Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

మొదటిసారి కెమెరాకు చిక్కిన నవీకరించిన హ్యుందాయ్ i20 N లైన్

హ్యుందాయ్ ఐ20 ఎన్-లైన్ కోసం rohit ద్వారా జూన్ 14, 2023 04:36 pm ప్రచురించబడింది

కొత్త అలాయ్ వీల్ డిజైన్ؚతో కనిపించింది

  • i20 హ్యాచ్ؚబ్యాక్ؚతో ప్రారంభించి, హ్యుందాయ్ “N లైన్” విభాగాన్ని 2021 మధ్యలో భారతదేశంలో ప్రవేశపెట్టింది.

  • నవీకరించబడిన i20 N లైన్‌తో పాటుగా నవీకరించబడిన రెండు రెగ్యులర్ i20లు కనిపించాయి, అన్నీ మోడల్‌లు పాక్షికంగా నలుపు రంగులో కప్పబడి ఉన్నాయి.

  • రహస్య చిత్రాలలో, ప్రస్తుత i20 N లైన్ؚలో ఉన్నట్లుగా కాంట్రాస్ట్ ఎరుపు రంగు స్టిచ్చింగ్ؚతో నలుపు అప్ؚహోల్ؚస్ట్రీ కనిపించింది.

  • హ్యాచ్ؚబ్యాక్ రెగ్యులర్ వెర్షన్ؚలు ప్యాడిల్ షిఫ్ؚటర్‌లు మరియు కొత్త వెర్నా వంటి 2-స్పోక్ స్టీరింగ్ వీల్ؚతో రావచ్చు.

  • నవీకరించబడిన i20 N లైన్ ప్రస్తుత మోడల్ కంటే అధిక ధరతో 2023 చివరి నెలలలో మార్కెట్‌లో అందుబాటులోకి రావచ్చని అంచనా.

నవీకరించబడిన హ్యుందాయ్ i20 భారతదేశంలో పరీక్షిస్తూ కనిపించిన వారం తరువాత, i20 N లైన్ అప్‌డేట్ వెర్షన్ మొదటిసారిగా కెమెరాకు చిక్కింది. దీనితో పాటు అప్‌డేట్‌డ్ హ్యాచ్ؚబ్యాక్ రెగ్యులర్ వెర్షన్‌లు కూడా కనిపించాయి. డిజైన్ వివరాలు కనిపించకుండా ఉండేలా మూడు వాహనాలను పాక్షికంగా నలుపు రంగు కవర్ؚతో కప్పబడి ఉన్నాయి. భారతదేశంలో 2021లో ఈ విభాగాన్ని పరిచయం చేసినప్పుడు N లైన్ ట్రీట్మెంట్ؚ పొందిన మొదటి మోడల్ i20.

కొత్త అంశాలు

ఈ ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ ముందు మరియు వెనుక భాగాలు నలుపు రంగులో కప్పబడి ఉన్నపటికి, ప్రస్తుత i20 N లైన్ؚలో ఉన్నట్లుగానే ఎరుపు సైడ్ స్కర్ట్ؚలు దీని ప్రొఫైల్ؚలో కనిపించాయి. ముందు వైపు ఎరుపు రంగు బ్రేక్ క్యాలిపర్స్ؚతో కొత్త అలాయ్ వీల్స్, హబ్ؚక్యాప్స్‌పై “N” బ్యాడ్జ్ కనిపించింది. దీనితో పాటు కనిపించిన i20 సాధారణ వేరియెంట్ؚలో కవర్‌లతో ఉన్న స్టీల్ వీల్స్ కనిపించాయి, మరొక వేరియెంట్ؚ సిల్వర్ పెయింట్ؚ ఫినిష్‌తో మునుపటి టెస్ట్ వాహనంలో గమనించిన కొత్త అలాయ్ వీల్స్ డిజైన్‌ను కలిగి ఉంది.

పైన పేర్కొన్న అప్‌డేట్‌లు మాత్రమే కాకుండా, నవీకరించిన i20 N లైన్‌లో అప్డేట్ؚలు ఇటీవల ఆవిష్కరించిన యూరోప్-స్పెక్ నవీకరించిన i20లో గమించిన మార్పులకు అనుగుణంగా ఉంటాయని అంచనా. ఇందులో ట్వీకెడ్ బంపర్‌లు మరియు మల్టీ-రిఫ్లెక్టర్ LED హెడ్ؚలైట్‌లు ఉన్నాయి. వెనుక వైపు నవీకరించబడిన i20 N లైన్ కూడా కనెక్టెడ్ LED టెయిల్ లైట్ సెట్అప్ؚను కలిగి ఉండవచ్చు.

ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎక్స్‌టర్ బ్రాండ్ అంబాసిడర్‌గా హార్దిక్ పాండ్యా

ఇంటీరియర్ వివరాలు

నవీకరించబడిన i20 N లైన్ క్యాబిన్ؚలో ఎరుపు రంగు స్టిచింగ్ؚతో నలుపు రంగు అప్ؚహోల్ؚస్ట్రీ మాత్రమే చిత్రాలలో కనిపించగా, రెగ్యులర్ i20 క్యాబిన్ రహస్య చిత్రాలలో డ్యాష్ؚబోర్డ్ కూడా కనిపించింది. రెండవదానిలో ప్యాడిల్ షిఫ్టర్‌లు మరియు 6వ జనరేషన్ వెర్నాలో ఉన్నట్లుగా కొత్త 2-స్పోక్ స్టీరింగ్ వీల్ ఉండవచ్చు, ఇంతకు ముందు చూసినట్లుగా అదే డ్యాష్ؚకామ్ మరియు టచ్ؚస్క్రీన్ సెట్అప్ؚతో రావచ్చు.

ప్రామాణిక మోడల్ నవీకరించబడిన వెర్షన్ؚలో ఆశించినట్లు వెంటిలేటెడ్ ముందు సీట్‌లు మరియు ఆంబియాంట్ లైటింగ్ؚ వంటి కొత్త పరికరాలను i20 N లైన్ؚలో హ్యుందాయ్ అందించవచ్చు. వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్, కనెక్టెడ్ కార్ టెక్ మరియు ఆటో క్లైమేట్ కంట్రోల్ వంటి ఇతర ఫీచర్‌లను కొనసాగించవచ్చు. దీని భద్రత ఫీచర్‌లలో ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), మరియు రివర్సింగ్ కెమెరా ఉండవచ్చు.

బోనెట్ؚలో టర్బో-పెట్రోల్

నవీకరించబడిన i20 N లైన్ మునపటి 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో (120PS/172Nm) కొనసాగవచ్చు. ప్రస్తుతం ఉన్న 6-స్పీడ్‌ల iMT (క్లచ్ లేని మాన్యువల్) మరియు 7-స్పీడ్‌ల DCTని (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్ؚమిషన్) అందించవచ్చు.

ఇది కూడా చదవండి: స్విఫ్ట్, వ్యాగన్ R మరియు టాటా నెక్సాన్‌లను అధిగమించి మే 2023లో ఆత్యధికంగా అమ్ముడైన కారుగా అవతరించిన మారుతి బాలెనో

విడుదల మరియు ధర అంచనా

నవీకరించిన i20 N లైన్ؚను హ్యుందాయ్ 2023 చివరి నెలలలో, బహుశా నవీకరించబడిన i20తో పాటుగా పరిచయం చేస్తుందని విశ్వసిస్తున్నాము. దీని ధరలు ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువ ఉండవచ్చు. దీని ప్రత్యేక పోటీదారులు టాటా అల్ట్రోజ్ టర్బో వేరియెంట్ؚలు మాత్రమే.

చిత్రం మూలం

ఇక్కడ మరింత చదవండి: i20 ఆన్ؚరోడ్ ధర

r
ద్వారా ప్రచురించబడినది

rohit

  • 36 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన హ్యుందాయ్ ఐ20 N-Line

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర