భారతదేశంలో 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సిట్రోయెన్ C3: పునశ్చరణ

సిట్రోయెన్ సి3 కోసం tarun ద్వారా జూలై 24, 2023 05:16 pm ప్రచురించబడింది

  • 1.1K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ హ్యాచ్ؚబ్యాక్ స్టైలిష్ లుక్‌తో వస్తుంది మరియు ధర విషయంలో తన పోటీదారులకు గట్టి పోటీ ఇచ్చేలా వివిధ మోడల్‌లు మార్కెట్‌లో విక్రయానికి ఉన్నాయి,  దీని EV వేరియెంట్ కూడా అందుబాటులో ఉంది

Citroen C3

సిట్రోయెన్ C3 భారతదేశంలో తన మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ మన దేశంలో లభిస్తున్న ఫ్రెంచ్ కారు తయారీదారు రెండవ మరియు అత్యంత చవకైన మోడల్. పరిమాణంలో మారుతి బాలెనో మరియు హ్యుందాయ్ i20 వంటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ؚలతో పోటీ పడుతున్నప్పటికీ, ధరల విషయంలో హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ మరియు మారుతి స్విఫ్ట్ వంటి మరింత చవకైన కార్ లతో సమానంగా ఉన్నాయి.

సిట్రియోన్ C3 పునశ్చరణ మరియు ఈ సంవత్సర కాలంలో దీనిలో వచ్చిన మార్పులను ఇప్పుడు తెలుసుకుందాం:

ధరలో మార్పులు

వేరియెంట్ 

విడుదల ధర 

సరికొత్త ధర

తేడా

లైవ్

రూ. 5.71 లక్షలు 

రూ. 6.16 లక్షలు 

రూ. 45,000

ఫీల్

రూ. 6.63 లక్షలు 

రూ. 7.08 లక్షలు

రూ. 45,000

ఫీల్ DT

రూ. 6.78 లక్షలు 

రూ. 7.23 లక్షలు

రూ. 45,000

ఫీల్ DT టర్బో

రూ. 8.06 లక్షలు

రూ. 8.28 లక్షలు 

రూ. 22,000

షైన్ 

-

రూ. 7.60 లక్షలు 

-

షైన్  DT

-

రూ. 7.75 లక్షలు 

-

షైన్ DT టర్బో

-

రూ. 8.80 లక్షలు 

-

  • లైవ్ మరియు ఫీల్ వేరియెంట్‌ల ధరలు రూ.45,000 పెరిగాయి, ఫీల్ టర్బో ధర విడుదలైనప్పటి నుండి రూ.22,000 పెరిగింది. 

  • C3 ధరలు ప్రస్తుతం రూ.6.16 లక్షల నుండి రూ.8.80 లక్షల (ఎక్స్-షోరూమ్) పరిధిలో ఉన్నాయి.

కొత్త టాప్-ఎండ్ వేరియెంట్

Citroen C3

C3 లైన్అప్ؚకు, సిట్రియోన్ కొత్త టాప్-స్పెక్ షైన్ వేరియెంట్ؚను జోడించింది. ఈ వేరియెంట్‌లో ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMలు, ఫాగ్ ల్యాంప్ؚలు, 15-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్, కనెక్టెడ్ కార్ టెక్ ఫీచర్‌లు, డే/నైట్ IRVM, రేర్ పార్కింగ్ కెమెరా మరియు వాషర్ؚతో రేర్ వైపర్ ఉన్నాయి.

ఫీచర్ జోడింపులు

Citroen C3 Interior

టర్బో వేరియెంట్ؚలు ప్రత్యేకించి ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్-హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు ఐడిల్-ఇంజన్ స్టార్ట్/స్టాప్ؚను ప్రామాణికంగా పొందుతాయి.

ఇది కూడా చదవండి: సిట్రియోన్ eC3 Vs టాటా టియాగో EV: స్పేస్ మరియు ఆచరణాత్మకత పోలిక

భద్రత రేటింగ్ؚల వెల్లడి

Citroen C3 Latin NCAP

బ్రెజిల్‌లో తయారైన సిట్రోయెన్ C3 లాటిన్ NCAP క్రాష్ టెస్ట్‌లలో విఫలమైంది. బ్రెజిల్-స్పెక్ మోడల్‌పై ఈ క్రాష్ టెస్ట్‌లను నిర్వహించగా, అంచనాలో ఇది సున్నా స్టార్ స్కోర్ؚను పొందింది. అడల్ట్ ఆక్యుపేషన్ ప్రొటెక్షన్ؚలో 31 శాతం (12.21 పాయింట్లు) చైల్ ప్రొటెక్షన్ؚలో 12 శాతం స్కోర్ؚను పొందింది.

BS6 ఫేజ్ 2 అప్ؚడేట్‌లు

విక్రయించబడుతున్న ఇతర కార్‌ల విధంగానే, ఈ కారు కూడా 2023 ప్రారంభం BS6 ఫేస్ 2 ఉద్గార నియమాల అప్‌డేట్‌ను పొందింది. C3ని వరుసగా 82PS పవర్ 1.2-లీటర్ పెట్రోల్ మరియు 110PS టర్బో-పెట్రోల్ ఇంజన్‌లతో అందిస్తున్నారు. నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఎంపిక 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ؚను పొందింది, టర్బో యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ గేర్ؚబాక్స్ؚతో వస్తుంది.

ఎలక్ట్రిక్ వర్షన్ కూడా ఉంది!

Citroen eC3

2023 ఫిబ్రవరిలో సిట్రోయెన్ C3 హ్యాచ్ؚబ్యాక్ ఎలక్ట్రిక్ వర్షన్ؚను కూడా పరిచయం చేసింది. లుక్ పరంగా ఇది ICE వర్షన్ؚలానే ఉంటుంది, కానీ కొన్ని eC3 లక్షణాలు ఉంటాయి, అయితే ఎగ్జాస్ట్ పైప్ ఉండదు. 20.2kWh బ్యాటరీ ప్యాక్ؚతో వస్తుంది, ఇది 320 కిలోమీటర్‌ల వరకు డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. eC3 ధర రూ.11.50 లక్షల నుండి రూ.12.43 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది.

భవిష్యత్తులో ఆశించగల మార్పులు 

భవిష్యత్తులో, అంతిమంగా C3 ఆటోమ్యాటిక్ ట్రాన్స్‌మిషన్‌ను పొందుతుందని ఆశించవచ్చు. బ్రెజిలియన్-స్పెక్ మోడల్ 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమ్యాటిక్ؚతో వస్తుంది, ఇది ఇండియా-స్పెక్ C3లో కూడా విడుదల కావచ్చు.

ఇక్కడ మరింత చదవండి: సిట్రోయెన్ C3 ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన సిట్రోయెన్ సి3

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience