• English
  • Login / Register

రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ ఇంటీరియర్ మా కంటపడింది; పెద్ద టచ్‌స్క్రీన్, కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది

రెనాల్ట్ క్విడ్ కోసం sonny ద్వారా సెప్టెంబర్ 21, 2019 01:04 pm ప్రచురించబడింది

  • 55 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొత్త క్విడ్ దాని EV కజిన్ నుండి చాలా వరకూ ఇంటీరియర్స్ ని తీసుకుంది

  •  రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ చైనాలోని సిటీ K-ZE మాదిరిగానే బాహ్య స్టైలింగ్‌ ను కలిగి ఉంటుంది.
  •  రహస్యంగా కనిపించిన షాట్లలో క్విడ్ EV లో ఉన్నవిధంగానే డాష్‌బోర్డ్‌ కలిగి ఉంది, అదే విధంగా వీటిలో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ ప్రదర్శన ఉంది.
  •  ఇది ట్రైబర్‌ లో అందించే మాదిరిగానే ఇది కొత్త సెమీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ను కూడా కలిగి ఉంది.
  •  ఎసి వెంట్స్‌ పై ఆరెంజ్ యాక్సెంట్స్ కనిపించాయి, కొత్త క్విడ్‌లో కూడా రంగురంగుల థీమ్‌లను అందించవచ్చని సూచిస్తున్నాయి.
  •  అదే 0.8-లీటర్ మరియు 1.0-లీటర్ పెట్రోల్ పవర్ట్రైన్లు అందుబాటులో ఉండవచ్చని ఊహిస్తున్నాము,ప్రారంభించే సమయంలో ఈ రెండూ BS6 కంప్లంట్ కి అనుగుణంగా ఉండవచ్చని భావిస్తున్నాము.
  •  ప్రస్తుత మోడల్ రూ .2.76 లక్షలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రారంభ ధరతో రాబోయే వారాల్లో ఇది భారతదేశంలో ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

Renault Kwid Facelift Interior Spied; Gets Larger Touchscreen, New Instrument Cluster

రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్ త్వరలో భారతదేశంలో విడుదల కానుంది, బహుశా ఈ నెలాఖరులోగా. మునుపటి టెస్ట్ మ్యూల్ వీక్షణల ప్రకారం, ఇటీవల చైనాలో సిటీ K-ZE గా లాంచ్ చేసిన క్విడ్ EV తో బాహ్య స్టైలింగ్ వివరాలను పంచుకునే అవకాశం ఉంది. ఇప్పుడు, సరికొత్త రహస్య షాట్లు కొత్త క్విడ్ యొక్క అంతర్భాగాలు గురించి మనకి మరిన్ని వివరాలు తెలుపుతున్నాయి.

Renault Kwid Facelift Interior Spied; Gets Larger Touchscreen, New Instrument Cluster

2019 క్విడ్ ఫేస్‌లిఫ్ట్ పెద్ద (బహుశా 8-అంగుళాల డిస్ప్లే) టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ తో సహా సిటీ K-ZE నుండి కొత్త డాష్‌బోర్డ్ అంశాలను తీసుకుంటుంది. ఇది రెనాల్ట్ ట్రైబర్‌లో మాదిరిగానే కనిపించే కొత్త ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ను కూడా పొందుతున్నట్లు తెలుస్తోంది. రహస్యంగా కనిపించిన ఈ మోడల్  ప్రస్తుతం అమ్మకానికి ఉన్న క్విడ్ క్లైంబర్ మాదిరిగానే డ్రైవర్-సైడ్ ఎయిర్ వెంట్‌ లో ఆరెంజ్ యాక్సెంట్ ని కలిగి ఉంటుంది.

Renault Kwid Facelift Interior Spied; Gets Larger Touchscreen, New Instrument Cluster

ప్రస్తుత మోడల్ మాదిరిగానే పవర్‌ట్రెయిన్ ఎంపికలతో క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ ను రెనాల్ట్ అందిస్తూనే ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో 0.8-లీటర్ మరియు 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్లు ఉన్నాయి, రెండూ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో ప్రామాణికంగా జతచేయబడతాయి. పెద్ద ఇంజిన్ 5-స్పీడ్ AMT ఎంపికను కూడా పొందుతుంది. క్విడ్ ఫేస్‌లిఫ్ట్ భారతదేశంలో లాంచ్ అయినప్పుడు ఈ ఇంజన్లు బిఎస్ 6 ఉద్గార నిబంధనలకు అనుగుణంగా అప్‌గ్రేడ్ అవుతాయని భావిస్తున్నారు.

భద్రతా లక్షణాల విషయానికొస్తే, కొత్త క్విడ్‌ లో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు, ఎబిఎస్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్‌ లు ప్రామాణికంగా ఉంటాయి. ట్రైబర్ మరియు బ్రెజిల్-స్పెక్ క్విడ్ నాలుగు ఎయిర్‌బ్యాగ్‌ల వరకు అందిస్తున్నాయి, అయితే రెనాల్ట్ ఇండియా-స్పెక్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌తో అదే విధంగా చేసే అవకాశం లేదు.

Renault Kwid Facelift Interior Spied; Gets Larger Touchscreen, New Instrument Cluster

2019 రెనాల్ట్ క్విడ్ ఇతర ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లతో పోటీ పడటం కొనసాగుతుంది. ఈ నెలాఖరులోగా ప్రారంభించబోయే మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో నుండి కొత్త పోటీని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది. బిఎస్ 6 కంప్లైంట్ పెట్రోల్ ఇంజన్లతో లాంచ్ చేస్తే, కొత్త క్విడ్ ప్రస్తుత సంఖ్య రూ .2.76 లక్షలు (ఎక్స్-షోరూమ్ ,ఢిల్లీ) కంటే కొంచెం ఎక్కువ ప్రారంభ ధరను కలిగి ఉండవచ్చు.

Image : - Source

ఫొటో తీయండి బహుమతి గెలుచుకోండి: మె దాగర రహస్యంగా తీసిన చిత్రాలు కానీ వీడియోస్ గానీ ఉన్నాయా? కొన్ని మంచి గూడీస్ లేదా వోచర్‌లను గెలుచుకునే అవకాశం కోసం వెంటనే వాటిని editorial@girnarsoft.com కు పంపండి.

దీనిపై మరింత చదవండి: క్విడ్ AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Renault క్విడ్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience