హ్యుందాయ్ ఎక్స్టర్ؚ బ్రాండ్ అంబాసడర్ؚగా హార్దిక్ పాండ్యా
హ్యుందాయ్ ఎక్స్టర్ కోసం shreyash ద్వారా జూన్ 13, 2023 07:21 pm ప్రచురించబడింది
- 57 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
రూ.6 లక్షల ప్రారంభ ధరతో (ఎక్స్-షోరూమ్) జూలై 10న విడుదల కాబోతున్న హ్యుందాయ్ ఎక్స్టర్
-
హ్యుందాయ్ ఎక్స్టర్ ఐదు విస్తృత వేరియెంట్ؚలలో అందించబడుతుంది: EX, S, SX, SX (O), మరియు SX (O) కనెక్ట్.
-
1.2-లీటర్ ఇంజన్ؚతో వస్తుంది, ఇది పెట్రోల్ మరియు CNG ఎంపికలలో అందించబడుతుంది.
-
ఈ విభాగంలో మొదటిసారిగా అందిస్తున్న వాయిస్ అసిస్టెడ్ సింగిల్ పెన్ సన్ؚరూఫ్ మరియు డ్యూయల్ డ్యాష్ؚకామ్ సెట్అప్ వంటి ఫీచర్‌లతో వస్తుంది.
జూలై 10న విడుదల కానున్న హ్యుందాయ్ మైక్రో SUV ఎక్స్టర్ؚకు బ్రాండ్ అంబాసడర్ؚగా భారత క్రికెట్ ఆల్-రౌండర్ హార్దిక్ పాండ్యా వ్యవహరిస్తున్నాడు. ఎక్స్టర్ జన్ Z సజీవ జీవన శైలిని పరిపూర్ణం చేస్తుంది, యూత్ ఐకాన్ మరియు ఆల్ؚరౌండర్ అయిన హార్దిక్ రాబోయే మైక్రో SUVకి సరైన మ్యాచ్ అవుతారు.
విడుదల కానున్న హ్యుందాయ్ మైక్రో SUV ఎక్స్టర్ కోసం భవిష్య మార్కెటింగ్ ప్రచారాలలో ఈ క్రికెటర్ పాల్గొంటాడు. ఎక్స్టర్ؚతో హార్దిక్ పాండ్యా ఉన్న, మైక్రో SUV వెలుపలి రూపాన్ని దగ్గరగా చూపుతున్న ఎక్స్టర్ వీడియోను కూడా హ్యుందాయ్ విడుదల చేసింది.
సంపూర్ణమైన డిజైన్
ఎక్స్టర్‌కు సంబంధించి హ్యుందాయ్ వరుస టీజర్‌లను విడుదల చేయడంతో, ప్రస్తుతం ఈ మైక్రో SUV పూర్తి డిజైన్ గురించి తెలిసింది. ఎక్స్టర్ ముందు భాగంలో బంపర్ దిగువన అమర్చబడిన హెడ్ؚలైట్‌లతో H-ఆకారపు LED DRLలు ఉన్నాయి. ముందు వైపు నుండి ఎక్స్టర్ నిటారుగా ఉంటుంది, ఇది మొత్తం ప్రొఫైల్ؚలో కొనసాగుతుంది అలాగే వెనుక వైపు కూడా కొనసాగుతుంది. వెనుక భాగంలో కూడా, ముందు భాగంలో ఉన్నట్లుగానే ఎక్స్టర్ H-ఆకారపు LED టెయిల్ ల్యాంపులతో వస్తుంది.
ఇది కూడా చూడండి: ప్రత్యేకం: భారతదేశంలో రహస్య చిత్రాలలో కనిపించిన నవీకరించబడిన హ్యుందాయ్ i20
ఈ విభాగంలో మొదటిసారి అందిస్తున్న ఫీచర్‌లు
ప్రస్తుతానికి హ్యుందాయి ఎక్స్టర్ ఇంటీరియర్ గురించి వెల్లడించకపోయిన, ఈ కారు తయారీదారు టీజర్‌లలో కొన్ని ముఖ్యమైన ఫీచర్‌ల గురించి చర్చించింది. ఈ మైక్రో SUVలో, ఈ విభాగంలోనే మొదటిసారిగా డ్యూయల్ డ్యాష్ؚక్యామ్ మరియు వాయిస్ అసిస్టెడ్ సింగిల్ పేన్ సన్ؚరూఫ్ؚతో వస్తుంది. పెద్ద ఇన్ఫోటైన్ؚమెంట్ డిస్ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, క్రూయిజ్ కంట్రోల్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్ ఫీచర్‌లు కూడా ఉండవచ్చని అంచనా.
ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ అసిస్ట్, మరియు 3-పాయింట్‌ల సీట్ బెల్ట్ؚలు మరియు ఐదు సీట్‌లకు రిమైండర్‌లు, రేర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) వంటి ఫీచర్‌లు ప్రయాణీకుల భద్రతను సంరక్షిస్తాయి.
దీని ఏది నడిపిస్తుంది?
ప్రొపల్షన్ డ్యూటీల కోసం, ఎక్స్టర్ؚలో రెండు ఇంజన్ ఎంపికలు ఉంటాయి: 5-స్పీడ్‌ల మాన్యువల్ؚతో జోడించిన 1.2-లీటర్ ఇంజన్ లేదా 5-స్పీడ్‌ల AMT, మరియు CNG కాన్ఫిగరేషన్ؚతో 5-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ జోడించబడింది.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ ఎక్స్టర్: దీని కోసం వేచి ఉండాలా లేదా దీని పోటీదారులలో ఒకదాన్ని ఎంచుకోవాలా?
పోటీదారులు
హ్యుందాయి తమ మైక్రో SUVని ఐదు విస్తృత వేరియెంట్ؚలలో అందిస్తుంది: EX, S, SX, SX (O), మరియు SX (O) కనెక్ట్. దీని ధర రూ.6 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా. ఇది టాటా పంచ్, సిట్రోయెన్ C3, నిస్సాన్ మాగ్నైట్, రెనాల్ట్ కైగర్ మరియు మారుతి ఫ్రాంక్స్ؚతో పోటీ పడుతుంది.