Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

కొత్త రంగు ఎంపికను సూచించిన సరికొత్త 2023 కియా సెల్టోస్ టీజర్

కియా సెల్తోస్ కోసం shreyash ద్వారా జూలై 04, 2023 12:41 pm ప్రచురించబడింది

నవీకరించిన కియా సెల్టోస్ ఎక్స్ؚటీరియర్ డిజైన్‌లో మార్పులు, అప్ؚడేట్ చేయబడిన క్యాబిన్ؚతో వస్తుంది

  • 2023 కియా సెల్టోస్ రేపు భారతదేశంలో విడుదల కానుంది.

  • ఎక్స్ؚటీరియర్ మరియు ఇంటీరియర్ؚల డిజైన్ అప్ؚడేట్‌లను టీజర్‌లు వెల్లడించాయి.

  • ఇందులో హ్యుందాయ్ నుండి తీసుకున్న 1.5-లీటర్ T-TGDi (టర్బో) పెట్రోల్ ఇంజన్ ఉంటుందని అంచనా.

  • అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) భద్రతను మెరుగుపరుస్తాయి.

  • దీని ధర రూ. 10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చని అంచనా.

2023 కియా సెల్టోస్ రేపు భారతదేశంలో విడుదల కానుంది, ఈ కారు తయారీదారు మరొక టీజర్ؚను విడుదల చేశారు, టీజర్ؚలో సరికొత్త “ప్లూటాన్ బ్లూ” రంగు ఎంపికను చూడవచ్చు. నవీకరించిన కాంపాక్ట్ SUV అంతర్జాతీయ స్పెక్ మోడల్‌లలో ఈ రంగు ఇప్పటికే పరిచయం చేయబడింది.

ఇంకా ఏమి కనిపిస్తున్నాయి?

సరికొత్త రంగు మాత్రమే కాకుండా, టీజర్ؚలో రీడిజైన్ చేసిన LED DRLలు మరియు LED టెయిల్‌ల్యాంప్ؚలు కూడా కనిపించాయి. ఇతర మార్పుల గురించి చెప్పాలంటే, అప్‌డేట్ చేసిన సెల్టోస్ؚలో నవీకరించిన గ్రిల్ మరియు బంపర్ డిజైన్ మరియు గ్లోబల్ మోడల్ నుండి ప్రేరణ పొందిన కొత్త అలాయ్ వీల్స్ సెట్ కూడా ఉన్నాయి.

రీఫ్రెషెడ్ క్యాబిన్

లోపల భాగంలో, 2023 సెల్టోస్ సరికొత్త డ్యాష్‌బోర్డు డిజైన్‌తో రానుంది, ఇది నిలిపివేస్తున్న మోడల్‌తో పోలిస్తే మరింత ప్రీమియంగా కనిపిస్తుంది. ఫీచర్‌ల విషయానికి వస్తే, ఇన్ఫోటైన్మెంట్ మరియు ఇన్స్ట్రుమెంటేషన్ రెండిటి కోసం 10.25-అంగుళాల ఇంటిగ్రేటెడ్ స్క్రీన్ؚలను, పనోరమిక్ సన్ؚరూఫ్, డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్ؚను సెల్టోస్ అందిస్తుంది. అదనంగా, కొత్త సెల్టోస్‌లో వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, వెంటిలేటెడ్ ముందరి సీట్‌లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ మరియు క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉంటాయి.

ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, 360-డిగ్రీల కెమెరా మరియు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ؚతో (ESC) పాటు అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) భద్రతను మెరుగుపరుస్తాయి.

ఇది కూడా చదవండి: మొదటిసారిగా భారతదేశంలో రహస్యంగా పరీక్షిస్తు కనిపించిన నవీకరించిన హ్యుందాయ్ క్రెటా

కొత్త పవర్ؚట్రెయిన్‌తో రావచ్చు

ప్రస్తుతం ఉన్న 1.5-లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ (115PS/144Nm) మరియు 1.5-లీటర్ డీజిల్ (116PS/250Nm) ఇంజన్ ఎంపికలను నిలుపుకుంటుంది. అప్ؚడేట్ చేయబడిన సెల్టోస్ కియా క్యారెన్స్ నుండి కొత్త 1.5-లీటర్ T-Gdi (టర్బో) పెట్రోల్ ఇంజన్ؚను (160PS/253Nm) కూడా పొందనుంది.

విడుదల పోటీదారులు

2023 సెల్టోస్ ధరలను కారు తయారీదారు త్వరలోనే ప్రకటించనున్నాను మరియు ఆవిష్కరణ తరువాత బుకింగ్ؚలు ప్రారంభం కావచ్చు. దీని ధర రూ.10 లక్షల నుండి (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. నవీకరించిన సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, హ్యుందాయ్ క్రెటా, స్కోడా కుషాక్, MG ఆస్టర్, టయోటా హైరైడర్, వోక్స్వాగన్ టైగూన్, మరియు రాబోయే సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ మరియు హోండా ఎలివేట్ؚతో పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి : సెల్టోస్ డీజిల్

Share via

Write your Comment on Kia సెల్తోస్

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.18.90 - 26.90 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.9 - 17.80 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.44.90 - 55.90 లక్షలు*
Rs.75.80 - 77.80 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర