ to customize your experience