• English
  • Login / Register

అస్పష్టంగా కనిపించిన Tata Nexon ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్ డ్యాష్‌బోర్డ్: వివరాలు

టాటా నెక్సన్ కోసం ansh ద్వారా ఆగష్టు 29, 2023 06:39 pm ప్రచురించబడింది

  • 39 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొత్త ఎక్స్టీరియర్ రంగు ఎంపికకు అనుగుణంగా క్యాబిన్‌ను ఊదా రంగులో అందించనున్నారు

Tata Nexon Facelift

  • నవీకరించిన నెక్సాన్ సెప్టెంబర్ 14న విడుదల కానుంది. 

  • ఇది కొత్త 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను పొందవచ్చు మరియు 1.5-లీటర్ డీజిల్ ఎంపికను కొనసాగించవచ్చు. 

  • కర్వ్ మోడల్ కాన్సెప్ట్‌లో ప్రదర్శించిన టాటా సరికొత్త డిజైన్ లాంగ్వేజ్ؚను ఇందులో కూడా అందించవచ్చు. 

  • భద్రతా కిట్ؚలో భాగంగా ADAS ఫీచర్‌లను పొందవచ్చు. 

  • ధర రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుందని అంచనా. 

నవీకరించిన టాటా నెక్సాన్ మళ్ళీ కప్పబడకుండా కెమెరాకు చిక్కింది, ఈసారి క్యాబిన్ లోపల కొత్త డ్యాష్‌బోర్డ్ؚ స్పష్టంగా కనిపించింది. ఈ నవీకరించిన సబ్‌కాంపాక్ట్ SUV లోపల మరియు వెలుపల భారీ నవీకరణను పొందింది. వాటిని మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్యాబిన్ 

క్యాబిన్‌ను దాదాపుగా నలుపు రంగు థీమ్ؚ గల డ్యాష్ؚబోర్డ్ؚతో అందించనున్నారు. ఇక్కడ కెమెరాకు చిక్కిన మోడల్ కొత్త ఎక్స్టీరియర్ పెయింట్ ఎంపికకు అనుగుణంగా ఉండేలా దిగువ వైపు ఊదా రంగుతో డ్యూయల్-టోన్ ఫినిష్‌ను కలిగి ఉంది. ఇదే రంగును సీట్ؚలు మరియు స్టీరింగ్ వీల్ అడుగున కూడా చూడవచ్చు.

Tata Nexon Facelift Interior

ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్ మెరిసే టాటా లోగోతో స్పష్టంగా కనిపిస్తోంది. ఇది పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేను మరియు మధ్యలో 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్‌తో వస్తుంది. మిగిలిన క్యాబిన్, ఆధునికంగా కనిపించడానికి  మెరుగ్గా కనిపించే డిజైన్ మార్పును పొందింది. 

పవర్ؚట్రెయిన్ؚలు

నవీకరించిన నెక్సాన్‌ను బహుశా 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚతో (110PS/260Nm) అందించనున్నారు, ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా 6-స్పీడ్ AMTతో జోడించబడుతుంది. టాటా సరికొత్త E20కి అనుగుణమైన 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (125PS/225Nm) మాన్యువల్ మరియు DCT (డ్యూయల్-క్లచ్ ట్రాన్స్ؚమిషన్) ఆటోమ్యాటిక్ ఎంపికలతో అందించబడవచ్చు. 

ఫీచర్‌లు & భద్రత

Tata Nexon 2023

10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ మరియు పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మాత్రమే కాకుండా, నవీకరించిన నెక్సాన్ వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ؚను కూడా పొందవచ్చు. 

ఇది కూడా చదవండి: టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్: ఇప్పటివరకు గమనించిన అన్నీ మార్పులు

భద్రత విషయంలో ఇది ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలను మరియు EBDతో ABSతో పాటుగా అదనంగా 360-డిగ్రీల కెమెరాను, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ؚను (TPMS) కూడా పొందనుంది. లేన్-కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటి ADAS ఫీచర్‌లను కూడా ఉండవచ్చు. 

విడుదల, ధర & పోటీదారులు

Tata Nexon 2023

ఎలక్ట్రిక్ వర్షన్ؚతో పాటుగా, నవీకరించిన నెక్సాన్ؚను సెప్టెంబర్ 14న టాటా విడుదల చేయనుంది. దీని ధర రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చు; విడుదల తరువాత ఇది కియా సోనెట్, మహీంద్రా XUV300, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా, రెనాల్ట్ కైగర్ మరియు నిస్సాన్ మాగ్నైట్ వంటి వాటితో పోటీని కొనసాగిస్తుంది. 

చిత్రం మూలం

ఇక్కడ మరింత చదవండి: టాటా నెక్సాన్ AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Tata నెక్సన్

Read Full News

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience