• English
  • Login / Register

మొదటిసారిగా భారతదేశంలో రహస్యంగా పరీక్షిస్తూ కనిపించిన ఫేస్ లిఫ్టెడ్ హ్యుందాయ్ క్రెటా

హ్యుందాయ్ క్రెటా కోసం rohit ద్వారా జూలై 04, 2023 12:37 pm ప్రచురించబడింది

  • 34 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

నవీకరించిన హ్యుందాయ్ క్రెటా 2024 ప్రారంభంలో కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని అంచనా

2024 Hyundai Creta spied

  • రహస్య వీడియోలో క్రోమ్ స్టడ్స్ؚతో రీడిజైన్ చేసిన గ్రిల్ మరియు కొత్త 18-అంగుళాల అలాయ్ వీల్స్ కనిపించాయి.

  • ఈ SUV కొత్త LED లైటింగ్ మరియు ట్వీకెడ్ బంపర్ؚలతో వస్తుంది.

  • లోపల, కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు హీటెడ్ సీట్‌లు ఉండవచ్చు.

  • అదనపు కొత్త ఫీచర్‌లలో 360-డిగ్రీ కెమెరా మరియు ADAS ఉండవచ్చు.

  • కొత్త కియా సెల్టోస్ؚలో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్, టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ؚలను పొందనుంది.

  • ధరలు రూ.10.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు.

2021 చివరిలో, నవీకరించిన హ్యుందాయ్ క్రెటా ఇండోనేషియా మార్కెట్ؚలోకి ప్రవేశించింది. భారతదేశానికి కూడా వస్తుందని ఆశించినప్పటికీ, మార్కెట్-ప్రత్యేక మార్పులతో మరొక మోడల్ؚను విడుదల చేయనున్నట్లు తరువాత నిర్ధారించారు. ప్రస్తుతం, నవీకరించిన హ్యుందాయ్ క్రెటా మొదటిసారిగా భారతదేశంలో రహస్యంగా టెస్ట్ చేస్తుండగా కనిపించింది. 

ఏం కనిపించింది?

2024 Hyundai Creta spied

టెస్ట్ వాహనం భారీగా నల్లని ముసుగుతో కప్పబడి ఉంది, నవీకరించిన క్రెటా క్రోమ్ స్టడ్డింగ్ కలిగిన రీడిజైన్ చేసిన గ్రిల్ؚను కలిగి ఉంటుందని రహస్య వీడియో నిర్ధారించిది. హ్యుందాయ్ ఈ SUVలో సరికొత్త జత LED హెడ్ؚలైట్ؚలు, రీడిజైన్ చేసిన LED DRLలు మరియు ముందు బంపర్ؚను అందించవచ్చు.

2024 Hyundai Creta alloy wheel spied

ప్రొఫైల్ؚలో, వెనుక డిస్క్ బ్రేక్ؚలతో (ఆల్కాజార్ నుండి తీసుకొని ఉండవచ్చు) 18-అంగుళాల అలాయ్ వీల్స్, 360-డిగ్రీ సెట్అప్ ఏర్పాటును సూచిస్తున్న ORVMకు అమర్చిన సైడ్ కెమెరా మినహా, 2024 క్రెటా డిజైన్ؚలో గమనించదగిన మార్పులు ఏమి లేవు, వెనుక భాగంలో డిజైన్ పరంగా మార్పులు చాలా తక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది కానీ ఇందులో కనెక్టెడ్ LED టెయిల్ లైట్‌లు మరియు ట్వీకెడ్ బంపర్ ఉండవచ్చు. 

ఇది కూడా చదవండి: మరికొన్ని రోజులలో విడుదల కానున్న ఎక్స్టర్ SUV, ప్రొడక్షన్‌ను ప్రారంభించిన హ్యుందాయ్

ఆశించిన ఇంటీరియర్ అప్ؚడేట్ؚలు 

నవీకరించిన ఈ SUV ఇంటీరియర్ వివరాలు రహస్య వీడియోలో కనిపించకపోయినా, హ్యుందాయ్ ఈ కొత్త క్రెటాను సవరించిన సీట్ అప్ؚహోల్ؚస్ట్రీ మరియు డ్యాష్ؚబోర్డ్ డిజైన్ؚతో అందిస్తుందని అంచనా. 

2024 Hyundai Creta ORVM-mounted camera spied

360-డిగ్రీ కెమెరాను జోడించడంతో పాటు, నవీకరించిన క్రెటాలో పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే (ఆల్కజార్ నుండి తీసుకున్నది), హీటెడ్ సీట్ؚలు మరియు డ్యాష్‌క్యామ్ కూడా ఉంటుందని అంచనా. 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్, పనోరమిక్ సన్ؚరూఫ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు వెంటిలేటెడ్ ముందు సీట్‌లు వంటి ఫీచర్‌లను కొనసాగించవచ్చు.

భద్రత విషయంలో, కొత్త వెర్నాలో ఉన్నట్లుగా నవీకరించిన క్రెటా అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ؚలతో (ADAS) రావచ్చు, ఇందులో లేన్-కీప్ అసిస్ట్, అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ మరియు అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్‌లు ఉండవచ్చు. ఇతర భద్రతా పరికరాలలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ؚలు మరియు రివర్సింగ్ కెమెరా ఉన్నాయి. 

అనేక ఇంజన్-గేర్ؚబాక్స్ ఎంపికలు

నవీకరించిన క్రెటా తన పవర్ؚట్రెయిన్ ఎంపికలను కియా సెల్టోస్ؚతో పంచుకుంటుంది, అవి ఈ క్రింది విధంగా ఉన్నాయి:

స్పెసిఫికేషన్

1.5-లీటర్ N.A. పెట్రోల్

1.5-లీటర్ టర్బో-పెట్రోల్

1.5-లీటర్ డీజిల్ 

పవర్ 

115PS

160PS

116PS

టార్క్ 

144Nm

253Nm

250Nm

ట్రాన్స్ؚమిషన్

6-స్పీడ్/ CVT

6-స్పీడ్ iMT/ 7-స్పీడ్ DCT

6-స్పీడ్ MT/ 6-స్పీడ్ AT

విడుదల, ధర మరియు పోటీదారులు

2024 Hyundai Creta rear spied

నవీకరించిన క్రెటాను హ్యుందాయ్ వచ్చే సంవత్సరం ప్రారంభంలో విడుదల చేస్తుందని అంచనా. దీని ధరలు రూ.10.50 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం కావచ్చు. ఇది మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, స్కోడా కుషాక్, వోక్స్వాగన్ టైగూన్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మరియు రాబోయే హోండా ఎలివేట్ మరియు సిట్రోయిన్ C3 ఎయిర్ క్రాస్ؚలతో పోటీని కొనసాగిస్తుంది. 

చిత్రం మూలం

ఇక్కడ మరింత చదవండి: క్రెటా ఆన్ؚరోడ్ ధర

was this article helpful ?

Write your Comment on Hyundai క్రెటా

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience